
'మీకు బీపీ పెరిగితే.. పదవిని గోరంట్లకు ఇవ్వండి'
హైదరాబాద్ : శాసనసభలో నిన్న నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పలు నీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లగా అప్పటి వరకూ రక్తపోటు సాధారణంగా ఉండేదని, ఆ తర్వాత 140/80కి పెరిగిందని మంత్రి దేవినేని అన్నారు.
దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రికి ఆరోగ్యం బాగోలేకపోతే పదవికి రాజీనామా చేసి పక్కనే ఉన్న సీనియర్ సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఇస్తే బావుంటుందేమో ఆలోచించాలని సూచించారు. దీంతో సభ్యుల మధ్య ఒక్కసారిగా నవ్వుల పూలు పూశాయి.