
అన్నింటికీ సై...దానికి మాత్రం నై...
హైదరాబాద్ : అన్నింటీకి సవాల్ విసురుతున్న ప్రభుత్వం రాజధాని భూ దందాపై ఎందుకు విచారణకు అంగీకరించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజధాని భూములపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.
'రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేత, అపార అనుభవజ్ఞులు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొత్తగా ఎన్నికైన సభ్యుడు సవాల్ విసరడం సరికాదు. ఆయనను సవినయంగా చేతులు చేతులు జోడించి కోరేది ఒకటే... ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు దేనికైనా సై అంటారు. భూ దందాపై విచారణకు మాత్రం నై... దీని వెనుక చిదంబర రహస్యం ఏమిటి. మేం ఇచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రష్యాలోనో, మరెక్కడో నుంచో వచ్చివని కావు. ఏపీ రిజిస్ట్రర్ వెబ్ సైట్ లో ఉన్నవే. టీడీపీ నేతలు భూములు కొన్నవి నిజం కాదా?అని' కోటంరెడ్డి ప్రశ్నించారు.