‘హోదా సాధించకుంటే బాబు చరిత్రహీనుడే’ | ysrcp mla kotamreddy sridhar reddy takes on chandrababu naidu over special status | Sakshi
Sakshi News home page

‘హోదా సాధించకుంటే బాబు చరిత్రహీనుడే’

Published Thu, Mar 23 2017 11:34 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘హోదా సాధించకుంటే బాబు చరిత్రహీనుడే’ - Sakshi

‘హోదా సాధించకుంటే బాబు చరిత్రహీనుడే’

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని  వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధించకపోతే చంద్రబాబు చరిత్రహీనుడు అవుతారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీట్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ చేస్తామన్న చంద్రబాబు... ప్రత్యేక హోదా కోసం ఎందుకు ముందుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు.

సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గుంటూరులో డ్రైనేజీ సమస్యపై మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement