ప్రతిపక్షంపై సర్కార్‌ మరోసారి ఎదురుదాడి | opposition demands on special status in ap assembly, ruling party members attacked | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంపై సర్కార్‌ మరోసారి ఎదురుదాడి

Published Thu, Mar 23 2017 10:54 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రతిపక్షంపై సర్కార్‌ మరోసారి ఎదురుదాడి - Sakshi

ప్రతిపక్షంపై సర్కార్‌ మరోసారి ఎదురుదాడి

అమరావతి: ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్‌ చేసిన ప్రతిపక్షంపై ప్రభుత్వం మరోసారి ఎదురుదాడినే మార్గంగా ఎంచుకుంది. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. అయితే చర్చకు అనుమతించాల్సిందేనంటూ హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసిన వైఎస్‌ఆర్ సీపీ సభ్యులకు ప్రత్యేక వ్యాధి ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు.

ముగిసిపోయిన అంశంపై ఇంకా చర్చ ఏంటి..అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీసి పారేశారు. రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా లేదు కనుక, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అధికార పార్టీ సభ్యులు ప్రత్యేకహోదాపై మాట్లాడటమే తప్పన్నట్టు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement