ప్రత్యేక ఆర్థిక సాయంపై చంద్రబాబు ప్రకటన
అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటనను ప్రతిపక్షం అడ్డుకున్నాయి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే అంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపాయి. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన చట్టబద్ధ హామీని చంద్రబాబు తుంగలోకి తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు...వైఎస్‌ఆర్ సీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ . విపక్ష సభ్యులకు సబ్జెక్ట్ తెలియదంటూ అబద్ధమనేది అన్ పార్లమెంటరీ పదమని, అసత్యమని అనొచ్చు కానీ అబద్ధమనడానికి వీల్లేదన్నారు. తన ప్రకటనలో అసత్యమేమీ లేనది చంద్రబాబు సమర్థించుకున్నారు. కేంద్రమంత్రి ప్రకటనే అసత్యం అనడం సరికాదన్నారు. ప్రత్యేక సహాయానికి కేంద్రం చట్టబద్ధత కల్పించిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 100 శాతం నిధులు కేటాయించినందుకు కేంద్రప్రభుత్వానికి ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని నిర్మాణం ఊసే లేకుండా రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని అన్నారు. 56సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు చంద్రబాబు తెలిపారు.