జి.కొండూరు: మైలవరం నియోజకవర్గం టీడీపీ నుంచి గత పదిహేనేళ్లుగా ఏకచత్రాధిపత్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావుకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం కోసం బల ప్రదర్శన చేసే స్థాయికి దిగజారాల్సిన వచ్చింది. నాడు దేవినేని ఉమా అన్న దేవినేని వెంకటరమణకు నందిగామ సీటు నిరాకరించి వేరే వ్యక్తికి కేటాయించినప్పుడు రమణ బలప్రదర్శన చేసి సీటు సాధించిన ఘటనలు నేడు మైలవరం నియోజకవర్గంలో రిపీట్ కావడంతో కేడర్ గందరగోళంలో పడింది. ఒక వైపు వసంత వెంకటకృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిని నేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు తన అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు.
మరో వైపు సీటు నాదేనంటూ దేవినేని ఉమా సైతం తన అనుచరులతో గొల్లపూడిలో శుక్రవారం సాయంత్రం శంఖారావం సభ నిర్వహించారు. నాడు దేవినేని వెంకటరమణ, మరో వ్యక్తికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో రమణ విజయం సాధించినట్లే నేడు వసంత వెంకటకృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య జరుగుతున్న సీటు ఫైట్‌లో ఉమానే పంతం నెగ్గించుకుంటారని ఆయన అనుచరులు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవినేని ఉమా శంఖారావం సభలో మాట్లాడుతూ ఇప్పటికే టీడీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో టీడీపీ కేడర్ తమ నిర్ణయాన్ని ప్రకటించారని, మరో రెండు మూడు పర్యాయాలు మైలవరం సీటు తనదేనన్న భావనను అనుచరులకు చెప్పినట్లు తెలిసింది.
అంతే కాకుండా వసంత కృష్ణప్రసాద్‌కు ఎట్టి పరిస్థితులలో సహకరించవద్దని, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయాలని అనుచరులకు సూచించినట్లు సమాచారం. దేవినేని ఉమా, వసంత మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్న క్రమంలో బొమ్మసాని సైతం తగ్గేదేలేదన్నట్లు మైలవరం టీడీపీ సీటు తనకే కేటాయించాలని కోరుతూ తన అనుచరులను బుధవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు పంపి నేరుగా చంద్రబాబుకే వినతిపత్రం అందించేలా చేశారు. ఈ క్రమంలో మైలవరం టీడీపీ సీటు కోసం జరుగుతున్న త్రిముఖపోరులో అంతిమంగా నెగ్గేదవెవరో కానీ కేడర్‌లో ఏర్పడిన గందరగోళానికి మాత్రం ఇప్పటిలో తెరపడేలా లేదు.
అధిష్టానం ఆదేశాలను పెడచెవిన పెట్టిన దేవినేని ఉమా శంఖారావం పేరుతో అనుచరులతో సమావేశం మరోవైపు టీడీపీలో చేరేందుకు హైదరాబాద్ వెళ్లిన వసంత
Comments
Please login to add a commentAdd a comment