Krishna District News
-
ఆప్కాస్ ఉద్యోగుల ఆందోళన బాట
గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న ఆప్కాస్(ఏపీ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్) ఉద్యోగులు తమ జీతాలు పెంచాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు నిలబడి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మేడూరి శేషుబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పశువైద్య కళాశాలను స్థాపించి పాతికేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ప్రభుత్వ నియామకం చేపట్టలేదన్నారు. ఈ కళాశాలను నమ్ముకొని అవుట్ సోర్సింగ్ విధానంలో కోస్టల్ ఆంధ్రా జోనల్లో 498 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాస్ విధానాన్ని తొలగించి తిరిగి ప్రైవేట్ ఏజెన్సీల చేతులకు ఉద్యోగులను అప్పగించాలని చూడడం దుర్మార్గమన్నారు. యూనియన్ ఉపాధ్యక్షులు అంజిబాబు, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూముల రీసర్వేతో సమస్యలకు చెక్
పెనమలూరు: భూములు రీసర్వే చేయించటంతో సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర సర్వే కమిషనర్ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్ డీఎల్‌బీఎల్ కుమార్ అన్నారు. మండల పరిధిలో పెదపులిపాక గ్రామంలో భూములపై జరుగుతున్న రీసర్వే పైలెట్ ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ భూములు రీ సర్వే చేయటంతో భూ యజమానులకు మేలు చేయటమే కాకుండా ప్రభుత్వ భూములు గుర్తిస్తామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఈ సర్వే ఉపయోగపడుతుందని వివరించారు. భూ యజమానులు కూడా వారి సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శివప్రసాద్, మండల సర్వేయర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాతృభాషపై మమకారం పెంచుకోండి చిలకలపూడి(మచిలీపట్నం): మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. అంత ర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని తెలుగుతల్లి విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. జేసీ మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదన్నారు. తెలుగుభాషలోని మాధుర్యాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నా రు. పాఠశాలల్లో భాష ప్రాధాన్యతపై విద్యార్థుల కు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జీజీహెచ్‌లో అందుబాటులోకి టిఫా స్కాన్ లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భస్థ పిండంలోని అవయవ లోపాలు, బ్రెయిన్ ఎదుగుదలను గుర్తించేందుకు అవసరమైన టిఫా స్కాన్‌ను విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో ఏర్పాటు చేశారు. దానిని శుక్రవారం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు(అకడమిక్) డాక్టర్ రఘునందన్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అల్ట్రాసౌండ్ మెషీన్ల కంటే హై రిజల్యూషన్‌తో పిండం ఎదుగుదల, అవయవాల రూపుదిద్దుకుంటున్న తీరు వంటి వాటిని ఈ టిఫా స్కాన్‌తో కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. అశోక్‌కుమార్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ. వెంకటేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ పార్వతీశంరావు, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ కేశవచంద్ర, పిడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ పి. అనిల్‌కుమార్ పాల్గొన్నారు. వంశీతో పేర్ని ములాఖత్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు, అభియోగాలు మోపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ పెట్టిన అక్రమ కేసులో అరెస్టయి జైలులో ఉన్న వంశీతో శుక్రవారం ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖ, పోలీసు అధికారులు కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్న వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యంగా పటమట ప్రాంతానికి చెందిన పోలీసులు దారుణంగా కేసులు కడుతున్నారన్నారని విమర్శించారు. 10వ తేదీ సత్యవర్థన్ కోర్టు ముందు హాజరై.. తన చేత తప్పుడు కేసు పెట్టించారని జడ్జిముందు చెప్పారన్నారు. క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఫణికుమార్ అనే టీడీపీ కార్యకర్త 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టులను, పోలీసులను తప్పుదారి పట్టించారని సత్యవర్థన్, వంశీపై కేసు కట్టారని తెలిపారు. 12న సత్యవర్థన్ అన్న చేత ఫిర్యాదు తీసుకుని కేసు కట్టారన్నారు. ఈ కేసులో ఎక్కడా ఆధారాలు లేవన్నారు. వీటన్నిటిపై వంశీ కుటుంబం న్యాయస్థానాల్లో పోరాడుతుందన్నారు. అక్కడ లేను.. అయినా కేసు.. రైతులను పరామర్శించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు వచ్చినపుడు, తాను మచిలీపట్నంలో ఉన్నానన్నారు. తన పైన పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. దీనిపై డీజీపీకి ఈమెయిల్ లేఖ రాశానన్నారు. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరి ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు సేకరిస్తున్నారన్నారు. -
రంగు చేపలతో ఉపాధి అవకాశాలు
పెనమలూరు: రంగు చేపల పెంపకంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పోరంకిలోని సేంద్రియ మంచినీటి జీవపాలన సంస్థ, ప్రాంతీయ పరిశోధన కార్యలయం ఇన్చార్జ్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ రాథోడ్ అన్నారు. పోరంకిలోని ప్రాంతీయ కార్యాలయంలో గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మల్లవరం గ్రామ స్వయం సహాయ సంఘం మహిళా సభ్యులకు చేపల రంగంలో వ్యవస్థాపకత అభివృద్ధిపై శుక్రవారం ముగిసిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేడు రంగు చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, వీటిని ఇంట్లో అలంకరణకు పెంచుకోవటానికి ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారని వివరించారు. సైంటిస్టు అజిత్కేశవ్ చౌదరి మాట్లాడుతూ గ్లాస్ ఆక్వేరియమ్, చేపల మేత తయారు చేయటం నేర్చుకుంటే వ్యాపారం వృద్ధి చేసి లాభాలు పొందవచ్చన్నారు. మూడు రోజుల శిక్షణలో దీనిపైనే ప్రత్యేకంగా అవగాహన కల్పించామన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందచేశారు. నాగాయలంక బావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
నిల్వ నీడ కరువు!
కృష్ణాజిల్లాశనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025పంట నిల్వకు అవకాశం లేక నష్టాల పాలురైతులు పండించిన పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేక నష్టపోతున్నారు. కోసిన పంట కోసినట్లు తక్కువ ధరకై నా అమ్ముకోవాల్సి రావడంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. కృష్ణా జిల్లాలో వాణిజ్య పంటలకు కేరాఫ్ అయిన మోపిదేవి మండలంలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం కూరగాయలకు సరైన రేటు లేకపోవడంతో చాలా మంది రైతులు చేతికొచ్చిన పంటలను కూడా అలాగే వదిలేస్తున్నారు. ఏళ్లుగా మోపిదేవిలో రైతు బజార్ లేదా గిడ్డంగులు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. సాంకేతిక సాయంతో నేరాల అదుపు సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. పామర్రు సర్కిల్, గన్నవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. నేటితో తిరునాళ్ల ముగింపు వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారంతో ముగియనుండటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు బారులు తీరారు. తిరుపతమ్మకు బంగారు నెక్లెస్ పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి శుక్రవారం తెనాలికి చెందిన లంక శ్రీనివాసరావు, రత్నజ్యోతి దంపతులు 20గ్రా. బంగారు నెక్లెస్, 135గ్రా. వెండి గిన్నెను అందజేశారు.–10లోuనేడు, రేపు ఉచిత పుస్తకాల పంపిణీ పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడ పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఉచిత పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి రావి శారదా తెలిపారు. శుక్రవారం పటమటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా తాము ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెండు రోజుల పాటు జరిగే ఈ పంపిణీ తొలుత 6 వేల పుస్తకాలతో ప్రారంభమైందని, ఈ ఏడాది పుస్తకాలను 30 విషయాలుగా విభాగించి సామాన్యుడు సైతం సులభంగా పుస్తకాలను ఎంపిక చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నామన్నారు. ఇందులో చిన్నపిల్ల ల పుస్తకాలు నుంచి వేదాంత గ్రంథాలు, అన్ని తరగతుల పాఠ్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఇంజినీరింగ్, మెడిసిన్ అరుదైన గ్రంథా లు, వైద్యశాస్త్రంలో వేదం వంటి రెండు సంపుటాల హరిసన్స్, మెడిసిన్, మరెన్నో ఖరీదైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఇంతియాజ్ ప్రారంభిస్తారని, పుస్తక ప్రియులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్లో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. సేకరించిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు స్టాండింగ్‌లో నుంచి తీసే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది. ప్లాట్‌ఫాంపై ఉన్న పిల్లరును ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు లేక పోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు, ఆర్టీసీ డ్రైవర్‌కు ఎటువంటి ప్రమాదం జరగక పోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదేవిధంగా జరిగిన ఘటనలో ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అలాంటి ఘటనే జరగడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి: భూమిని నమ్ముకుని సాగులో నిమగ్నమైన రైతులు వాణిజ్య పంటలు వేసి మరోసారి నిండా మునిగిపోయారు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన భారీ వరదలకు లంక గ్రామాల్లో వేసిన పసుపు, కంద, జామ, అరటి వంటి తోటలు వేసి చేతికి వచ్చే సమయంలో కృష్ణమ్మ ఆగ్రహానికి గురై పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో కొంత సమయం తీసుకుని మరికొంత అప్పులు చేసి కృష్ణానది ఒడ్డున లంక గ్రామాల్లో పలు రకాల కూరగాయల పంటలు సాగు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాల్లో టమాటా, మిర్చి, క్యాబేజి సాగు చేపట్టారు. ప్రస్తుతం వీటి ధరలు దారుణంగా పడిపోవడంతో కనీసం కూలీల ఖర్చులు కూడా రావడంలేదని పంట పొలా ల్లోనే టమాటా, మిర్చి వదిలేస్తుండగా, క్యాబేజీ పంటను రోటోవేటర్ వేసి దున్నేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10,270 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. అధికారులు భరోసా ఇచ్చినా.. ఇటీవల మండలంలోని మోపిదేవివార్పు, బొబ్బర్లంక గ్రామాల్లో ధరలు లేవని రైతులు పండించిన క్యాబేజి పంటను దున్నేశారు. నాడు మార్కెట్‌యార్డు రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ పి. లావణ్య, మార్కెట్‌యార్డ్ ఏడీ నిత్యానందం ఘటనా స్థలానికి చేరుకుని పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఆ సమయంలో రైతులు మరోసారి మోపిదేవిలో మోడల్ రైతు బజారు హామీని గుర్తుచేశారు. వెంటనే రైతు బజారు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాథేయపడ్డారు. ప్రస్తుతం కోసూరువారిపాలెం, మెరకనపల్లి గ్రామాల్లో పండించిన టమాటా, మిర్చి పొలాల్లో వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 7న్యూస్‌రీల్ రైతులు కుదేలు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం గిడ్డంగులు, లేదా రైతు బజార్ నిర్మించాలని ఏళ్లుగా వేడుకోలు మోపిదేవిలో స్థలం కేటాయించి ఆరేళ్లు అయినా ప్రయోజనం లేదు రైతు బజార్ కలేనా? ధరల ఒడుదొడుకులు ఉన్న సమయంలో పంటలు నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు లేదా కనీసం మోడల్ రైతు బజారు ఏర్పాటు చేయాలని రైతులు ఎంతోకాలంగా పోరాటం చేస్తుండగా.. 2018లో ఆర్ఎస్ నంబర్ 147లో మోపిదేవికాలనీ వద్ద 0.20 ఎకరాల స్థలం కేటాయించారు. సరిహద్దులు నిర్ణయించి సంబంధిత లెటర్‌ను అప్పటి తహసీల్దార్ విమలకుమారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్‌కు అప్పగించారు. దీనివల్ల రైతులు పండించిన పంటను వారి చేతుల మీదుగానే అప్పటికప్పుడు రైతు బజారులో నేరుగా విక్రయించుకోవచ్చని ఆనంద పడ్డారు. కానీ రైతులు అంటేనే గిట్టని నేటి పాలకులు, అధికారులు మరోసారి మోసగించారు. -
‘‘తెలుగు తేజం’’ పాఠశాల పత్రిక ఆవిష్కరణ
పెడన: మండలంలోని చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల హెచ్ఎం సిద్ధినేని సౌజన్య రూపొందించిన ‘తెలుగు తేజం’ పాఠశాల పత్రిక ఏడవ సంచిక, ఈ– బుక్‌ను పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులలో భాష పట్ల ఆసక్తి పెంచడానికి వారిలో పఠనాశక్తిని, రచనా శక్తిని పెంచటానికి ఇలాంటి పత్రికలు దోహదపడతాయన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కథలు, కవితలు, పద్యాలు వంటివి రాయడం, బొమ్మలు గీయటం, వారు చదివిన పుస్తకాల నుంచి మంచి అంశాలు సేకరించి పాఠశాల పత్రికకు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. పత్రికకు సంపాదకులుగా కలిదిండి రాంబాబు, ఉప సంపాదకులుగా పరిశే రాజేశ్వరరావు, తెలుగు ఉపాధ్యాయిని ఎం. పద్మజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాధ్యతతో ప్రాణాలు కాపాడుకుందాం
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): వాహనదారులు బాధ్యతగా హెల్మెట్, సీటుబెల్టు ధరిస్తే రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025 జనవరి నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 90 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. వాటిలో 41 మరణాలు, 76 మంది గాయాలపాలయ్యారన్నారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ఏఐ పవర్ సీసీ టీవీల సాంకేతిక పరిజ్ఞానంతో అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించటం, హెల్మెట్ లేకుండా ప్రయాణించే చోదకులను గుర్తించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా జరిమానాలు విధించాలన్నారు. ●బందరు మండలం ఎస్.ఎన్గొల్లపాలెంలోని విద్యార్థులు సమీపంలోని జాతీయ రహదారిని దాటుకుని నేషనల్ కళాశాలకు చేరుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, రహదారిపై అకస్మాత్తుగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఆ ప్రాంతంలో పరిష్కార మార్గాల కోసం రవాణా, జాతీయ రహదారులు, పోలీసులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ●మచిలీపట్నం నగరంలో రహదారి వెంబడి ఏర్పాటు చేసిన శుభకార్యాలు, పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ●జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై వంగిపోయిన స్తంభాన్ని వెంటనే తొలగించాలన్నారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి వచ్చే బైపాస్‌రోడ్డులో వినాయకుడి సెంటర్లో భారీ గుంతకు మరమ్మతులు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా రవాణాధికారి బీఎస్ఎస్ నాయక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎల్. సిద్ధిఖ్, నగరపాలక సంస్థ కమిషనర్ బాపి రాజు, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు, డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్ ఎస్. శర్మిష్ట పాల్గొన్నారు. -
హోటళ్ల స్వచ్ఛతా ప్రమాణాలకు రేటింగ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వచ్ఛతా ప్రమాణాలు పాటించే హోటల్స్, లాడ్జీలకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టమ్ (ఎస్జీఎల్ఆర్ఎస్)పై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆతిథ్య రంగం కీలకమైందన్నారు. స్థానిక సమాజం, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుత పర్యాటకంలో భాగంగా ఆతిథ్య రంగంలో సురక్షిత పారిశుద్ధ్య నిర్వహణను ప్రోత్సహించేందుకు గ్రీన్ లీఫ్ రేటింగ్ వ్యవస్థను ఆవిష్కరించినట్లు వివరించారు. రేటింగ్స్ ఇలా.. హోటళ్లు, లాడ్జీలు, హోమ్‌స్టేలు, ధర్మస్థలాలు తదితర ఆతిథ్య సౌకర్యాలకు గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తామని కలెక్టర్ చెప్పారు. వన్ లీఫ్ రేటింగ్ పొందాలంటే ఘన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణలో 100–130 మార్కులు రావాలన్నారు. త్రీ లీఫ్ రేటింగ్‌కు 130–180 మార్కులు, ఫైవ్ లీఫ్ రేటింగ్‌కు 180–200 మార్కులు సాధించాల్సి ఉంటుందని వివరించారు. రేటింగ్‌కు సిఫార్సు చేసేందుకు వీలుగా జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండింగ్ ఇంజినీర్ కన్వీనర్‌గా, జిల్లా పర్యాటక అధికారి సభ్య కార్యదర్శిగా కమిటీ ఉంటుందన్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీవో చైర్మన్‌గా వెరిఫికేషన్ ఉప కమిటీ ఉంటుందని తెలిపారు. డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రేటింగ్ వ్యవస్థ గురించి వివరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలోనూ వర్క్‌షాప్‌లతో పాటు శిక్షణ కార్యక్రమాలపైనా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓలు చైతన్య, కె మాధురి, బాలకృష్ణ, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎస్.విద్యాసాగర్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వీ స్వామి, ఏపీ టీడీసీ డివిజనల్ మేనేజర్ చైతన్య, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, గ్రామవార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీపీవో పి.లావణ్య కుమారి, జిల్లా టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధి టి.రవికుమార్, డీఎల్డీవోలు పాల్గొన్నారు. వన్ లీఫ్, త్రీ లీఫ్, ఫైవ్ లీఫ్ స్టేటస్ ఇచ్చేందుకు కార్యాచరణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సంప్రదాయ వస్త్రాలకు చిహ్నం కో–ఆప్టెక్స్
తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు కో–ఆప్టెక్స్ చేనేత వస్త్రాలు చిహ్నలని, ఆప్కో, కో–ఆప్టెక్స్ షోరూమ్‌లలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఆర్.గాంధీ అన్నారు. శుక్రవారం విజయవాడ ఏలూరు రోడ్డులో ఆధునికీకరించిన కో –ఆప్టెక్స్ షోరూంను తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో చేనేత వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. తమిళనాడు ఆధ్వర్యంలోని కో–ఆప్టెక్స్ షోరూమ్‌లో ఆప్కో వస్త్రాలు, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆప్కో షోరూమ్‌లో కో–ఆప్టెక్స్ వస్త్రాలు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎంతోమంది చేనేత కళాకారులు యంత్రాలు వినియోగించకుండా ఆకట్టుకునేలా చేనేత వస్త్రాలు రూపొందిస్తున్నారన్నారు. సాధారణ వస్త్రాలతో పోలి స్తే చేనేత వస్త్రాలు ముఖ్యంగా మహిళలు ధరించే చీర లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. మహిళల అధునాతన జీవనశైలి, అభిరుచులకు అనుగుణంగా కో–ఆప్టెక్స్ సైతం వస్త్రాల డిజైన్లలో మార్పులు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, తమిళనాడు కో– ఆప్టెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జాకబ్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.పి.రవి, జనరల్ మేనేజర్ శంకర్, రీజినల్ మేనేజర్ సి.నాగరాజన్ పాల్గొన్నారు. -
బాపులపాడులో అమెరికా బృందం
హనుమాన్‌జంక్షన్ రూరల్: ప్రకృతి వ్యవసాయ విధానంతో ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రతను ప్రజలకు చేరువ చేస్తుండటం ప్రశంసనీయమని అమెరికాకు చెందిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో క్రేగ్ కోగట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) కార్యక్రమాన్ని పరిశీలించేందుకు అమెరికా వాతావరణ మార్పు, సుస్థిర వ్యవసాయ రంగ నిపుణుల బృందం బాపులపాడు మండలంలోని కానుమోలు, కాకులపాడు గ్రామాల్లో శుక్రవారం పర్యటించింది. తొలుత కానుమోలులో గృహిణి అనురాధ నిర్వహిస్తున్న 365 రోజుల కిచెన్ గార్డెన్‌ను సందర్శించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముచ్చడించారు. ఇంట్లోకి రోజువారీ కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలను కిచెన్ గార్డెన్ ద్వారా పెరట్లోనే పండించుకునే విధానాన్ని అనురాధ ద్వారా ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ఫుడ్ బాస్కెట్ ప్రాజెక్టు గురించి ఆరా తీశారు. అనంతరం కాకులపాడుకు చెందిన రైతు చింతయ్యకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అమెరికా బృంద సభ్యులు సందర్శించారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో క్రేగ్ కోగట్ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం నుంచి రైతులకు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ఏపీసీఎన్ఎఫ్ కృషి సాహసోపేతమన్నారు. -
చిన్నారి ప్రాణాలు తీసిన పంఖా
జి.కొండూరు: అసలే పేద కుటుంబం. పొట్ట చేతబట్టుకొని ఆ భార్య, భర్తలిద్దరూ పిల్లలతో కలిసి ఇటుక బట్టీలో పనికి వచ్చారు. పిల్లల భవిష్యత్తును కలలు కంటూ, బట్టీలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు విషాదంలోకి నెట్టింది. ఇంట్లో వెలుగులు నింపాల్సిన విద్యుత్ ఆ ఇంట్లో చీకట్లు కమ్మేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే...బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, పెద్దపాలెం గ్రామానికి చెందిన ఇందుమూడి రవి తన భార్య కల్పన, కుమార్తె మంజూష, కుమారుడు యశ్వంత్(6)తో కలిసి గత డిసెంబరులో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో పని చేసేందుకు వచ్చారు. గురువారం అర్థరాత్రి కుటుంబం అంతా గాఢ నిద్రలో ఉండగా యశ్వంత్ చేయి స్టాండ్ ఫ్యానుకు తగిలింది. అయితే ఆ ఫ్యానుకు విద్యుత్ సరఫరా అవడంతో యశ్వంత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే నిద్రలేచిన తండ్రి రవి, కొడుకును తప్పించబోయి తాను కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి రవి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు రవిని మైలవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రవికి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లమందే చనిపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మైలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యుదాఘాతంతో బాలుడి దుర్మరణం -
నేటితో వీరమ్మతల్లి తిరునాళ్ల ముగింపు
ఉయ్యూరు: వీరమ్మతల్లీ...కాపాడమ్మా...కల్పవల్లీ..కరుణించమ్మా..అంటూ భక్తజనం అమ్మవారికి విశేష పూజలు జరిపించారు. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శుక్రవారంతో 14వ రోజుకు చేరింది. 15 రోజులు పాటు జరిగే తిరునాళ్లు శనివారంతో ముగియనుండటంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అశేష భక్తజనం తరలివచ్చి చల్లనితల్లిని దర్శించుకుని భక్తిపారవశ్యం చెందారు. మహిళలు పాలపొంగళ్లు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పొట్టేళ్ల ప్రభ బండ్లుతో ఊరేగి అమ్మకు మొక్కులు చెల్లించారు. సంతానం ప్రసాదించాలని వేడుకుంటూ ఆలయం వెనుక పసుపు దుస్తులతో పానాచారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అన్నసంతర్పణ చేశారు. ఉయ్యూరు పట్టణ పోలీసులు గురువారం ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కుబడి చెల్లించారు. సీఐ రామారావు, ఎస్ఐ విశ్వనాఽథ్తో కలిసి పొట్టేళ్లను కానుకగా ఇచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు. అలరించిన అమ్మవారి జీవిత చరిత్ర నాటకం శ్రీ కనక చింతయ్య సమేత వీరమ్మతల్లి అమ్మవారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన ఆద్యంతం భక్తులను అలరించింది. తిరునాళ్లను పురస్కరించుకుని ఎంకే ఇంగ్లిష్ మీడియం పాఠశాల డైరెక్టర్ ఎంకే బాబు ఆధ్వర్యంలో ఎంకే గ్రూప్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు దేవతామూర్తుల వేషధారణలో సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అమ్మవారి జీవితచరిత్రను నాటక రూపంలో ప్రదర్శించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. -
రీ సర్వే రికార్డులను పరిశీలించిన అడిషనల్ డైరెక్టర్
పెడన: మండలంలోని భా.హుస్సేన్‌పాలెంలో భూముల రీ సర్వే కార్యక్రమం పూర్తి కావడంతో ఆ రికార్డులను ల్యాండ్ అండ్ సర్వే శాఖ అడిషనల్ డైరెక్టర్ గోవిందరావు పరిశీలించారు. ఆయన శుక్రవారం పెడన తహసీల్దారు కార్యాలయానికి విచ్చేయడంతో ల్యాండ్ అండ్ సర్వే జిల్లా అధికారి జోషిలా, మచిలీపట్నం ఆర్డీవో ఎం.స్వాతి, ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన పుల్లపాడు పంచాయతీ పరిధిలోని భా.హుస్సేన్‌పాలెం గ్రామానికి సంబంఽధించి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములన్నీ కలిపి 229 ఎకరాలున్నాయని, వాటికి సంబంధించిన సర్వే నంబర్లు, రీ సర్వే నివేదికల రికార్డులను పరిశీలించారు. ఇన్చార్జి తహసీల్దారు అనిల్‌కుమార్, మండల సర్వేయర్ దాసు, సర్వే డీటీ సల్మా పూర్తి వివరాలను తెలియజేశారు. అనంతరం ఆయన మచిలీపట్నం మండలంలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారు. రీసర్వే పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో భాగంగా శుక్రవారం మండలంలోని కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం గ్రామ సరిహద్దులు, భౌగోళిక సత్య నిర్థారణ నిర్వహించారు. ఈ ప్రక్రియను ఏపీ స్టేట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అకాడమీ జాయింట్ డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్వీఎస్ఎన్ కుమార్, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, తహసీల్దారు కె.వెంకటశివయ్య స్వయంగా తనిఖీ చేశారు. తహసీల్దారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 420 ఎకరాల్లో రీసర్వే ప్రక్రియ సంతృప్తికరంగా పూర్తయిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీభూమి వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా రైతులు స్థానిక తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. -
స్వామివారి సన్నిధిలో క్యాట్ సభ్యులు
మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(సీఏటీ) సభ్యులు లతా బీ పాట్నే, షాలిని మిశ్రా, జి.నవీన్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్దు సతీష్ శర్మ, వెంకటేశ్వరరావు, మణిదీప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. కూచిపూడిలో మాతృభాషా దినోత్సవం కూచిపూడి(మొవ్వ): తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమ్మలాంటి కమ్మని మాతృభాషలో మాట్లాడి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేయాలని కళాపీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ ఆకాక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళా పీఠంలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళా పీఠం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ సీ్త్ర, పురుషుల హ్యాండ్‌బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లను ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ తెలిపారు. వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశామన్నారు. మహిళల జట్టుకు సత్య, షర్మిల, లక్ష్మి, శ్రావణి, లేపాక్షి, జాహ్నవి, అరుణనాగదుర్గ, ద్వారకేసరి, తనూజ, మానస, లోకేశ్వరి, భారతి, ధనుంజయశ్రీ , లీనాశ్రీ, భాగ్యలక్ష్మి, సుష్మాస్వరాజ్, పురుషుల జట్టుకు రితేష్, అభిష్, గౌతమ్, సుభాష్, డాని, సాయిగణేష్, భీమా, ధనుంజయ్, చరణ్, ధనుష్, దీపక్, వెంకటరత్నం, సీతయ్య, సంతోష్, చరణ్ ఎంపికై నట్లు తెలిపారు. కర్నూలులో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని వెల్లడించారు. -
లేగదూడల అందాల పోటీలు
పెనుగంచిప్రోలు: స్థానిక పశువైద్యశాలలో శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ, గన్నవరం వారి ఆధ్వర్యంలో లేగదూడల అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ కె.శ్రీనివాసులు లింగ నిర్థారణ ద్వారా, కృత్రిమ గర్భధారణ ద్వారా ఉపయోగాలు, నట్టల నివారణ మందులు వాడటం, ముర్రుపాలు తాగించటం వలన కలిగే ఉపయోగాలు, లేగదూడల సంరక్షణ గురించి రైతులకు వివరించారు. అనంతరం మంచి పోషణ కలిగిన దూడలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. రైతులకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, కాల్షియం, లివర్ టానిక్, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నందిగామ డివిజన్ డీడీ డాక్టర్ మోజెస్ వెస్లీ, ఏడీ డాక్టర్ వెంగళరావు, పశువైద్యులు పి.అనిల్, అర్చన, సిబ్బంది పాల్గొన్నారు. -
కోలుకున్న చిన్నారులు
మైలవరం: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కోడిగుడ్లు తిన్న చిన్నారులు 9మంది అస్వస్థతకు గురి కాగా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులు పూర్తిగా కోలుకోవడంతో వారిని డిస్చార్జి చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయ ప్రకాశ్ శుక్రవారం తెలిపారు. మిగతా ముగ్గురి ఆరోగ్యం సంతృప్తిగానే ఉందని,అయితే కొంచెం నీరసంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్, డీసీహెచ్ నాయక్, ఆరోగ్య శాఖ సిబ్బంది, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చిన్నారుల ఆరోగ్యం గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. బాలల అస్వస్థతపై అధికారుల విచారణ తిరువూరు: ఎ.కొండూరు మండలం పెదతండా అంగన్వాడీ కేంద్రంలో ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటనపై ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ శ్రీలక్ష్మి గురువారం రాత్రి మైలవరం ప్రభుత్వాసుపత్రిలో పిల్లల తల్లిదండ్రులను, పెద తండా అంగన్వాడీ కేంద్ర సిబ్బందిని విచారించారు. తిరువూరు ఐసీడీఎస్ సీడీపీవో సత్యవతి పెదతండా వాసులను, పిల్లల తల్లిదండ్రులను కలిసి చిన్నారులు అస్వస్థతకు గురైన విషయంలో వారి అభిప్రాయాలు సేకరించారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల అదుపు
పామర్రు: నేరాలను అదుపు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి విజయాలు సాధిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. పామర్రు సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డులను రిజిష్టర్లను తనిఖీలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈగిల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పాఠశాలలో ఈగిల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంటుందని ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. వీరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఎప్పుడు పోలీస్ శాఖకు అవసరమైతే అప్పుడు వివరాలను త్వరితగతిన అందించేందుకు సిద్ధంగా ఉంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు, గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, పామర్రు సీఐ సుభాకర్, పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గన్నవరం ట్రాఫిక్ పీఎస్ తనిఖీ చేసిన ఐ.జి గన్నవరం: స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావుతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఐజీ స్టేషన్ సిబ్బంది, ట్రాఫిక్ రద్దీ వివరాలను సీఐ పెద్దిరాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో వీవీఐపీలు, వీఐపీలు రాకపోకల వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగానే ఉందన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి సభలు, సమావేశాలు కూడా ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తయితే ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరును మరింత మెరుగుపర్చేందుకు త్వరలో కృష్ణాజిల్లాలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోలీస్ స్థలాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఒక నివేదిక తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. త్వరలో చేపట్టనున్న పోలీస్ రిక్రూట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కానున్నట్లు చెప్పారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, లా అండ్ ఆర్డర్ సీఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ -
వ్యాపారాలు లేవు!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ‘కరవమంటే కప్పకు కోపం... అరవమంటే పాముకు కోపం’ సామెత చందాన తయారైంది ఉమ్మడి కృష్ణాజిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పరిస్థితి. కూటమి సర్కార్ విధానాలతో ఉమ్మడి జిల్లాలో వ్యాపారాలు లేక ఆ శాఖకు రావాల్సిన ఆదాయానికి గండి పడింది. అయితే ‘‘ఆదాయం తగ్గితే ఎలా...? ప్రభుత్వానికి డబ్బులు తెచ్చే శాఖలో రెవెన్యూ పడిపోతే బాగుండదు. మీరు ఏం చేస్తారో తెలియదు ఆదాయం పెరగాల్సిందే...’’ అంటూ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెడుతున్నారు. గడిచిన తొమ్మిది మాసాలుగా వ్యాపారాలు లేక జీఎస్టీ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. వ్యాపారాలు పూర్తిగా దిగజారిన వైనం ఉమ్మడి కృష్ణాజిల్లాలో వ్యాపారాలు పూర్తిగా దిగజారాయి. ప్రధానంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయకత్వంలో అమలు చేస్తున్న విధానాలతో అన్ని వ్యాపారాలపై ప్రభావం చూపుతోందని వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు చెబుతున్నారు. వ్యాపారాలు లేకపోవటంతో పలువురు వ్యాపారులు దివాలా తీసే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా విజయవాడ నగరంలో అత్యధికంగా జరిగే వస్త్రాలు, బంగారం, కిరాణా తదితర రంగాలకు సంబంధించిన వ్యాపారాలు లేకపోవటంతో ఆ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గడిచిన పండుగ సీజన్లో తమ వ్యాపారాలకు భారీగా గండి పడిందని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. దానికి తోడు ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్లోనూ వ్యాపారం లేకుండా పోయిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడకేసిన నిర్మాణరంగం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఆదాయం వచ్చే రంగం సిమెంట్ పరిశ్రమ. దానికి తోడు ఇతర నిర్మాణ అనుబంధ రంగాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా. అయితే సిమెంట్ అమ్మకాలు గత ఏడాది మీద 30 నుంచి 35 శాతం పడిపోయాయంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఆ మేర వాణిజ్య పన్నుల శాఖ అధికారుల లెక్కలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. దాంతో నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే ఇతర రంగాల అమ్మకాలు కూడా దిగజారాయి. ఈ రంగాలపై ఆధారపడిన కార్మికులు, ప్రజానీకం సైతం సరైన ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఆటోమొబైల్ రంగానికీ అదే పరిస్థితి ఉమ్మడి కృష్ణాజిల్లాలో సిమెంట్ పరిశ్రమతో పాటుగా భారీగా ఆదాయం వచ్చే మరో రంగం ఆటోమొబైల్ పరిశ్రమ. ఈ రంగం నుంచి సైతం ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ వసూళ్లు పూర్తిగా దిగజారిపోయాయి. విజయవాడ–3 డివిజన్ పరిధిలో దాదాపుగా ఆటోమొబైల్ నుంచి అత్యధికంగా ఆదాయం ఉంటుంది. ఈ రంగం పూర్తిగా పడకవేయటంతో ఆదాయం టార్గెట్ దేవుడెరురు కనీసం గత ఏడాది వచ్చిన రెవెన్యూ సైతం వచ్చే పరిస్థితులు లేవని సర్కిల్ స్థాయి అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సమీక్షలో జిల్లా అధికారుల వెల్లడి గత ఏడాది ఆదాయం సైతం రాని వైనం గత ఏడాదిపై 30 శాతం అధికంగా టార్గెట్ చేయాలంటూ హుకుం తలలు పట్టుకుంటున్న వాణిజ్య పన్నుల శాఖ జిల్లా అధికారులు ఉమ్మడి జిల్లాకు రూ.6500 కోట్లు టార్గెట్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1 డివి జన్, విజయవాడ–2 డివిజన్, విజయ వాడ–3 డివిజన్‌గా వాణిజ్య పన్నుల శాఖ పని చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ –1,విజయవాడ–2 డివిజన్లుగా ఉండగా కృష్ణాజిల్లాలో అధిక భాగంగా విజయ వాడ–3 డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. మూడు డివిజన్ల పరిధిలో 17 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా సరాసరిన సుమారు నాలుగు నుంచి రూ.4500 కోట్ల మేర వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం వస్తుంది. ఈ ఏడాది ఆ శాఖ ఆరున్నర వేల కోట్ల మేర ఉమ్మడి జిల్లా నుంచి ఆదాయం రావాలని టార్గెట్ పెట్టారని, లేకుంటే కనీసం ఆరు వేల కోట్లకు రిచ్ కావాలంటూ ఒత్తిడి పెడుతున్నట్లుగా సమాచారం. కానీ జనవరి మాసాంతానికి కనీసం నాలుగు వేల కోట్ల ఆదాయం కూడా దాటకపోవటంతో ఆ శాఖ అధికారులపై మరింత ఒత్తిడి పెరిగినట్లు తెలసింది. అది కూడా పాత బకాయిలపై దృష్టి పెట్టడంతో ఆ మాత్రం ఆదాయమైనా వచ్చిందని ఒకరిద్దరు అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం గత ఏడాది ఆదాయం సైతం వచ్చే పరిస్థితులు లేవని ఆ శాఖ ఉద్యోగ సంఘ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
నేత కార్మికుల సంక్షేమం కోసమే ఏఐడబ్ల్యూఎఫ్
పెడన: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నిరంతరం పనిచేస్తుందని ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ అన్నారు. పట్టణంలోని శ్రీవిఘ్నేశ్వర ప్రార్థన మందిరంలో శుక్రవారం గుంటూరు జిల్లా పెదకాకాని శంకర్ నేత్రాలయ వారి సహకారంతో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. తొలుత శిబిరాన్ని నేత్రాలయం వైద్యురాలు షెఫాలి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆనందప్రసాద్ మాట్లాడుతూ నేత కార్మికులు నేత నేసే సమయంలో సన్నని దారపు పోగులు సక్రమంగా చూసుకోవాల్సి ఉంటుందని, కంటి చూపు తీక్షణంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేత కార్మికులకు చూపు బాగుంటేనే నేత బాగా నేయగలరని, ఈ ఉద్దేశంతోనే తాము ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా పెడనలో కంటి వైద్య శిబిరం పెట్టామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. నేత కార్మికులే కాకుండా ఇతర వృత్తుల వారు కూడా ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. నేత్రాలయం వారు ఉచితంగా ఆరోగ్యశ్రీపై వైద్య పరీక్షలు చేయడమే కాకుండా శస్త్రచికిత్సలు కూడా చేస్తారన్నారు. ఇప్పటి వరకు నేత్రాలయం వారు 2,500కు పైగా శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకండా 4 లక్షల మందికి శస్త్రచికిత్సలను అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇనమాల శివరాంప్రసాద్, జాతీయ కార్యవర్గ సభ్యుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు పిచ్చుక ఫణికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకురాతి జనార్దనరావు, కోశాధికారి తాళ్ల బాలాజీ, నేత్రాలయం క్యాంపు ఇన్చార్జి రవి, ఫెడరేషన్ నాయకులు కట్టా హేమసుందరరావు, దేవాంగ సంక్షేమ సంఘ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఊటుకూరి సుధీర్‌కుమార్, భళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో 123 మంది ఓపీలో నమోదు అవగా 49 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించి మొదటి విడతలో 17 మందిని పెదకాకాని తరలించినట్లు ఫెడరేషన్ వారు తెలిపారు. ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ పెడనలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహణ -
బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు మంగళగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో చేనేత రంగానికి రూ. 2వేల కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేతలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు బకాయి ఉన్న రూ. 172 కోట్లను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నేతన్న నేస్తం పథకాన్ని రూ.24 వేల నుంచి రూ.36 వేల రూపాయలకు పెంచాలని కోరారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కిసాన్ క్రెడిట్ కార్డులు తక్షణమే జారీ చేయాలి
ఏపీ కౌలురైతుల సంఘం, ఏపీ రైతు సంఘంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు కౌలు రైతులకు ‘కిసాన్ క్రెడిట్ కార్డులు‘ తక్షణమే జారీ చేయాలని ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్నీడు యల్లమందారావు, ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీలో కౌలు రైతులకు ష్యూరిటీ లేని పంట రుణాలు వడ్డీ లేకుండా తక్షణమే మంజూరు చేయాలని, సాగు భూమి దామాషాను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ‘ఏపీ పంట సాగుదారు హక్కుల చట్టం 2019’ ప్రకారం గుర్తింపు కార్డులు పొందిన వారికి హామీలు లేకుండానే బ్యాంకు నుంచి పంట రుణాలు పొందవచ్చనని నిబంధనలు ఉన్నా వాటిని పాటించడం లేదని కౌలురైతుల ఆవేదనను లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు ఇవ్వాలని అడిగితే భూ యజమాని ష్యూరిటీ సంతకం పెట్టాలని, భూ యజమాని పంట రుణాలు తీసుకోకుండా ఉండాలంటూ ఇలా అనేక ఆంక్షలు పెడుతూ అప్పు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని తెలిపారు. దేవదాయ ధర్మాదాయ, వక్ఫ్ భూములు సాగు చేస్తున్న కౌలురైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. పంట రుణాల సమీక్ష సమావేశంలో కౌలు రైతులను, సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని విన్నవించారు. లీడ్ బ్యాంకు కన్వీనర్ సి. భాస్కరరావు సానుకూలంగా స్పందించారన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రమేష్ ను కలిసి జిల్లాలో రబీలో పంటరుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. -
బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు మంగళగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో చేనేత రంగానికి రూ. 2వేల కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేతలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు బకాయి ఉన్న రూ. 172 కోట్లను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నేతన్న నేస్తం పథకాన్ని రూ.24 వేల నుంచి రూ.36 వేల రూపాయలకు పెంచాలని కోరారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలు
గుడ్లవల్లేరు: జిల్లాలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. రిజిస్ట్రేషన్ల జోరు తగ్గుముఖం పట్టడానికి భూముల ధరల పెంపే కారణమని తెలుస్తోంది. జనవరి నెలలో కృష్ణా జిల్లాలో 9,439 రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.48.62లక్షల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరిలో భూముల ధరల పెంపుతో పాటు రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరిగాయి. దీంతో ఈ నెలలో 6,924 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడంతో కేవలం రూ.20.86 లక్షల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. అందుకు అడ్డగోలుగా కూటమి ప్రభుత్వం పెంచేసిన భూముల ధరలే ప్రధాన కారణమన్న విమర్శలు జిల్లా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 10 నుంచి 40 శాతం అదనంగా భూముల ధరలను పాలకులు పెంచేశారు. సగటున 20శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్లకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.సంపద సృష్టి పేరుతో ఇష్టారాజ్యంగా ధరల పెంపురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పాలకులు సంపద సృష్టి పేరిట ఇష్టారాజ్యంగా ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలు భారీ పెరుగుదలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. తాజాగా భూముల రిజిస్ట్రేషన్ల ఫీజును పెంచేసి కొత్త బాదుడుకు శ్రీకారం చుట్టారు. దీంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సంఖ్య తగ్గింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా 10 నుంచి 40 శాతం వరకు భూముల ధరలను పెంచేసి.. రిజిస్ట్రేషన్ల ధరలు కూడా సగటున 20శాతానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి పెంచేశారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భూములు, నివాసాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల విలువలు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వ విధానంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారీగా చార్జీలుఅర్బన్లో 35శాతం, రూరల్‌లో 40 శాతం వరకు భూముల విలువలు పెంచారు. అధిక శాతం పట్టణ ప్రాంతాల్లో 20శాతానికి పైగా ధరలు అధికమైతే.. అధిక శాతం మండలాల్లో 30 శాతానికి పైగా పెరిగాయి. తాజా పెంపుతో కొన్ని పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే.. ప్రభుత్వ ధర ఎక్కువగా ఉన్నట్లు రియల్టర్లు చెబుతున్నారు.సామాన్యులకు సమస్యేబిడ్డల చదువులు, వివాహాలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ఉన్న కాస్త ఆస్తిని అమ్మకానికి పెట్టినా.. కొనేవారు లేక సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో నెలకు ఒక్క ప్లాట్ అయినా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనపడటం లేదు.అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపుతో పరిస్థితి మరింత దిగజారిందన్న ఆందోళనలో బాధితులు ఉన్నారు.బాబు హామీ.. నీటిమూటరిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోమంటూ గారడీ మాటలు చెప్పిన చంద్రబాబు ఎన్నికల హామీ నీటి మూటలా మారింది. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే జనాలపై ఆర్థిక భారం వేశారు. జిల్లాలో పెరిగిన 20 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటుగా అమల్లోకి వచ్చింది. ప్రజలపై పెంచిన భారాన్ని తన సంపద సృష్టిలా బాబు భావించడంపై సర్వత్రా వ్యతిరేకతలు వస్తున్నాయి.కొత్త ధరలతో రిజిస్ట్రేషన్లురిజిస్ట్రేషన్లపై పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూములు, ఇతర ఆస్తుల విలువలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ధరలు పెరుగుతుండటంతో గత కొద్ది రోజులుగా రిజిస్ట్రేషన్ల సంఖ్యలో వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం పెంచిన ధరల ప్రకారం జిల్లాలో సగటున 20శాతం వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయి. – ఎం.ఎస్.జి.కె.మూర్తి, జిల్లా రిజిస్ట్రార్ -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చల్లపల్లి: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ఆముదార్లంకలో చోటుచేసుకుంది. చల్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆముదార్లంకకు చెందిన తిరుమలశెట్టి రమణ(41) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రమణకు భార్య శ్యామలమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో పెద్దమనుషుల సమక్షంలో మూడు సంవత్సరాల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి శ్యామలమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోగా రమణ తన సోదరుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన రమణ బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న రమణ కుటుంబ సభ్యులు వెంటనే రమణను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించటంలో అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమణ గురువారం ఉదయం మృతి చెందాడు. రమణ సోదరుడు ఏడుకొండల ఫిర్యాదు మేరకు చల్లపల్లి హెడ్‌కానిస్టేబుల్ బీవీఎస్‌వీ ఈశ్వరప్రసాద్ కేసు నమోదు చేశారు. -
మర్చిపోయిన బ్యాగ్ మహిళకు అప్పగింత
భవానీపురం(విజయవాడపశ్చిమ): బంగారు ఆభరణాలు, నగదు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయిన ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి తిరిగి వాటిని అప్పగించారు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిళ్లా పార్వతి, దుర్గారావు దంపతులు చిట్టినగర్ సొరంగం దగ్గర నివసిస్తున్నారు. ఈ క్రమంలో పార్వతి తన కుటుంబసభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం విజయనగరం వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం 10 గంటల సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద దిగి బయటకు వచ్చారు. అక్కడ ఆటోను కిరాయికి మాట్లాడుకొని చిట్టినగర్ సొరంగం దగ్గర ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఆటో దిగే సమయంలో పార్వతి తన హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలోనే మరిచి పోయారు. అందులో ఐదు తులాల బంగారు వస్తువులు, పది వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ఉన్నాయి. వెంటనే ఆమె కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తక్షణమే సీఐ చిన కొండలరావు తమ సిబ్బందిని విచారణకు పంపారు. బాధితురాలు ఆటో ఎక్కిన సమయం, దిగిన సమయం తెలుసుకున్నారు. అలాగే ఆయా ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆటో డ్రైవర్ నున్న దగ్గర కండ్రిక వెళ్లిపోగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని ఆటోను గుర్తించారు. ఫిర్యాదులో పేర్కొన్న బంగారపు వస్తువులు, నగదు, ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమెకు తిరిగి ఇచ్చారు. -
విస్తృత స్తాయిలో ఎంఎస్ఎంఈ సర్వే
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశనందిగామ టౌన్(నందిగామ రూరల్): ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వేను విస్తృత స్థాయిలో చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. నందిగామ పట్టణంలో జరుగుతున్న ఎంఎస్ఎంఈ సర్వే (ఉద్యమ్) యాప్‌లో సమాచారాన్ని పొందుపరిచే ప్రక్రియను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక యూనిట్‌కు రుణాలు అవసరమా, నైపుణ్యాభివృద్ధితో పాటు మార్కెటింగ్ అవసరాలు, యూనిట్లకు అవసరమైన చేయూతనందించడానికి సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్లలో సాంకేతిక వినియోగం, నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి, సరిదిద్ద డానికి కూడా సర్వే ఫలితాలు దోహదపడతాయని చెప్పారు. ఎవరికై నా సందేహాలుంటే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఈ యూనిట్లు 100 శాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికి క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పరిష్కరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి ఇల్లూ.. సోలార్ రూఫ్‌టాప్‌తో వెలగాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రధాని సూర్యఘర్‌ను వినియోగించుకుని ప్రతి ఇల్లూ.. సోలార్ రూఫ్‌టాప్‌తో వెలగాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో గురువారం వివిధ శాఖల ఉద్యోగులకు సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ప్రజలు అతి తక్కువ ఖర్చుతో లబ్ధిదారుల ఇంటిపై సోలార్ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకోవడంతో తయారైన విద్యుత్‌ను ఉచితంగా గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. దీంతో కరెంట్ బిల్లులు చెల్లించనక్కర్లేదన్నారు. 360 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్కు రూ. 78,400, 240 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్కు రూ. 60 వేలు, 120 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కిలోవాట్‌కు రూ. 30 వేలు ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. దాదాపుగా 20 ఏళ్లు సౌర విద్యుత్‌ను పొందవచ్చన్నారు. గృహ అవసరాలకు వినియోగించిన అనంతరం మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇచ్చి ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించే మొత్తంతో బ్యాంకు రుణం చెల్లిస్తే రుణం తీరిపోతుందన్నారు. ఈ పథకంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కాలయాపన లేకుండా వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఇప్పటికే బ్యాంకర్లకు సూచించామన్నారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి.సాయిబాబు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నాడు వద్దని.. నేడు అదేపని..
సాక్షి, మచిలీపట్నం: నాడు భూముల రీ సర్వే వద్దని డిమాండ్ చేసి.. నేడు అదే పని చేయాలంటూ కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలు, సమస్యలకు శాశ్వత పరిష్కారానికి రీ సర్వే అవసరం. దీన్ని గుర్తించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లాలోని మూడు మండలాల్లో చేపట్టింది. గ్రామ సచివాలయాల్లోని సర్వేయర్లు, వీఆర్వోలు, రెవెన్యూ అధికారులతో పనులు మొదలు పెట్టింది. దీన్ని నాడు కూటమి నేతలు వ్యతిరేకించారు. రీ సర్వేపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. రైతులు, ప్రజల్లో ఆందోళన కలిగించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదేపని చేస్తోంది. రెవెన్యూ సదస్సులు నిర్వహించి, వచ్చిన విజ్ఞప్తులపై రీ సర్వే మార్గాన్ని ఎంచుకుంది. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక గ్రామంలో రీ సర్వేకు శ్రీకారం చుట్టింది.నాడు మూడు మండలాల్లో పూర్తిభూ తగాదాలు, సమస్యలను పరిష్కరించి, భూములను పూర్తి హక్కులతో యజమానులకు అప్పజెప్పడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రీసర్వే చేయించింది. భూముల చట్టబద్ధతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని గుడివాడ, గుడ్లవల్లేరు, పామర్రు మండలాల్లో రీ సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది. నాడు కూటమి దుష్ప్రచారం చేసినా.. లోపాలకు తావు లేకుండా పూర్తి చేసింది. ఎన్నికల కారణంగా ఆగింది.వ్యతిరేకించి.. నేడు అనుసరిస్తున్నారుగత ప్రభుత్వం చేపట్టిన విధానాలను వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు.. నేడు వాటినే అనుసరిస్తున్నారు. ముఖ్యంగా నాడు ఇసుక విధానాన్ని వ్యతిరేకించి.. తర్వాత అదే తరహా పాలసీని అమలు చేస్తున్నారు. భూముల రీ సర్వేపై నాడు టీడీపీ విష ప్రచారం చేసింది. భూములు లాగేసుకుంటారంటూ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టి ప్రజలు, రైతుల్లో ఆందోళన కలిగించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు అదే రీ సర్వే మార్గాన్ని ఎంచుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించిన మూడు మండలాలు మినహా.. మిగిలిన మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.గ్రామ సర్వేయర్లతో..గ్రామ సచివాలయ వ్యవస్థను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైన ప్రతి శాఖలకు ఉద్యోగిని నియమించింది. వారిలో గ్రామ సర్వేయర్లతో నాడు అనేక పనులు చేయించారు. ఇప్పుడు ఆ సర్వేయర్లతోనే ప్రభుత్వం రీసర్వే పనులు చేయిస్తోంది.గ్రామ సరిహద్దులు ఏర్పాటు, సర్వే నంబర్లలో హక్కుదారులెవరున్నారు? వారి భూములకు పట్టాదారు పాసు పుస్తకాలున్నాయా? వంటి అంశాలు పరిశీలిస్తున్నారు. లేనివారికి మ్యూటేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. యజమాని మరణిస్తే వారసులు తమ పేరిట భూ హక్కులు మార్చుకోవడానికి వీఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలి.జిల్లాలో ఇలా..జిల్లాలోని 23 మండలాల్లోని 23 గ్రామాలను ఎంపిక చేసి, పైలెట్ ప్రాజెక్ట్‌గా రీసర్వే చేస్తున్నారు. మార్చి 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రీ సర్వే డెప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ డీటీలు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు 394 మంది సిబ్బందితో, 58 రోవర్స్‌తో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తం 31,723.89 ఎకరాల భూమిలో 19,428 ఎకరాల్లో రీసర్వే పూర్తైంది. 6,535.20 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా 4,710 ఎకరాలు పూర్తైంది. ప్రస్తుతానికి వివరాలు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు.మార్చి 15లోపు పూర్తికి చర్యలురీ సర్వే ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాం. దీనిపై ఆర్ఎస్డీటీలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలకు ఇప్పటికే అవగాహన కల్పించాం. రోవర్, డ్రోన్ల సాయంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు వినియోగించుకోవాలి.– ఎం. జోషీలా, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి -
టమాటాను రైతుబజారులోనే విక్రయించండి
మార్కెటింగ్ ఏడీ నిత్యానందం మచిలీపట్నంటౌన్: టమాటాను పండించే రైతులు వాటిని బహిరంగ మార్కెట్లో కాకుండా రైతు బజార్లోనే విక్రయించుకోవాలని మార్కెటింగ్ శాఖ ఏడీ నిత్యానందం సూచించారు. రైతు బజారును ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. టమాటా దిగుబడి ఎక్కువగా రావటంతో ధర కిలో రూ.13 ఉన్నందున బహిరంగ మార్కెట్లో తక్కువ ధర వస్తుందని, అందువల్ల రైతు బజారులో స్వయంగా విక్రయిస్తే లాభం వస్తుందన్నారు. బయట మార్కెట్లో దళారులకు విక్రయించి నష్ట పోవద్దన్నారు. రైతు బజార్లో దుకాణాల్లో కాటాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ ఆయన పరిశీలించారు. రైతు బజార్లో నడవడానికి కూడా లేకుండా దుకాణాలను అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్న రైతుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో ఆయన వెంట రైతు బజారు ఎస్టేట్ అధికారి ఎల్. బలిచక్రవర్తి, పకీర్, ఆనంద్ ఉన్నారు. -
అధికారుల సమావేషాలు!
పెడన: ఇంటర్మీడియెట్ విద్యాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా అధికారిక సమావేశాలు జిల్లా కేంద్రంలో నిర్వహించడం పరిపాటి. అయితే అందుకు భిన్నంగా ఇంటర్ అధికారులు ఉయ్యూరు కేంద్రంగా సమావేశాలు నిర్వహిస్తూ విధానపరమైన నిర్ణయాలు చేస్తున్నారు. ఇటీవల ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ముందు సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఉయ్యూరులోనే నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా ఇక్కడే సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఒకటో తేదీ నుంచి పరీక్షలు.. మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లాలోని ఆర్ఐవోలు, డీఐఈవోలు జిల్లా కేంద్రాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటు అధికారులు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు ఇలా 150 మందికిపైగా సిబ్బందిని నియమించారు. వీరందరికీ ఈ నెల 23న జిల్లా కేంద్రంలో కాకుండా ఉయ్యూరులో సమావేశం పెట్టి దిశానిర్దేశం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటుకు మేలు చేసేందుకేనా? వాస్తవంగా జిల్లా కేంద్రంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించి జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించాలి. కానీ ఇంటర్మీడియెట్ అధికారులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడం, జిల్లా కలెక్టర్ ప్రమేయాన్ని తగ్గించడం విమర్శలకు తావిస్తోంది. అదీ కాకుండా ప్రైవేటు కళాశాలలను ఎన్డీయే కూటమి అందలం ఎక్కించడమే లక్ష్యంగా పావులు కదుపుతుందనే విషయానికి ఈ సమావేశం బలం చేకూర్చుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన ఇంటర్ ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలోనే సమావేశాలు నిర్వహించి పరీక్షల సిబ్బందికి మార్గదర్శకాలను జారీ చేసేవారు. కానీ ఇప్పుడున్న అధికారి మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా జిల్లా కేంద్రానికి ఎక్కడో దూరంగా ఎన్టీఆర్ జిల్లాకు దగ్గరగా ఉన్న ఉయ్యూరులో సమావేశాలను నిర్వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరో పక్క జిల్లా కేంద్రానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన జిల్లా అధికారులు జిల్లా కేంద్రాన్ని వదిలిపెట్టి ఉయ్యూరులో సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. కావాలని జిల్లా కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారనే పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాత మారని బందరు.. ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్న సమయంలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్నా.. విజయవాడలోనే అత్యధికంగా జిల్లా అధికారులుండే వారు. దీంతో విజయవాడలోనే సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలు విడిపోయినా, అధికారులు జిల్లా కేంద్రాల్లో ఉంటున్నా కూడా జిల్లా కేంద్రంగా మచిలీపట్నాన్ని గుర్తించకపోవడం విడ్డూరంగా ఉంది.ఇంటర్ విద్యాధికారుల రూటే సెపరేటు జిల్లా కేంద్రం వైపు చూడని అధికారులు సమావేశాలన్నీ ఉయ్యూరులోనే.. జిల్లా కేంద్రంలోనే పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ ప్రైవేటు కళాశాలలకు లబ్ధి చేకూర్చేందుకేనని ఆరోపణలు కలెక్టర్ ప్రమేయాన్ని తగ్గించడం పైనా విమర్శలు జిల్లా కేంద్రంలోనే నిర్వహించాలి.. ఇంటర్ పరీక్షలు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు, ఫ్లయింగ్ స్క్వాడ్లకు, కస్టోడియన్లకు సమావేశం జిల్లా కేంద్రంలోనే పెట్టాలని స్పష్టం చేశాం. అయితే ఆ రోజు అంటే 23న గ్రూపు–2 పరీక్ష ఉందన్నారు. 22న పెట్టుకోవాలని చెప్పాం. బందరులోని హిందూ కళాశాల, నోబుల్ కళాశాలలున్నాయి. వాటిల్లో సమావేశం పెట్టుకోవాలని ఆదేశించాం. – వీవీ సుబ్బారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియెట్ -
బాలికపై లైంగిక దాడి.. నిందితులకు జీవిత ఖైదు
విజయవాడలీగల్: బాలికను బెదిరించి, లైంగిక దాడి చేసిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్ట్టు న్యాయమూర్తి వి.భవాని జీవిత కాలం కఠినకారాగార శిక్ష, జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాలిక, ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో తన తాత ఇంట్లో ఉంటూ దగ్గరలోని స్కూల్లో చదువుతోంది. ఈ క్రమంలో సాయి అనే యువకుడు పరిచయమయ్యాడు. అప్పుడప్పుడూ ఫోన్లో ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. 2022 మే నెలలో రాత్రి సమయంలో సాయి బాలికకు ఫోన్ చేసి బయటకు పిలిచి, లైంగికదాడి చేశాడు. మరలా రెండు రోజుల తరువాత సాయి బయటకు రమ్మని అడుగగా, బాలిక రాను అని చెప్పడంతో మొదటి సారి కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అందరికీ చూపిస్తాను అని భయపెట్టి బయటకు తీసుకొచ్చి మరో ఇద్దరు వ్యక్తులతో కలసి లైంగికదాడి చేసి.. ఎవరికై నా చెపితే చంపుతామని బెదిరించారు. తరువాత బాలిక పిన్ని గమనించి, కడువు ఎత్తుగా ఉందని అడగగా, బాలిక జరిగిన విషయం చెప్పింది. మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పటి దిశా పోలీస్‌స్టేషన్ ఏసీపీ బి.వి.నాయుడు పటమట దర్శిపేటకు చెందిన సిరిగిరి చంద్రశేఖర్ అలియాస్ సాయి, పటమట లంబాడీ పేటకు చెందిన అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీనుతో పాటు మరో జువైనల్ సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకుని విచారించి, కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో పోక్సో చట్టం ప్రకారం నిందితులైన సిరిగిరి చంద్ర శేఖర్ అలియాస్ సాయి, అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీనుకు మరణించేంత వరకు కఠినకారాగార శిక్ష, సాయికి రూ.32 వేలు, ప్రకాష్‌కు రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా బాధిత బాలికకు జరిమానా నుంచి రూ.30 వేలు, మరో రూ.ఐదు లక్షలను నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. -
అవయవదానమిచ్చి.. ఆదర్శంగా నిలిచి..
భవానీపురం(విజయవాడపశ్చిమ): అవయవ దానంతో కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన ముత్యాల సరస్వతి (55) జీవితం ధన్యమైంది. విజయవాడ గొల్లపూడి బైపాస్ రోడ్‌లోని బాలాజీ టవర్స్‌లో నివసిస్తున్న ముత్యాల సరస్వతి, ఆమె కుమారుడు ముత్యాల రామ్‌కుమార్ ఈ నెల 14న బైక్‌పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సరస్వతి తలకు దెబ్బతగిలి తీవ్రంగా గాయపడింది. దాంతో రామ్‌కుమార్ తల్లిని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్సకు స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు 19వ తేదీన వైద్యులు ప్రకటించారు. ముత్యాల సరస్వతి అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. చిరస్మరణీయురాలు.. విషయం తెలిసి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా హాస్పిటల్‌కు వచ్చి మృతురాలికి పుష్పాంజలి ఘటించారు. చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన సరస్వతి చిరస్మరణీయురాలని కొనియాడారు. ఆమె దేహం నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లు సేకరించామని తెలిపారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు అప్పగించామని చెప్పారు. మృతురాలి కుటుంబసభ్యులకు జీవన్‌దాన్ సర్టిఫికెట్, రూ.10వేలు అందించామని, అయితే ఆ మొత్తాన్ని పేదల వైద్య సేవలకు ఖర్చు చేయాలని ఆమె కుమారుడు రామ్‌కుమార్ తిరిగి హాస్పిటల్‌కే ఇచ్చేశారని పేర్కొన్నారు. అనంతరం సరస్వతి మృతదేహాన్ని గొల్లపూడిలోని ఆమె నివాసానికి తరలించే ఏర్పాట్లు చేశారు. వెలంపల్లి నివాళులు.. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం సరస్వతి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ముత్యాల రామ్‌కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, బాపతి కోటిరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, నాయకులు పదిలం రాజశేఖర్, వెలది అనిల్ శర్మ, పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. కాగా గురువారం విద్యాధరపురంలోని హిందూ స్మశానవాటికలో సరస్వతి అంత్యక్రియలు నిర్వహించారు. మరో నలుగురికి పునర్జన్మనిచ్చిన మహిళ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కృత్తివెన్ను: మండల పరిధిలోని అడ్డపర్ర వద్ద గురువారం రాత్రి 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అడ్డపర్రకు చెందిన గార్లపాటి కోటేశ్వరరావు(65) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కృత్తివెన్ను నుంచి మచిలీపట్నం వైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కోటేశ్వరరావు కిందపడిపోయి అపస్మార స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కోటేశ్వరరావును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు
విజయవాడస్పోర్ట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఎన్జీజీవో(నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్) అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలకుమారి తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆమె ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు మార్చి 4, 5 తేదీల్లో ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీజీవో హోంలో క్రీడా, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్, వాకింగ్, టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్, చెస్, పాటలు, నృత్యం అంశాల్లో పోటీలుంటాయన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరి, ఏపీ ఏన్జీజీవో అసోసియేషన్ మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌తో మోసం.. వ్యక్తిపై కేసు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఒక వ్యక్తిని మోసం చేసిన వారిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖపట్నంకు చెందిన పూసర్ల విశ్వేశ్వర రావు గొల్లపూడి గ్రామంలోని సర్వే నంబర్ 234/1 నందు ఎకరం భూమిని గ్రామానికి చెందిన నూతలపాటి ఉషారాణి వద్ద కొనుగోలు చేశాడు. 2016లో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఏడాది తర్వాత ఆర్ఓఆర్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. సదరు భూమిని తాను కోనుగోలు చేయడానికి నెల రోజుల ముందే భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి విక్రయించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అతను వెంటనే ఉషారాణిని సంప్రదించగా.. భాస్కర్‌రెడ్డికి తాము బాకీ ఉన్నామని, అతని భాకీ చెల్లించి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటామని తెలిపారు. ఉషారాణి, ఆమె భర్త మల్లిఖార్జునరావు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకునేందుకు 10 రోజులు గడువు కోరారు. గడువు ముగిసినా భాస్కరరెడ్డికి చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోకపోవడంతో బాధితుడు విశ్వేశ్వరరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉషారాణి, ఆమె భర్త కుట్ర పూరితంగా తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసులిస్తేనే ఇసుక
కంచికచర్ల: నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల ఇసుకదందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎంపీ అనుచరులు ప్రకృతి వనరులపై కన్నేశారు. ‘నో చలానా.. ఓన్లీ క్యాష్’ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా దోచేస్తున్నారు. ఒక్కో లారీకి రూ. 10వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులయినా లారీలకు నింపుతామని ఎంపీ అనుచరులు బహిరంగంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పెండ్యాల, చెవిటికల్లు, వేములపల్లి ఇసుక రీచ్‌లన్నీ మూతపడ్డాయి. అదేమంటే ఒక్క రీచ్ సరిపోతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని ఇసుక కొనుగోలు దారులు చెబుతున్నారు. కూటమి పార్టీకి చెందిన నాయకులకు ఎవ్వరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఎంపీ అనుచరులు ఒకే రీచ్ నుంచి ఇసుకను తోడేస్తున్నారు. నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్ నుంచి రోజుకు 80 నుంచి 100 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం కూడా చెల్లించటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారుల సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసుకున్నా.. తట్టెడు ఇసుక దొరకదని రీచ్‌ల వద్ద ఎంపీ అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టచెప్పితే చాలు దండిగా ఇసుక లోడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ లారీ యజమానికి ఇసుకరీచ్‌లో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు రావటంతో ఈ విషయం బట్టబయలైంది. కంచికచర్ల మండలంలోని మూడు ఇసుక రీచ్లయిన పెండ్యాల – 1, పెండ్యాల–2, వేములపల్లి రీచ్‌లను మూసివేయించారు. రోజుకు రూ.10లక్షల ఆదాయం.. చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్ నుంచి ఎంపీకి రోజుకు రూ.10లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వ్యక్తులకు వచ్చిన రీచ్‌లను మూసివేయించి కేవలం కాసరబాద రీచ్‌ను తెరిచి రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. రూ.10వేలు చెల్లించిన వారికి ఒక్కో లారీకి 30 టన్నుల నుంచి 40 టన్నుల ఇసుక లోడింగ్ చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికి భారీ పొక్లెయిన్లతో ఇసుకను ఎత్తి పోస్తున్నారు. ఇసుక అక్రమంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, వైరా, మధిర, హైదరాబాద్, విజయవాడకు తరలించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు. కూటమి పెద్దల లక్ష్యం అదేనా? సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు బాగా ఖర్చు అయ్యాయని ఆ డబ్బులు సంపాదించాలంటే ఇసుక, మద్యం పాలసీల ద్వారా రాబట్టు కోవాలని ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా అంటున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.100కోట్లకు పైగా ఖర్చు అయ్యాయని ఆ డబ్బులు ఇసుక రూపంలో వసూలు చేసుకోవటం తప్పా అని ఎంపీ అనుచరులు అంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ నాయకుడికి సంబంధం లేదని తమ నాయకుడు రూ.200 కోట్లు సంపాదించే వరకు పార్టీ నాయకులెవ్వరికీ వాటాలు ఇచ్చేది లేదని ఎంపీ అనుచరులు ఖరాఖండిగా అంటున్నట్లు తెలుస్తోంది. రూ.10వేలు కొట్టు.. లోడ్ పట్టు టీడీపీ నేతలకు డబ్బు చెల్లిస్తే చాలు.. దండిగా ఇసుక నందిగామ నియోజకవర్గంలో ఎంపీ అనుచరుల హల్చల్ చలానా సైతం ఇవ్వకుండా దోపిడీ చందర్లపాడులోని కాసరబాద రీచ్ నుంచి మాత్రమే ఇసుక తరలింపు మిగిలిన అన్ని రీచ్‌లు మూత మిన్నకుండిపోతున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు క్లియరెన్స్ రాగానే ప్రారంభిస్తాం.. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలంలోని పెండ్యాల–1, పెండ్యాల–2, వేములపల్లి, చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామాల్లోని ఇసుక రీచ్‌లకు ఆరు నెలల క్రితం అనుమతి ఇచ్చాం. కానీ ఆ రీచ్‌లను తిరిగి పునరిద్దరించేందుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అది రాగానే రెండు రోజుల్లో తిరిగి రీచ్‌లు ప్రారంభిస్తాం. రీచ్‌లలో అక్రమ వసూళ్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. – వీరాస్వామి, మైనింగ్ ఏడీ విజయవాడ -
సమర్థంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉయ్యూరు: కృష్ణా–గుంటూరు జిల్లాల పట్టభద్రుల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల పోలింగ్ నిర్వహణ సమర్థంగా జరగాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఉయ్యూరు పట్టణంలో పోలింగ్ నిర్వహించే జిల్లా పరిషత్ పాఠశాల, రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాన్ని ఎస్పీ ఆర్.గంగాధర్‌రావుతో కలిసి గురువారం పరిశీలించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 25 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పంపిణీ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు వీలుగా ఆర్డీఓ కార్యాలయం ఉన్న మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్‌రూమ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. పెనమలూరు, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో 11 పోలింగ్ కేంద్రాలు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల్లో 8 పోలింగ్ కేంద్రాలు, మొవ్వ, పామర్రు, పమిడిముక్కల మండలాల్లో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రంలో నాలుగు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్ సామగ్రి తరలించేందుకు వీలుగా సెక్టార్ రూట్ వారీగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పటిష్ట బందోబస్తు.. ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు మాట్లాడుతూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని మాత్రమే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలకు అనుమతిస్తామన్నారు. సామగ్రి, బ్యాలెట్ బాక్సులు తరలించే వాహనాలకు ఎస్కార్ట్‌గా సీఐతో కూడిన బందోబస్తు ఉంటుందన్నారు. ఆర్డీఓ హెలా షారోన్, తహసీల్దార్ సురేష్‌కుమార్, కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉయ్యూరులో పోలింగ్ సామగ్రి పరిశీలన -
నిర్భయంగా తినండి
చల్లపల్లి: కోడిగుడ్డు, కోడి మాంసం ఎటువంటి సందేహాలు, అపోహలు లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ నిర్భయంగా తినవచ్చని పశుసంవర్థక శాఖ కృష్ణాజిల్లా జాయింట్ డైరెక్టర్ చిన్న నరసింహులు అన్నారు. చల్లపల్లి లోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రలో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం, కృష్ణాజిల్లా లేయర్స్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గుడ్డు, చికెన్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు పశు సంవర్థక శాఖ జాయింట్ డైరె క్టర్‌తో పాటు, కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓ శర్మిష్ట, మచిలీపట్నం ఆర్డీవో స్వాతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు మాలెంపాటి కాంచనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిన్న నరసింహులు మాట్లాడుతూ సాధారణంగా ఈ వైరస్ మొదట నాటుకోళ్లకు, ఆ తరువాత బ్రాయిలర్, ఫారం కోళ్లకు సోకుతుందని అన్నారు. ఏ ప్రాంతంలో అయితే ఈ వైరస్ గుర్తించారో ఆ ప్రాంతానికి 10 కిలోమీటర్లు చుట్టూ సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి అక్కడి నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తులైన గుడ్లు వంటివి ఒక్కటి కూడా బయటకు రానీయకుండా పటిష్టంగా కట్టడి చేస్తామని వివరించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క బర్డ్స్ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా గుడ్లను, చికెన్ ను ఆనందంగా తినవచ్చని భరోసా ఇచ్చారు. డీఎంహెచ్ఓ శర్మిష్ట మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అంటే పక్షులకు సోకే వైరస్ అని, మనుషులకు సోకేది కాదని, ఒకవేళ ఇలాంటి వైరస్లు మనుషులకు సోకితే వాటిని 99.99 శాతం నివారించటానికి తమ వద్ద మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మచిలీపట్నం ఆర్డీవో స్వాతి మాట్లాడుతూ ప్రస్తుతం బర్డ్స్ఫ్లూ వదంతుల కారణంగా ప్రజలు గుడ్లకు, చికెన్‌కు దూరమయ్యారని, నిర్భయంగా వాటిని తినవచ్చని అన్నారు. అనంతరం ఎగ్, చికెన్ మేళాకు విచ్చేసిన అధికారులు, పౌల్ట్రీ సంఘాల నాయకులు, ప్రముఖులు, పౌల్ట్రీ రైతులు అందరూ ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఫ్రై చేసిన చికెన్ ముక్కలు తిన్నారు. సుమారు వెయ్యి మందికి ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి రథసారథి డాక్టర్ డీఆర్కే ప్రసాద్, వైద్యులు సుజని, కృష్ణాజిల్లా అసోసియేషన్ నాయకులు వి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు కోడి గుడ్డు, కోడి మాంసం హాయిగా తినొచ్చు పశు సంవర్థక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ చిన్న నరసింహులు -
సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. సాయంత్రం 3 గంటల వరకు సాంకేతిక లోపాన్ని సరిచేయలేదు. దీంతో కక్షి దారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సప్తమి మంచి రోజు కావడంతో ఎక్కువ మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కక్షిదారులు తొలుత ఈకేవైసీ నిర్థారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పార్టీల సంతకాలు ఆన్లైన్ ద్వారా(ఈ–సైన్) సేకరిస్తారు. అయితే ఈ– సైన్ తీసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు సాంకేతిక లోపం సరిచేసినప్పటికీ.. మరలా కొద్దిసేపటికి నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌పై పార్టీల సంతకాలు ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు. సాంకేతిక సమస్య కారణంగా కొంత మంది వద్ద మాన్యువల్‌గా సంతకాలు తీసుకున్నట్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
వీరమ్మతల్లీ...పాహిమాం...
ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం భక్తజన కోలాహలంగా మారింది. శిడి బండి మహోత్సవం పూర్తవటంతో అమ్మవారిని దర్శించుకుని శిడి మొక్కులు తీర్చుకునేందుకు బుధవారం వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. మహిళలు పాలపొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. వీరమ్మతల్లీ...అమ్మా...పాహిమాం...అంటూ చల్లని తల్లికి పూజలు చేశారు. ఉయ్యూరు పాల వ్యాపారులు, వీరమ్మతల్లి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అమ్మవారికి ఊరేగింపుగా వెళ్లి పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. తొలుత శిడిబండికి పూజలు జరిపించారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జంపాన పూర్ణిమ, కేపీస్ డెంటల్ ఆసుపత్రి చైర్మన్ దాడి కై లాష్కుమార్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామ రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలి కలెక్టర్ జి.లక్ష్మీశ కేతనకొండ(ఇబ్రహీంపట్నం): గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని కేతనకొండ గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గ్రామానికి సంబంధించిన ఆన్లైన్ స్థితిగతులను పరిశీలించారు. గ్రామంలో 608 ఎకరాలకు గ్రౌండ్ లెవల్ ట్రూతింగ్ జరిగినట్లు సర్వేయర్లు వివరించారు. అందుకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రైతుకు సర్వే వివరాలు నోటీసు రూపంలో తెలియజేయాలని సూచించారు. రీసర్వే సమాచారం నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ వరప్రసాద్, సర్వేయర్లు పాల్గొన్నారు. టీబీ ముక్త్ పంచాయతీల్లో చర్యలపై సమావేశం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో టీబీ ముక్త్ పంచాయతీలుగా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి ఎన్నికై న సందర్భంగా అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సమావేశం నిర్వహించారు. నగరంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ మాచర్ల సుహాసిని సమావేశంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, డీఎల్‌టీఓ డాక్టర్ గుణశ్రీ, డాక్టర్ కె.శ్రీనివాస్, డాక్టర్ విజయకృష్ణ, డాక్టర్ రవీంద్రనాథ్, దినేష్, లీలాకుమార్ తదతరులు పాల్గొన్నారు. టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్ ఇవ్వండి వైద్య మంత్రిని కోరిన వైద్యుల సంఘం ప్రతినిధులు లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్స్ వర్తింపజేయాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కోరారు. ఆయన బుధవారం ప్రభుత్వాస్పత్రిని సందర్శించగా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ బాబ్జి శ్యామ్‌కుమార్, డాక్టర్ మహేష్, డాక్టర్ నూరుల్లా, డాక్టర్ సరళ తదితరులు కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేయడంతో పాటు, పీఆర్సీ ఎరియర్స్‌ను విడుదల చేయించాలని కోరారు. వారి సమస్యలు విన్న మంత్రి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
మత్స్యకారుల సంక్షేమాభివృద్ధికి కృషి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద అమలవుతున్న వివిధ రకాల పథకాల రాయితీలను మత్స్యకారులకు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం మత్స్యశాఖ అధికారులతో పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పథకాలపై మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. బోట్లు, వలలు, మోటారు ఇంజిన్లు తదితర యూనిట్ల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొంతమంది లబ్ధిదారులకు పలు రకాల యూనిట్లకు సంబంధించి సబ్సిడీ రాయితీలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఈ విషయాలను పై అధికారులకు తెలియజేసేందుకు లేఖలు సమర్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా యూనిట్ల మంజూరుకు పూర్తిస్థాయిలో ఆర్థిక చేయూతనిచ్చేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగబాబు, పలువురు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయం కోనేరుసెంటర్: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రత కోసం దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏఎస్ఈజెడ్ కృషి అభినంద నీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీ పట్నం మంగినపూడి బీచ్ ఒడ్డున ఏఎస్ఈజెడ్ సంస్థ ప్రతినిధులు వలంటీర్లతో కలిసి మంగినపూడి బీచ్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏరి శుభ్రం చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్‌ను కలిసి సంస్థ లక్ష్యాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్ర తీరాలలో కాలుష్య రహితానికి సంస్థ చేస్తున్న కృషిని కలెక్టర్‌కు వివరించారు. పర్యాటకశాఖ జిల్లా అధికారి జి.రామలక్ష్మణరావు, సంస్థ ప్రతినిధులు విలియం, ప్రేమ్ కుమార్, దక్షిణ కొరియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కలెక్టర్ బాలాజీ -
పది రోజుల్లో ‘పరీక్ష’
సాక్షి, మచిలీపట్నం: విద్యార్థి దశలో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియెట్. ఉన్నత చదువులకు దీనిని ప్రామాణికంగా తీసుకుంటారు. భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకమైన దశ ఇది. ఇంజినీర్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్, ఫార్మసీ, అగ్రి కల్చర్, మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్... విభాగం ఏదైనా ఇంటర్ మీడియెట్ కీలకం. ఇంత కీలకమైన ఇంటర్ పరీక్షలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. ● మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. ● మొదటి సంవత్సరం విద్యార్థులకు 1వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1, 4న ఇంగ్లిష్ పేపర్–1, 6న లెక్కలు–1ఏ / బోటని–1 / సివిక్స్ –1, 8న లెక్కలు–1బీ /జువాలజీ –1, హిస్టరీ –1, 11న ఫిజిక్స్ –1/ ఎకనామిక్స్ –1, 13న కెమిస్ట్రీ–1 / కామర్స్–1, సోషియాలజీ –1 / ఫైన్ ఆర్ట్, మ్యూజిక్–1, 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ –1 /లాజిక్–1 / బ్రిడ్జ్ కోర్సు / మేథమేటిక్స్ (బైపీసీ విద్యార్థులకు)–1, 19న మోడ్రన్ లాంగ్వేజెస్–1 / జియోగ్రఫీ–1 ఉంటాయి. ● ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్చి 2వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2, 5న ఇంగ్లిష్ –2, 7న లెక్కలు–2ఏ / బోటని–2 / సివిక్స్ –2, 10న లెక్కలు–2బీ /జువాలజీ –2, హిస్టరీ –2, 12న ఫిజిక్స్ –2/ ఎకనామిక్స్ –2, 15న కెమిస్ట్రీ–2 / కామర్స్–2, సోషియాలజీ –2 / ఫైన్ ఆర్ట్, మ్యూజిక్–2, 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ –2 /లాజిక్–2 / బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్ (బైపీసీ విద్యార్థులకు)–2, 20న మోడ్రన్ లాంగ్వేజెస్–2 / జియోగ్రఫీ–2 ఉంటాయి. ● జిల్లా సమాచారం జిల్లాలో మొత్తం 169 జూనియర్ కాలేజీలు ఉండగా ప్రభుత్వ కళాశాలలు 8, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 114 ఉన్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 24,571 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,833 మంది ఉన్నారు. వీరిలో ఎంపీసీ 12,511 మంది, బైపీసీ 5,839 మంది విద్యార్థులు ఉండగా ప్రభుత్వ కళాశాలల ఎంపీసీ 136, బైపీసీ 117 మంది ఉన్నారు. ఒకేషనల్ కాలేజీలు 17 ఉండగా ప్రైవేటు 11, ప్రభుత్వ కాలేజీలు ఆరు ఉన్నాయి. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు నేటితో ముగియనున్న ప్రాక్టికల్స్ కృష్ణాజిల్లాలో హాజరుకానున్న విద్యార్థులు 45 వేల మంది 63 పరీక్ష కేంద్రాలు.. 18 స్టోరేజ్ పాయింట్లు ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ 163 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన అధికారులు పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీ గా నిర్వహిస్తాం. ఇప్పటికే 63 పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి, అక్కడ తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి కాలేజీలో టేబుల్స్, ఇతర సదుపాయాలు కల్పిస్తాం. విద్యార్థులకు హాల్ టికెట్ల జారీ మొదలు పరీక్షలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహిస్తాం. – పి.సాల్మన్ రాజు, ఆర్ఐఓ నేటితో ముగియనున్న ప్రాక్టికల్స్ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థుల ప్రయోగ పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు 18,350 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులు ఎంపీసీ 12,511, బైపీసీ 5,839 మంది ఉన్నారు. మార్చి 5వ తేదీ నుంచి జరిగే ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు 1,639 మంది హాజరు కానున్నారు. ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలల్లో 731 మంది ఉన్నారు. ఏర్పాట్లు ఇలా... ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 45,404 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరి కోసం 63 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రశ్న, సమాధాన పత్రాలు భద్రపరిచేందుకు పోలీసు స్టేషన్లలో 18 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. 163 మంది సిబ్బందితో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. -
బాబూ... తడి, పొడి చెత్త వేరుగా ఇస్తున్నారా?
పెడన: పూర్వం రాజ్యంలో పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి రాజులు రాజ్యంలో మారువేషాలతో తిరిగేవారని కథల్లో చదివేవాళ్లం. ఇప్పుడు అలా మారువేషం వేయకపోయినా కృష్ణాజిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం పెడన మండలంలోని ఒక గ్రామంలో మందీ మార్బలం లేకుండా తానొక్కరే నేరుగా అక్కడకు వెళ్లి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితిపై గ్రామస్తులను ఆరా తీశారు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఉదయం పెడన మండలం బలిపర్రు గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులు ఎవరికీ చెప్పకుండా మచిలీపట్నం నుంచి నేరుగా బలిపర్రు విచ్చేసిన కలెక్టర్ గ్రామంలో మార్నింగ్ వాకర్ లాగా నడుచుకుంటూ సంచరించారు. పాత బలిపర్రు రోడ్డులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో పాటు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి పారిశుద్ధ్య పరిస్థితులపై ఆరా తీశారు. తడి, పొడి చెత్తలపై అవగాహన ఉందో లేదో పరిశీలించారు. కొందరు పొడిపొడిగా సమాధానం ఇవ్వగా మరి కొందరు అసలు ఏం చెప్పలేకపోయారు. కొసమెరుపు : అసలు వచ్చింది ఎవరో..ఏమిటో కూడా గ్రామస్తుల్లో చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. -
డేంజర్ బెల్స్
మూడు దశాబ్దాల కిందట ప్రజలను వణికించిన ఎయిడ్స్ మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తోంది. ఇటీవల కాలంలో కృష్ణాజిల్లాలో హెచ్ఐవీ కేసులు మళ్లీ చాప కింద నీరులా గప్‌చిప్‌గా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో మళ్లీ మరణ మృదంగం వినిపించే ప్రమాదం ఉంది. మచిలీపట్నంఅర్బన్: భాగస్వామితో కాకుండా ఇతరులతో కలవటం, విచ్చలవిడి శృంగారం, సురక్షిత పద్ధతులు పాటించకపోవటం ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి బారిన పడేలా చేస్తోంది. భార్య కడుపులో ఉన్న బిడ్డకు సైతం హెచ్ఐవీ సోకుతోంది. కృష్ణాజిల్లాలో ఇటీవల వెలుగు చూస్తున్న హెచ్ఐవీ కేసులను బట్టి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. చాప కింద నీరులా... మచిలీపట్నం జీజీహెచ్ ఏఆర్టీ సెంటర్లో 8810, గుడివాడ 3197 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. గతంలో మచిలీపట్నంకు చెందిన ఓ మహిళ వైద్య పరీక్షల కోసం స్థానికంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో చేసిన రక్త పరీక్షలలో పాజిటివ్ రాగా పెద్దాస్పత్రికి వెళ్తే అక్కడ ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త కారణంగా తనకీ దుస్థితి పట్టిందని తెలుసుకున్న ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. కొంతకాలం క్రితం రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఒక యువకుడికి హెచ్ఐవీ సోకిందని నిర్థారణ అవడంతో అతను వేదనతో కుంగిపోయాడు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో... జిల్లా పరిధిలో ఉన్న రెండు ఏఆర్టీ, 7 ఐసీటీసీ కేంద్రాల ద్వారా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు తరచూ వైద్య సేవలు అందించారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడినా గ్రామస్థాయిలో ఉన్న ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా పర్యవేక్షణ తప్పనిసరి చేశారు. మూడు నెలల పాటు ఏఆర్టీ కేంద్రాల ద్వారా మందులు వాడిన వారికి పింఛను అందజేశారు. గర్భిణులకు సోకుతుండటంపై ఆందోళన హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను గుర్తించటం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టగలం అనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షల సంఖ్యను పెంచాలి. జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జనరల్ క్లయింట్స్ 27,205 మందికి పరీక్షలు చేస్తే 1.25 శాతం పాజిటివిటీగా గుర్తించారు. ప్రతి గర్భిణికి హెచ్ఐవీ పరీక్షలు చేస్తున్నారు. ఇలా 2023–24 ఏడాదిలో 32,765 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 0.02 శాతం, 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 17,699 మందికి పరీక్షలు చేయగా 0.06 పాజిటివిటీ ఉందని తేల్చారు. ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదుసెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, మాదక ద్రవ్యాలను సూదుల ద్వారా ఎక్కించుకునే వారి ద్వారా హెచ్ఐవీ ఎక్కువగా విస్తరిస్తుందని వైద్యశాఖాధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకు లు, ల్యాబ్‌లలో హెచ్ఐవీ పరీక్షలు పాజిటివ్ తేలినా ఎలాంటి సమాచారం ఐసీటీసీలకు అందించడం లేదని వైద్యవర్గాలు అంటు న్నాయి. దీనికి తోడు వారికి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సంస్థల నిర్వహణకు ఏపీ సాక్స్ నుంచి అరకొర నిధులు కేటాయిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. ఇందువల్ల ఆయా సంస్థలు కాగితాల్లోనే తప్ప క్షేత్రస్థాయిలో కనిపించటం లేదు. ఏపీ సాక్స్ నిధులతో నిర్వహిస్తున్న సంస్థల కార్యకలాపాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు తక్షణం మేల్కొని హెచ్ఐవీ నియంత్రణకు తక్షణ తగిన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉంది. మళ్లీ పెరుగుతున్న హెచ్ఐవీ కేసులు గర్భిణులకు సోకుతుండటంపై ఆందోళన గర్భిణులు సంవత్సరం పరీక్షలు పాజిటివ్ కేసులు 2023–24 32,765 0.02 శాతం 2024 ఏప్రిల్ నుంచి 17,699 0.06 శాతం అక్టోబర్ వరకు జనరల్ క్లయింట్స్ సంవత్సరం పరీక్షలు పాజిటివ్ కేసులు 2023–24 39834 1.39 శాతం 2024 ఏప్రిల్ నుంచి 27,205 1.25 శాతం అక్టోబర్ వరకు -
పీహెచ్‌సీల్లో డీఎంహెచ్ఓ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహా సిని మంగళవారం అర్ధరాత్రి ఎ.కొండూరు, రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రాత్రి వేళల్లో విధుల్లో ఉండాల్సిన సిబ్బందిని తనిఖీ చేసి, హాజరు పట్టీ పరిశీలించారు. ఆ కేంద్రంలో అందిస్తున్న సేవల రికార్డులను పరిశీలించారు. ఎ.కొండూరు పీహెచ్సీలో కాన్పు జరిగిన బాలింత, శిశువుల ఆరోగ్య పరి స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్సీడీ–సీడీ సర్వే పరిశీలన జిల్లాలో జరుగుతున్న ఎన్సీడీ– సీడీ సర్వేను డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పరిశీలించారు. కంచికచర్ల–2 సచివాలయం పరిధిలో జరుగుతున్న సంచార చికిత్స కార్యక్రమం, వసంతకాలనీలో జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వేను తనిఖీచేశారు. సర్వే లక్ష్య సాధన దిశగా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ చేరుకుని స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాల్స్, ప్రయాణికులకు అందుతున్న సదు పాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో అభించే ఆహార పదార్థాలు, వాటి నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 31.37 కోట్లతో జరుగుతున్న పనుల పురో గతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సేవలు అందిందుకు వారి అభిప్రాయాలను సేకరించారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్రయాణికులకు అందుతున్న సేవలు, రైళ్ల నిర్వహణ, సమయపాలన తదితర విషయాలపై అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో కమర్షియల్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కర్ణాటక బ్యాంకులో కిలోల కొద్దీ బంగారు నగలను మాయం చేసిన అసిస్టెంట్ మేనేజర్‌ను అరెస్టు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బుధవారం రాత్రి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో విజయవాడకు చెందిన గన్నే సోమేశేఖర్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్, పేకాట, ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన సోమ శేఖర్ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోవటం మొదలుపెట్టాడు. బ్యాంకు అధికారులకు తెలియకుండా ఖాతాదారులు తాకట్టు పెట్టిన మూడు కిలోల బంగారు నగలను లాకర్ నుంచి తీసి, విజయవాడలోని నాన్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లతో పాటు తాను పనిచేసే బ్యాంకులోనూ తాకట్టుపెడుతూ వచ్చాడు. తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ముతో జల్సా చేయటంతో పాటు జూదాల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఇటీవల కర్ణాటక బ్యాంకు అధికారులు ఆడిట్ చేయగా తాకట్టులో ఉన్న బంగారు నగల లెక్క తేలలేదు. అనుమానం వచ్చిన అధికారులు ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ సీహెచ్.రాజా ఆధ్వర్యంలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు, చిలకలపూడి సీఐ ఎస్కే నబీ, సీసీఎస్ సీఐ కె.వి.ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుడు సోమశేఖర్‌ను గత నెల 31వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిందితుడు సోమశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు విజయవాడలోని నాన్ ఫైనాన్స్ కంపెనీల్లో సోమశేఖర్ తాకట్టుపెట్టిన రెండున్నర కిలోల నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని మరికొన్ని నాన్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టినట్లు తెలుసుకున్న పోలీసులు, దానిని కూడా రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్ట్ చేయటంతో పాటు రెండున్నర కిలోల బంగారు నగలను రికవరీ చేసిన సీఐలతో పాటు ప్రత్యేక బృందాలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నాన్ ఫైనాన్స్ కంపెనీలు, గోల్డు లోన్లు ఇచ్చే ఇతర సంస్థలు బంగారంపై ఖాతాదారులకు రుణాలు ఇచ్చే ముందు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు, ఏసుబాబు, నబీ, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం మిగిలిన నగల రికవరీకి చర్యలు వివరాలు వెల్లడించిన ఎస్పీ గంగాధరరావు -
సీసీ రోడ్ల నిర్మాణం.. అంతులేని నిర్లక్ష్యం
గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ నాటికే పూర్తికావాల్సిన సీపీ రోడ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఈ పనుల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామా పథకం కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కాంపోనెంట్ నిధులను కేటాయించింది. అక్టోబర్‌లో పల్లె పండుగ పేరిట ఈ పనులకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సంక్రాంతి వెళ్లి శివరాత్రి సమీపించినా లక్ష్యంలో 70 శాతం మాత్రమే పనులే పూర్త య్యాయి. ప్రస్తుతం పనులు సాగుతున్న తీరును గమనిస్తే పనులు పూర్తి కావడానికి మరో నెల రోజులకు పైగా పడుతుందని అంచనా. అక్టోబర్‌లో పనులు ప్రారంభం పల్లె పండుగ కార్యక్రమం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు వారం రోజుల పాటు విధి విధానాలు, పనుల గుర్తింపుపై గత ఏడాది ఆగస్టులో అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను అధికార ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. జిల్లాలో ఉపాధి నిధులు రూ.15,537.59 లక్షలతో 1,964 పనులను గుర్తించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. ఆమోదం రావడంతో గత ఏడాది అక్టోబర్‌లో నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆ పనులకు భూమిపూజలకే రెండు వారాలకు పైగా సమయం పట్టింది. నవంబర్ నుంచి పనులను చేపట్టారు. రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు.. పల్లె పండుగ కార్యక్రమం పేరిట ఒక్కొక్క అభివృద్ధి పనికి రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షలతో అంచనాలు రూపొందించారు. కూటమి ప్రభు త్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచించిన నేతలకే ఆ పనులను ఎక్కడికక్కడ కట్టబెట్టారు. చాలా గ్రామాల్లో సర్పంచులకు ఈ పనులు కేటాయించక పోవటంతో వారి నుంచి వ్యతిరేకతను కూడా కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంది. ఆ పనులను ఎలాంటి అనుభవం లేని కొత్త వారికి కట్టబెట్టడంతో పనుల్లో జాప్యం జరుగుతుందోన్న విమర్శలు లేకపోలేదు. పనుల నిర్వహణ ఇలా.. జిల్లాలోని 25 మండలాల్లో ఉపాధి నిధుల కింద రూ.15,537.59 లక్షలతో పనులు మంజూరయ్యాయి. ఇందులో సీసీ రోడ్లతో పాటు అవసరమైన చోట మాత్రమే డ్రెయిన్లను నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా గ్రామాల టీడీపీ నేతలు చెప్పిన ప్రాంతాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 80 శాతం సీసీ రోడ్ల నిర్మాణానికే నిధులను కేటాయించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆ పనులు పూర్తయిన రోడ్లను కచ్చితంగా 21రోజుల పాటు నీటితో తడిపి క్యూరింగ్ చేయాలన్నది నిబంధన. అయితే ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో అన్ని రోజుల పాటు క్యూరింగ్ చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. త్వరలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి జిల్లాలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పురోగతిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల 15వ తేదీకల్లా పూర్తి చేయాలని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పంచా యతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నాసిరకంగా చేసే పనులకు బిల్లులు మంజూరు కావు. – పున్నమరాజు రమణరావు, కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ ఎస్ఈ జిల్లాలో సంక్రాంతికే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావాలన్నది లక్ష్యం సంక్రాంతి వెళ్లి శివరాత్రి వస్తున్నా పూర్తికాని నిర్మాణ పనులు గత అక్టోబర్‌లో ప్రారంభమైన పనులు 70 శాతమే జరిగిన వైనం -
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థినిపై కళాశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని జిల్లా కోర్టు సమీపం శిడింబి అగ్రహారంలో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఆ కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ విద్యార్థినిని తరచూ బయటకు తీసుకెళ్లటంతో పాటు నిత్యం చాటింగ్ చేస్తున్నాడు. దీనిని గమనించిన విద్యార్థిని తల్లిదండ్రులు ఈ నెల 14వ తేదీన ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డి వద్దకు వచ్చి నిలదీశారు. దీంతో వాగ్వాదం జరగ్గా ప్రిన్సిపాల్‌పై విద్యార్థిని తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ సమాచారం కళాశాల చైర్మన్‌కు తెలియడంతో ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఏఐఎస్ఎఫ్ ఆందోళన విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ నాయకులు కళాశాల ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌పై కాకినాడలో ఫిర్యాదు చేశామని యాజ మాన్యం చెప్పింది. ఘటనను కావాలనే నీరు కారుస్తున్నారని, మచిలీపట్నంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ డిమాండ్ చేశారు. అందుకు యాజమాన్యం నిరాకరించడంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు కళాశాల ఫ్లెక్సీలను చింపి ఆందోళన చేపట్టారు. అనంతరం చైర్మన్ తమ కళాశాల ఉద్యోగుల ద్వారా ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డిపై చిలలకపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనను విరమించారు. -
దళిత మహిళలపై పెరుగుతున్న హింస
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశవ్యాప్తంగా దళిత మహిళలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని అంబేడ్కర్ భవన్లో దళిత సీ్త్ర శక్తి (డీఎస్ఎస్) 19వ వార్షిక మహాసభ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అధ్యక్షతన బుధవారం జరిగింది. ‘దళిత ఆదివాసి మహిళలపై జరుగుతున్న హింస, మానసిక ఆరోగ్యం – వివిధ కోణాలు’ అంశంపై వక్తలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాకి సునీత మాట్లాడుతూ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దళిత మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. 23 శాతం మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే రెండు శాతం మాత్రమే నిందితులకు శిక్షపడుతోందని తెలిపారు. మహిళలపై హింసలో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. అయినప్పటికీ నిత్యం సీ్త్రలపై హింస పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి హింసాత్మక ఘటనలపై దళిత సీ్త్ర శక్తి పోరాడటం అభినందనీయమన్నారు. తొలుత డీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం మాట్లాడుతూ.. 19 ఏళ్లుగా దళిత, ఆదివాసి సీ్త్రలు, బాలికల కోసం డీఎస్ఎస్ చేసిన కార్యక్రమాలను వివరించారు. ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ సరస్వతి అయ్యర్ మాట్లాడుతూ.. సీ్త్రలపై హింస అనేక ప్రభావాలకు గురి చేస్తోందన్నారు. సీనియర్ పాత్రికేయుడు ఎం.విశ్వ నాథరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని సీ్త్ర, పురుష సంబంధాలు హింసాత్మక ఘటనలతో ఉండకూడదన్నారు. హింసకు ఎవరు పాల్పడినా సహించకూడదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు హింసకు గురైతే పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. అనంతరం డీఎస్ఎస్ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయుడు శ్యామ్ సుందర్, జీజీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, సైకాలజిస్ట్ శ్రావణి కృష్ణకుమారి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాధిక ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఎస్ కోఆర్డినేటర్లు, దళిత మహిళలు పాల్గొన్నారు. -
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఆర్థికంగా ఎదగాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అన్నీ వ్యాపార సంస్థలుగా రాణించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆకాంక్షించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం జిల్లాలోలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థల సీఈఓలు, బోర్డు డైరెక్టర్లు, సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. సంస్థలోని ప్రతి రైతూ వ్యాపారవేత్తగా ఎదిగేలా ఆలోచన చేయాలని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఎన్.పద్మావతి, జై.జ్యోతి, డీఆర్డీఏ పీడీ సాయిబాబు, నాబార్డ్ బ్యాంక్ ఏజీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, డీసీఓ చంద్రశేఖర్, ప్రకృతి వ్యవసాయ డీపీఎం పార్థసారథి, బాపట్ల వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్త వాసుదేవరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ రాయితీలపై ప్రచారం అసత్యం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ీసనియర్ సిటిజన్లకు టికెట్లో 50 శాతం రాయితీని రైల్వేశాఖ పునరుద్ధరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గతంలో రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇచ్చేదని, 2020 మార్చి నుంచి కరోనా సమయంలో ఈ రాయితీని తొలగించిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి రాయితీని పునరుద్ధరించలేదని స్పష్టంచేశారు. కొన్ని సోషల్ మీడియాల్లో మాత్రం రాయితీపై తప్పుడు ప్రచారం జోరుగా సాగడంతో సీనియర్ సిటిజన్లలో కొంత అయోమయం నెలకొందని వివరించారు. కచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వే వెబ్సైట్లు లేదా అధీకృత మీడియాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రయాణికులు పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే ప్రయాణికులను గాయపరిచి చోరీ చేసే నిందితుల అరెస్టు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఔటర్లో కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డుపై ఉండే ప్రయాణికులను కిందకు లాగి, వారిపై బ్లేడుతో దాడి చేసి నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసే ఇద్దరు నిందితులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు, మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ కథనం మేరకు.. ఈ నెల రెండో తేదీన శ్రీనివాసరావు అనే వ్యక్తి తెనాలి నుంచి విజయవాడకు రైలులో బయలుదేరాడు. ఆ రైలు బస్‌స్టేషన్, పూలమార్కెట్ సమీపంలోకి రాగానే కొంత మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులు అతడిని కిందకి లాగి బ్లేడుతో గాయపర్చి పర్సు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. మరుసటి రోజు కూడా ఇదే తరహాలో పవన్ కుమార్‌ను బ్లేడుతో గాయపర్చి అతని వద్ద సెల్‌ఫోన్ దోచుకున్నారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాలతో జీఆర్పీ డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో సీఐ జి.వి.రమణ ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడిన వారిలోని ఒక మైనర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురు యువకులతో కలసి బ్లేడుతో దాడిచేసి చోరీలకు పాల్పడినట్లు తెలిపాడు. మైనర్ ఇచ్చిన సమాచారంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కన్నీటి రాజేష్‌ను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. -
హ్యాండ్ బాల్ పోటీల విజేత కేబీఎన్ కళాశాల
మైలవరం: స్థానిక డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ పురుషుల పోటీల విజేతగా విజయవాడ కేబీఎన్ కళాశాల జట్టు నిలిచింది. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల ద్వితీయ స్థానం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ స్థానం దక్కించుకున్నాయి. ఈ టోర్నీ బుధవారం ముగిసింది. టోర్నీలో పాల్గొన్న అన్ని జట్ల నుంచి మెరుగైన క్రీడాకారులను కృష్ణా యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ మేజర్ మన్నేస్వామి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 27 నుంచి తమిళనాడు రాష్ట్రం సేలంలోని పెరియార్ యూనివర్సిటీ నిర్వహించే దక్షిణ భారత విశ్వవిద్యాలయ పోటీలకు ప్రాతి నిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చీఫ్ డోనర్ డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, గ్లోబల్ స్టార్ కన్సల్టెన్సీ ఎండీ జె.చంద్రశేఖరరెడ్డి చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి తది తరులు పాల్గొన్నారు. -
చురుగ్గా శివాలయ నిర్మాణం
పెనుగంచిప్రోలు: స్థానిక మునేరు పక్కన స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో భక్తుల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మిస్తు న్నారు. మౌద్గల్య మహాముని తపస్సుతో ఏర్పడిన స్థానిక మునేరు పక్కన స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని 11వ శతాబ్దంలో సాగిపోతు రాజుగా పేరుపొందిన విజయాధిత్యుడు నిర్మించాడని, ఆ తరువాత 17వ శతాబ్దంలో అమరావతి కేంద్రంగా పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునః ప్రతిష్టించి నిత్య ధూపదీప నైవేద్యాల నిమిత్తం సుమారు 33 ఎకరాల భూమిని ఇచ్చారని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఈ ఆలయం పూర్తిగా శిథిలమైంది. ధ్వజస్తంభం తుపాను గాలులకు విరిగి పోయింది. దీంతో ఆలయాన్ని పునః నిర్మించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. గతంలో ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయం కూడా గత ప్రాశస్త్యం కోల్పోకుండా కొండ రాళ్లతోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయం సగభాగం నిర్మాణ పూర్తి కావస్తోంది. దేవదాయ శాఖ పర్యవేక్షణలో.. దేవదాయ శాఖ పర్యవేక్షణలో నూతన ఆలయాన్ని నిర్మించేందుకు శంభులింగేశ్వరస్వామి ట్రస్ట్ ఏర్పాటు చేసి పాత ఆలయాన్ని పూర్తిగా తొలగించారు. నూతన ఆలయ నిర్మాణానికి 2023, మార్చి 9న బలుసుపాడు గురుధామ్ క్షేత్రానికి చెందిన తాత్వికుడు గెంటేల వెంకటరమణ దంపతులు శంకుస్థాన చేశారు. 11వ శతాబ్దానికి చెందిన శంభులింగేశ్వరస్వామి ఆలయం శిథిలావస్థకు చేరడంతో కొండరాళ్లతో పునర్నిర్మాణ పనులు రూ.4 కోట్లతో నిర్మాణం కోనేరు బావి నుంచి ఉద్భవించిన స్వామికి ప్రకృతి సిద్ధంగా అంతర్వాహినిగా మునేరు ప్రవహిస్తూ నిత్యా భిషేకం జరడం ఈ క్షేత్రం విశిష్టత. శివరాత్రి, కార్తికమాసం, మిగిలిన ఉత్సవాల సమయాల్లో శ్రీఅయ్యప్ప సేవాసమితి తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయ పునః నిర్మాణానికి పూర్తిగా దాతలు సహకరిస్తున్నారు. రూ.4 కోట్లకు పైగా అంచనాలతో శివాలయంతో పాటు వెనుక అయ్యప్పస్వామి ఆలయం కూడా నిర్మిస్తున్నాం. భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. – వాసిరెడ్డి బెనర్జీ, శంభులింగేశ్వరస్వామి ట్రస్ట్ బాధ్యుడు -
అనధికార కట్టడాలపై కొరడా
పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో అనధికార కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. పోరంకి, తాడిగడపలో పలు అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. దీంతో మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు పోరంకి బీజేఆర్ నగర్లో అనధికార భవన నిర్మాణంలో అదనపు ఫ్లోర్లను ధ్వంసం చేశారు. తాడిగడప మనోజ్నగర్లో కూడా అనధికార కట్టడాన్ని అధికారులు గుర్తించి శ్లాబ్‌కు కన్నాలు పెట్టారు. అనధికార నిర్మాణాలు నిర్మించినా, అక్రమ లేఅవుట్లు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ భవానీప్రసాద్ అన్నారు. ఇళ్ల స్థలాలు కొనే వారు, భవనాల్లో ఫ్లాట్ కొనే వారు నిబంధనల ప్రకారం నిర్మించారా లేదా అనే విషయం తెలుసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించండి కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): ఎకో సెన్సిటివ్ జోన్లో పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా వైల్డ్ లైఫ్ సాంక్చ్యూరి పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. జోన్ పరిధిలోని గ్రామాల్లో పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి ఆయా శాఖలు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె. చంద్రశేఖర్, ఆర్డీవో కె. స్వాతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటకశాఖ అధికారి రామలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర వాసులందరూ పాల్గొనాలి పటమట(విజయవాడతూర్పు): జాతీయ స్థాయిలో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ వాసులందరూ పాల్గొనాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. గతంలో నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచినందుకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ నగరాల్లో ఒకటిగా విజయవాడ నిలిచిందన్నారు. అదే మాదిరిగా ఈ సారి జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ నగర వాసులు చురుగ్గా పాల్గొని విజయవాడను ఉత్తమ స్థానంలో నిలపాలన్నారు. ప్రస్తుతం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రజాభిప్రాయాన్ని క్యూ ఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఫోన్ నంబర్, ఓటీపీ నమోదు చేసి, సర్వేలో ఉన్న పది ప్రశ్నలకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రజలను కోరారు. -
● గ్రామ పంచాయతీ, ముడా అనుమతులు లేకుండా నిర్మాణాలు ● బంటుమిల్లిలో ఇష్టారాజ్యంగా వెంచర్లు ● అడ్డూ అదుపు లేకుండా కట్టడాలు ● 200 మందికి నోటీసులు జారీ చేసిన ఎంయూడీఏ ● నిబంధనల పేరుతో రూ.వేలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణ
సాక్షి, మచిలీపట్నం/బంటుమిల్లి: జిల్లాలో అక్రమ కట్టడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు పెద్ద మాల్స్, ఫంక్షన్ హాల్స్ సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తు న్నారు. మరోవైపు వెంచర్లు, లే అవుట్లకు కూడా ఎలాంటి అనుమతులు ఉండటం లేదు. ముఖ్యంగా పచ్చని పొలాలు, వరి పండే భూములను సైతం ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున చర్చ రావడంతో ఇటీవలే మేల్కొన్న అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకొని కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లానింగ్, అనుమతులు తప్పనిసరి.. గృహ నిర్మాణాలతో పాటు వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తులు, మాల్స్, కల్యాణ మండపాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. 300 అడుగుల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకునే కట్టడాలకు గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. ఆపై విస్తీర్ణంలో నిర్మించే వాటికి ఎంయూడీఏ అనుమతులు పొందాలి. ఆఫ్‌లైన్ విధానంలో కాకుండా కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని, అనుమతులు పొందాలి. ఎంయూడీయూ పరిధి ఇది.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కేంద్రంగా 2016లో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పా టు చేశారు. ఇందులో మచిలీపట్నంతో పాటు పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కై కలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి, కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, గుడ్లవల్లేరు మండలాల్లోని గ్రామాలు వస్తాయి. తగిన విస్తీర్ణం దాటి నిర్మించే కట్టడాలు, వెంచర్లు, మాల్స్, బహుళ అంతస్తుల నిర్మాణాలకు తప్పనిసరిగా ఎంయూడీఏ అనుమతులు పొందాలి. నిబంధనలు గాలికి.. అనుమతులు లేకుంటే చర్యలు.. బహుళ అంతస్తుల నిర్మాణాలు, లే అవుట్లు, మాల్స్, వెంచర్లు, కల్యాణ మండపాల కట్టడాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. ముందుగా ఇంజినీరింగ్ ప్లానింగ్ మేరకు గ్రామ పంచాయతీ పరిధి దాటి ఉంటే.. ఎంయూడీఏలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ కార్యదర్శి, ఎంయూడీఏ అధికారులు ఫీల్డ్ విజిట్ తరువాత సూచించిన చలానా చెల్లిస్తే అనుమతులు ఇస్తాం. ఆఫ్ లైన్లో ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దు. అనుమతులు లేకపోతే తగిన చర్యలు తీసుకుంటాం. – కె. రవిశంకర్, కార్యదర్శి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఎంయూడీఏ నిబంధనలకు పాతర.. నిర్మాణాల జాతరఎంయూడీఏ కార్యాలయంలో 2024లో 380 దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది 192 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్స్ కలిగిన ఇంజినీర్ ప్లానింగ్ పొందాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, నిర్మాణాలు పూర్తిగా కట్టడానికి అయ్యే ఖర్చులో 14శాతం వరకు అనుమతుల ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ఇది అమలు కావడం లేదు. కేవలం గుడ్లవల్లేరు, వడ్లమన్నాడులో నిర్మించే రెండు కట్టడాలను మాత్రమే అడ్డుకొని నిలిపివేశారు. బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, కల్యాణ మండపాలకు తప్పనిసరిగా సెట్‌బ్యాక్ (అగ్ని ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు వీలుగా స్థలం వదలాలి) ఉండాలి. కానీ ఇలాంటి నిబంధనలు పాటించకుండా వందల నిర్మాణాలు, వెంచర్లు వెలుస్తున్నాయి. -
వైభవం.. శిడి బండి సంబరం
ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. నయనానందకరంగా.. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడి బండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూల దండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తి పారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు. శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు.. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్‌ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం -
పెదవి చీలిక శాపం కాదు
సిద్ధార్థ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రామోజీరావు గన్నవరం రూరల్: పెదవి చీలిక, అంగిలి చీలిక శాపం కాదని చిన అవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ రామోజీరావు అన్నారు. మండలంలోని ముస్తాబాద జెడ్పీ హైస్కూల్లో మంగళవారం ఓరల్ అండ్ మాక్సిలో ఫేషియల్ సర్జరీ విభాగం ఆధ్వర్యాన విద్యార్థులకు గ్రహణం మొర్రిపై అవగాహన కల్పించారు. డాక్టర్ రామోజీరావు మాట్లాడుతూ చిన్నతనంలో ఏర్పడే పెదవి చీలికతో ఆత్మన్యూనతకు గురవుతారని, మిగిలిన వారితో కలసి ముందుకు నడవలేరని చెప్పారు. దీనిని అధిగమించడం ఈ రోజు చాలా తేలికన్నారు. తమ కళాశాలల్లో గ్రహణం మొర్రి ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌వోడీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు మాట్లాడుతూ చీలిక ఉన్న బాలలను ఆదరించాలన్నారు. అంగిలి చీలిక ఉన్న వారిని చైతన్యపరిచి వారికి ఆపరేషన్ల ద్వారా నూతన జీవితాన్ని అందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన, ఇబ్బందులను అధిగమించే ప్రక్రియలను డాక్టర్ వసుధ వివరించారు. పెడోడాంటిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ రవిచంద్రశేఖర్, డాక్టర్ నాయుడు, ప్రొఫెసర్ శ్రీకాంత్ గుంటూరు, ఇన్చార్జి హెచ్ఎం శ్రీపతి రామ్‌గోపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సాగుదారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కిసాన్ మేళాలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఘంటసాల: సాంకేతికతను సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఘంటసాలలోని వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజోన్ కిసాన్ మేళా మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ పరిశోధనా ప్రాంగణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ అధ్యక్షతన జరిగిన కిసాన్ మేళాను విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏఆర్ఎస్, కేవీకే, ఇతర వ్యవసాయ ప్రదర్శన స్టాల్స్, యంత్రాలను పరిశీలించారు. ముందుగా ఏఆర్ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు వరి మాగాణుల్లో అపరాల సాగు–సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించడంతో పాటు వివిధ పంటల్లో నూతన వంగడాలు, నూతన పద్ధతులు తెలియజేసి రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అనంతరం ఘంటసాల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన వరి మాగాణులలో మినుము, పెసర సాగు యాజమాన్యం, వరి మాగాణులలో మినుమును ఆశించే కాండం గజ్జి తెగులు యాజమాన్యం పుస్తకాలను ఆవిష్కరించారు. రైతులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ, కృష్ణా మండలం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వీవీఎస్ దుర్గా ప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎన్.పద్మావతి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి నరసింహులు, ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.సత్యప్రియ లలిత తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 18 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం స్వామి పెళ్లి కుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. స్వామికి గణపతి పూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని పెళ్లికుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన చంద్రిక జ్యూయలర్స్ అధినేత జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు ఈ ఉత్సవానికి కై ంకర్యకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్లు బోగి కోటేశ్వరరావు, సీతారామ కోవెల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె.వి.నారాయణ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. -
కృష్ణా వర్సిటీ వీసీగా రాంజీ
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా కె. రాంజీని నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాగా జేఎన్టీయూ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరావు ఆరు నెలలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపకులపతిగా కొనసాగిన విషయం విదితమే. త్వరలో రాంజీ కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుబ్బారాయుడి సేవలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్ధు సతీష్‌శర్మ, విరూప్శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
జాతీయ పోటీల్లో సత్తాచాటిన పారా అథ్లెట్లు
విజయవాడస్పోర్ట్స్: జాతీయ పారా చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటుతున్నారని ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి.రామస్వామి తెలిపారు. ఈ నెల 17వ తేదీ చైన్నెలో ప్రారంభమైన 23వ పారా జాతీయ పోటీల్లో రాష్ట్ర జావెలిన్ క్రీడాకారుడు రొంగలి రవి ఎఫ్–40 విభాగంలో గోల్డ్ మెడల్, ఖలీషాబాషా బ్రాంజ్ మెడల్, 1500 మీటర్ల రన్నింగ్‌లో ఎస్.నవీన్ బ్రాంజ్ మెడల్ సాధించారని పేర్కొన్నారు. తొలి రోజు పోటీల్లోనే రాష్ట్రానికి మూడు పతకాలు అందించిన క్రీడాకారులను ఏపీ పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు అభినందించారు. -
లిటిల్ లైట్స్ హోమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
గన్నవరం: స్థానిక లిటిల్ లైట్స్ హోమ్‌లో సోమ వారం అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్కసారిగా చెల రేగిన మంటలు హాస్టల్ గదిని చుట్టుముట్ట డంతో విద్యార్థుల హాహాకారాలు మిన్నంటాయి. కొంత మంది విద్యార్థులు మంటలను తప్పించుకుని బయటపడగా, మరికొందరిని స్థానికులు, అగ్నిమాపక దళం రక్షించడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానిక రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్‌లో మూడు నుంచి పదో తరగతి చదువుతున్న 140 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. సోమ వారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో పై అంతస్తులో ఉన్న గదిలో 35 మంది పిల్లలు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక బెడ్‌కు మంటలు అంటుకున్నాయి. సీలింగ్ ఫ్యాన్ల గాలికి పక్కపక్కనే ఉన్న బెడ్లకు ఆ మంటలు వేగంగా విస్తరించాయి. గది మొత్తాన్ని మంటలు చుట్టేయగా పొగ వ్యాపించింది. దీంతో నిద్ర నుంచి మేలుకున్న విద్యార్థులు మంటలు, పొగతో ఊపిరి అందక ఆందోళనతో బిగ్గరగా కేకలు వేశారు. హాస్టల్ గది మొత్తానికి ఒకే ద్వారం ఉండడంతో కొంత మంది అటుగా తప్పించుకుని బయటపడ్డారు. మిగిలిన విద్యార్థులు గదిలోనే ఉండిపోయారు. స్థానికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులు చిక్కుకున్న గది కిటికీ అద్దాలను పగులకొట్టి మిగిలిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నాల్గో తరగతి విద్యార్థి పులపాక అఖిల్ చేతికి గాయాలు కావడంతో మొదట గన్నవరం, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి నుంచి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి విద్యార్థి కై లే ఉదయ్‌కిరణ్, మెండెం సిద్ధార్థ, తిరివీధి అఖిలేష్, టి.తేజశ్వర్, ఎన్.వినయ్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి దోమల చక్రం కారణమని ఫైర్ అధికారి షేక్ అహ్మద్ గుర్తించారు. దోమల చక్రం వల్లే..ఓ విద్యార్థి తను నిద్రిస్తున్న బెడ్ అంచున దోమల చక్రం వెలిగించాడు. ఆ చక్రం కొబ్బరి పీచుతోచేసిన బెడ్‌కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని తెలిపారు. సీడబ్ల్యూసీ విచారణ ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన హాస్టల్ గదిని పరిశీలించారు. ఘటనకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దారు కె.వెంకటశివయ్య, ఎంఈఓ కొండా రవికుమార్, కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, రవిభార్గవ్, రాధాకుమారి, ప్రేమ లత, సత్యవతి పాల్గొన్నారు. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం దోమల చక్రమే ఘటనకు కారణం -
అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభం
మైలవరం: క్రీడలతో విద్యార్థుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని కృష్ణా జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సీజర్రెడ్డి పేర్కొన్నారు. మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు పోటీల్లో విజయవాడ నుంచి ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల, నూజివీడు నుంచి డీఏఆర్ కళాశాల, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్లు ప్రాతినిధ్యం వహించాయి. ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు 16–11 స్కోర్‌తో విజయం సాధించి లీగ్ దశకు చేరుకుంది. డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ కళాశాల, నూజివీడు డీఏఆర్ కళాశాల, విజయవాడ కేబీఎన్ కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల జట్లు లీగ్‌కు చేరాయి. భూ సమస్యలపరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ తిరువూరు: పెండింగులో ఉన్న భూసమస్యల పరిష్కారానికి తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశా, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొని భూముల సమస్యలకు పరిష్కారం చూపారు. మ్యూటేషన్లు, ప్రభుత్వ భూములుగా నమోదైన పట్టాభూములు అర్హులైన వారి భూములు పట్టాభూములు మార్చడంతోపాటు, సబ్ డివిజన్ చేసినప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో లేని రీసర్వే నంబర్లను నమోదు చేశారు. డివిజన్లోని పలు మండలాల నుంచి 45 మంది రైతులు దీర్ఘకాలంగా కోరుతున్న క్లిష్టమైన సమస్యలతో పాటు సర్వే సమస్యలను కూడా ఈ సందర్భంగా పరిష్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనరసింహం, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. శ్రీశైలానికి ఏపీటీడీసీ బస్ భవానీపురం(విజయవాడపశ్చిమ): శివరాత్రి సందర్భంగా ఏపీటీడీసీ రాజమండ్రి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 18 సీట్ల ఏసీ మినీ బస్ నడపనుంది. ఈ నెల 25న సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రిలో బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడ హరిత బెరంపార్క్కు వస్తుంది. ఇక్కడి నుంచి పది గంటలకు బయలుదేరి 26వ తేదీ ఉదయం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుతుంది. మల్లన్న స్వామి దర్శనం తరువాత బస్సు తిరిగి బయలుదేరి 27వ తేదీ తెల్లవారు జాము రెండు గంటలకు విజయవాడ, సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. పెద్దలకు రూ.4,360, పిల్లలకు రూ.3,490గా చార్జ్జీ నిర్ణయించామని ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పీ) శేషగిరి తెలిపారు. -
ఉప్పొంగిన అభిమానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అభిమాన కెరటం ఉప్పొంగింది. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమా నులు ఛేదించి తమ అధినేతకు నీరాజనాలు పట్టారు. అక్రమ కేసులో అరెస్టయి జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయ వాడ వచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో జైలు పరిసరాలు, గాంధీనగర్‌లో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. జైలు ఉన్న ఆంధ్రరత్న రోడ్డులో మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. జైలుకు వంద అడుగుల దూరం నుంచే అభిమానులను అడ్డుకున్నారు. హనుమాన్‌పేట లోని సిరివెళ్ల నర్సింగ్ హోం, తాలూకా ఆఫీస్ దక్షిణం గేటు, లేపాక్షి షోరూమ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రెస్‌క్లబ్ ఎదురుగా ఉన్న దుర్గా కళామందిరం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి జైలు వైపు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను వంద అడుగుల అవతలే నిలిపివేశారు. ఏ రోడ్డు చూసినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిశాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ముందుగా నిర్ణయించిన మార్గంలో కాకుండా, మరో దారిలో జైలు వద్దకు అనుమతించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలుకు సమీపంలోకి రావడంతో ఒక్కసారిగా కార్య కర్తలు దూసుకొచ్చారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. తమ అభిమాన నేతను చూసేందుకు అనుమతివ్వాలని, తమపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద పోలీసులను అభిమానులు నిలదీశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినా కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అడుగడుగునా అభివాదం పర్యటన ముగించుకొని వెళ్లే క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగడుగునా అభిమానులకు అభివాదం చేశారు. జైలు నుంచి న్యూ ఇండియ హోటల్ సెంటర్ వరకు ఐదారు చోట్ల ఆగి కారుపై నిలబడి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఆయనతో సెల్ఫీల కోసం కార్యకర్తలు ఎగబడ్డారు. జగన్ కారుపైకి వచ్చి అభివాదం చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పర్యటనలో పాల్గొన్న పలువురు నేతలు వల్లభనేని వంశీ అక్రమ అరెస్టుపై స్పందించారు. గాంధీనగర్ ప్రశాంతతకు పెట్టింది పేరు. వంశీని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తుంటే ఆయనను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. పోలీసులు అనవసర ఆంక్షలు విధించారు. దారులన్నీ మూసి వేశారు. ప్రశాంత వాతావరణాన్ని పోలీసులే చెడగొడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ముందుకు వెళ్లడం లేదు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. మా నాయకుడు పరామర్శకు వస్తుంటే 144 సెక్షన్ విధించింది. ప్రభుత్వం ఏ ఒక్క పనీ చేయడంలేదు. డైవర్ట్ రాజకీయాలు చేస్తోంది. ప్రజాస్వామ్య విలువ లను కాపాడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. – కై లే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న సందేహం కలుగుతోంది. సత్యవర్థన్‌ను పోలీసులే కిడ్నాప్ చేశారు. అతని చేత బలవంతపు కేసు పెట్టారు. వల్లభనేని వంశీని ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు కేసు బనాయించారు. – మొండితోక అరుణకుమార్, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వానిది కచ్చితంగా కక్ష సాధింపే. ప్రజలు అంతా గమనిస్తు న్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అడిగే వారి గొంతు నొక్కుతున్నారు. అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – నలగట్ల స్వామి దాసు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ను చూసేందుకు పోటెత్తిన అభిమానులు అడుగడుగునా ఆంక్షలు విధించి అడ్డుకున్న పోలీసులు ఆంధ్రరత్న రోడ్డులో మూడు చోట్ల బారికేడ్ల ఏర్పాటు ఆంక్షలను ఛేదించి నీరాజనం పలికిన ప్రజలు దారులన్నీ మూసివేశారు ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? కక్ష సాధింపు చర్యలు చిన్నారి దేవికతో సెల్ఫీ మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌కు చిన్నారి దేవిక రెడ్డి ఎదురుగా వచ్చింది. మేనమామతో కలిసి వచ్చిన చిన్నారి వైఎస్ జగన్‌తో సెల్ఫీ తీసుకోవాలని కోరింది. దీంతో ఆ చిన్నారిని సిబ్బంది కారుపైకి ఎక్కించారు. జగన్ ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆమెను ఎత్తుకుని ముద్దాడి సెల్ఫీ దిగారు. జగన్‌ను కలిసిన బాలిక ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. జగన్ దగ్గరకు తీసుకోగానే చిన్నారి భావోద్వేగానికి గురైంది. ‘జగనన్న ఎత్తుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మొదటిసారి జగనన్నను చూశాను. నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆ బాలిక తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వస్తున్న అభిమానులను అడ్డుకుంటున్న పోలీసులుపాలన చేతగాని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడు తోంది. ప్రజలు హామీలు అమలు చేయాలని అడుగుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రజలను, వైఎస్సార్ సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి తప్పుడు కేసులు నమోదు చేసి హామీల అమలు నుంచి తప్పుకొంటోంది. టార్గెట్ చేసి కేసులు పెడుతోంది. చేతనైతే మంచి పాలన ఇవ్వండి. అంతేగాని కక్ష సాధింపులకు పాల్ప డితే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. – నందిగం సురేష్, మాజీ ఎంపీ వల్లభనేని వంశీపై పెట్టిన కేసు పూర్తిగా అక్రమం. సత్యవర్థన్ కోర్టు ముందు హాజరై తనను ఎవరూ తిట్టలేదని అఫిడవిట్ ఇచ్చారు. నన్ను, పేర్ని నాని, వంశీ ఇలా కొందరిని అక్రమ కేసుల్లో ఇరికించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎలాగోలా జైల్లో పెట్టాలని కుట్రలు చేస్తోంది. అంతకంటే టీడీపీ నాయకులు ఏం చేయగలరు? అట్టుపెట్టిన వాళ్లకు అట్టున్నర ఉంటుంది. దేనికీ భయపడేది లేదు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. చచ్చే వరకు జగన్‌తోనే ఉంటాం. మాకు జగన్, పార్టీ కేడర్ అండగా ఉంది. – కొడాలి నాని, మాజీ మంత్రి -
ఓపెన్ స్కూల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓపెన్ స్కూల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని, ఏ వన్ కో–ఆర్డినేటర్ సెంటర్లలో అవకతవకలను అరికట్టాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని కోరుతూ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హరీష్ కుమార్, ఇతర ప్రతినిధులు డిస్ట్రిక్ట్ ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ వెంకటప్పయ్యకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరిధిలో వచ్చే నెలలో జరిగే టెన్త్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని కోరారు. ఏ వన్ కో–ఆర్డినేటర్ సెంటర్లలో అవకతవకలను అరికట్టాలని, ఆ సంస్థలు విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో సొమ్మును కాజేస్తున్నాయని వివరించారు. అడ్మిషన్ ఫీజు రూ.2 వేలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2 వేలు, ఎగ్జామ్ మేనేజ్మెంట్ పేరుతో రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కో ఆర్డినేటర్ వెంకటప్పయ్యను కలిసిన వారిలో బీసీఎస్ఎఫ్ నాయకులు నవీన్, శ్రీనివాసరావు, నాని తదితరులు ఉన్నారు. -
పాలవ్యాన్ ఢీకొని సైక్లిస్టు మృతి
గుడివాడరూరల్: పాల వ్యాన్ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. మల్లాయపాలెం పరిధి లోని టిడ్కో సముదాయంలో నివసించే అబ్దుల్ బాజానీ (గనీ) (54) సోమవారం రాత్రి గుడివాడ వచ్చి తిరిగి ఇంటికి బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాజానీని స్థానికులు హుటాహుటిన 108లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌ను గుడివాడ టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాజానీ మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని మూడో కుమార్తె సయ్యద్ షహనాజ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఏఎస్ఐ జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు సూచించారు. గొల్లపూడిలోని గ్రామీణాభివృద్ధి సంస్థ సెమినార్ హాల్లో మంగళవారం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసించేసి, వారి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును వివిధ రూపాల్లో దొంగిలిస్తున్నారని పేర్కొన్నారు. వారు పంపే అబద్ధపు మెసేజ్‌లతో ప్రభావితం కావద్దని, అనవసరపు లింక్‌లను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.ప్రియాంక మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్సఫర్మేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ పోర్టల్‌లో తప్పనిసరిగా చేరాలని పేర్కొన్నారు. ట్రైనర్ వై.బాబూరావు మాట్లాడుతూ.. బ్యాంకుల ద్వారా ఆర్థిక, సామాజిక భద్రత పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ గొల్లపూడి బ్రాంచి మేనేజర్ కె.వి.విజయలక్ష్మి, ఎం.సునీత లక్ష్మి, ట్రైనర్ ఎం.ఆశా, రిసోర్స్ పర్సన్లు కె.శ్రీనివాసరావు, ఆర్.పవన్‌కుమార్, ఏపీడీ చంద్రశేఖర్, ఏరియా కో–ఆర్డినేటర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన ఆర్థిక అక్షరాస్యత బ్రోచర్‌ను ఆవిష్కరించారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
మొవ్వ: కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొవ్వ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 65 ఏళ్లకు పైబడిన గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధు రాలి తలకు తీవ్ర గాయమైంది. ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగి ఉంటుందని కూచిపూడి ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. వృద్ధురాలి వివరాలు తెలవాల్సి ఉందన్నారు. కొన్ని రోజులుగా మొవ్వ, కొడాలి మధ్య ఈ వృద్ధురాలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు కూచిపూడి పోలీసులకు సమా చారం అందించాల్సిందిగా కోరారు. ఈ ప్రమా దంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ
కంచికచర్ల: ఒకే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ఇళ్లలోకి చొరబడి దొంగతనం చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెక్కీ నిర్వహించి, ఎవరూ లేని ఇళ్లను ముందుగా గుర్తించి చోరీలకు పాల్పడ్డారు. మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో సోమవారం రాత్రి సమయంలో నాలుగు ఇళ్లలో దొంగలు పడి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గ్రామానికి చెందిన గోగినేని నాగరాణి వారం క్రితం తన కుమార్తెలు ఉంటున్న విజయవాడకు వెళ్లారు. ఆమె ఇంట్లోకి జొరబడిన దొంగలు రూ.50 వేల నగదు, ఐదు తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. గోగి నేని జోగయ్య సోమ వారం గుంటూరు వెళ్లగా అతని ఇంటి తాళాన్ని దొంగలు పగలగొట్టారు. అయితే కుక్క అరవటంతో దొంగలు వేరే ఇంటికి వెళ్లారు. నంది గామలో ఉంటున్న చాగంటి దేవేంద్ర ఇంటిలో రూ.20 వేల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. గోగినేని వెంకట్రావు నాలుగు రోజుల క్రితం హైద్రాబాద్ వెళ్లగా, అతని ఇంటిలోకి చొరబడిన దొంగలు కొంత నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బఫర్ జోన్లో చికెన్ షాపులు మూసేయాలి
● బర్డ్‌ఫ్లూ కారణంగానే అనుమల్లంకలో కోళ్ల మృతి ● నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ● 35 గ్రామాల పరిధిలో కట్టుదిట్టమైన బయో సెక్యూరిటీ ● జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చికెన్ దుకాణాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం చూపుతోంది. గంపలగూడెం మండలంలోని అనుమల్లంక గ్రామంలో కోళ్ల మరణాలకు బర్డ్‌ఫ్లూ వ్యాధే కారణమని నిర్ధారణ కావడంతో ఆ గ్రామానికి పది కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సమన్వయ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో చేపడుతున్న నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిహ్షాద్) నుంచి ఈ నెల 14న వచ్చిన ఫలితాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లూయంజా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు పశు సంవర్థక శాఖ అధికారులు తెలిపారు. అప్పటికే యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వివ రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన కేంద్రమైన అనుమల్లంకకు పది కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్‌గా నిర్ణయించి, ఆ ప్రాంతంలో వ్యాధి నియంత్రణ చర్యలను పకడ్బందీగా కొనసాగించాని కలెక్టర్ ఆదేశించారు. బఫర్ జోన్లో చికెన్, గుడ్ల దుకాణాలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, శానిటైజేషన్‌కు స్ప్రేయర్లు, ఫాగర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో పర్యవేక్షణ జిల్లాలో ఉన్న 116 కోళ్లఫారాల్లోనూ నిరంతర పర్యవేక్షణతో పాటు బయో సెక్యూరిటీ చర్యలను చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బఫర్ జోన్లో ఫీవర్ సర్వేలను నిర్వహించాలని, అవసరమైతే నమూనాలను పరీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో పక్షుల్లో అసహజ మరణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని అటవీ అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డీపీఓ పి.లావణ్య కుమారి, ఫారెస్ట్ రేంజ్ అధికారి పి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
పెనమలూరు: మండలంలోని యనమలకుదు రులో వేంచేసిన శ్రీ పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఉయ్యూరు ఆర్డీఓ హేలాషారోన్ ఆదేశించారు. యనమలకుదురులో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా 26న స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని ఆర్డీఓ తెలిపారు. ప్రభోత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపల్ కమిషనర్ భవానిప్రసాద్, సీఐ వెంకటరమణ, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ ప్రణవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఆలయాన్ని ఆర్డీఓ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించండి చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థులకు రుచి కరమైన పౌష్టికాహారాన్ని అందించాలని, నిర్ల క్ష్యాన్ని ఉపేక్షించేది లేదని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి అరుణసారిక స్పష్టంచేశారు. స్థానిక వలందపాలెం బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని ఆమె సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార పదా ర్థాను అందించాలని, పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. తాను తరచూ తని ఖీలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సద్సులో న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ.. న్యాయసేవాధి కార సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరి గేలా కృషి చేస్తామన్నారు. న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య మాట్లాడుతూ.. పేదలకు తక్షణ న్యాయం అందేలా న్యాయవిజ్ఞాన సదస్సులు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య, వసతి గృహ సంక్షేమా ధికారి షేక్ జహీరున్నీసాబేగం పాల్గొన్నారు. పరిశోధనలతో మరిన్ని అవకాశాలు కోనేరుసెంటర్(మచిలీపట్నం): సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ రంగాల్లో పరిశోధనలకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ సీనియర్ సైంటిస్ట్, విశ్రాంత ఆచార్యుడు అప్పాజోస్యుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన సెమినార్లో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. పరిశోధనలు చేసే విద్యార్థులకు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అనంతరం శ్రీనివాసరావును ఆయా విభాగాల అధిపతులు సత్కరించారు. ఈ సెమినార్లో రెక్టార్ ఆచార్య ఎం.వి.బసవేశ్వరరావు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య ఎన్.ఉష, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సుజాత, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చాలా ఘోరంగా మారాయని మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పారు. యూనివర్సిటీలో చదువుకునే అమ్మాయిలు బాత్రూమ్కు వెళితే నిచ్చెనలు వేసుకొని ఫొటోలు తీస్తున్నారని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో చింతా మోహన్ సోమవారం విలేకరులతో మాట్లా డుతూ.. రైతులకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన చంద్రబాబు పైసా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో సీఎం చంద్రబాబు రూ.6 వేల కోట్లు స్వాహా చేశారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఒక్క తుళ్లూరు ప్రాంతంలోనే ఖర్చు చేయకుండా కర్నూలు నుంచి ఒంగోలు వరకు, శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
జాతీయ సేవాపురస్కారం అందుకున్న పులిగడ్డ సర్పంచ్
అవనిగడ్డ: మండలంలోని పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్‌కుమార్ మదర్‌థెరిస్సా విశిష్ట సేవా జాతీయ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో సారస్వత పరిషత్ విశ్వ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమలో ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నాని చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విశిష్ట సేవా జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. పురస్కారం అందుకున్న సర్పంచ్‌ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు కడవకొల్లు నరసింహారావు, వైస్ ఎంపీపీ పులిగడ్డ పిచ్చేశ్వరరావు, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు అభినందించారు. -
కథలు వద్దు.. పని పూర్తి కావాలి
కంకిపాడు: ‘కథలు వద్దు. పని పూర్తి కావడం కావాలి. నేను చెప్పేది మీరు చెప్తే సమస్య పరిష్కారం ఎలా అవుతుంది’ అని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. మండలంలోని పునాదిపాడు, కంకిపాడు గ్రామాల్లో కలెక్టర్ సోమ వారం విస్తృతంగా పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త సేకరణ తీరు, సంపద కేంద్రాల నిర్వహణపై సమీక్ష చేశారు. వివిధ గ్రామాల్లో చెత్తసేకరణపై కలెక్టర్ ప్రశ్నించగా, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. దీంతో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కథలు వద్దు.. పనులు ఎంతవరకు జరిగాయో చెప్పాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, సంపద తయారీ కేంద్రాల కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా సాగాలని స్పష్టంచేశారు. అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని స్పష్టం చేశారు. వారంలో వంద కుటుంబాల్లో మార్పులు తీసుకురావాలని పేర్కొన్నారు. కంకిపాడు, పునాదిపాడు సంపద తయారీ కేంద్రాల నిర్వహణ బాగుందని, అన్ని కేంద్రాలు ఇదే రీతిగా పనిచేయా లని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రీ సర్వేపై సమీక్ష చేశారు. ఫ్రీ సర్వే రికార్డులను పరిశీలించి తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.భావనారాయణ, ఎంపీడీఓ పి.అనూష, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బాపూజీ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20257కృష్ణలంకలో అగ్నిప్రమాదం విజయవాడ కృష్ణలంక పరిధిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మూడు పోర్షన్ల పూరిల్లు దగ్ధమైంది. ఈ పోర్షన్లలోని సామగ్రి మొత్తం బుగ్గిపాలైంది. లీకేజీలపై అప్రమత్తంగా ఉండాలి గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు సూచించారు. పైప్‌లైన్ లీకులపై సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అనధికార కట్టడాల కూల్చివేత పెనమలూరు మండలంలోని యనమలకుదురులో అనధికార కట్టడాలను మునిసిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. అనుమతులు లేని ఐదు కట్టడాలపై చర్యలు తీసుకున్నారు.–8లోuఈ చిత్రంలోని మహిళ పేరు అక్తర్ ఉన్నిసా. పామర్రు మండలం కొండిపర్రు స్వగ్రామం. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమెను ఈ నెల మూడో తేదీన గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆరోగ్య శ్రీ కింద చేర్చుకునేందుకు ఆన్లైన్లో వివరాలు ఆప్‌లోడ్ కావడం లేదని, రూ.20 వేలు చెల్లిస్తేనే వైద్యం ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక అప్పటికప్పుడు డబ్బు కట్టారు. రెండు రోజులైనా ఎన్టీఆర్ ట్రస్టు నుంచి స్పందన లేకపోవడంతో మరో రూ.40 వేలు చెల్లించారు. అయినా ఫలితం లేక ఐదో తేదీన అక్తర్ ఉన్నిసా మృతిచెందారు. న్యూస్రీల్దుర్గగుడికి వాట్సాప్ నంబరు -
సొరంగం భద్రత ప్రశ్నార్థకం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): చిట్టినగర్ సొరంగం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సొరంగం లోపల నుంచి వస్తున్న నీటి ఊట ఇప్పుడు నీటి ధారలుగా మారింది. భారీ వాహనాల రాకపోకలే ఇందుకు కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పగటి వేళ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలతో బిజీగా ఉండే సొరంగ మార్గంలో రాత్రి పది గంటల తర్వాత ట్రావెల్ బస్సులు, లారీలు, టిప్పర్ల వేగానికి ప్రకంపనలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇదే పరి స్థితి మరి కొంత కాలం కొనసాగితే సొరంగం మను గడే ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో నీటి ఊటలను ఇటీవల విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు, నిపుణులు పరిశీలించారు. సొరంగం దెబ్బ తిన్నకుండా ఉండేందుకు కొండపై ఉన్న కొన్ని ఇళ్లను తొలగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో తొలగించాల్సిన ఇళ్లను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. నీటి ఊట ధారలై.. గతంలో సొరంగం లోపల మూడు నాలుగు చోట్ల నీటి ఊట ఛాయలు కనిపించేవి. అయితే ఒక ఏడాది నుంచి నీటి ఊట స్థానంలో లీకేజీలు ఏర్పడి నీరు ధారలుగా ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ నీటి ధారలు పదుల సంఖ్యకు చేరాయి. సొరంగం నుంచి ప్రయాణించే వారిపై నీటి ధారలు పడుకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోడ్డుపైకి చేరిన నీరు మడుగుగా మారి, నాచు పట్టి ప్రమాదాలకు కారణమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి చెమ్మ ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సొరంగం సుందరీకరణ పనుల్లో భాగంగా వేసిన త్రీడీ పెయింటింగ్ సైతం నీటి ధారల వల్ల దెబ్బతింది. సొరంగం పైభాగంలో ఇళ్లకు మార్కింగ్ సొరంగంలో నీటి ధారలు అధికం కావడంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. 15 రోజుల కిందట మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు ఇంజినీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. సొరంగం మనుగడ దెబ్బతినకుండా చేపట్టాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు రెండు రోజుల పాటు సొరంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పై భాగంలో ఉన్న ఇళ్లను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొండపైకి చేరుకున్న అధికారులు కొన్ని ఇళ్లకు ప్రాథమికంగా మార్కింగ్ చేయడంతో పాటు నివాసితుల వివరాలను నమోదు చేసుకున్నారు. దీనిపై కమిషనర్‌తో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. నీటి ఊట, లీకేజీలతో సొరంగానికి ముప్పు భారీ వాహనాలను నిషేధించాలంటున్న స్థానికులు కొండపై కొన్ని ఇళ్లు తొలగించాలని వీఎంసీ నిర్ణయం -
భారీ వాహనాల వేగానికి కళ్లెం వేయాల్సిందే..
రాత్రి పది నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు సొరంగం నుంచి భారీ వాహనాల రాకపోకలే నీటి ధారలకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. టన్నుల బరువుతో మితి మీరిన వేగంతో లారీలు, టిప్పర్లు ఈ మార్గంలో రాకపోకలు సాగించడంతో వచ్చే ప్రకంపనల నేపథ్యంలోనే సొరంగానికి పగుళ్లు ఏర్పడుతున్నాయని వివరిస్తున్నారు. సొరంగం రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఇళ్లలో సామగ్రి సైతం టిప్పర్లు, లారీల వేగానికి పడిపోతున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. సొరంగం పరిరక్షణకు చర్యలు తీసుకోకుంటే, ఈ నిర్మాణం చరిత్రగా మాత్రమే మిగులుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సొరంగం మనుగడపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
బకాయిల రోగం
వైద్య సేవకు గత ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ వివరాలుసాక్షి, మచిలీపట్నం: పేదల ప్రాణాలు కాపాడే అపర సంజీవని ఆరోగ్య శ్రీ. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పథకం నిర్వీర్యమైంది. నాడు ఎంతో ఘనంగా అమలైన ఈ పథకం ఇప్పుడు బకాయిల భారంతో మంచంపట్టింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీగా ఉన్న ఈ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదల చేయడం లేదు. బకాయిలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ముందుకు రావడం లేదు. ఫలితంగా అత్యవసర సమయంలో వైద్య సేవలు అందక, చేతిలో డబ్బు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అటకెక్కించిన ప్రభుత్వం, పేదల ప్రాణాలు కాపాడే ఆరోగ్య శ్రీని కూడా పట్టించుకోవడంలేదని పేదలు వాపోతున్నారు. నాడు జీవం పోసిన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి నాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవం పోశారు. ఒక వైద్యుడిగా పేదల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతూ లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ వస్తోంది. మెడికల్ ఓపీ నుంచి గుండె ఆపరేషన్ల వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తోంది. వైఎస్సార్ సీపీ పాలనలో.. పేదల వైద్యం ఖర్చు రూ.వెయి దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదల ఆరోగ్యం, వైద్యం తమ బాధ్యత అని నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే చెప్పేవారు. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం, శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తూ వచ్చారు. వైద్యం పొందిన రోగులకు భోజనాలు, కోలుకున్నాక తమ ఊరికి వెళ్లేందుకు చార్జీలు అందించడంతో పాటు నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో నిధులు మంజూరు చేస్తూ వచ్చారు. కృష్ణా జిల్లాలో 35 వేల మందికి రూ.67.40 కోట్లతో వైద్య, శస్త్ర చికిత్సలు అందించారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన ప్రభుత్వం పేరు మార్చినా పథకం అమలును నిర్వీర్యం చేస్తున్న నిర్ణయాలు నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించని వైనం ఫలితంగా రూ.80 కోట్ల వరకు పేరుకుపోయిన బకాయిలు చికిత్స అందించేందుకు ముందుకురాని ఆస్పత్రులు ఉచిత వైద్యం అందక పేదలకు తీవ్ర ఇబ్బందులు కూటమి పాలనలో బకాయిల భారం సంవత్సరం వైద్యం పొందిన నిధులు వారి సంఖ్య 2019–20 972 రూ.3.08లక్షలు 2020–21 468 రూ.1.25కోట్లు 2021–22 1,937 రూ.4.34కోట్లు 2022–23 3,608 రూ.8.19కోట్లు 2023–24 12,267 రూ.22.65 కోట్లు 2024–25 15,565 రూ.27.89కోట్లు మొత్తం 34,817 రూ.67.40కోట్లురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు, బకాయిలు సకాలంలో చెల్లించకుండా వస్తోంది. ఫలి తంగా ఈ పథకం కింద రోగులకు వైద్యం అందించేందుకు పలు ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 19 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, ఏడు సీహెచ్‌సీలు, 49 పీహెచ్‌సీలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద నమోదయ్యాయి. వీటిలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలి. నెట్వర్క్ ఆస్పత్రుల వైద్య బకాయిలు సుమారు రూ.80 కోట్ల వరకు ఉన్నాయని సమాచారం. -
నాటకానికి పూర్వ వైభవం తెద్దాం
విజయవాడ కల్చరల్: గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సాంఘిక నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. యూత్ స్పోర్ట్స్ కల్చరల్ ఫోరం, కళావిపంచి, శ్రీ కృష్ణా తెలుగు థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో నిశ్శబ్దం.. నీ ఖరీదు ఎంత, జనరల్ బోగీ, కిడ్నాప్ వంటి నాటికలు వీక్షకులను ఆలోచింపజేశాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకానికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. శ్రీ కృష్ణ తెలుగు థియేటర్స్ అధ్యక్షుడు కేవీకే రంగనాథన్, ఉపాధ్యక్షుడు నడుంపల్లి వేంకటేశ్వర్లు, కోశాధికారి చంద్రశేఖర్ సంస్థ లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా సమాచార శాఖ ఉప సంచాలకుడు కిరణ్‌కుమార్ పోతుల, విద్యావేత్త బెండపూడి మురళీధర్, వివిధ రంగాలకు చెందిన వజ్ఞా మధుసూదనరావు, అమరేంద్ర బోల్లంపల్లి, అంకం భుజంగరావు, వైఎస్వీఎస్ శ్రీనివాస్, జీవీజీ శంకర్, హసన్ షేక్ విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. నేడు హ్యాండ్‌బాల్ జిల్లా జట్లు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల, జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లను విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలో సోమవారం ఎంపిక చేస్తున్నట్లు కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నక్రీడాకారులు సాయంత్రం నాలుగు గంటలకు ఎంపిక ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు. ఎంపికై న జిల్లా జట్లు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు.నాటక అకాడమీ చైర్మన్ గోపాల కృష్ణ -
సూర్య భగవానుడికి 241 పాత్రలతో పాయసం నివేదన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేదిక ప్రాంగణంలో మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్య భగవానుడికి వాసవీ క్లబ్, వాసవీ పరివార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ విభాగాల ఆధ్వర్యంలో 241 పాత్రలతో పాయసంతో సూర్య భగవానుడికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఆవు పాలు, పిడకలతో ఏక కాలంలో శ్రీ సూర్యనారాయణస్వామికి పాయసం వండి నివేదించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారమని, ఆ రోజున తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. -
పోటెత్తిన భక్తజనం
ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తజనం అమ్మవారి దర్శనానికి తరలిరావటంతో వేకువజాము నుంచే ఉయ్యూరు పట్టణం భక్తజనసంద్రంగా మారింది. డప్పు వాయిద్యాలతో పాలపొంగళ్లు, పొట్టేళ్లు, కోళ్లతో భక్తులు ఊరేగింపుగా తిరునాళ్లకు తరలివచ్చి చల్లని తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అమ్మవారిని దర్శించుకుని పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. విజయవాడ–మచిలీపట్నం ప్రధాన రహదారి, కాటూరురోడ్డు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు గంటలతరబడి బారులుతీరారు. అమ్మా వీరమ్మతల్లీ.. చల్లంగ చూడమ్మా.. కాపాడమ్మా.. అంటూ భక్తులు వేడుకున్నారు.వైభవంగా వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం -
24 నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ఆది దంపతులకు మంగళ స్నానాలతో ప్రారంభమై, మండపారాధనలు, కల్యాణోత్సవం, రథోత్సవం, పూర్ణాహుతితో ముగుస్తాయి. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో పవళింపు సేవ జరుగుతుంది. ఆదిదంపతులకు మంగళ స్నానాలు.. మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా 24వ తేదీ ఉదయం 9 గంటలకు గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరుల అలంకరణ జరుగుతుంది. సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనం, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 25వ తేదీ మండపారాధనలు, కలశారాధన, మూల మంత్ర హవనం, బలిహరణ జరుగుతుంది. త్రికాల అభిషేకాలు, కల్యాణోత్సవం.. 26వ తేదీ సాయంత్రం మల్లేశ్వర స్వామి వార్లకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు త్రికాల అభిషేకాలు, రాత్రి 8.30 గంటలకు మహాన్యాసం, లింగోద్భవ కాలాభిషేకం, రాత్రి గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారి దివ్య లీలా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సదస్యం, సాయంత్రం నాలుగు గంటలకు కెనాల్‌రోడ్డులో రథోత్సవం జరుగుతుంది. 28వ తేదీ ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, దుర్గాఘాట్‌లో అవభృతోత్సవం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. మార్చి 1 నుంచి ద్వాదశ ప్రదక్షిణలు.. ఉత్సవాలలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ నిర్వహిస్తారు.ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల పాటు నిర్వహణ -
ఇటు కళకళ.. అటు వెలవెల
మచిలీపట్నంటౌన్: బర్డ్‌ఫ్లూ ప్రభావం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆదివారం వచ్చిందంటే నగరంలోని అన్ని వర్గాల ప్రజలు మాంసాహారాన్ని భుజించేందుకు ఇష్టపడతారు. ఎక్కువగా చికెన్నే తింటుంటారు. అయితే ఈ ఆదివారం మాత్రం బర్డ్‌ఫ్లూ ప్రభావం ప్రచారంతో ప్రజలు చికెన్‌ను తినేందుకు అయిష్టత చూపినట్లు స్పష్టంగా కనిపించింది. నగరంలోని చికెన్ షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. మటన్, చేపల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చేపల మార్కెట్ కిటకిట.. బందరలోని మోకా భాస్కరావు చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కేజీ చికెన్ ధర రూ. 170 ఉంది. అయితే చేపలు, మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలో కిలో మటన్‌ను సాధారణంగా రూ. 800కు విక్రయిస్తుండగా ఆదివారం మాత్రం ఇది రూ.900 నుంచి రూ. వెయ్యి వరకూ విక్రయించారు. చేపలు రాగండి రకం కిలో రూ.170, బొచ్చ రకం కిలో రూ. 220కు విక్రయించారు. అధిక ధర పలికినా వీటిని కొనుగోలు చేసేందుకే ప్రజలు మొగ్గు చూపారు. ఇవి కూడా మధ్యాహ్నం 12 గంటల కల్లా అన్ని దుకాణాల్లోనూ నిండుకోవటం గమనార్హం. చికెన్ వైపు చూడని మాంసం ప్రియులు మటన్, చేపలు కొనుగోలుకు మొగ్గు -
గల్లీకో బెల్టు షాపు వెలుస్తోంది. వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలు బుట్టదాఖలవుతున్నాయి. గ్రామం, పట్టణం అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా కొన్ని షాపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఖజానా నింపు కోగా.. కూటమి న
సాక్షి, మచిలీపట్నం: మత్తు.. అనేక జీవితాలను చిత్తు చేస్తోంది. సంక్షేమ పథకాలను ఎత్తేసిన కూటమి ప్రభుత్వం.. అందుబాటులో మందు పథకంలా మద్యం దుకాణాలు తీసుకొచ్చింది. అధికారిక వైన్ షాపులకు అనుమతులిచ్చి.. కోట్ల రూపాయలతో ఖజానా నింపుకొంది.. విచ్చలవిడిగా అమ్మకాలకు తెరలేపింది. షాపులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు సిండికేట్‌తో చేతులు కలిపి, బెల్ట్ షాపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి, ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నారు. కొన్ని చోట్ల అమ్మకాలు అధికమైనట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులకు మందు సరఫరా చేసేందుకు రూ.50వేల వరకు వసూలు చేయగా.. వాటిలో ప్రతి బాటిల్‌పై రూ.50 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల డోర్ డెలివరీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. పచ్చని పల్లెల్లో.. పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన ప్రైవేటు మద్యం విధానంతో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. షాపులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు సిండికేట్ అయి కాసులతో జేబులు నింపుకుంటున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మండలం యూనిట్‌గా ప్రభుత్వం మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వగా.. ఒకే షాపుతో సంపాదన చాలదన్నట్లు బినామీలతో బెల్ట్ షాపులు పెట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారికంగా 123 దుకాణాలు.. జిల్లాకు అధికారికంగా 123 మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా 104 మద్యం షాపులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 123 షాపుల్లో నగర మునిసిపాలిటీల పరిధిలోని మచిలీపట్నంలో 5, పెడన–4, తాడిగడప–3, గుడివాడ–7 కాగా మిగిలినవి 104 మద్యం షాపులు మండలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుకునే వీలు కల్పించారు. దీనికి తోడు గీత కార్మికులకు 12 షాపులు (10శాతం) కేటాయించగా.. ఇటీవలే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. 1,200కు పైగా బెల్టు షాపులు.. గ్రామీణ ప్రాంత కొనుగోలుదారుల అవసరాలను ఆసరా చేసుకున్న కూటమి నేతలు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సిండికేట్ సభ్యుల సహకారంతో 1,200కు పైగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంటే అధికారిక షాపుల కంటే పదింతలు ఎక్కువగా బెల్ట్ షాపులున్నాయి. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు చర్యలకు సాహసించడం లేదు. గ్రామీణ ప్రాంతా లతో పాటు పట్టణాల్లోనూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీటి ఏర్పాటు కోసం రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే సుమారుగా.. మచిలీపట్నంలో 200, అవనిగడ్డ 140, పెడన 106, పామర్రు 215, గుడివాడ 100, పెనమలూరు 110, గన్నవరం 250 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు తెలుస్తోంది.ఖజానాకు రూ.వందల కోట్లు.. మద్యం షాపుల ఫీజు రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా నగదు చేరింది. 123 షాపుల దరఖాస్తు ఫీజు రూ.58.84కోట్లు, లైసెన్స్ ఫీజులో 1/6 వంతు కింద రూ.11.52కోట్లు మొత్తం 70.36కోట్లు ఆరంభంలోనే వచ్చాయి. తరువాత విక్రయాలు, పన్నులు, పండగ, న్యూఇయర్ లాంటి సందర్భాల్లో రూ.వందల కోట్ల వ్యాపారాలు జరుగుతుండడంతో ప్రజా ధనం అంతా ఖజానాలో చేరుతోంది. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు.. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయి. ఇప్పటికే తనిఖీలు చేపట్టాం. గత ఏడాది నవంబర్‌లో 134 కేసులు నమోదు చేసి, 138 మందిని అరెస్టు చేశాం. 5151.8 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 16.25 బీర్ కేసులు, రెండు వాహనాలు పట్టుకున్నాం. డిసెంబర్లో 58 కేసులు నమోదు చేసి, 60 మందిని అరెస్టు చేశాం. 266.25 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 35 బీర్ కేసులు, ఆరు వాహనాలు, జనవరిలో 64 కేసులు నమోదు చేసి, 64 మందిని అరెస్టు చేశాం. 134.46 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, ఒక వాహనంపై కేసు పెట్టాం. – సి. భార్గవ, ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్