శ్రీవారి వద్ద పోలవరం ప్రాజెక్టు డిజైన్లు
2018 నాటికి ప్రాజెక్టు పూర్తి: మంత్రి ఉమా
సాక్షి, తిరుమల: ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని 2018 నాటికి పూర్తిచేస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆదివారం తిరుమలలో ఆయన పోలవరం ప్రాజెక్టు డిజైన్లను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర ్వహించి, స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. అలాగే బాలాజీ హైడ్రో మెకానికల్ నిపుణులు కన్నయ్యనాయుడుకు ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఉందని, ఆయనతోపాటు చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వర్లు సూచనలు మేరకు పోలవరం నిర్మాణం చేపడతామన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్‌కు పంపుతామని చెప్పారు.