
'మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పలేదు'
హైదరాబాద్: వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ. లక్ష కోట్ల రుణాలు మాఫీ అనలేదని చెప్పారు. 43 లక్షల మందికి రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు.
బంగారం రుణాల్లో చాలా మంది వ్యాపారం కోసం తీసుకున్నవారున్నారని పేర్కొన్నారు. రూ. 24 వేల కోట్ల టర్మ్ లోన్ల మాఫీ అవసరం లేదని తేల్చిచెప్పారు. రైతులపై పడ్డ 12 శాతం వడ్డీ భారాన్ని తమ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.