
'హైదరాబాద్ లో ఆధార్ ఉన్నా రుణమాఫీ'
హైదరాబాద్: పంట రుణాల మాఫీ వ్యవహారంపై ఇప్పటివరకు 3 లక్షల ఫిర్యాదులు అందాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రుణమాఫీ సమస్యలు, సాంకేతిక లోపాలపై సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు.
హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉంటే ఇక్కడున్న వారికి కూడా రుణమాఫీ వరిస్తుందని చెప్పారు. అయితే ఏపీలో ఓటు హక్కు కలిగి వుండాలని స్పష్టం చేశారు. కాగా, రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.