అద్దె ఇంట్లో ఉంటున్న ఏపీ మంత్రి | devineni umamaheswara rao not reveal asset details | Sakshi
Sakshi News home page

అద్దె ఇంట్లో ఉంటున్న ఏపీ మంత్రి

Published Wed, Jul 13 2016 10:42 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

సర్వేలో భాగంగా మంత్రి దేవినేని ఉమాకు ఐరిస్ తీస్తున్న సిబ్బంది

సర్వేలో భాగంగా మంత్రి దేవినేని ఉమాకు ఐరిస్ తీస్తున్న సిబ్బంది

విజయవాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. తనకు గజం స్థలం కూడా లేదని, కృష్ణా జిల్లా గొల్లపూడిలోని అద్దె ఇంట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మంగళవారం గొల్లపూడిలో మంత్రి ఇంటి నుంచి ప్రజాసాధికారిక సర్వే ప్రారంభించిన అధికారులకు ఆయన ఈ వివరాలు ఇచ్చారు.

అధికారులకు తన ఆధార్, ఓటరుకార్డులోని విషయాలు మాత్రమే అందచేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి ఈ వివరాలను నమోదుచేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement