
ఇద్దరి మధ్య ఎంత?
‘‘సినిమాను చూసి, మంచి సందేశాత్మక చిత్రాన్ని అందిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు మా యూనిట్‌ను అభినందించిన క్షణాలు మరువలేనివి’’ అని నిర్మాత శివరాజ్‌పాటిల్ అన్నారు.
నాని ఆచార్య దర్శకత్వంలో రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా సాయితేజపాటిల్ సమర్పణలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ‘తీన్మార్’ ప్రోగ్రామ్ ఫేమ్ బిత్తిరి సత్తి కీలక పాత్ర చేశారు. ఈ నెల 21న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ.