Ram Karthik
-
'వీక్షణం' సినిమా రివ్యూ
సినిమాల్లో ఎవర్ గ్రీన్ జానర్ ఏదైనా ఉందా అంటే చాలామంది చెప్పేమాట థ్రిల్లర్. ఈ జానర్ మూవీస్ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం (అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజైన మూవీ 'వీక్షణం', రామ్ కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే)కథేంటి?ఆర్విన్ (రామ్ కార్తీక్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. ఖాళీగా ఉండేసరికి ఏం చేయాలో తెలీక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు ఏం చేస్తుంటారా అని బైనాక్యులర్‌తో చూస్తుంటాడు. అలా తమ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండే నేహా(కశ్వి)ని చూసి ఇష్టపడతాడు. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెతో ప్రేమలో పడతారు. మరోవైపు తన ఎదురింట్లో దిగిన ఓ అమ్మాయి (బిందు నూతక్కి) రోజుకి ఒకరితో రావడం గమనిస్తాడు. వాళ్లని ఆమె దారుణంగా చంపడం చూస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తోంది? దీని వల్ల ఆర్విన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?థ్రిల్లర్ సినిమా అంటే ఓ టెంప్లేట్ ఉంటుంది. ఓ హంతకుడు ఉంటాడు. మనుషుల్ని చంపేస్తుంటాడు. అతడు/ఆమె అలా చంపడానికి కారణమేంటి? హీరో సదరు హంతుకుడిని ఎలా పట్టించాడు అనే పాయింట్‌తో పలు భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. 'వీక్షణం' కూడా దాదాపు అదే తరహాలో తీసిన మూవీ. కానీ స్టోరీ కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది.బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటున్న ఓ అమ్మాయి.. సడన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లోని కారుపై పడి చనిపోతుంది. ఇలా షాకింగ్ సీన్‌తో మూవీని మొదలవుతుంది. కట్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే హీరో, అతడికో ఇద్దరు ఫ్రెండ్స్. బైనాక్యూలర్లో చూసి తన ఇంటి పక్కనో ఉండే అమ్మాయితో ఇష్టపడటం, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం ఇలా లవ్ ట్రాక్. మరోవైపు తన ఎదురింట్లో రోజుకో వ్యక్తితో ఓ అమ్మాయి రావడం, వాళ్లందరినీ చంపుతుండటం.. ఇలా మరో స్టోరీ నడుస్తుంటుంది. ఇదంతా హీరో చూస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరా అనే విషయం తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)సెకండాఫ్‌లో హత్యలు చేస్తున్న అమ్మాయి ఎవరు? అసలు ఆమె ఎందుకిలా చేస్తోంది? ఆమె లిస్టులో హీరోయిన్ ఎందుకుంది? అనే పాయింట్లని సెకండాఫ్‌లో చూపించారు. ఫస్టాప్ అంతా రొటీన్ లవ్ ట్రాక్ చూపించారు. అదేమంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైతే ఇంటర్వెల్లో ట్విస్ట్ పడుతుందో.. సెకండాఫ్‌లో దెయ్యం కథ ఉండబోతుందా అనుకుంటాం. కానీ మనం ఊహించని విధంగా హంతకుడి విషయంలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఓఆర్డీ (ORD) అనే జబ్బు గురించి చెప్పి, చిన్నపాటి మెసేజ్ ఇచ్చారు. అదే టైంలో సీక్వెల్ ఉండే అవకాశముందనేలా మూవీని ముగించారు.రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలానే తీసినప్పటికీ సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. హంతకుడి విషయంలో మనం ఊహించనది జరుగుతుంది. ఇప్పటికీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్యని స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. అది ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది. రెండు గంటల నిడివి కూడా ప్లస్ పాయింట్. కాకపోతే పెద్దన్న పేరు నటులు లేరు. అలానే ఫస్టాప్ అంతా కావాలనే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది తప్పితే ఓవరాల్‌గా మూవీ గుడ్.ఎవరెలా చేశారు?ఆర్విన్ అనే కుర్రాడిగా చేసిన రామ్ కార్తిక్ పాత్రకు తగ్గట్లు ఉన్నాడు. ఫస్టాప్ అంత లవర్ బాయ్‌లా, సెకండాఫ్‌లో హత్యలు కనుక్కొనే వాడిలో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. కశ్వి అయితే గ్లామర్ చూపించడానికి తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి అనే అమ్మాయి పర్లేదనిపించింది. సర్ప్రైజింగ్ పాత్ర చేనిన నటుడు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.టెక్నికల్ విషయానికొస్తే థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని సమర్థ గొల్లపూడి సరిగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. ఇక డైరెక్టర్ మనోజ్ పల్లేటి.. తను అనుకున్న పాయింట్ గురించి బాగానే రీసెర్చ్ చేసి మరీ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసి మెప్పించాడు. నిర్మాణ విలువలు కూడా స్థాయిగా తగ్గట్లు ఉన్నాయి. పెద్దగా పేరున్న నటీనటులు లేరు. కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి?రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
లవ్ నుంచి థ్రిల్
‘‘నేను గతంలో థ్రిల్లర్ సినిమాలు చేశాను. కానీ ‘వీక్షణం’ లాంటి మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. సరదాగా ఉండే కుర్రాడికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఆ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడంతో అతని కథ ఎలాంటి మలుపులు తిరగుతుంది?’’ అన్నది ‘వీక్షణం’లో ఆసక్తిగా ఉంటుంది’’ అని హీరో రామ్ కార్తీక్ అన్నారు.మనోజ్ పల్లేటి దర్శకత్వంలో రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన సినిమా ‘వీక్షణం’. పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లవ్ స్టోరీతోప్రారంభమై మిస్టరీ థ్రిల్లర్‌గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరు. ఫస్ట్ కాపీ చూసినవారు నా గత సినిమాలతో పోలిస్తే ఇందులో మెచ్యూర్డ్‌గా, సెటిల్డ్‌గా నటించానని అనడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన వాటిలో ‘తెలిసినవాళ్లు, గ్రేట్ ఇండియన్ సూసైడ్’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ‘వీక్షణం’ చిత్రం హీరోగా నన్ను మరో మెట్టుపైకి తీసుకెళుతుందని ఆశిస్తున్నాను. వాసూగారి దర్శకత్వంలో నేను చేసిన సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది’’ అన్నారు. -
‘వీక్షణం’ ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు: హీరో రామ్ కార్తీక్
థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ‘వీక్షణం’లో అలాంటి హుక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు. భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో తెలియజేసే చిత్రమిది’ అన్నారు యంగ్ హీరో రామ్ కార్తిక్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీక్షణం’. కశ్వి హీరోయిన్. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీరో రామ్ కార్తిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...⇢ గతేడాది నేను ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి "వీక్షణం" మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ "వీక్షణం" కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి.⇢ ఈ సినిమాలో నేను సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది.⇢ నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు.⇢ ఈ సినిమాలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.⇢ ప్రస్తుతం వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. -
వెంకటేష్‌గారి మాటే ‘వీక్షణం’కి మూలం
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ– ‘‘ఎమ్బీఏ పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డీఎఫ్టీ కోర్సు పూర్తి చేశా. ‘జార్జి రెడ్డి, జోహార్’ వంటి చిత్రాలకు పనిచేశాను. ఓ సందర్భంలో వెంకటేష్‌గారితో మాట్లాడే అవకాశం లభించింది. ‘ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే.. మన పని మనం చూసుకోకపోవడమే’ అని అన్నారాయన. ఈ లైన్ నాకు ఎగ్ట్జైటింగ్గా అనిపించింది. ‘వీక్షణం’ కథకు ఈ లైన్ మూలం. సంతోషంగా జీవిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం వల్ల అతని జీవితం ఎలా ప్రభావితమైంది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ–‘‘కోటిగారి దగ్గర వర్క్ చేశాను. ఎమ్ఎస్ రాజుగారి ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రానికి సంగీతం అందించాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘వీక్షణం’ రెండో చిత్రం. ఇందులో మూడు పాటలున్నాయి’’ అని పేర్కొన్నారు. -
రిలీజ్‌కు రెడీ అవుతున్న 'తెలిసినవాళ్లు' సినిమా
సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా హేబా పటేల్ హీరోయిన్గా నటిస్తుంది.ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన "శశివదనే" పాటకు మంచి స్పందన లభించింది. అలానే ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేసింది. సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసుకుందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. -
విభిన్న కథాంశంతో వస్తున్న 'తెలిసినవాళ్లు'.. ఆకట్టుకుంటున్న టీజర్
రొమాన్స్ –ఫ్యామిలీ –థ్రిల్లర్ జోనర్స్ కలిసిన కొత్త తరహా కథనంతో రూపొందుతున్న చిత్రం 'తెలిసినవాళ్లు'. ఈ సినిమాలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంబంధించి మరిన్ని అప్డేట్స్, రిలీజ్ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
Telisinavaallu Glimpse: నన్ను నేను చంపుకోబోతున్నాను.. హెబ్బా పటేల్
హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం తెలిసినవాళ్లు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో హీరో చెఫ్ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. చివర్లో.. నన్ను నేను చంపుకోబోతున్నాను అన్న హెబ్బా డైలాగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. హీరోయిన్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది? దాని వెనక కారణాలు ఏత్టి? ఆత్మహత్యను ఎవరైనా అడ్డుకున్నారా? లేదా? అన్న అనుమానాలకు సమాధానం దొరకాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానై ఈ సినిమాను భుజానికెత్తుకున్నాడు విప్లవ్ కోనేటి. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. అనంత్ కవూరి, అజయ్ నాగ్ వి సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తుండగా ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. -
మంచి సినిమాలతో అలరిస్తూనే ఉంటా: వెంకటేష్ త్రిపర్ణ
కథలో బలం ఉంటే చాలు.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలేకుండా థియేటర్స్‌కి వస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రామ్ అసుర్’. ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహించారు. తొలి సినిమా నే ఈ స్థాయిలో చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ.. ‘రామ్ అసుర్ సినిమా నీ ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. ఇక మంచి సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు అయ్యింది. సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ప్రతిఫలం విజయం రూపంలో వచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమా లతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అని అన్నారు. ‘రామ్ అసుర్’మూవీలో అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ లు హీరోలుగా నటించగా చాందిని తమిళరసన్, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు. లకమైన పాత్రలో శానీ సల్మాన్ నటించగా ఈ సినిమా కు ఈ పాత్ర హైలైట్ గా నిలిచింది. బెంగాల్ టైగర్ సినిమా తో మంచి పేరు దక్కించుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కి సంగీతం సమకూర్చగా జె. ప్రభాకరరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. -
‘రామ్ అసుర్’పై ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ ప్రశంసలు
అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామ్ అసుర్. చాందిని తమిళ్‌రాసన్, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ సరికొత్త కథ కథనాలతో ఆద్యంతం ఈ సినిమా ను ప్రేక్షకులు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య కొన్ని నగరాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమా ను వీక్షించిన చిత్ర బృందం తాజాగా వరంగల్ లో సందడి చేసింది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి సినిమా ను వీక్షించింది చిత్ర బృందం. (చదవండి: రామ్ అసుర్ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రామ్ అసుర్ సినిమా అద్భుతంగా ఉంది. హీరో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన చాలా బాగుంది. ప్రత్యేకమైన పాత్రలో శానీ సల్మాన్ మంచి నటన కనపరిచాడు. దర్శకుడు వెంకటేష్ ఈ సినిమా ను మంచి కథ తో తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాన్ని యూనిట్ తో కలిసి వీక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను* అన్నారు. -
రామ్ అసుర్ మూవీ రివ్యూ
టైటిల్ : రామ్ అసుర్ నటీనటులు : అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ తదితరులు నిర్మాత : అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం : వెంకటేష్ త్రిపర్ణ సంగీతం : భీమ్స్ సిసిరోలియో విడుదల తేది : నవంబర్ 19, 2021 ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ప్రజాదరణ లభిస్తోంది. కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘రామ్ అసుర్’. డైమండ్ చుట్టూ తిరిగే కథకు ఇద్దరి జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను ‘రామ్ అసుర్’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే... రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే సమయంలో తను ప్రాణంగా ప్రేమించిన ప్రియ(షెర్రీ అగర్వాల్).. బ్రేకప్ చెబుతుంది. దీంతో రామ్ బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైన జీవితంలో కోలుకోవాలనే ఉద్దేశంతో స్నేహితుడి సహాయంతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూరికి, రామ్ కు సంబంధం ఏంటి? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి? సూరి ఎవరు.. అతని నేపథ్యం ఏంటి? చివరగా రామ్ కృత్రిమ వజ్రాలను తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడా? అనేది తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లి ‘రామ్ అసుర్’చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. సినిమాకి కీలకమైన సూరి పాత్రలో అభినవ్ సర్దార్ ఒదిగిపోయాడు. ఓ షేడ్ లో లవర్ బాయ్ గా, మరో షేడ్ లో ఎగ్రెసివ్ లుక్‌లో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక లవర్ బాయ్ రామ్ పాత్రకి రామ్ కార్తీక్ న్యాయం చేశాడు. రొమాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్‌లో కూడా అదరగొట్టేశాడు.షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన శివ పాత్రలో శాన్వీ సాల్మన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. విభిన్నమైన పాత్రని చాలా అవవోకగా పోషించి మెప్పించాడు. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్‌తో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? కృత్రిమంగా డైమండ్ తయారుచేయడమనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘రామ్ అసుర్’.ఈ కాన్సెప్ట్ కు రెండు విభిన్న జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చాడు దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ. అయితే ఇంత మంచి కాన్సెప్ట్ ను తెరపైకి పకడ్బందీగా తీసుకొచ్చారా అంటే మాత్రం పూర్తిగా అవునని చెప్పలేం. బడ్జెట్ పరిమితులు ఓవైపు, బలమైన స్టార్స్ లేకపోవడం మరోవైపు ఈ సినిమాను కాస్త వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో రామ్ కార్తీక్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అతడి లవ్ ట్రాక్, రొమాన్స్ కు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేవరకు కథ స్లోగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే సెకెండాఫ్ స్టార్ట్ అవుతుందో ఇక అక్కడ్నుంచి 'రామ్ అసుర్' పరుగులుపెడుతుంది. ఈ విషయంలో దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణను మెచ్చుకోవాలి. తొలి సినిమాకే కాస్త క్లిష్టంగా, కష్టంగా అనిపించే కథను సెలక్ట్ చేసుకున్న వెంకటేష్.. సెకండాఫ్ నుంచి తన రైటింగ్ పవర్ చూపించాడు. స్క్రీన్ ప్లేలో, ట్విస్టుల్లో చమక్కులు చూపించాడు. సినిమాలో ప్రేమ, భావోద్వేగం, యాక్షన్‌తో ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌గా డీల్ చేశాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే రామ్ అసుర్ సినిమా, టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త కథను పరిచయం చేస్తుంది. -
ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో
మహేశ్వరం: కాబోయే భార్య అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడైన కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు. కార్తీక్‌కు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో ఏడాది కిందట వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి రామ్ కార్తీక్ ఆస్ట్రేలియా నుంచి నిత్యం ప్రగతితో వీడియో కాల్స్, వాట్సాప్ ద్వారా మాట్లాడేవాడు. ఈ సందర్భంగా ఫోన్లో ప్రగతి నగ్న వీడియోలు, ఫొటోలను రికార్డు చేశాడు. ఆరు నెలల కిందట కార్తీక్ స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా ప్రగతితో చనువుగా తిరిగాడు. కొంతకాలం తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టిన కార్తీక్.. పెళ్లికి బంగారం, నగదుతో పాటు ప్లాట్, భూమి ఇవ్వాలని ప్రగతి, ఆమె తల్లిపై పలుమార్లు ఒత్తిడి తెచ్చాడు. తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నానని.. వేరే సంబంధమైతే ఇంతకన్నా అధిక కట్నం ఇచ్చేవారని, తాను అడిగినన్ని కట్నకానుకలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ప్రగతి అశ్లీల వీడియోలు, ఫొటోలను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చదవండి: (‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా') ఇదిలా ఉండగా అక్టోబర్ 21న నిశ్చితార్థం ఉండగా, 17వ తేదీన పెద్దల మధ్య కట్నకానుల విషయంలో గొడవ జరగడంతో సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కార్తీక్ తన ఫొటోలు, వీడియోలు బయటపెడితే జీవితం నాశనం అవుతుందని భావించిన ప్రగతి అక్టోబర్ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ప్రగతి, రామ్ కార్తీక్‌ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించగా ఫొటోలు, వీడియోలు, కార్తీక్ బ్లాక్మెయిల్ విషయం వెలుగు చూసింది. ప్రగతి ఆత్మహత్యకు రామ్ బ్లాక్ మెయిల్ కారణమని నిర్ధారించిన పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కన్ ఫ్యూజన్ .. ఫన్
‘‘కార్తీక్, ఉమ ప్రేమకథలో అనుకోకుండా చిట్టి అనే చిన్నపాప ప్రవేశిస్తే వచ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవరు? మా ప్రేమకథని తను ఎలా గట్టెక్కించింది? అనే పాయింట్‌తో రూపొందిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే. ఇందులో పాత్రల మధ్య ఉండే కన్ ఫ్యూజన్ మంచి వినోదం అందిస్తుంది’’ అన్నారు రామ్ కార్తీక్. జగపతిబాబు ప్రధాన పాత్రలో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్–చిట్టి–ఉమా–కార్తీక్)’. కేఎల్ దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇందులో నా పాత్ర పక్కింటబ్బాయి తరహాలో ఉంటుంది. నటుడిగా నాలో నాకు తెలీని యాంగిల్‌ను ఈ సినిమాతో బయటకు తెచ్చారు విద్యాసాగర్‌గారు. ప్రివ్యూ చూసిన వారంతా నా నటనను మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఫన్ గానే కాకుండా ఎమోషనల్గానూ ఉంటుంది. అది ఆడియన్స్‌కు బాగా రీచ్ అవుతుంది’’ అన్నారు. -
‘ఎఫ్‌సీయూకే’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
ఇది నీ కథేనా అని అడుగుతున్నారు!
‘‘ఎఫ్‌సీయూకే’లో నా పాత్ర గురించి వెల్లడైన విషయాలు చూసి, ఇది నీ కథేనా? అని కొందరు అడుగుతున్నారు. పిల్లలకు ఆటలు కావాలి, యూత్‌కు రొమాన్స్ కావాలి, మాకు అన్నీ కావాలి. ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో బేబీ సహస్రిత మరో పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్.. చిట్టి.. ఉమ.. కార్తీక్). విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్‌పై దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..‘దామోదర్ ప్రసాద్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. నాన్నగారు (వి.బి. రాజేంద్రప్రసాద్) నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దసరా బుల్లోడు’ ఈ జనవరి 13కు 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం హ్యాపీ’ అన్నారు. ‘సినిమా అనేది వ్యాపారమైనప్పటికీ విలువలతో సినిమాలు తీస్తూ వస్తున్నాను. ‘ఎఫ్‌సీయూకే’ కూడా అలాంటి సినిమానే’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘ప్రేక్షకులను బాగా నవ్వించే చిత్రమిదని విద్యాసాగర్ రాజు పేర్కొన్నారు. ‘ఫిబ్రవరి 12న జగపతిబాబు, దాము బర్త్‌డే. ఆ రోజే మా సినిమా రిలీజ్ చేస్తామని రామ్ కార్తిక్ తెలిపారు. సినిమాటోగ్రాఫర్ శివ, సహనిర్మాత యలమంచిలి రామకోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి పాతూరి, లైన్ ప్రొడ్యూసర్ వాసు పరిమి పాల్గొన్నారు. -
రెండు కాలాల కథ
అభినవ్ సర్దార్, రామ్‌కార్తీక్ ప్రధాన పాత్రల్లో సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ‘పీనట్ డైమండ్’ సినిమా ప్రారంభమైంది. ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్ పతాకాలపై ప్రొడక్షన్ నెం1 గా ప్రారంభమైన ఈ చిత్రం శుక్రవారం తొలి షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. వెంకటేశ్ త్రిపర్ణ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించడంతోపాటు హీరో అభినవ్ సర్దార్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్, అభినవ్‌లు మాట్లాడుతూ– ‘‘1989లో ఒక కథ, 2020లో మరో కథ.. ఇలా రెండు కాలమానాలకి సంబంధించిన కథతో సాగే చిత్రమిది. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్స్‌ని చెన్నై, వైజాగ్‌లలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. చాందిని తమిళరాసన్, శానీ సల్మాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె. ప్రభాకర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
తలచినదే జరిగినదా...
షైన్ పిక్చర్స్ పతాకంపై రామ్‌కార్తీక్, ఊర్వశి పరదేశి జంటగా సూర్యతేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ‘తలచినదే జరిగినదా’ చిత్రం సోమవారం ప్రారంభమైంది. శేఖర్ రెడ్డి, సంధ్య రెడ్డి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, ఎమ్. హరికృష్ణారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘దండు’ చిత్రదర్శకుడు సంజీవ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. సూర్యతేజ మాట్లాడుతూ– ‘‘2000 ఏళ్ల క్రితం మొదలైనటప్పటి జీవితాలకు ఇప్పటి జీవితాలకు ఉన్న తేడాను తెలిపే ఫిక్షన్ స్టోరీనే మా చిత్రం. ‘జెర్సీ’ చిత్రానికి అసిస్టెంట్ దర్శకునిగా, అనేక ప్రభుత్వ ప్రకటనలకు డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తీస్తున్నాను’’ అన్నారు. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జూలై 8న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’ చిత్రం తర్వాత నేను చేస్తున్న చిత్రం ఇది’’ అన్నారు రామ్‌కార్తీక్. -
ఎలాంటి పాత్రలైనా ఓకే
‘‘చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. ‘భేతాల మాంత్రికుడు, ఐ యామ్ ఇండియన్’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించాను. హీరోగా నా తొలి చిత్రం ‘ఇట్స్ మై లైఫ్’’ అన్నారు రామ్ కార్తీక్. ఆయన హీరోగా అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మౌనమే ఇష్టం’, కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమాలు ఈ నెల 15న రిలీజయ్యాయి. ఈ సందర్భంగా రామ్‌కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా నాన్న సత్యనారాయణ బిజినెస్‌మేన్.. అమ్మ రమాదేవి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ‘జూడో’ టీమ్‌కి రిప్రజెంటేటివ్. అమ్మ మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. తమ్ముడు కిరీటి ఫారిన్లో జాబ్ చేస్తున్నాడు. నేను బీబీఏ చేశా. ఎంబీఏ చదువుతున్నప్పుడు నటనలో శిక్షణ తీసుకుందామనుకున్నా. ఆడిషన్స్ ఎలా జరుగుతాయోనని చూడ్డానికి రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌కి వెళితే, డైరెక్టర్ రామినేని నేతాజీగారు నటనపై ఆసక్తి ఉందా? అంటే.. అవునన్నా. నాకొచ్చింది చేసి, చూపించా. మూడు రోజుల తర్వాత ‘ఇట్స్ మై లైఫ్’కి నువ్వే హీరో అని నేతాజీగారు అనడంతో షాకయ్యా. మా పేరెంట్స్‌తో చెబితే, ‘ఎందులోనైనా కష్టపడటం అన్నది ముఖ్యం. నీ బెస్ట్ ఇవ్వు’ అని ప్రోత్సహించారు. సినిమాల ఎంపికలో నా తొలి ప్రాధాన్యం కథ, నా పాత్రకే. హీరోగానే కాదు.. బలమైన పాత్ర ఉంటే ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధమే. కాంచిగారి దర్శకత్వంలో నేను చేసిన ‘షో టైమ్’లో నాది నెగటివ్ రోల్. ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ, ‘96’లో విజయ్ సేతుపతిగారు చేసినటువంటి పాత్రలు చేయాలనుంది. ‘దృశ్యకావ్యం, మామ ఓ చందమామ’ చిత్రాలకు నటుడిగా మంచి పేరొచ్చింది. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ, మౌనమే ఇష్టం’ సినిమాలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. అయితే ఇప్పటివరకూ నాకు సరైన గుర్తింపు రాలేదనిపిస్తోంది. అందుకు కారణం నా చిత్రాలకు సరైన ప్రమోషన్స్ లేకపోవడమే. ప్రస్తుతం చదలవాడ శ్రీనివాస్‌గారి బ్యానర్లో చేస్తున్న సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా కథాచర్చలు, అలాగే తెలుగు, తమిళ్లో రూపొందనున్న మరో సినిమాకి కూడా చర్చలు జరిగాయి. -
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ మూవీ రివ్యూ
టైటిల్ : వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ జానర్ : కామెడీ హారర్ తారాగణం : రాయ్ లక్ష్మీ, రామ్ కార్తీక్, పూజితా పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్ సంగీతం : హరీ గౌర దర్శకత్వం : కిశోర్ నిర్మాత : శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి టాలీవుడ్‌కు వరుస సక్సెస్‌లు అందించిన సూపర్ హిట్ జానర్ కామెడీ హారర్. ఒకప్పుడు ఈ జానర్లో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. అయితే ఇటీవల టాలీవుడ్లో ఈ తరహా సినిమాల హడావిడి కాస్త తగ్గింది. కొంత గ్యాప్ తరువాత ఇదే జానర్లో మరోసారి వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెంకటలక్ష్మీ ప్రేక్షకులను ఏమేరకు నవ్వించింది..? ఎంత వరకు భయపెట్టింది..? కథ : చంటిగాడు (ప్రవీణ్), పండుగాడు (మధు నందన్) బెల్లంపల్లి అనే ఊళ్లో పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాళ్లు. ఊళ్లో జనాలను ఇబ్బంది పెడుతూ ఆనందపడే చంటి , పండు.. ఒక్క శేఖర్ (రామ్ కార్తీక్) మాట మాత్రం వింటారు. వాళ్లకు ఏ సమస్య వచ్చిన శేఖరే కాపాడుతుంటాడు. కానీ శేఖర్, గౌరీ(పూజితా పొన్నాడ)ల ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన పని కారణంగా శేఖర్ కూడా వారిని అసహ్యించుకుంటాడు. అదే సమయంలో బెల్లంపల్లి ఊరికి స్కూల్ టీజర్‌గా వెంకటలక్ష్మి( రాయ్ లక్ష్మీ) వస్తుంది. బస్ దిగగానే సాయం చేయమని చంటి, పండులను అడుగుతుంది. ఆమె అందంపై ఆశపడ్డ చంటి, పండు వెంకటలక్ష్మికి వసతి ఏర్పాటు చేయటంతో పాటు అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే సరికి వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది. అసలు దెయ్యంగా వచ్చిన వెంకటలక్ష్మీ ఎవరు..? వెంకటలక్ష్మి.. చంటి, పండులకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఈ కథతో నాగంపేట వీరారెడ్డి(పంకజ్ కేసరి)కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రధాన పాత్రలో నటించిన రాయ్ లక్ష్మి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. భయపెట్టే సన్నివేశాలతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ప్రవీణ్, మధునందన్‌లు తమ పరిధి మేరకు బాగానే నటించారు. అయితే పూర్తిస్థాయిలో తమ కామెడీ టైమింగ్‌ను చూపించే అవకాశం మాత్రం దక్కలేదు. హీరో రామ్ కార్తీక్ మంచి నటన కనబరిచాడు. పూజితా పొన్నాడ గ్లామర్ షోలో రాయ్ లక్ష్మితో పోటీ పడింది. ఇతర పాత్రల్లో అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు కిశోర్, తరువాత అదే స్థాయిలో కథను నడిపించలేకపోయాడు. కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, హారర్ రెండూ వర్క్ అవుట్ కాలేదు. ఎక్కువగా అడల్ట్ కామెడీ మీద దృష్టి పెట్టి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన దర్శకుడు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కథా కథనాలు కూడా ఆసక్తికరంగా సాగకపోవటం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. వెంకటలక్ష్మి దెయ్యం అని రివీల్ అయిన తరువాత కథ ఆసక్తికరంగా మారుతుందని భావించిన ప్రేక్షకుడిని మరింత నిరాశకు గురిచేశాడు దర్శకుడు. భయపెట్టే సన్నివేశాలకు స్కోప్ ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ద్వితీయార్థం కూడా సాదాసీదా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ మరీ నాటకీయంగా ముగియటం ఆడియన్స్‌కు రుచించటం కష్టమే. సినిమాలో కాస్త పాజిటివ్‌గా అనిపించే అంశం హరి గౌర సంగీతం. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాయ్ లక్ష్మి సంగీతం మైనస్ పాయింట్స్ : కథా కథనం దర్శకత్వం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా ఉంటుంది
‘‘నేను తెలుగువాణ్ణే. మా పూర్వీకులు తమిళనాడుకి వలస వెళ్లిపోవడంతో అక్కడే పుట్టి పెరిగాను. ఎన్.కె.ఏకాంబరంగారి వద్ద అసిస్టెంట్‌గా పని చేశాను. దర్శకుడు షాజీ కైలాస్ నన్ను కెమెరామేన్‌గా పరిచయం చేశారు. నేను చెన్నైలో ఉన్నా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అని కెమెరామేన్ జేడీ రామతులసి అన్నారు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. అశోక్ కుమార్ దర్శకత్వంలో ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కెమెరామేన్‌గా పనిచేసిన జేడీ రామతులసి మాట్లాడుతూ– ‘‘నా బంగారు తల్లి’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం అయ్యాను. రాజేష్ టచ్‌రివర్ రూపొందించిన ఆ చిత్రం ద్వారా నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘రక్తం’ చిత్రానికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నాకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. ‘మౌనమే ఇష్టం’ విషయానికొస్తే.. అశోక్ కుమార్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్. ప్రతి ఫ్రేమ్ తన ఆర్ట్ వర్క్‌లాగే ఉండాలనుకుంటారు. అలెక్సా కెమెరాను ఉపయోగించి దర్శకుడి అభిరుచికి అనుగుణంగా ప్రతి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లాగా తెరకెక్కించాం. ఆయన పట్టుదల చూసేకొద్దీ మాలో ఉత్సాహం పెరిగేది. ఈ చిత్రం నా కెరీర్లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. అలాగే తెలుగు, ఒడియా భాషల్లో రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పట్నఘడ్’ అనే చిత్రానికీ పనిచేశా. ఆ చిత్రం కూడా అద్భుతం సృష్టించబోతోంది’’ అన్నారు. -
డైరెక్షన్ చాలా కష్టం
‘‘మొదటి నుంచీ నాకు డైరెక్టర్ కావాలనే ఉండేది. ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్‌గా బిజీ అయ్యాక డైరెక్షన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాత సినిమాలు తగ్గడం.. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ రొటీన్‌గా అనిపించడంతో దర్శకత్వం చేయాలని ఫిక్స్ అయ్యా’’ అని డైరెక్టర్ అశోక్ కుమార్ కోరాలత్ అన్నారు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. ఈ చిత్రంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ కుమార్ కోరాలత్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ కావాలనుకున్న తర్వాత చాలామంది హీరోలు, నిర్మాతలను కలిశాను కానీ వర్కవుట్ కాలేదు. దీంతో నేనే ఓ మంచి సినిమా తీయాలని ఫిక్స్ అయి సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ‘మౌనమే ఇష్టం’ కథని బయటి నిర్మాతలకు చెప్పలేదు. మా సొంత బ్యానర్లోనే తీశాం. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ప్రేమ, కుటుంబం.. ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమ కథలకు ఎప్పటికీ అంతం లేదు. ఎవరి శైలిలో వారు వ్యక్తం చేసుకోవచ్చు. కానీ కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. ప్రేమను వ్యక్తపరచడానికి ఒక జంట మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రకథ. హీరో పాత్రకి చాలామందిని ఆడిషన్స్ చేశా. కానీ నచ్చలేదు. సాయి కార్తీక్ నటన చూసి, ఈ పాత్రకి కరెక్ట్ అని తీసుకున్నా. హీరోయిన్ పార్వతిది కేరళ. రెండు మూడు మలయాళీ, కన్నడ సినిమాలు చేసింది. తెలుగులో ఆమెకు ‘మౌనమే ఇష్టం’ తొలి సినిమా. హీరో గ్రాండ్ ఫాదర్ పాత్ర నాజర్‌గారు చేశారు. ఈ పాత్రకి ఆయన తప్ప వేరెవరూ నా మదిలో మెదలలేదు. డైరెక్షన్ చేయడం అన్నది కచ్చితంగా కష్టమే. సరైన లొకేషన్స్ కోసమే చిత్రీకరణ లేట్ అయింది. రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, ఎస్.గోపాల్‌రెడ్డి, ఛోటా కె.నాయుడు, శ్యాం ప్రసాద్‌రెడ్డి, ‘జెమిని’ కిరణ్గార్లు ‘మంచి సినిమా చూసిన ఫీల్ అవుతున్నాం’ అని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాని డబ్బుల కోసం తీయలేదు. థియేటర్స్ నుంచి బయటికొచ్చే ప్రేక్షకులు మంచి ఫీల్‌తో వస్తే చాలు. కొన్ని కథలు రెడీ చేస్తున్నారు. నాకు మంచి స్కోప్ ఉండే సినిమా వస్తే ఆర్ట్ డైరెక్టర్‌గా చేయడానికి రెడీ’’ అన్నారు. -
హీరోగా చేసినా నవ్వించాలి
‘‘ఊర్లో జులాయిగా తిరిగే పాత్రలు మావి. ఆ ఊరికి టీచర్‌గా వచ్చిన లక్ష్మీ రాయ్‌ని వెంటపడి ఆనందిస్తాం. ఆ తర్వాత మమ్మల్ని ఊరికి ఉపయోగపడేలా ఆమె ఎలా మారుస్తుంది? అన్నది కథ. హారర్ టచ్ ఉండే ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సినిమాలో మా ఇద్దరి సీన్స్ ఎంత నవ్విస్తాయో లక్ష్మీరాయ్‌తో ఉన్న సీన్స్ ఇంకా బాగా నవ్విస్తాయి’’ అని ప్రవీణ్, మధు నందన్ అన్నారు. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. ప్రవీణ్, మధు నందన్ వినోదాత్మక పాత్రల్లో నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించారు. ఈ నెల 15న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రవీణ్, మధునందన్ మాట్లాడుతూ – ‘‘మేం సినిమాను అంగీకరించినప్పుడు లక్ష్మీరాయ్ లేరు. కథే ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. లక్ష్మీ రాయ్ ఆ ఊరికి ఎందుకు వచ్చింది? ఏం చేసింది అన్నది కథాంశం. మేం ఈ సినిమాను అంగీకరించడానికి కారణం కథ. మా పాత్రల ముగింపు. బయట మేం చాలా క్లోజ్‌ఫ్రెండ్స్. ఆ కెమిస్ట్రీ సినిమాలో మేం చేసే కామెడీలో కనిపిస్తుంటుంది. ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కామెడీ కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఓ కమెడియన్ హీరోగా చేస్తే.. సినిమాలో 90 శాతం నవ్వులే ఉండాలి. అప్పుడే సోలో హీరోగా నటించాలి. ఫైట్లు, డ్యాన్స్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే.. వాటికి పెద్ద హీరోలు ఎలాగూ ఉన్నారు కదా?’’ అన్నారు. -
పచ్చి మామిడి.. పిచ్చి కామెంట్!
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను మార్చి 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘కామెడీ, హారర్, గ్లామర్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ చిత్రమిది. లక్ష్మీరాయ్ నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్ లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కథ, కథనం, మాటలు: తటవర్తి కిరణ్. ఏదిపడితే అది ఊహించుకోవద్దు ఒకవైపు ‘వేర్ ఈజ్ ది...’ ప్రమోషనల్ కార్యక్రమాలతో లక్ష్మీరాయ్ బిజీగా ఉంటే మరోవైపు ఆమె గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. ఇలా హీరోయిన్ల విషయంలో గాసిప్‌లు సృష్టిస్తుంటారు. చాలాసార్లు వాటిని విననట్లు వదిలేసినా, కొన్నిసార్లు ఘాటుగా స్పందించి వాటిని కొట్టిపారేస్తుంటారు. లక్ష్మీరాయ్ కూడా ఈ వార్త నిజం కాదన్నారు. ‘‘నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు స్టోరీలు రాసుకుంటారా? అంత నమ్మకంగా ఎలా న్యూస్ అల్లేస్తారు? అదేదో నన్నే అడిగి ఉంటే ఇంకా మంచి స్టోరీ ఇచ్చుండేదాన్ని కదా? ఏది పడితే అది ఊహించుకోవద్దు’’ అని ట్వీటర్లో రియాక్ట్ అయ్యారామె. ఇంతకీ ఈ గాసిప్ పుట్టడానికి కారణం ఏంటంటే... లక్ష్మీరాయ్ పచ్చి మామిడికాయ తింటూ కనిపించారట. -
అదే మా సక్సెస్
‘‘అక్కడొకడుంటాడు’ చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నా మౌత్ టాక్‌తో ఆదివారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. ‘భారతీయుడు, అపరిచితుడు’ చిత్రాల కోవలో మా సినిమాలో అండర్ కరెంట్‌గా డ్రంకన్ డ్రైవ్ పైన సందేశం ఉంటుంది. ఇది పూర్తి కమర్షియల్ చిత్రం. నిర్మాత సి.కల్యాణ్‌గారి వల్లే మాకు మంచి థియేటర్లు లభించాయి’’ అని శివ కంఠంనేని అన్నారు. రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘కొత్తదనానికి పట్టం కడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తోంది. మేము అనుకున్నట్టు ప్రేక్షకులకు చేరువయ్యాం’’ అన్నారు. ‘‘సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చోబెడుతోంది. అదే మా సక్సెస్’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక, డిస్ట్రిబ్యూటర్ దాసరి శ్రీనివాస్, చిత్ర నిర్వాహకులు ఘంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎక్కడుంటాడు?
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్ కార్తీక్, శివ హరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరో, హీరోయిన్లుగా, రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ఈ చిత్రం ఆడియో సీడీలను విడుదల చేసి, నిర్మాత సి. కల్యాణ్‌కి ఇచ్చారు. ‘‘అక్కడొకడుంటాడు.. ఎక్కడుంటాడు? ఎందుకుంటాడు? అనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అని శివ కంఠంనేని అన్నారు. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు శ్రీపాద విశ్వక్. ‘‘పైరసీలో కాకుండా థియేటర్లో చూస్తేనే మా సినిమా సాంకేతికంగా ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. ‘అల్లరి’ రవిబాబు మాట్లాడారు. -
నీకేదంటే ఇష్టం
రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. కిశోర్ కుమార్ దర్శకత్వం వహించారు. గురునాథ్‌రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్‌రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రవీణ్, మధునందన్ల కామెడీ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. హరిగౌర మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది
శివ కంఠమనేని టైటిల్ రోల్లో రామ్ కార్తీక్, రసజ్ఞ, శివ హరీశ్, అలేఖ్య హీరో హీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్ తెరకెక్కించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ –‘‘టైటిల్‌లానే సినిమా కూడా వెరైటీగా ఉంటుంది. ప్రతి సన్నివేశం, ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. పెళ్లి కావాల్సిన ఓ ప్రేమ జంట అనుకోకుండా యాక్సిడెంట్లో చిక్కుకుని అందులో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడవిలోకి ప్రవేశిస్తారు. అక్కడ నా పాత్ర ప్రవేశిస్తుంది. నాకు, వాళ్లకూ మధ్య ఏం జరిగింది అన్నది కథ. నేను అంధుడి పాత్రలో కనిపిస్తా’’ అన్నారు. ‘‘30 ఏళ్ల నుంచి సినిమాతో అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం పేపర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ కాన్సెప్ట్ మీద సినిమా తీశాం. క్వాలిటీగా తీశాం. మా సినిమా చూసి నచ్చడంతో రిలీజ్ విషయంలో నిర్మాత సి. కల్యాణ్‌గారు సహకారం అందించారు’’ అన్నారు రావుల వెంకటేశ్వరరావు. -
స్నేహితుల సాయంతో...
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె. శివశంకర్ రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. శ్రీపాద విశ్వక్ దర్శకుడు. రామ్ కార్తీక్, శివ హరీశ్, అలేఖ్య, రసజ్ఞ దీపికా హీరో, హీరోయిన్లు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ హీరో నాగశౌర్య విడుదల చేయగా, ఈ చిత్రంలోని ‘ఆడి పాడి గడిపేద్దాం..’ అనే పాటను ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు విడుదల చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి’’ అన్నారు నాగశౌర్య. ‘‘టైటిల్ పాత్రలో శివ కంఠంనేని బాగా ఒదిగిపోయారు’’ అన్నారు కేయస్ రామారావు. ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే అనర్థాలను మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు శివ కంఠంనేని. శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. ఆ ప్రేమ జంట ఎలా బయటపడుతుందనే అంశంతో లె రకెక్కిన చిత్రమిది. త్వరలోనే సినిమాలోని అన్ని పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు!
రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞదీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. ‘అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘డ్రంకన్ డ్రైవ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా నేను చూశా. మంచి సందేశం ఉంది. శివ కంఠంనేని సీనియర్ నటుల కోవలో తన పాత్రలో ఒదిగిపోయాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నేను కూడా చూశా. కొత్త నిర్మాతలు తీశారనే భావన ఎక్కడా కలగదు. పేరెంట్స్‌తో పాటు యువత చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు అశోక్ కుమార్. ‘‘మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులను కదలనివ్వకుండా కూర్చోబెట్టే చిత్రమిది’’ అన్నారు శివ కంఠంనేని. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీపాద విశ్వక్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహనిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి. -
‘మంచు కురిసే వేళలో’ మూవీ రివ్యూ
టైటిల్ : మంచుకురిసే వేళలో జానర్ : రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తారాగణం : రామ్ కార్తీక్, ప్రనాలి, యశ్వంత్ సంగీతం : శ్రావణ్ భరద్వాజ్ నిర్మాత, దర్శకత్వం : బాలా బోడేపూడి తెలుుగు తెర మీద ప్రేమ కథలు ఎప్పుడు సూపర్ హిట్ ఫార్ములానే. అందుకే కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వారు ప్రేమ కథలనే ఎంచుకుంటారు. అలాంటి తెలుగు తెర మీద సందడి చేసిన మరో ఆసక్తికర ప్రేమకథ `మంచు కురిసే వేళలో`. దేవా కట్టా లాంటి క్రియేటివ్ దర్శకుడి దగ్గర పనిచేసిన బాలా బోడేపూడి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? తొలి ప్రయత్నంలో బాలా బోడేపూడి ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ : ఆనంద్ కృష్ణ( రామ్ కార్తీక్) ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటూ రేడియో సిటీలో ఆర్జే గా పనిచేస్తుంటాడు. ఆత్మహత్య చేసుకోబోతూ తనకు కాల్ చేసిన ఓ కాలర్‌ను కాపాడే ప్రయత్నంలో తాను బీచ్‌లో పున్నమి వెన్నెల్లో ఓ అందమైన అమ్మాయిని చూసి ప్రేమించానని చెపుతాడు. కానీ ఓ రోజు అలానే నిండు వెన్నెల్లో గీత (ప్రనాలి) అనే అమ్మాయి బీచ్‌లో కనిపించటంతో తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. గీత కూడా తన కాలేజ్‌లోనే జాయిన్ అవ్వటంతో ఆమెతో స్నేహం చేస్తాడు. (సాక్షి రివ్యూస్) ఎప్పుడూ డల్ గా, మూడీగా ఉండే గీత, ఆనంద్‌తో పరిచయం అయిన తరువాత కాస్త యాక్టివ్ అవుతుంది.తన ప్రేమకథనే కాలర్స్‌తో పంచుకున్న ఆనంద్ కృష్ణ వాళ్ల ఒత్తిడితో గీతతో ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేస్తాడు. కానీ గీత, ఆనంద్ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. గీత, ఆనంద్ ప్రేమను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి..? గీత గతం ఏంటి..? ఈ ప్రేమకథలో ప్రకాష్(యశ్వంత్) ఎవరు..? అన్నద మిగతా కథ. విశ్లేషణ : హీరో హీరోయిన్లు కొత్త వారే అయిన తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హీరోలుగా నటించిన రామ్ కార్తీక్, యశ్వంత్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. హీరోయిన్గా నటించిన ప్రనాలి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. రెండు వేరియేషన్స్‌ను చాలా బాగా చూపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మూడీగా, డల్ గా కనిపించిన ప్రనాలి ద్వితియార్థంలో బబ్లీ బబ్లీగా ఆకట్టుకుంది. చాలా చోట్ల త్రిష ను ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అందమైన ప్రేమకథను కవితాత్మకంగా చెప్పాలనుకున్న దర్శకుడు చాలా వరకు విజయం సాధించాడు. ఏమాత్రం వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమకథను అందించారు. (సాక్షి రివ్యూస్) అయితే తను అనుకున్న విషయాన్ని పోయటిక్‌గా చెప్పే ప్రయత్నంలో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. తిరుజ్ఙాన, ప్రవీణ్ కుమార్ తమ కెమెరా పనితనంతో సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చారు. కొన్ని ఫ్రేమ్స్ మణిరత్నం సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఊటీలో తెరకెక్కించిన సీన్స్ సూపర్బ్. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం కూడా సరిగ్గా కుదిరింది. మెలోడీస్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌ను క్యారీ చేశాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కొన్ని లెంగ్తీ సీన్స్‌కు కత్తెర పడితే సినిమా ఫీల్ మరోలా ఉండేది. దర్శకుడే నిర్మాత కూడా కావటంతో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫీ సంగీతం మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మద్యం తాగి వాహనాలు నడిపితే?
శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేక్షకులకు ప్రతిక్షణం ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. దాని నుంచి ఆ ప్రేమజంట ఎలా బయటపడ్డారన్నదే చిత్ర ప్రధానాంశం’’ అని శ్రీపాద విశ్వక్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహ నిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి. -
మంచు కురవనుంది
‘‘ఈనెల 28 నుంచి థియేటర్స్‌లో ప్రేమమంచు కురవబోతోంది. ఆ స్వచ్ఛమైన ప్రేమ మంచులో తడిసిపోండి’’ అంటున్నారు ‘మంచు కురిసే వేళలో’ చిత్రబృందం. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత బాల మాట్లాడుతూ – ‘‘మా చిత్రం మోషన్ పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. అందమైన లొకేషన్స్‌లో అద్భుతమైన కథాకథనాలతో రూపొందించిన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ఇది. సంగీతం, కెమెరా వర్క్ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ సీజన్లో మంచి ఎంటర్టైనర్ అవుతుందని భావిస్తున్నాను. పెద్ద విజయం అందుకుంటాం అనే నమ్మకం కూడా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి. -
ఆర్ట్ డైరెక్షన్ టు డైరెక్షన్
మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా రిలీజైనప్పుడు అందులో వేసిన చార్మినార్ సెట్ గురించే మాట్లాడారు. ఆ సినిమాకి ఆ సెట్ కీలక పాత్ర వహించింది. ఇప్పుడెందుకు ఆ సెట్ గురించి అనుకుంటున్నారా! ఏమీ లేదు.. ఆ చిత్ర కళాదర్శకుడు అశోక్ కోరలత్ దర్శకునిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్టం’. ఏ.కె మూవీస్ పతాకంపై ఆషా అశోక్ నిర్మిస్తున్నారు. కళా దర్శకునిగా భారత దేశంలోని అన్ని ముఖ్య భాషల్లో దాదాపు 150 పై చిలుకు చిత్రాలకు పని చేశారు అశోక్. ఐదు నంది అవార్డులను కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఆయన దర్శకుడిగా మారి, తెరకెక్కించిన ‘ఇష్టం’లో రామ్‌కార్తీక్, పార్వతి అరుణ్ హీరో హీరోయిన్లు. సినిమా మొత్తం పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్. కె మాట్లాడుతూ– ‘‘ఇదో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. చిత్రంలోని ప్రేమకథ కూడా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఆడియోను, సినిమాను రిలీజు చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. విజయం అందుకుంటామన్న దీమా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : వివేక్ మహాదేవ. -
ఏంటా ప్రమాదం?
లైట్ హౌస్ సినీ మ్యూజిక్ పతాకంపై కె.శివశంకర రావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్ కార్తీక్, శివ హరీశ్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరో హీరోయిన్లు. శ్రీపాద విశ్వక్ దర్శకత్వం వహించారు. శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య పాత్రలు చేశారు. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ–‘‘డ్రంకన్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా ఇందులో చూపించాం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు, వరంగల్ దగ్గరలోని లక్నవరం ఫారెస్ట్‌లో చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమ జంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం నుంచి ఈ జంట ఎలా బయటపడ్డారన్నదే కథాంశం’’ అన్నారు శ్రీపాద విశ్వక్ . -
టీజర్ చూస్తే క్వాలిటీ తెలుస్తోంది
‘‘మంచు కురిసే వేళలో’ సినిమా టీజర్ చాలా బాగుంది. మనసుని హత్తుకునే చక్కటి సంగీతం కూడా ఉంది. ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మంచి ఔట్‌డోర్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. టీజర్ చూస్తే సినిమా క్వాలిటీ తెలుస్తోంది. రామ్ కార్తీక్ చాలా అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’. ఈ సినిమా టీజర్‌ను మారుతి విడుదల చేశారు. దర్శక–నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘అందమైన కథ, కథనాలతో తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలలో ఆడియో, డిసెంబర్లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి. -
స్వచ్ఛమైన ప్రేమకథ
డైరెక్టర్ దేవా కట్టా వద్ద ‘ప్రస్థానం’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన బాల బోడెపూడి తొలిసారి దర్శక–నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా నటించారు. ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై రూపొందింది. దర్శక–నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘అందమైన కథ, కథనాలతో తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. సంగీతం, సినిమాటోగ్రఫీ హైలెట్‌గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్లో ఉత్తమ చిత్రం అవుతుంది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. ఈ నెలలోనే ఆడియోను, డిసెంబర్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి. -
మంచు కురిసే వేళ...
‘అభినందన’ సినిమాలోని ‘మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో’ పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. తాజాగా ఈ పాట పల్లవి ‘మంచు కురిసె వేళలో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా నటించారు. దర్శకుడు దేవాకట్టా వద్ద ‘ప్రస్థానం’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. దర్శక– నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘మంచు కురిసె వేళలో’ చిత్రం పేరుకు తగ్గట్టుగానే ప్యూర్ లవ్ ఎంటర్టైనర్. వైజాగ్, కూర్గ్, ఊటీ, అరకు, హైదరాబాద్‌లలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. కథ, కథనాలతో పాటు టెక్నికల్‌గా కూడా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలో చూస్తారు. ‘మళ్ళీరావా’ ఫేం శ్రావణ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు ఎస్సెట్‌గా నిలుస్తుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
పిల్లా నీకేదంటే ఇష్టం
లక్ష్మీ రాయ్, రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్ ముఖ్య తారలుగా కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎమ్. శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను దర్శక–నిర్మాతలు లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పిల్లా నీకేదంటే ఇష్టం.. యాపిల్ పిల్లా నీకేదంటే ఇష్టం’ అనే మాసీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు శేఖర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అమలాపురంలో దాదాపు 40 రోజులు షూటింగ్ జరిపాం. ఇంకో పదిరోజులు అక్కడే షూటింగ్ జరిపితే ఈ సినిమా దాదాపు పూర్తి అవుతుంది. కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. లక్ష్మీరాయ్ బహుభాషా నటి. అద్భుతంగా నటిస్తున్నారు. డైరెక్టర్ కిశోర్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ బాగా నటిస్తున్నారు. హరి మంచి సంగీతం అందిస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రస్తుతం చిత్రీకరిస్తున్న మాస్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్‌రెడ్డి. ‘‘కామెడీ చిత్రమిది. మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీ. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు లక్ష్మీ రాయ్. ‘‘నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. ప్రేక్షకులను నవ్వించడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు కిశోర్. ఈ కార్యక్రమంలో రామ్‌కార్తీక్, ప్రవీణ్, మధు నందన్, డీఓపీ వెంకట్, కిశోర్, పూజిత, పంకజ్ తదితరులు పాల్గొన్నారు. -
యువతరం ప్రేమకథ
రామ్ కార్తీక్, సహర్ హప్ష జంటగా కేయస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ‘‘కొత్తవారిని ప్రోత్సహించేందుకే ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కేయస్ నాగేశ్వరరావుతో గతంలో మేం వర్క్ చేశాం. ఓ చక్కటి ప్రేమకథతో మళ్లీ రాబోతున్నాం. హైదరాబాద్‌లో 15 రోజులు షూటింగ్ జరిపిన తర్వాత కాశ్మీర్లో చిత్రీకరణ జరుపుతాం. ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు సాగుతుంది. ఆ నెక్ట్స్ మళ్లీ హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ‘‘కొంత గ్యాప్ తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. నేటి యువతారాన్ని ప్రతిబింబించే ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు నాగేశ్వరరావు. ఈ సినిమాకు సబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. -
ఎలా బయటపడ్డారు
శివ కంఠంనేని, రవిబాబు, వినోద్‌కుమార్, ఇంద్రజ, రామ్ కార్తీక్, శివ హరీశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకర రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రకథ బాగా నచ్చి నిర్మించా’’ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. శ్రీపాద విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ఓ ప్రేమ జంట స్నేహితుల సహాయం పొందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. వాటి నుంచి ప్రేమ జంట, ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు? అన్నదే కథ. యాక్షన్, సస్పెన్స్ ఉన్న చిత్రం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్, ఎన్.వి. గోపాల్‌రావు, కె.శ్రీధర్ రెడ్డి, సంగీతం: సార్క్స్. -
సినిమా చూసి థ్రిల్ అవుతారు
రామ్ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్ జంటగా విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో వరప్రసాద్ బొడ్డు నిర్మించిన ‘మామ ఓ చందమామ’ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సుమన్‌గారు బిజీగా ఉండటంతో ‘వందేమాతరం’ సినిమాలో టి.కృష్ణగారు నాకు అవకాశం ఇచ్చారు. సుమన్‌గారి వల్లే నేను హీరో అయ్యా. ట్రైలర్ చుశాను. ఈ సినిమా హిట్ అవుతుంది’’ అని అన్నారు. ‘‘వెంకట్ కథ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చెయ్యలేదు. ‘గరుడవేగ’తో మంచి హిట్ కొట్టిన రాజశేఖర్‌కి కంగ్రాట్స్’’ అన్నారు నటుడు సుమన్. ‘‘రామ్‌గోపాల్ వర్మగారి స్ఫూర్తితో డైరెక్టర్ అవ్వాలని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చా. కథ చెప్పగానే సినిమా చేద్దామని ముందుకు వచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారన్న నమ్మకం ఉంది.’’ అన్నారు వెంకట్. సీనియర్ నటి గీతాంజలి, రామ్ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్, రచయిత చిన్నికృష్ణ, నటి జీవిత, నిర్మాత రాజ్ కందుకూరి, చిత్రబృందం పాల్గొన్నారు. -
'అక్కడొకడున్నాడు' షూటింగ్ ప్రారంభం
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శివ శంకర రావు కంటగమనేని, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అక్కడొక్కడున్నాడు'. రామ్ కార్తిక్, దీపిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ సినిమా ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లహరి ఎస్టేట్స్ అధినేత హరిబాబు క్లాప్ నివ్వగా, రవీంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి. కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 'కథ కొత్తగా ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. అందుకే సినిమా నిర్మాణానికి పూనుకున్నా. ప్రతీ పాత్ర ఆద్యంత ఆసక్తికరంగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం. మిగతా పనులు కూడా పూర్తిచేసి వీలైనంత త్వరగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని అన్నారు. మరో నిర్మాత శివశంకరరావు మాట్లాడుతూ, 'గతంలో కొన్ని సినిమాల్లో నటించాను. కానీ మళ్లీ వ్యాపార రంగంలో బిజీ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అక్కడొకడున్నాడు సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నా. ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నా. పాత్ర చాలా వైవిథ్యంగా ఉంటుంది. తెలుగు లో ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎవ్వరు సినిమా చేయలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంద'న్నారు. చిత్ర దర్శకుడు శ్రీపాడ విశ్వక్ మాట్లాడుతూ, 'పొరపాటుకు- తప్పుకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు. వ్యక్తిత్వాన్ని ఆరాధించడం. ఇద్దరు ప్రేమికులు అనుకోకుండా విపత్కర పరిస్థితులకు లోనైతే స్వచ్ఛమైన ప్రేమ వారిని ఎలా కాపాడుతుందనే పాయింట్ పొరపాటు- తప్పుగా డివైడ్ చేసి చూపిస్తున్నాం. ప్రతీ పాత్రలో చక్కని ఎమోషన్ ఉంటుంది. ఆ భావోద్వేగాలను కన్వెన్సింగ్గా చెబుతున్నా. టెక్నికల్‌గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. మే 2 నుంచి 20 వరకూ కంటున్యూస్గా షూటింగ్ చేస్తామ'న్నారు. -
ఇద్దరి మధ్య ఎంత?
‘‘సినిమాను చూసి, మంచి సందేశాత్మక చిత్రాన్ని అందిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు మా యూనిట్‌ను అభినందించిన క్షణాలు మరువలేనివి’’ అని నిర్మాత శివరాజ్‌పాటిల్ అన్నారు. నాని ఆచార్య దర్శకత్వంలో రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా సాయితేజపాటిల్ సమర్పణలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ‘తీన్మార్’ ప్రోగ్రామ్ ఫేమ్ బిత్తిరి సత్తి కీలక పాత్ర చేశారు. ఈ నెల 21న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ. -
ఇద్దరి మధ్య!
రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. నాని ఆచార్య దర్శకత్వంలో సాయితేజ పాటిల్ సమర్పణలో శివరాజ్ పాటిల్ నిర్మించారు. ఘంటాడి కృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ‘‘ఘంటాడి పాటలు అలరిస్తాయి. మా చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు శివరాజ్ పాటిల్. ‘‘ఇది నా 50వ చిత్రం. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఘంటాడి. -
ఇద్దరి మధ్య..!
రామ్ కార్తీక్, భాను త్రిపాత్రి జంటగా, టీవీ ఫేమ్ బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం – ‘ఇద్దరి మధ్య 18’. నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘శివరాజ్ రాజకీయరంగంలో మంచి పేరు పొందారు. ‘ఇద్దరి మధ్య 18’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెడు తున్నారు. సినిమా రంగంలోనూ తను సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘త్వరలో పాటలు, ఈ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, సమర్పణ: సాయితేజ పాటిల్. -
చందమామ నవ్వులు!
రామ్‌కార్తీక్, సనా మక్బూల్ జంటగా తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ ‘మామ.. ఓ చందమామ’. ‘విశాఖ థ్రిల్లర్స్’ వెంకట్ దర్శకత్వంలో శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కుటుంబ విలువలు, హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చిన చిత్రమిది. పసలపూడిలో నవంబర్ 11న ప్రారంభించిన తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ నెలాఖరున రెండో షెడ్యూల్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కెమెరామ్యాన్ బాబు కోనసీమ అందాలను బాగా చూపిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని రామ్ కార్తీక్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మురళి సాధనాల.