
రామ్ కార్తీక్, ప్రనాలి
‘‘ఈనెల 28 నుంచి థియేటర్స్‌లో ప్రేమమంచు కురవబోతోంది. ఆ స్వచ్ఛమైన ప్రేమ మంచులో తడిసిపోండి’’ అంటున్నారు ‘మంచు కురిసే వేళలో’ చిత్రబృందం. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత బాల మాట్లాడుతూ – ‘‘మా చిత్రం మోషన్ పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. అందమైన లొకేషన్స్‌లో అద్భుతమైన కథాకథనాలతో రూపొందించిన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ఇది. సంగీతం, కెమెరా వర్క్ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ సీజన్‌లో మంచి ఎంటర్‌టైనర్ అవుతుందని భావిస్తున్నాను. పెద్ద విజయం అందుకుంటాం అనే నమ్మకం కూడా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి.
Comments
Please login to add a commentAdd a comment