కథలో బలం ఉంటే చాలు.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలేకుండా థియేటర్స్‌కి వస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రామ్ అసుర్’. ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహించారు. తొలి సినిమా నే ఈ స్థాయిలో చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ.. ‘రామ్ అసుర్ సినిమా నీ ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. ఇక మంచి సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు అయ్యింది. సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ప్రతిఫలం విజయం రూపంలో వచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమా లతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అని అన్నారు.
‘రామ్ అసుర్’మూవీలో అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ లు హీరోలుగా నటించగా చాందిని తమిళరసన్, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు. లకమైన పాత్రలో శానీ సల్మాన్ నటించగా ఈ సినిమా కు ఈ పాత్ర హైలైట్ గా నిలిచింది. బెంగాల్ టైగర్ సినిమా తో మంచి పేరు దక్కించుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కి సంగీతం సమకూర్చగా జె. ప్రభాకరరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment