Abhinav Sardhar
-
‘మిస్టేక్’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టేక్ నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు నిర్మాణ సంస్థ: ఏఎస్పీ మీడియా హౌస్ నిర్మాత: అభినవ్ సర్దార్ స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి సంగీతం: మణి జెన్నా సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి ఎడిటర్:విజయ్ ముక్తావరపు విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘మిస్టేక్’ కథేంటంటే.. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య(అజయ్ కతుర్వర్) , పూజారి మహదేవ్ శర్మ అలియాస్ దేవ్(సుజిత్ కుమార్), కార్తీక్(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఒకే గదిలో కలిసి ఉంటారు. ఈ ముగ్గురికి లవర్స్ ఉంటారు. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య.. ఏసీపీ కూతురు మిత్ర(ప్రియా)ను ప్రేమిస్తాడు. పూజారి దేవ్, పార్వతి అలియాస్ పారు(నయన్ సారికా) అనే యువతితో ప్రేమలో ఉంటే, ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి స్వీటీ(తనియా కార్లా)ని కార్తీక్ లవ్ చేస్తాడు. ఈ ముగ్గురికి నగరంలో వేరు వేరు కారణాల వల్ల ప్రాణహానీ ఉందని భావిస్తారు. దీంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా వెళ్లాలనుకుంటారు. తమ లవర్స్‌తో కలిసి ఫారెస్ట్ ట్రిప్ వేస్తారు. ఇందుకుగాను కార్తీక్ ఆన్లైన్లో షాపింగ్ చేసి అందరికి డ్రెస్సులు తీసుకుంటాడు. అంతా కలిసి జీపులో ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఓ రౌడీ(అభినవ్ సర్దార్) వీరిపై అటాక్ చేస్తాడు. అతని నుంచి తప్పించుకున్న ఈ మూడు జంటలు అడవిలోకి వెళ్లిపోతారు. అడవిలో వీరికి ఎదురైన సమస్యలేంటి? అసలు ఆ రౌడీ వీరికి ఎందుకు అటాక్ చేశాడు? అతన్ని ఎవరు పంపించారు? ఈ మూడు జంటలు చేసిన మిస్టేక్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మిస్టేక్ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ చిన్న పొరపాటు వల్ల మూడు జంటలు పడిన బాధలేంటి? చివరకు వారు చేసిన మిస్టేక్ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చింది అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు భరత్ కొమ్మాలపాటి ఓ చిన్న పాయింట్‌ని కథగా మలిచి, రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడం హైలైట్ పాయింట్. సినిమా కామెడీగా సాగుతూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఉత్కంఠకు గురి చేస్తాయి. అయితే సస్పెన్స్ అంశాలు, ట్విస్టులలో కొత్తదనం ఉండదు. గతంలో చాలా సినిమాల్లో చూసిన ట్వీస్టులు ఇందులో చూపించారు. సస్పెన్స్ అంశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. సినిమా మొత్తం మూడు జంటలు, ఓ విలన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఎక్కువ భాగం అడవిలోనే సాగుతుంది. ఫస్టాఫ్‌లో మూడు జంటల ప్రేమ కథ, వారికి వచ్చిన సమస్యలు, దాని నుంచి తప్పించుకునేందుకు వారు వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వారు చేసే పనులు అన్ని సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగాను సాగుతాయి. మూడు జంటలకు అడవిలో మరుగుజ్జు జాతి ప్రజలతో కలిసి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం థ్రిల్లింగ్‌గా సాగినప్పటికీ కాస్త బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్‌ని రివీల్ చేయడం.. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కథను మరింత బలంగా రాసుకొని, సెకండాఫ్‌ని ఆసక్తికరంగా నడిపించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. అభినవ్ సర్దార్ నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. భయంకరమైన లుక్స్‌లో కనిపిస్తూ యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక మూడు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్)- మిత్ర(ప్రియా),దేవ్(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజారి దేవ్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్లు నటన పరంగానే కాదు గ్లామర్‌తోను మెప్పించారు. రాజా రవీంద్ర, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. మంగ్లీ పాడిన పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి పనితీరు బాగుంది. ఎడిటర్ విజయ్ ముక్తావరపు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి
'రామ్ అసుర్' తర్వాత అభినవ్ సర్దార్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్'. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. ఏఎస్పీ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!) ప్రియదర్శి మాట్లాడుతూ... "అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా మిస్టేక్ సినిమా చేశారు. మంచి కథపై నమ్మకంతో ఆయన నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతుంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు. అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. "మంచి పాయింట్ అనిపించగానే 'మిస్టేక్' సినిమా మొదలు పెట్టాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలన్నీ ఉంటాయి" అని అన్నారు. డైరెక్టర్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... "సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంది. ఇక యాక్షన్ సన్నివేశాలను తెలుగు సినిమాల్లో రానటువంటి యూనిక్ స్టైల్లో డిజైన్ చేసి చిత్రీకరించాం. ఆ యాక్షన్ పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది" అన్నారు. ఈ చిత్రంలో అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: ఖరీదైన లగ్జరీ కారు కొన్న 'అత్తారింటికీ దారేది' నటుడు.. కానీ!) -
సర్దార్ నాకు పోటీ వచ్చినా పర్లేదు..‘మిస్టేక్’ హిట్టుకొట్టాలి: శ్రీకాంత్
‘‘అభినవ్ సర్దార్ చాలా రంగాల్లో విజయం సాధించాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ, ‘మిస్టేక్’ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా మారాడు. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ‘మిస్టేక్’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’. విలన్‌గా సర్దార్ నాకు పోటీ వచ్చిన పర్లేదు కానీ ఈ చిత్రం విజయం సాధించాలి’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టేక్’. అభినవ్ సర్దార్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘భరత్ చెప్పిన కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ సినిమా నిర్మించాను’’ అన్నారు అభినవ్ సర్దార్. ‘‘జూలైలో ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు భరత్ కొమ్మాలపాటి. -
మిస్టేక్: ఒక్క పాటకోసం 40 మంది లిల్లీపుట్స్.. సాంగ్ వైరల్
ఇటీవల వచ్చి 'రామ్ అసుర్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అభినవ్ సర్దార్. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా విజయం సాధిస్తున్నాడు. తాజాగా 'మిస్టేక్' అనే మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అభినవ్. ఏఎస్పీ మీడియా ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతున్న ఈ సినిమాకు అభినవ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా రొమాంటిక్, సస్పెన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్‌లో కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఎప్పటికప్పుడూ సినిమా అప్డేట్స్ వదులుతూ చిత్రం పట్ల ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి సాంగ్ 'గంటా గ్రహచారం' విడుదల చేశారు. తాజాగా గుంటూరులోని వీవీఐటీ కాలేజ్‌లో సుమారు 4 వేల మంది విద్యార్థుల నడుమ రెండో పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ సందడి చేశారు. రేవంత్ 'పిల్లా పిల్లా' అంటూ పాడిన ఈ పాట (TAQUERO MUCHO SONG) యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. జంగిల్ థీమ్, మణి జెన్నా సంగీతం, శ్రీరామ్ పిసుపాటి అందించిన లిరిక్స్ పాటకు ప్రాణం పోశాయి. అయితే ఈ పాట కోసం సుమారు 40 మంది లిల్లీపుట్స్ను సేకరించడం విశేషం. అంటే ఈ పాటలో 40 మంది లిల్లీపుట్స్ నటించినట్లు తెలుస్తోంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మిస్టేక్ చిత్రంతో అభినవ్ సర్ధార్ మరో మెట్టు ఎక్కనున్నాడని చిత్రబృందం అంటోంది. అతి త్వరలో సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించనుంది. -
జూనియర్ యశ్ అని పిలుస్తున్నారు: అభినవ్ సర్ధార్
అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామ్ అసుర’. అభినవ్, వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ‘రామ్ అసుర’కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ – ‘‘కృత్రిమ వజ్రాలను తయారు చేయాలనుకున్న ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇందులో సూరి పాత్రలో నటించాను. సినిమాకు, నేను చేసిన సూరి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా స్నేహితులు, బంధువులు, మిత్రులు నన్ను ‘సూరి, జూనియర్ యశ్’ అని పిలుస్తున్నారు. (చదవండి: రామ్ అసుర్ మూవీ ఎలా ఉందంటే..) ఒక పక్క నిర్మాణం, మరోవైపు యాక్టింగ్ అంటే కష్టంగానే ఉంటుంది. కానీ మనం ఇష్టంగా చేసే పని కష్టంగా అనిపించదు. నా తర్వాతి చిత్రం ‘మిస్టేక్’. ఇందులో ఓ లీడ్ క్యారెక్టర్ చేశాను. తెలుగులో రెండు, తమిళంలో రెండు... మొత్తం నాలుగు సినిమాలకు కమిటయ్యాను. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. పెద్ద హీరోల సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లు చేయడానికి కూడా రెడీయే’’ అని అన్నారు. (చదవండి: ఆయన చాలా పెద్దాయన.. ఆ రోజు భయం వేసింది: హీరోయిన్) -
మంచి సినిమాలతో అలరిస్తూనే ఉంటా: వెంకటేష్ త్రిపర్ణ
కథలో బలం ఉంటే చాలు.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలేకుండా థియేటర్స్‌కి వస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రామ్ అసుర్’. ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహించారు. తొలి సినిమా నే ఈ స్థాయిలో చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ.. ‘రామ్ అసుర్ సినిమా నీ ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. ఇక మంచి సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు అయ్యింది. సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ప్రతిఫలం విజయం రూపంలో వచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమా లతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అని అన్నారు. ‘రామ్ అసుర్’మూవీలో అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ లు హీరోలుగా నటించగా చాందిని తమిళరసన్, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు. లకమైన పాత్రలో శానీ సల్మాన్ నటించగా ఈ సినిమా కు ఈ పాత్ర హైలైట్ గా నిలిచింది. బెంగాల్ టైగర్ సినిమా తో మంచి పేరు దక్కించుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కి సంగీతం సమకూర్చగా జె. ప్రభాకరరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. -
నా సంపాదనలో 10 శాతం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తా: యంగ్ హీరో
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ ఇటీవల విడుదలైన 'రామ్ అసుర్' తన కెరీర్లో బిగ్ సక్సెస్ అందుకున్నారు. సూరి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో టాలెంట్ చూపిస్తూ ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా, సెకండాఫ్‌లో అసురుడిగా మెప్పించారు. ఈ మూవీలో లుక్ పరంగా అట్రాక్ట్ చేసిన ఆయన టాలీవుడ్ యష్గా ప్రేక్షకుల నోళ్ళలో నానుతున్నారు. రీసెంట్గా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రామ్ అసుర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుండటం పట్ల హీరో అభినవ్ సర్దార్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు పదేళ్ల క్రింద తన సినీ ప్రయాణాన్ని ఆరంభించిన అభినవ్ సర్దార్.. తన సంపాదనలో 10 శాతం మేర దాతృత్వ పనుల కోసం ఖర్చు చేస్తూ ఉదారత చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. ‘‘రామ్ అసుర్ సినిమాతో నటుడిగా, నిర్మాతగా బిగ్ సక్సెస్ అందుకున్నా. కెరీర్లో ఇంకా చాలా సాధించేది ఉంది. అను నిత్యం నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉంటా. ఈ చిత్రంలో నేను పోషించిన రెండు డిఫరెంట్ షేడ్స్‌కు వస్తున్న రెస్పాన్స్ నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించాయి. మూవీ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్, సినీ క్రిటిక్స్, సినీ ప్రముఖుల నుంచి అందిన ప్రశంసలతో కెరీర్‌పై మరింత నమ్మకం పెరిగింది. ముందు ముందు మరిన్ని డిఫరెంట్ కథలతో ప్రేక్షకలోకాన్ని అలరిస్తా. రామ్ అసూర్ విజయం తర్వాత నాకు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా కొన్ని బిగ్ ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా విజయం కొత్త ఉత్సాహాన్నివ్వడమే గాక నటుడిగా నా లోని టాలెంట్ బయటపెట్టే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞలు చెబుతున్నా. త్వరలో నా తదుపరి సినిమాల వివరాలను వెల్లడిస్తా’’ అన్నారు. -
‘రామ్ అసుర్’పై ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ ప్రశంసలు
అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామ్ అసుర్. చాందిని తమిళ్‌రాసన్, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ సరికొత్త కథ కథనాలతో ఆద్యంతం ఈ సినిమా ను ప్రేక్షకులు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య కొన్ని నగరాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమా ను వీక్షించిన చిత్ర బృందం తాజాగా వరంగల్ లో సందడి చేసింది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి సినిమా ను వీక్షించింది చిత్ర బృందం. (చదవండి: రామ్ అసుర్ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రామ్ అసుర్ సినిమా అద్భుతంగా ఉంది. హీరో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన చాలా బాగుంది. ప్రత్యేకమైన పాత్రలో శానీ సల్మాన్ మంచి నటన కనపరిచాడు. దర్శకుడు వెంకటేష్ ఈ సినిమా ను మంచి కథ తో తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాన్ని యూనిట్ తో కలిసి వీక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను* అన్నారు. -
రామ్ అసుర్ మూవీ రివ్యూ
టైటిల్ : రామ్ అసుర్ నటీనటులు : అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ తదితరులు నిర్మాత : అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం : వెంకటేష్ త్రిపర్ణ సంగీతం : భీమ్స్ సిసిరోలియో విడుదల తేది : నవంబర్ 19, 2021 ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ప్రజాదరణ లభిస్తోంది. కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘రామ్ అసుర్’. డైమండ్ చుట్టూ తిరిగే కథకు ఇద్దరి జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను ‘రామ్ అసుర్’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే... రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే సమయంలో తను ప్రాణంగా ప్రేమించిన ప్రియ(షెర్రీ అగర్వాల్).. బ్రేకప్ చెబుతుంది. దీంతో రామ్ బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైన జీవితంలో కోలుకోవాలనే ఉద్దేశంతో స్నేహితుడి సహాయంతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూరికి, రామ్ కు సంబంధం ఏంటి? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి? సూరి ఎవరు.. అతని నేపథ్యం ఏంటి? చివరగా రామ్ కృత్రిమ వజ్రాలను తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడా? అనేది తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లి ‘రామ్ అసుర్’చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. సినిమాకి కీలకమైన సూరి పాత్రలో అభినవ్ సర్దార్ ఒదిగిపోయాడు. ఓ షేడ్ లో లవర్ బాయ్ గా, మరో షేడ్ లో ఎగ్రెసివ్ లుక్‌లో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక లవర్ బాయ్ రామ్ పాత్రకి రామ్ కార్తీక్ న్యాయం చేశాడు. రొమాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్‌లో కూడా అదరగొట్టేశాడు.షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన శివ పాత్రలో శాన్వీ సాల్మన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. విభిన్నమైన పాత్రని చాలా అవవోకగా పోషించి మెప్పించాడు. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్‌తో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? కృత్రిమంగా డైమండ్ తయారుచేయడమనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘రామ్ అసుర్’.ఈ కాన్సెప్ట్ కు రెండు విభిన్న జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చాడు దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ. అయితే ఇంత మంచి కాన్సెప్ట్ ను తెరపైకి పకడ్బందీగా తీసుకొచ్చారా అంటే మాత్రం పూర్తిగా అవునని చెప్పలేం. బడ్జెట్ పరిమితులు ఓవైపు, బలమైన స్టార్స్ లేకపోవడం మరోవైపు ఈ సినిమాను కాస్త వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో రామ్ కార్తీక్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అతడి లవ్ ట్రాక్, రొమాన్స్ కు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేవరకు కథ స్లోగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే సెకెండాఫ్ స్టార్ట్ అవుతుందో ఇక అక్కడ్నుంచి 'రామ్ అసుర్' పరుగులుపెడుతుంది. ఈ విషయంలో దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణను మెచ్చుకోవాలి. తొలి సినిమాకే కాస్త క్లిష్టంగా, కష్టంగా అనిపించే కథను సెలక్ట్ చేసుకున్న వెంకటేష్.. సెకండాఫ్ నుంచి తన రైటింగ్ పవర్ చూపించాడు. స్క్రీన్ ప్లేలో, ట్విస్టుల్లో చమక్కులు చూపించాడు. సినిమాలో ప్రేమ, భావోద్వేగం, యాక్షన్‌తో ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌గా డీల్ చేశాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే రామ్ అసుర్ సినిమా, టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త కథను పరిచయం చేస్తుంది.