జూనియర్‌ యశ్‌ అని పిలుస్తున్నారు: అభినవ్‌ సర్ధార్ | Ram Asur Movie Actor Abhinav Sardhar Interview: Friends Called Me Junior Yash | Sakshi
Sakshi News home page

జూనియర్‌ యశ్‌ అని పిలుస్తున్నారు: అభినవ్‌ సర్ధార్

Published Mon, Dec 6 2021 3:14 PM | Last Updated on Mon, Dec 6 2021 3:30 PM

Ram Asur Movie Actor Abhinav Sardhar Interview: Friends Called Me Junior Yash - Sakshi

అభినవ్‌ సర్ధార్

అభినవ్‌ సర్ధార్, రామ్‌ కార్తీక్‌ హీరోలుగా వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామ్‌ అసుర’. అభినవ్, వెంకటేశ్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ‘రామ్‌ అసుర’కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. 

ఈ సందర్భంగా అభినవ్‌ మాట్లాడుతూ – ‘‘కృత్రిమ వజ్రాలను తయారు చేయాలనుకున్న ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇందులో సూరి పాత్రలో నటించాను. సినిమాకు, నేను చేసిన సూరి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా స్నేహితులు, బంధువులు, మిత్రులు నన్ను ‘సూరి, జూనియర్‌ యశ్‌’ అని పిలుస్తున్నారు. (చదవండి: రామ్ అసుర్ మూవీ ఎలా ఉందంటే..)

ఒక పక్క నిర్మాణం, మరోవైపు యాక్టింగ్‌ అంటే కష్టంగానే ఉంటుంది. కానీ మనం ఇష్టంగా చేసే పని కష్టంగా అనిపించదు. నా తర్వాతి చిత్రం ‘మిస్టేక్‌’. ఇందులో ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేశాను. తెలుగులో రెండు, తమిళంలో రెండు... మొత్తం నాలుగు సినిమాలకు కమిటయ్యాను. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. పెద్ద హీరోల సినిమాల్లో నెగటివ్‌ క్యారెక్టర్లు చేయడానికి కూడా రెడీయే’’ అని అన్నారు. (చదవండి: ఆయన చాలా పెద్దాయన.. ఆ రోజు భయం వేసింది: హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement