ఇటీవల వచ్చి 'రామ్ అసుర్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అభినవ్ సర్దార్. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా విజయం సాధిస్తున్నాడు. తాజాగా 'మిస్టేక్' అనే మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అభినవ్. ఏఎస్‌పీ మీడియా ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతున్న ఈ సినిమాకు అభినవ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా రొమాంటిక్, సస్పెన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్‌లో కేర్ తీసుకుంటున‍్నారు దర్శక నిర్మాతలు. ఎప్పటికప్పుడూ సినిమా అప్‌డేట్స్ వదులుతూ చిత్రం పట్ల ఆసక్తి పెంచుతున్నారు.
ఈ క్రమంలోనే మొదటి సాంగ్ 'గంటా గ‍్రహచారం' విడుదల చేశారు. తాజాగా గుంటూరులోని వీవీఐటీ కాలేజ్‌లో సుమారు 4 వేల మంది విద్యార్థుల నడుమ రెండో పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ సందడి చేశారు. రేవంత్ 'పిల్లా పిల్లా' అంటూ పాడిన ఈ పాట (TAQUERO MUCHO SONG) యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. జంగిల్ థీమ్, మణి జెన్నా సంగీతం, శ్రీరామ్ పిసుపాటి అందించిన లిరిక్స్ పాటకు ప్రాణం పోశాయి. అయితే ఈ పాట కోసం సుమారు 40 మంది లిల్లీపుట్స్‌ను సేకరించడం విశేషం. అంటే ఈ పాటలో 40 మంది లిల్లీపుట్స్ నటించినట్లు తెలుస్తోంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మిస్టేక్ చిత్రంతో అభినవ్ సర్ధార్ మరో మెట్టు ఎక్కనున్నాడని చిత్రబృందం అంటోంది. అతి త్వరలో సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప‍్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment