సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా హేబా పటేల్ హీరోయిన్‌గా నటిస్తుంది.ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన "శశివదనే" పాటకు మంచి స్పందన లభించింది. అలానే ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేసింది.
సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసుకుందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment