చంటబ్బాయ్ తాలూకా అంటోన్న వెన్నెల కిశోర్.. ఆసక్తిగా పోస్టర్ | Tollywood Actor Vennela Kishore Latest Movie Update Goes Viral | Sakshi
Sakshi News home page

Vennela Kishore: వెన్నెల కిశోర్ డిటెక్టివ్‌ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Mon, Nov 25 2024 7:52 PM | Last Updated on Mon, Nov 25 2024 8:00 PM

Tollywood Actor Vennela Kishore Latest Movie Update Goes Viral

టాలీవుడ్ కమెడియన్‌ వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. చంటబ్బాయ్ తాలూకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు రచయిత మోహన్ దర్శకత్వం  వహిస్తున్నారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి  మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల క్రిస్‌మస్‌ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన పోస్టర్‌ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే డిటెక్టివ్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీయా గౌతమ్‌, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్‌, మురళీధర్‌ గౌడ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement