జేడీ రామతులసి
‘‘నేను తెలుగువాణ్ణే. మా పూర్వీకులు తమిళనాడుకి వలస వెళ్లిపోవడంతో అక్కడే పుట్టి పెరిగాను. ఎన్.కె.ఏకాంబరంగారి వద్ద అసిస్టెంట్‌గా పని చేశాను. దర్శకుడు షాజీ కైలాస్ నన్ను కెమెరామేన్‌గా పరిచయం చేశారు. నేను చెన్నైలో ఉన్నా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అని కెమెరామేన్ జేడీ రామతులసి అన్నారు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. అశోక్ కుమార్ దర్శకత్వంలో ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కెమెరామేన్‌గా పనిచేసిన జేడీ రామతులసి మాట్లాడుతూ– ‘‘నా బంగారు తల్లి’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం అయ్యాను.
రాజేష్ టచ్‌రివర్ రూపొందించిన ఆ చిత్రం ద్వారా నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘రక్తం’ చిత్రానికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నాకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. ‘మౌనమే ఇష్టం’ విషయానికొస్తే.. అశోక్ కుమార్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్. ప్రతి ఫ్రేమ్ తన ఆర్ట్ వర్క్‌లాగే ఉండాలనుకుంటారు. అలెక్సా కెమెరాను ఉపయోగించి దర్శకుడి అభిరుచికి అనుగుణంగా ప్రతి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లాగా తెరకెక్కించాం. ఆయన పట్టుదల చూసేకొద్దీ మాలో ఉత్సాహం పెరిగేది. ఈ చిత్రం నా కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. అలాగే తెలుగు, ఒడియా భాషల్లో రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పట్నఘడ్’ అనే చిత్రానికీ పనిచేశా. ఆ చిత్రం కూడా అద్భుతం సృష్టించబోతోంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment