
‘‘ఎఫ్‌సీయూకే’లో నా పాత్ర గురించి వెల్లడైన విషయాలు చూసి, ఇది నీ కథేనా? అని కొందరు అడుగుతున్నారు. పిల్లలకు ఆటలు కావాలి, యూత్‌కు రొమాన్స్ కావాలి, మాకు అన్నీ కావాలి. ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో బేబీ సహస్రిత మరో పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్.. చిట్టి.. ఉమ.. కార్తీక్). విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్‌పై దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..‘దామోదర్ ప్రసాద్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత.
నాన్నగారు (వి.బి. రాజేంద్రప్రసాద్) నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దసరా బుల్లోడు’ ఈ జనవరి 13కు 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం హ్యాపీ’ అన్నారు. ‘సినిమా అనేది వ్యాపారమైనప్పటికీ విలువలతో సినిమాలు తీస్తూ వస్తున్నాను. ‘ఎఫ్‌సీయూకే’ కూడా అలాంటి సినిమానే’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘ప్రేక్షకులను బాగా నవ్వించే చిత్రమిదని విద్యాసాగర్ రాజు పేర్కొన్నారు. ‘ఫిబ్రవరి 12న జగపతిబాబు, దాము బర్త్‌డే. ఆ రోజే మా సినిమా రిలీజ్ చేస్తామని రామ్ కార్తిక్ తెలిపారు. సినిమాటోగ్రాఫర్ శివ, సహనిర్మాత యలమంచిలి రామకోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి పాతూరి, లైన్ ప్రొడ్యూసర్ వాసు పరిమి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment