cameramen
-
వాళ్లంతా గొప్పవాళ్లు.. నేను కాను
‘‘పెదకాపు 1’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ వీవీ వినాయక్ చూశారు. విజువల్స్ ఆయనకు బాగా నచ్చడంతో పీసీ శ్రీరామ్‌గారితో నన్ను పోల్చారు. అయితే పీసీ శ్రీరామ్‌గారితో పోల్చుకునేటంత గొప్ప వ్యక్తిని కాదు నేను. పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, విన్సెంట్ (ఛాయాగ్రాహకులు).. వాళ్లంతా గొప్పవాళ్లు’’ అని కెమెరామేన్ ఛోటా కె. నాయుడు అన్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా చేసిన ఛోటా కె.నాయుడు విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో శ్రీకాంత్ అడ్డాల, నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తన ప్రతి సినిమా కథ నాకు చె΄్తాడు. ఇద్దరం కలసి చేద్దామనుకుంటాం కానీ ‘పెదకాపు 1’కి కుదిరింది. తన సినిమాల్లాగానే శ్రీకాంత్ చాలా కూల్‌గా ఉంటాడు. తనని చూస్తే నాకు కె.విశ్వనాథ్‌గారిలా అనిపిస్తారు. కూల్‌గా ఉండే తను ‘పెదకాపు 1’ లాంటి చిత్రం చేసి, ఇంత మంచి ఔట్పుట్ ఇవ్వడం నాకు షాక్ అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలకి నటుడిగా ఇది తొలి చిత్రమైనా సింగిల్ టేక్‌లో చేసేసేవాడు.. తను నటించిన ప్రతి సీన్‌ని మా నిర్మాత రవీందర్ రెడ్డిగారు డైరెక్ట్ చేశారు. ► ‘పెదకాపు 1’ కథ 1983 నేపథ్యంలో జరుగుతుంది. ఈ కథ కొత్త ΄్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్‌ని డిమాండ్ చేసింది.. దాన్ని తీసుకురావడం నాకు సవాల్‌గా అనిపించింది. ఈ విషయంలో క్రెడిట్ దర్శకుడిదే. ► నేనెప్పుడూ హీరో స్థానానికి గౌరవం ఇస్తాను. స్టార్ హీరోనా, పెద్ద హీరోనా, చిన్న హీరోనా అని చూడను. విరాట్‌కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. హీరోయిన్ ప్రగతికి కూడా మొదటి సినిమా అయినా చాలా బాగా చేసింది. నటి అనసూయ కూడా తన పాత్రని మేము అనుకున్నదానికంటే బాగా చేసింది.. మిక్కీ జె.మేయర్ ఇలాంటి చక్కని నేపథ్య సంగీతం ఇవ్వడం నన్ను సర్ప్రైజ్ చేసింది. ► ‘పెదకాపు 1’ ని రవీందర్ రెడ్డిగారు కాకుండా మరో నిర్మాత అయితే ఐదారు కోట్లలో సినిమా తీయమని చెప్పేవారు. కానీ, ఈ కథ ముప్పై నలభై కోట్లు డిమాండ్ చేస్తుంది. ఆయన కాబట్టి ఇంత భారీ బడ్జెట్‌తో తీశారు. పైగా తన బావమరిదిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. ‘పెదకాపు 2’ చిత్రం కూడా ఉంటుంది. ► ‘పెదకాపు 1’ కోసం 1983 నాటి వాతావరణం సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. ఈ మూవీలో హీరో, అతని స్నేహితులు జెండా కర్ర పాతే సన్నివేశం చిత్రీకరించడం నా కెరీర్లో అద్భుతం. నేను చాలా గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది. నెక్ట్స్ చిరంజీవిగారి 157వ సినిమా చేస్తున్నాను.. నవంబర్‌లో షూటింగ్ ్రపారంభమవుతుంది. -
తారకరత్న తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి తారకరత్న ఇకలేరన్న విషయాన్ని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నం తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా కూడా పనిచేశారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒకవైపు చదువుకుంటూనే కెమెరామెన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన. -
RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, భార్య రూహీతో " ప్రత్యేక ఇంటర్వ్యూ "
-
లైన్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తే సినిమా చేయను
‘‘ఈ రోజుల్లో మానవ సంబంధాలకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. కనీసం సహాయం చేసినవారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా మొక్కుబడిగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ‘థ్యాంక్యూ’ మాటకు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అన్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కెమెరామేన్ పీసీ శ్రీరామ్ చెప్పిన విశేషాలు.. ► నేను ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ మొత్తం వింటాను. ఆ కథ నా మనసుకి ఎమోషనల్‌గా నచ్చితేనే సినిమా చేసేందుకు అంగీకరిస్తాను. అంతేకానీ స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోను. కథ పూర్తిగా విన్నప్పుడే దర్శకుడి విజన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఆ కథని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది. ► ‘థ్యాంక్యూ’ అనే పదంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన హృదయంలోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయగలం. నా తల్లితండ్రులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే. నా వ్యక్తిగత, సినీ ప్రయాణంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సినవారెందరో ఉన్నారు.. ఈ సినిమా చేశాక వారందరకీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ► ప్రతి రంగంలో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీలోనూ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ వందల రకాలుగా టెక్నాలజీ అప్డేట్ అవుతుంటుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మన క్రియేటివ్ విజన్‌ని బట్టే అది తెరపై కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన కథని నా కోణంలో తెరపైన ఆవిష్కరించడానికే ప్రయత్నిస్తాను. నేను ఏ సినిమా చేసినా, నా వర్కే డామినేట్ చేస్తుందని అనుకోవడంలో నిజం లేదు. కథకి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే నేను డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ► డైరెక్షన్, సినిమాటోగ్రఫీ రెండూ వేర్వేరు. ఈ విభాగాల పని తీరు వేరుగా ఉంటుంది. దర్శకత్వం నా వృత్తి కాదు. అందుకే డైరెక్టర్ (తమిళ చిత్రాలు ‘మీరా, కురుది పునల్, వానమ్ వసప్ప డుమ్’కి దర్శకత్వం వహించారు) గా సక్సెస్ కాలేకపోయాను. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టాలన్న ఆలోచన లేదు. -
వైరల్: స్ప్రింటర్లను మించి కెమెరామెన్ పరుగో పరుగు..
బీజింగ్: మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఉత్తర చైనాలోని షాంకి ప్రావిన్స్‌లోని డాటాంగ్ విశ్వవిద్యాలయంలో పరుగు పందెం పోటీలు నిర్వహించారు. అయితే ఈ 100 మీటర్ల పరుగుపందెం ఈవెంట్‌ను కెమెరాలో బంధించే బాధ్యతను ఓ విద్యార్థికి అప్పగించారు. ఇంకేముంది ఆ విద్యార్థి ఈవెంట్‌ను వీడియో తీయడానికి ఓ 4 కిలోల భారీ కెమెరా గేర్‌ను పట్టుకొని స్ప్రింటర్ల కంటే వేగంగా పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. కెమెరామెన్ ప్రతి ఒక్కరినీ వీడియో తీయడానికి వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది, లేకపోతే రాకెట్లా దూసుకుపోయేవాడు.’’ అంటూ ప్రశంస జల్లు కురిపించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ ఆ బహుమతికి కెమెరామెన్ అర్హుడు.’’ అంటూ కామెంట్ చేశాడు. (చదవండి: ముంబైలో ఘోర ప్రమాదం.. 8 మంది పిల్లలతో సహా..) -
కెమెరామేన్ అల్లెన్ డీవియో మృతి
కరోనా వైరస్ కారణంగా ఇటీవలే పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్ కెమెరామేన్ అల్లెన్ డీవియో (77) కరోనా వల్ల మరణించారు. ‘ఈటీ’, ‘డి కలర్ పర్పుల్’, ‘ఎంపైర్ ఆఫ్ డి సన్’ వంటి పాపులర్ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేశారాయన. దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌తో ఎక్కువ సినిమాలు కలసి పని చేశారు అల్లెన్. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఐదుసార్లు ఆస్కార్ నామినేషన్ పొందారు అల్లెన్ డేవియో. 2007లో అమెరికన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆయనకు జీవిత సాఫల్యత పురస్కారాన్ని అందించింది. -
లైటింగ్ + షాడో = సాహో
లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను ‘విజువల్ వండర్’ అని సంబోధిస్తుంటారు. దర్శకుడు మెదడులో అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్ తన కెమెరాతో స్క్రీన్ పై చూపిస్తాడు. మన కంటే ముందే తన లెన్స్‌తో సినిమా చూసేస్తాడు కెమెరామేన్. ‘సాహో’ లాంటి భారీ సినిమాని తన కెమెరా కన్నుతో ముందే చూసేశారు చిత్ర ఛాయాగ్రాహకుడు మది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి మది ప్రత్యేకంగా చెప్పిన ‘మేకింగ్ ఆఫ్ సాహో’ విశేషాలు. ► 350 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసే చాన్స్ తరచు రాదు. ప్రభాస్‌తో గతంలో ‘మిర్చి’ చేశాను. స్వతహాగా ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు. ‘మిర్చి’లో స్టైలిష్‌గా చూపించే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు ‘సాహో’లో మరిన్ని షేడ్స్‌లో ప్రభాస్‌ని చూపించాను. దర్శకుడు సుజీత్ తీసిన ‘రన్ రాజా రన్’కి వర్క్ చేశాను. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నాకు మంచి స్నేహితులు. ‘సాహో’ లాంటి విజువల్ వండర్‌కి పని చేయడం అద్భుతమైన అవకాశం. విజువల్‌గా ఈ సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ► ఇలాంటి భారీ సినిమాకు హోమ్ వర్క్ లేకుండా డైరెక్ట్‌గా సెట్లో దిగలేం. ‘సాహో’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్ వర్క్, ప్రీ–డిజైన్ వర్క్ చాలా ఎక్కువ చేశాం. అవుట్‌పుట్ ఎలా వస్తుందో? అని ముందే రఫ్‌గా చూసుకున్నాం. కెమెరామేన్, యాక్షన్ డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ టీమ్ అందరం కలిసి టీమ్‌గా వర్క్ చేశాం. ► ‘సాహో’ బహుభాషా చిత్రం. ఒక భాషలో ఓ సన్నివేశం తీయగానే అదే సన్నివేశాన్ని యాక్టర్స్ అందరూ వేరే భాషలో నటించాలి. దానికి లైటింగ్ చాలా ముఖ్యం. అందుకే సన్నివేశానికి సంబంధించిన వాతావరణాన్ని మొత్తం లైటింగ్‌తో సృష్టించాం. అప్పుడు కంటిన్యూటీ మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. కొన్ని సన్నివేశాలకు లైటింగ్ సృష్టించడానికి రెండు మూడు రోజులు పట్టేది. ► ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పలు షేడ్స్‌లో ఉంటుంది. కథకు తగ్గట్టు క్యారెక్టర్ మారినప్పుడల్లా లైటింగ్ కూడా మార్చాలి. మామూలుగా ఏ సినిమాకైనా 4కెడబ్లు్య (కిలో వాట్స్), 6కెడబ్లు్య లేకపోతే 9కెడబ్లు్య లైటింగ్ వాడతాం. కానీ, ‘సాహో’కి మాత్రం హై ఇంటెన్సిటీ లైటింగ్ వాడాం. 16కెడబ్లు్య నుంచి 18కెడబ్లు్య లైటింగ్ వాడాం. దాన్నిబట్టి ఈ కథ మైలేజ్‌ని ఊహించుకోవచ్చు. చెప్పాలంటే సినిమా మొత్తం లైటింగ్, షాడో ఓరియంటెడ్‌గా ఉంటుంది. కథకు, సినిమాటోగ్రఫీకి వారధిలా లైటింగ్ నిలిచిందని చెప్పొచ్చు. ► ఈ సినిమాకు ఒకటి రెండు కాదు కొత్త కొత్త కెమెరా పరికరాలు చాలా ఉపయోగించాం. సుమారు 7–8 కెమెరా హెడ్స్‌ను వాడాం. ఈవో కార్, స్కార్పియో రిమోట్ హెడ్ కెమెరాలు, స్పెషల్ జీఎఫ్8 కెమెరాలు, 2 జిమ్మీ జిబ్స్, మాక్సిమస్ కెమెరా హెడ్ (అన్నింటి కంటే కొంచెం ఖరీదైన పరికరం ఇది). వెబ్రేషన్స్‌ను అదుపులో ఉంచే జింబల్ హ్యాండ్ కెమెరాలు, చాప్‌మ్యాన్ డాలీ, జీఎఫ్ఎమ్ క్రేన్ ఇవన్నీ ఉపయోగించాం. హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్నీ బేట్స్‌తో సంభాషించి కొన్ని పరికరాలను జర్మనీ నుంచి తీసుకువచ్చాం. సన్నివేశానికి అనుగుణంగా, క్వాలిటీకి రాజీపడకుండా కెమెరాలు వాడాం. ► అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు ప్రతిరోజు సెట్లో 14 కెమెరాలు వరకూ ఉండేవి. మెయిన్ కెమెరాలు 7, ఇతర కెమెరాలు 7. సుమారు 25 రోజులు ఆ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించాం. నా టీమ్ మొత్తం 60 మంది. అబుదాబి షెడ్యూల్లో దాదాపు 80మంది కెమెరా డిపార్ట్‌మెంట్‌కే వర్క్ చేశారు. ఫోకస్ పుల్లర్స్, లైటింగ్ డిపార్ట్మెంట్, క్రేన్స్ ఇలా ఒక్కో విభాగం చూసుకున్నారు. అందులో 20 శాతం ఫారిన్ వాళ్లు కూడా పని చేశారు. ఫారిన్ వాళ్లతో పని చేసే సమయంలో ఓ ఇబ్బంది ఉంది. అదేంటంటే కమ్యూనికేషన్. ఒక్కో డిపార్ట్మెంట్కు టెక్నికల్ పదాలు ఒక్కోలా ఉంటాయి. యాక్షన్ వాళ్ల టెక్నికల్ పదాలు ఒకలా ఉంటాయి. కెమెరా వాళ్లవి ఒకలా ఉంటాయి. వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పడం కూడా చిన్న చాలెంజే (నవ్వుతూ). ► ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నలిగిపోయినవన్నీ ఒరిజినల్ ట్రక్కులు, కార్లు. ముందు డమ్మీలతో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ కార్స్, ట్రక్స్‌ని బద్దలు కొట్టారు. సినిమాలో ఎంత మోతాదులో యాక్షన్ ఉందో.. అంతే ప్రాముఖ్యత లవ్‌స్టోరీకి కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలకు ఒక మూడ్ ఉంటుంది. ప్రేమ సన్నివేశాలు ఒక మూడ్. ఈ వ్యత్యాసాన్ని స్క్రీన్ మీద చూపించడం చాలా ఎంజాయ్ చేశాను. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ► అబుదాబి ఫైట్ ఎపిసోడ్ కాకుండా గన్‌ఫైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డమ్మీ బులెట్స్‌తో షూట్ చేసినప్పటికీ ఈ ఎఫెక్ట్ కొత్తగా ఉంటుంది. కెమెరా మూమెంట్స్ అన్నీ గన్ పాయింట్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. అటు కెమెరాకి ఇటు మాకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ఫైట్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► భారీ యాక్షన్ సినిమా చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనివార్యం. కానీ మే మాత్రం ఎవరి లైఫ్‌నీ రిస్క్ చేయదలచుకోలేదు. యాక్షన్ సన్నివేశాల్లో కారు 150 కి.మీ. ల వేగంతో వెళ్తుందంటే అంత స్పీడ్‌తో కెమెరా ఫాలో కానక్కర్లేదు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఉపయోగించుకున్నాం. అలా టెక్నాలజీ హెల్ప్‌తో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. 225 రోజులు వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ ఒక్క కెమెరా పరికరానికి డ్యామేజ్ జరగలేదు. అదే పెద్ద విశేషం. పెద్ద పెద్ద ట్రక్కులను, కార్లను మాత్రమే డ్యామేజ్ చేశాం (నవ్వుతూ). టోటల్‌గా ‘సాహో’ మాకో మంచి అనుభూతి. రేపు ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి అవుతుంది. ► అబుదాబి వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎండ 45 డిగ్రీలు పైనే. అబుదాబి షెడ్యూల్లో చాలామంది వడదెబ్బకు గురయ్యారు. మాలో కొంతమందికి చర్మం ఊడొస్తుండేది. అనూహ్యంగా ఇసుక తుఫానులు కూడా వస్తుండేవి. అలాంటి సమయాల్లో మమ్మల్ని మేం కాపాడుకుంటూనే మా ఖరీదైన కెమెరాలను కూడా జాగ్రత్త చేసేవాళ్లం. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడతాం. అవుట్‌పుట్ చూశాక ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. ► ఈ సినిమా చిత్రీకరణకు 230 రోజులు పట్టింది. అది కూడా 8 రోజులు టెస్ట్ షూట్, 50 రోజుల లైటింగ్ అరేంజ్‌మెంట్‌ను మినహాయించి. ► ‘సాహో’ కోసం సుమారు 60 సెట్లను ఏర్పాటు చేశారు. ఈ సెట్లన్నీ హైదరాబాద్, పూణే, ముంబై, అబుదాబి, యూరోప్‌లో వేశారు. ► 350 కోట్ల బడ్జెట్లో కెమెరా డిపార్ట్మెంట్కు కేటాయించిన బడ్జెట్ సుమారు 25 కోట్లు (కెమెరామేన్ల రెమ్యూనరేషన్లు మినహాయించి). – గౌతమ్ మల్లాది -
మా ఊరిని చూపించాలనుంది
‘‘కెమెరా, చక్కటి కథనం చాలు అద్భుతాలు సృష్టించడానికి’’ అంటారు సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు. ఇంతకీ ఎవరీ వేణు అంటే షాంగై ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ అందుకున్న తొలి భారతీయ కెమెరామేన్. అనుభవం ఒక్క సినిమానే. అదీ గారో భాషలో తీసిన మేఘాలయ సినిమా. రాజయ్యపల్లి, వరంగల్‌లో పుట్టిన వేణు ఆచార్యకి పదో తరగతి నుంచి కెమెరామేన్ అవాలనే కోరిక ఉండేది. ‘‘చిన్నప్పటి నుంచే నాకు డ్రాయింగ్ మీద ఆసక్తి ఉండేది. గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పను కానీ నాకు ఆర్ట్స్ మీద ఆసక్తి ఉందని అర్థమైంది. ఓసారి హైదరాబాద్ జెయన్‌టీయూ నుంచి కొందరు స్టూడెంట్స్ మా ఊరు వచ్చారు. ఆసక్తి ఉంటే ఆర్ట్స్ కాలేజీలో చేరి సినిమాటోగ్రాఫర్ కావచ్చని సలహా ఇచ్చారు. అలాగే చేశాను’’ అని బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ షాంగై ఫిల్మ్‌ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 15 నామినేషన్లలో ‘మా.అమా’ అనే చిత్రానికి వేణు ఈ అవార్డు పొందారు. ‘‘మేఘాలయా చూడటానికి అద్భుతంగా ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏం మా సినిమాలో లేవు. కేవలం 8 లక్షల్లో సినిమా తీశాం. డోమ్నిక్ సంగ్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అందరూ కెమెరాకు కొత్తవాళ్లే కావడం విశేషం. ఇంతకుముందు ‘జెర్సీ’ సినిమాకు సెకండ్ యూనిట్ కెమెరామేన్‌గా కూడా చేశాను. త్వరలోనే దర్శకత్వం కూడా చేయాలని, మా ఊరిని, అక్కడి ప్రజలను చూపించాలనుంది. అవార్డు తీసుకొని ఇంటికి వెళ్లగానే అమ్మ చిన్నగా నవ్వి ఇంతకీ తిన్నావా? అని అడిగింది. జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అనిపించింది నాకు’’ అన్నారు వేణు. -
నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను
‘స్వామి రారా, దోచెయ్, కొత్తజంట, బాబు బంగారం’ వంటి చిత్రాలకు కెమెరామేన్‌గా మంచి మార్కులు అందుకున్నారు రిచర్డ్ ప్రసాద్. తాజాగా ఆయన ఛాయాగ్రాహకుడిగా చేసిన చిత్రం ‘ఓ బేబీ’. సమంత లీడ్ రోల్లో నందనీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిచర్డ్ మాట్లాడుతూ– సినిమా అనేది ఎమోషన్స్ కలయిక కాబట్టి నా చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాను. నాన్న రిజిస్ట్రార్‌గా పని చేసేవారు. అమ్మ టీచర్. ఆమె తన జాబ్‌కి రిజైన్ చేసి ఇంటి వ్యవహారాలను చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడ లేరు. చనిపోయారు. మా సిస్టర్ను నా స్నేహితుడే పెళ్లి చేసుకున్నాడు. మా బావగారు కూడా సినిమాటోగ్రాఫర్. నేను విజువల్ కమ్యూనికేషన్స్ చదివాను. అందులో జర్నలిజం, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ అన్నీ ఉండేవి. చదువు పూర్తి చేసుకున్న తర్వాత జయ టీవీలో పార్ట్ టైమర్‌గా జాయిన్ అయ్యాను. జయ టీవీ వెబ్‌సైట్‌ను నేనే స్టార్ట్ చేశాను. వెబ్ డిజైనింగ్ చేసేవాడిని. ఓ సారి స్పీల్బర్గ్ `సిల్వస్టర్ ` సినిమా చూశాను. అప్పుడు డైరెక్టర్ కావాలనుకున్నాను కానీ.. నాకు డైరెక్షన్ కంటే ఫోటోగ్రఫీ అంటేనే ఆసక్తిఉందని గ్రహించాను. అన్నిక్రాఫ్ట్స్ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. అందువల్ల సినిమాటోగ్రఫీలో కోర్సు చేయాలనుకున్నాను. అంత కంటే ముందే నేను చదువుకునే రోజుల్లో ఎడిటింగ్‌పై పట్టు సాధించాను. ఎడిటింగ్ అవగాహన ఉంటే సీన్ డివిజన్, సౌండింగ్ అన్ని తెలుస్తాయి. నేను ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ అనే భావనతో కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ అనే భావనతో పనిచేస్తాను. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఎమోషన్‌ను ఎలా క్యారీ చేస్తారనే దాన్ని అబ్జర్వ్ చేసేవాడిని. కానీ పూర్తి ఫోకస్ అంతా ఫోటోగ్రఫీపైనే ఉండేది. నేను కోర్సు పూర్తి చేయగానే కమర్షియల్ యాడ్స్‌కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాను. ఓసారి థియేటర్లో పాటల రచయిత కృష్ణ చైతన్యతో పరిచయం ఏర్పడింది. అక్కడ నుండి సుధీర్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ వారితో కలిసి షార్ట్ ఫిలింస్‌కు పనిచేస్తూ వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. తొలిసారి `స్వామిరారా`తో సినిమాటోగ్రాపర్‌గా మారాను. తర్వాత కొత్తజంట, దోచెయ్, బాబుబంగారం సినిమాలకు పనిచేశాను. `దోచెయ్`లో నా వర్క్ చూసిన ఎన్టీఆర్‌గారు, సుకుమార్‌గారు ..`నాన్నకు ప్రేమతో` సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమా లండన్ షూట్ చేయాలి. నేను రెండు సార్లు వీసాకు అప్లై చేశాను. కానీ రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది. వీసా ఉండుంటే ఎన్టీఆర్ వంటి స్టార్‌తో పనిచేసే అవకాశం దక్కి ఉండేది. మిస్ అవడం నా దురదృష్టం. డైరెక్షన్ పరంగా నాకు స్పీల్బర్గ్ అంటే చాలా ఇష్టం. సినిమాటోగ్రఫీ పరంగా ఇద్దరినీ బాగా ఇష్టపడతాను. క్రిస్టోఫర్ డైల్‌గారంటే చాలా ఇష్టం. అలాగే పి.ఎస్.వినోద్‌గారు, రత్నవేలుగారు కెమెరావర్క్ బాగా నచ్చుతాయి. నేను సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తాను. అలాగే మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటాను. ఎందుకంటే సినిమా అంటే అన్నింటి కలయికే అని నా ఉద్దేశం. `ఓ బేబీ` సినిమా విషయానికి వస్తే ప్రస్తుత సమయంలో జరిగే ఫాంటసీ మూవీ. కాబట్టి కలర్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలు వహించాలి. వారు వేసుకునే డ్రెస్‌ను బేస్ చేసుకుని టోన్ ఉండేలా కేర్ తీసుకున్నాను. సాధారణంగా టోన్ ఆధారంగా డ్రెస్ సెలక్ట్ చేసుకుంటారు. కానీ మేం రివర్స్‌గా వెళ్లాం. మన సినిమాల్లో కెమెరా స్టైల్ కొరియన్, ఫిలిఫైన్, థాయ్ మూవీస్ స్టైల్లో ఉంటాయి. -
ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా ఉంటుంది
‘‘నేను తెలుగువాణ్ణే. మా పూర్వీకులు తమిళనాడుకి వలస వెళ్లిపోవడంతో అక్కడే పుట్టి పెరిగాను. ఎన్.కె.ఏకాంబరంగారి వద్ద అసిస్టెంట్‌గా పని చేశాను. దర్శకుడు షాజీ కైలాస్ నన్ను కెమెరామేన్‌గా పరిచయం చేశారు. నేను చెన్నైలో ఉన్నా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అని కెమెరామేన్ జేడీ రామతులసి అన్నారు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. అశోక్ కుమార్ దర్శకత్వంలో ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కెమెరామేన్‌గా పనిచేసిన జేడీ రామతులసి మాట్లాడుతూ– ‘‘నా బంగారు తల్లి’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం అయ్యాను. రాజేష్ టచ్‌రివర్ రూపొందించిన ఆ చిత్రం ద్వారా నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘రక్తం’ చిత్రానికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నాకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. ‘మౌనమే ఇష్టం’ విషయానికొస్తే.. అశోక్ కుమార్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్. ప్రతి ఫ్రేమ్ తన ఆర్ట్ వర్క్‌లాగే ఉండాలనుకుంటారు. అలెక్సా కెమెరాను ఉపయోగించి దర్శకుడి అభిరుచికి అనుగుణంగా ప్రతి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లాగా తెరకెక్కించాం. ఆయన పట్టుదల చూసేకొద్దీ మాలో ఉత్సాహం పెరిగేది. ఈ చిత్రం నా కెరీర్లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. అలాగే తెలుగు, ఒడియా భాషల్లో రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పట్నఘడ్’ అనే చిత్రానికీ పనిచేశా. ఆ చిత్రం కూడా అద్భుతం సృష్టించబోతోంది’’ అన్నారు. -
చిన్న బ్రేక్ తర్వాత!
కుమారుడు కార్తికేయ పెళ్లి పనులు పూర్తి కావడంతో చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్ బిజీలో పడిపోయారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌ను యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ చేసిన టీమ్ ఈ షెడ్యూల్లో ఏం చిత్రీకరించనున్నారో తెలియాలి. ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఫస్ట్ సినిమా మాదే రాజమౌళి, కెమెరామేన్ సెంథిల్ కుమార్లది సూపర్ హిట్ కాంబినేషన్. రాజమౌళి తెరకెక్కించే చిత్రాలన్నింటికీ దాదాపు సెంథిలే కెమెరామేన్. వీళ్ల కాంబినేషన్లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సరికొత్త కెమెరాలను ఉపయోగించనున్నారట సెంథిల్. ‘‘అర్రీ అలెక్సా ఏఆర్ కెమెరాతో, అర్రీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్‌తో ‘ఆర్ఆర్ఆర్’ను షూట్ చేయబోతున్నాం. ఇండియాలో ఈ కెమెరాలతో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం మాదే’’ అని పేర్కొన్నారు సెంథిల్. సెంథిల్ కుమార్ -
జీవన్
తెలుగు నటుల్లో జీవన్‌ను సిఎస్సార్తో పోల్చవచ్చా? ఆ రూపం, మాట విరుపు, చూపులో విషం... ప్రేక్షకులకు భయం కలిగించిన హిందీ విలన్లలో జీవన్ ఒకడు. పుట్టుకతోనే తల్లిని కోల్పోయాడు. మూడేళ్ల వయసుకే తండ్రిని కోల్పోయాడు. మొత్తం 24 మంది సంతానంలో ఇతను 24వ వాడట. పాకిస్తాన్లో వీళ్లది కలిగిన కుటుంబం. కాని సినిమాల పిచ్చితో చేతిలో 26 రూపాయలు పట్టుకుని 18 ఏళ్ల వయసులో లాహోర్ నుంచి బొంబైకి పారిపోయి వచ్చాడు. షోలేకు కెమెరామేన్‌గా పని చేసిన ద్వారకా ద్వివేచాతో కలిసి స్టూడియోల్లో రిఫ్లెక్టర్లు మోసేవాడు. తర్వాత యాక్టర్ అయ్యాడు. హిందీ సినిమాల్లో ఆ మాటకొస్తే భారతీయ సినిమాల్లో 60సార్లు నారదముని పాత్ర పోషించిన నటుడు జీవన్లా మరొకడు లేడు. ‘మేలా’ ,‘కానూన్’, ‘నయాదౌర్’, ‘వక్త్’ వంటి సినిమాలు జీవన్‌కు చాలా పేరు తెచ్చాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, నసీబ్ వంటి సినిమాల్లో కూడా కనిపించాడు. బాలీవుడ్లో క్రమశిక్షణ కలిగిన నటుడిగా పేరు. మరో విలన్ కిరణ్ కుమార్ ఇతని కుమారుడే.