నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను | Naga Chaitanya recommends Nenu Eyes to Samantha | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

Published Fri, Jul 19 2019 6:17 AM | Last Updated on Fri, Jul 19 2019 12:41 PM

Naga Chaitanya recommends Nenu Eyes to Samantha - Sakshi

రిచర్డ్‌ ప్రసాద్‌

‘స్వామి రారా, దోచెయ్, కొత్తజంట, బాబు బంగారం’ వంటి చిత్రాలకు కెమెరామేన్‌గా మంచి మార్కులు అందుకున్నారు రిచర్డ్‌ ప్రసాద్‌. తాజాగా ఆయన ఛాయాగ్రాహకుడిగా చేసిన చిత్రం ‘ఓ బేబీ’.  సమంత లీడ్‌ రోల్‌లో నందనీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిచర్డ్‌ మాట్లాడుతూ– సినిమా అనేది ఎమోష‌న్స్ క‌ల‌యిక కాబ‌ట్టి నా చుట్టూ జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని గ‌మ‌నిస్తూ ఉంటాను. నాన్న రిజిస్ట్రార్‌గా పని చేసేవారు. అమ్మ టీచ‌ర్‌. ఆమె త‌న జాబ్‌కి రిజైన్ చేసి ఇంటి వ్య‌వ‌హారాల‌ను చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడ లేరు. చనిపోయారు. మా సిస్ట‌ర్‌ను నా స్నేహితుడే పెళ్లి చేసుకున్నాడు. మా బావ‌గారు కూడా సినిమాటోగ్రాఫ‌ర్‌. నేను విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్స్ చదివాను. అందులో జ‌ర్న‌లిజం, ఫోటోగ్ర‌ఫీ, పెయింటింగ్ అన్నీ ఉండేవి. చ‌దువు పూర్తి చేసుకున్న త‌ర్వాత జ‌య టీవీలో పార్ట్ టైమ‌ర్‌గా జాయిన్ అయ్యాను. జ‌య టీవీ వెబ్‌సైట్‌ను నేనే స్టార్ట్ చేశాను. వెబ్ డిజైనింగ్ చేసేవాడిని. ఓ సారి స్పీల్‌బ‌ర్గ్ `సిల్వ‌స్ట‌ర్ ` సినిమా చూశాను. అప్పుడు డైరెక్ట‌ర్ కావాల‌నుకున్నాను కానీ.. నాకు డైరెక్ష‌న్ కంటే ఫోటోగ్ర‌ఫీ అంటేనే ఆస‌క్తిఉంద‌ని గ్ర‌హించాను. అన్నిక్రాఫ్ట్స్ తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉండేది. అందువ‌ల్ల సినిమాటోగ్ర‌ఫీలో కోర్సు చేయాల‌నుకున్నాను. అంత కంటే ముందే నేను చదువుకునే రోజుల్లో ఎడిటింగ్‌పై ప‌ట్టు సాధించాను. ఎడిటింగ్ అవ‌గాహ‌న ఉంటే సీన్ డివిజ‌న్, సౌండింగ్ అన్ని తెలుస్తాయి.
 
 నేను ప్ర‌తి సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ అనే భావ‌న‌తో కాకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అనే భావ‌న‌తో పనిచేస్తాను. ఒక్కొక్క డైరెక్ట‌ర్ ఒక్కొక్క ఎమోష‌న్‌ను ఎలా క్యారీ చేస్తార‌నే దాన్ని అబ్జ‌ర్వ్ చేసేవాడిని. కానీ పూర్తి ఫోక‌స్ అంతా ఫోటోగ్ర‌ఫీపైనే ఉండేది. నేను కోర్సు పూర్తి చేయ‌గానే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను. ఓసారి థియేట‌ర్‌లో పాట‌ల ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అక్క‌డ నుండి సుధీర్ వ‌ర్మ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక్క‌డ వారితో క‌లిసి షార్ట్ ఫిలింస్‌కు ప‌నిచేస్తూ వ‌చ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. తొలిసారి `స్వామిరారా`తో సినిమాటోగ్రాప‌ర్‌గా మారాను. త‌ర్వాత కొత్త‌జంట‌, దోచెయ్‌, బాబుబంగారం సినిమాల‌కు ప‌నిచేశాను. `దోచెయ్‌`లో నా వ‌ర్క్ చూసిన ఎన్టీఆర్‌గారు, సుకుమార్‌గారు ..`నాన్న‌కు ప్రేమ‌తో` సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. సినిమా లండ‌న్ షూట్ చేయాలి. నేను రెండు సార్లు వీసాకు అప్లై చేశాను. కానీ రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది. వీసా ఉండుంటే ఎన్టీఆర్ వంటి స్టార్‌తో ప‌నిచేసే అవ‌కాశం దక్కి ఉండేది. మిస్ అవ‌డం నా దుర‌దృష్టం. 

డైరెక్ష‌న్ ప‌రంగా నాకు స్పీల్‌బ‌ర్గ్ అంటే చాలా ఇష్టం. సినిమాటోగ్ర‌ఫీ ప‌రంగా ఇద్ద‌రినీ బాగా ఇష్ట‌ప‌డ‌తాను. క్రిస్టోఫ‌ర్ డైల్‌గారంటే చాలా ఇష్టం. అలాగే పి.ఎస్‌.వినోద్‌గారు, ర‌త్న‌వేలుగారు కెమెరావర్క్ బాగా న‌చ్చుతాయి. నేను సినిమాలు ఎక్కువ‌గా చూస్తుంటాను. భాష‌తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తాను. అలాగే మ‌న చుట్టూ జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని బాగా అబ్జ‌ర్వ్ చేస్తుంటాను. ఎందుకంటే సినిమా అంటే అన్నింటి క‌ల‌యికే అని నా ఉద్దేశం. `ఓ బేబీ` సినిమా విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుత స‌మ‌యంలో జ‌రిగే ఫాంట‌సీ మూవీ. కాబ‌ట్టి క‌ల‌ర్స్ ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. వారు వేసుకునే డ్రెస్‌ను బేస్ చేసుకుని టోన్ ఉండేలా కేర్ తీసుకున్నాను. సాధార‌ణంగా టోన్ ఆధారంగా డ్రెస్ సెల‌క్ట్ చేసుకుంటారు. కానీ మేం రివ‌ర్స్‌గా వెళ్లాం. మ‌న సినిమాల్లో కెమెరా స్టైల్ కొరియ‌న్‌, ఫిలిఫైన్, థాయ్ మూవీస్ స్టైల్లో ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement