ఫన్‌ రైడ్‌ | Samantha new movie Oh Baby release date confirmed | Sakshi
Sakshi News home page

ఫన్‌ రైడ్‌

Jun 2 2019 5:08 AM | Updated on Jun 2 2019 5:08 AM

Samantha new movie Oh Baby release date confirmed - Sakshi

సమంత

వెండితెరపై సమంత ఉన్నప్పుడు థియేటర్స్‌లోని ఆడియన్స్‌కు ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు. ఆ ఎంజాయ్‌మెంట్‌ను మరోసారి ఆడియన్స్‌కు అందించడానికి సమంత రెడీ అయ్యారు. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబి’. సౌత్‌ కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. డి. సురేశ్‌బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్‌ హు, థామస్‌ కిమ్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల, యువరాజ్‌ కార్తికేయన్, వంశీ బండారు సహ నిర్మాతలు. ‘ఓ బేబి’ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్, టీజర్‌లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫన్‌ రైడర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గడపాలనే విషయాలను ఆలోచింపజేసే కోణంలో ఈ సినిమాను నందినీ రెడ్డి రూపొందించారు’’ అని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. సీనియర్‌ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేశ్, తేజ సజ్జ, ప్రగతి తదితరులు నటించిన ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. విజయ్‌ డొంకాడ, దివ్యా విజయ్‌ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement