‘‘పెదకాపు 1’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ వీవీ వినాయక్ చూశారు. విజువల్స్ ఆయనకు బాగా నచ్చడంతో పీసీ శ్రీరామ్‌గారితో నన్ను పోల్చారు. అయితే పీసీ శ్రీరామ్‌గారితో పోల్చుకునేటంత గొప్ప వ్యక్తిని కాదు నేను. పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్ స్వామి, విన్సెంట్ (ఛాయాగ్రాహకులు).. వాళ్లంతా గొప్పవాళ్లు’’ అని కెమెరామేన్ ఛోటా కె. నాయుడు అన్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా చేసిన ఛోటా కె.నాయుడు విలేకరులతో పంచుకున్న విశేషాలు...
► ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో శ్రీకాంత్ అడ్డాల, నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తన ప్రతి సినిమా కథ నాకు చె΄్తాడు. ఇద్దరం కలసి చేద్దామనుకుంటాం కానీ ‘పెదకాపు 1’కి కుదిరింది. తన సినిమాల్లాగానే శ్రీకాంత్ చాలా కూల్‌గా ఉంటాడు. తనని చూస్తే నాకు కె.విశ్వనాథ్‌గారిలా అనిపిస్తారు. కూల్‌గా ఉండే తను ‘పెదకాపు 1’ లాంటి చిత్రం చేసి, ఇంత మంచి ఔట్‌పుట్ ఇవ్వడం నాకు షాక్ అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలకి నటుడిగా ఇది తొలి చిత్రమైనా సింగిల్ టేక్‌లో చేసేసేవాడు.. తను నటించిన ప్రతి సీన్‌ని మా నిర్మాత రవీందర్ రెడ్డిగారు డైరెక్ట్ చేశారు.
► ‘పెదకాపు 1’ కథ 1983 నేపథ్యంలో జరుగుతుంది. ఈ కథ కొత్త ΄్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్‌ని డిమాండ్ చేసింది.. దాన్ని తీసుకురావడం నాకు సవాల్‌గా అనిపించింది. ఈ విషయంలో క్రెడిట్ దర్శకుడిదే.
► నేనెప్పుడూ హీరో స్థానానికి గౌరవం ఇస్తాను. స్టార్ హీరోనా, పెద్ద హీరోనా, చిన్న హీరోనా అని చూడను. విరాట్‌కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. హీరోయిన్ ప్రగతికి కూడా మొదటి సినిమా అయినా చాలా బాగా చేసింది. నటి అనసూయ కూడా తన పాత్రని మేము అనుకున్నదానికంటే బాగా చేసింది.. మిక్కీ జె.మేయర్ ఇలాంటి చక్కని నేపథ్య సంగీతం ఇవ్వడం నన్ను సర్‌ప్రైజ్ చేసింది.
► ‘పెదకాపు 1’ ని రవీందర్ రెడ్డిగారు కాకుండా మరో నిర్మాత అయితే ఐదారు కోట్లలో సినిమా తీయమని చెప్పేవారు. కానీ, ఈ కథ ముప్పై నలభై కోట్లు డిమాండ్ చేస్తుంది. ఆయన కాబట్టి ఇంత భారీ బడ్జెట్‌తో తీశారు. పైగా తన బావమరిదిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. ‘పెదకాపు 2’ చిత్రం కూడా ఉంటుంది.
► ‘పెదకాపు 1’ కోసం 1983 నాటి వాతావరణం సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. ఈ మూవీలో హీరో, అతని స్నేహితులు జెండా కర్ర పాతే సన్నివేశం చిత్రీకరించడం నా కెరీర్‌లో అద్భుతం. నేను చాలా గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది. నెక్ట్స్ చిరంజీవిగారి 157వ సినిమా చేస్తున్నాను.. నవంబర్‌లో షూటింగ్ ్రపారంభమవుతుంది.
వాళ్లంతా గొప్పవాళ్లు.. నేను కాను
Published Thu, Sep 14 2023 1:34 AM | Last Updated on Thu, Sep 14 2023 1:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment