నందమూరి తారకరత్న ఇకలేరన్న విషయాన్ని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నం తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు.
మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా కూడా పనిచేశారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒకవైపు చదువుకుంటూనే కెమెరామెన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment