Nandamuri Mohan Krishna
-
తారకరత్న తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి తారకరత్న ఇకలేరన్న విషయాన్ని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నం తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా కూడా పనిచేశారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒకవైపు చదువుకుంటూనే కెమెరామెన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన. -
సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష
తెలుగు సినిమా రంగంలో రచనలో అగ్రగణ్యుడు సముద్రాల రాఘవాచారి. 1930లలో రచయితగా కెరీర్ ఆరంభించి 30 ఏళ్ల పాటు మాటలు, పాటల రచయితగా, ‘బబ్రువాహన, వినాయక చవితి’ వంటి చిత్రాలతో దర్శకునిగా, ‘దేవదాసు, శాంతి’ వంటి చిత్రాలతో నిర్మాతగా తెలుగు సినిమా రంగంలో సీనియర్ సముద్రాలది ఓ చరిత్ర. జూలై 18న ఆయన 117వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ‘‘మా నాన్న ఎన్టీఆర్ సముద్రాలగారిని మాష్టారు అని పిలిచేవారు’’ అన్నారు నందమూరి మోహనకృష్ణ. రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ– ‘‘నేటి సినీ రచయితల వైభోగమంతా అప్పుడు వారు పెట్టిన భిక్ష. కె.వి రెడ్డి దర్శకత్వంలో నాగయ్యగారు నటించిన ‘యోగివేమన’ చిత్రంలోని మాటలు తూకం వేసినట్టుగా ఉంటాయి. అందులో ఆయన రచన ఈ రోజుకి రచయితలకు పెద్ద బాలశిక్ష. కొన్ని సందర్భాల్లో నా కలం ముందుకు సాగనప్పుడు ఆ సినిమా ఓ సారి చూస్తా’’ అన్నారు. ఈ జయంతి వేడుకలను నిర్వహించిన రైల్వే ఉన్నతాధికారి రవి పాడి మాట్లాడుతూ– ‘‘సముద్రాల గారు రాసిన పాటల్లోని ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి...’, ‘దేవదేవ ధవళాచల మందిర...’, ‘జనని శివకామిని..’ పాటలు తెలుగు శ్రోతలకు, తెలుగువారి సాంస్కృతిక జీవితంలో భాగమయ్యాయి. ఇక నుంచి ప్రతి ఏటా సముద్రాల వారి జయంతి రోజున ఒక ఉత్తమ సినీ సంభాషణల రచయితకు, ఉత్తమ సినీ గీత రచయితకు నగదు పురస్కారంతో సత్కరించాలనుకుంటున్నాం’’ అన్నారు. సముద్రాల సీనియర్ మనవడు, సముద్రాల జూనియర్ ఆఖరి కుమారుడు విజయ రాఘవాచారితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
నందమూరి మోహన్ కృష్ణ కుమార్తె వివాహం