
నందమూరి తారకరత్న పార్థివదేహన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం మహాప్రస్థానంలో నేడు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా
చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
గత నెల 27న నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం(ఫిబ్రవరి 18న) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని టాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు ఇటూ నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు చాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తారకరత్న మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.