
అల్లెన్ డీవియో
కరోనా వైరస్ కారణంగా ఇటీవలే పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్ కెమెరామేన్ అల్లెన్ డీవియో (77) కరోనా వల్ల మరణించారు. ‘ఈటీ’, ‘డి కలర్ పర్పుల్’, ‘ఎంపైర్ ఆఫ్ డి సన్’ వంటి పాపులర్ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేశారాయన. దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌తో ఎక్కువ సినిమాలు కలసి పని చేశారు అల్లెన్. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఐదుసార్లు ఆస్కార్ నామినేషన్ పొందారు అల్లెన్ డేవియో. 2007లో అమెరికన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆయనకు జీవిత సాఫల్యత పురస్కారాన్ని అందించింది.
Comments
Please login to add a commentAdd a comment