చిన్న బ్రేక్‌ తర్వాత! | SS Rajamouli’s RRR second schedule begins after son marrage | Sakshi
Sakshi News home page

చిన్న బ్రేక్‌ తర్వాత!

Published Tue, Jan 22 2019 3:14 AM | Last Updated on Tue, Jan 22 2019 3:14 AM

SS Rajamouli’s RRR second schedule begins after son marrage - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

కుమారుడు కార్తికేయ పెళ్లి పనులు పూర్తి కావడంతో చిన్న బ్రేక్‌ తర్వాత మళ్లీ షూటింగ్స్‌ బిజీలో పడిపోయారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.   పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఫస్ట్‌ షెడ్యూల్‌ను యాక్షన్‌ సన్నివేశాలతో స్టార్ట్‌ చేసిన టీమ్‌ ఈ షెడ్యూల్‌లో ఏం చిత్రీకరించనున్నారో తెలియాలి. ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట రాజమౌళి.

ఫస్ట్‌ సినిమా మాదే
రాజమౌళి, కెమెరామేన్‌ సెంథిల్‌ కుమార్‌లది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. రాజమౌళి తెరకెక్కించే చిత్రాలన్నింటికీ దాదాపు సెంథిలే కెమెరామేన్‌. వీళ్ల కాంబినేషన్‌లో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సరికొత్త కెమెరాలను ఉపయోగించనున్నారట సెంథిల్‌. ‘‘అర్రీ అలెక్సా ఏఆర్‌ కెమెరాతో, అర్రీ సిగ్నేచర్‌ ప్రైమ్‌ లెన్స్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను షూట్‌ చేయబోతున్నాం. ఇండియాలో ఈ కెమెరాలతో షూటింగ్‌ జరుపుకుంటున్న చిత్రం మాదే’’ అని పేర్కొన్నారు సెంథిల్‌.


సెంథిల్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement