Seattle Critics Award 2022: RRR Wins Seattle Critics Awards For Best Action Choreography - Sakshi
Sakshi News home page

Seattle Film Critics Society: ఆర్‌ఆర్‌ఆర్‌ ఫైట్స్‌కి అవార్డ్‌

Published Thu, Jan 19 2023 6:11 AM | Last Updated on Thu, Jan 19 2023 9:20 AM

Seattle Film Critics Society: RRR wins one more international award - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో అవార్డు చేరింది. సియాటెల్‌ ఫిలిం క్రిటిక్స్‌ సొసైటీ అవార్డ్స్‌లో బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది.

ఈ విషయాన్ని సదరు సొసైటీ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్‌ కోస్టాడినోవ్, నిక్‌ పావెల్, రాయిచో వాసిలెవ్‌ స్టంట్స్‌ కో ఆర్డినేటర్లుగా చేయగా, ప్రేమ్‌ రక్షిత్, దినేశ్‌ కృష్ణన్‌ స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేశారు. హాలీవుడ్‌ చిత్రాలు ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ అట్‌ ఒన్స్, ది నార్త్‌మేన్, టాప్‌ గప్‌: మ్యావరిక్‌’లతో పోటీపడి ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ అవార్డు దక్కించుకోవడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement