Choreography
-
Meenakshi Seshadri: అరవైలోనూ ఇరవై!
నృత్యానికి వయసు అడ్డు కాదని మరోసారి నిరూపించింది మాజీ బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. 60 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ కొరియోగ్రఫీతో నెటిజనులను ఆకట్టుకుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. క్లిష్టమైన ఫుట్‌వర్క్, హావభావాల వ్యక్తీకరణతో నెటిజనులను ఆకట్టుకుంది. ఆమె కాలాతీత అందం, క్లాసికల్ డాన్స్ పట్ల నిబద్ధతకు అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 1980లలో హీరో, మేరీ జంగ్, దామినిలాంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి భర్త, బిడ్డలతో అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ప్రారంభించి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించేది. ఆన్–స్క్రీన్ మీద కనిపించనప్పటికీ ఈ అందాల నటి సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. ‘అప్పుడు–ఇప్పుడూ’ అనే కాప్షన్‌తో పాత, కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. -
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్పెషల్ వీడియో!
ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్‌తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
Seattle Film Critics Society: ఆర్ఆర్ఆర్ ఫైట్స్‌కి అవార్డ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో అవార్డు చేరింది. సియాటెల్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సొసైటీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలెవ్ స్టంట్స్ కో ఆర్డినేటర్లుగా చేయగా, ప్రేమ్ రక్షిత్, దినేశ్ కృష్ణన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ ఒన్స్, ది నార్త్మేన్, టాప్ గప్: మ్యావరిక్’లతో పోటీపడి ‘ఆర్ఆర్ ఆర్’ అవార్డు దక్కించుకోవడం విశేషం. -
జిన్నాకి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సిన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 'జిన్నా' లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించాడట. ఈ సినిమాలోని ఓ పాటకు ఇప్పటికే ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించగా తాజాగా ఓ సాంగ్‌ను స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య స్టెప్స్ సమకూర్చాడు. హీరో విష్ణు, పాయల్, సన్నీలియోన్‌ల మధ్య సాగే ఓ పార్టీ సాంగ్‌కు ఆయన కొరియోగ్రఫి అందించినట్లు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. విష్ణు మంచుతో ఉన్న అనుబంధంతో గణేష్ ఆచార్య ఈ పాటలో కాలు కదపడం విశేషం. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండ ప్రభుదేవ, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లతో పాటలను రూపొందించి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేట్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తుండగా.. చోటా కే నాయుడా కెమెరా మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో ప్రభుదేవా..
Prabhu Deva Choreography In Chiranjeevi Godfather Movie: కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి చేతిలో ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మంగళవారం (మే 3) రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారని మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఇదివరకే తెలిపాడు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ప్రకటించాడు తమన్. చిరు-సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయనున్న సాంగ్‌ను ఇండియన్ మైఖేల్ డ్యాన్సర్‌గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు. ఇదివరకు అనేక చిరంజీవి చిత్రాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చిందేయడం, దీనికి తమన్ సంగీతం అందించడంతోపాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ యాడ్ కావడంతో ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పాట సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. చదవండి: సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి.. టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి Yayyyy !! ❤️ THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6 — thaman S (@MusicThaman) May 3, 2022 -
శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్
చిత్రలేఖనం అందరికీ తెలుసు. లీజా దినూప్ చేసేది నృత్య లేఖనం. శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ చేసి నృత్యకళను, చిత్రకళను వేదిక మీద సంగమకళగా ప్రదర్శిస్తోందామె. ఇలా చేస్తున్న ఒకే కళాకారిణి లీజా. అందుకే ఆమె పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ ‘చిత్రనర్తకి’ పరిచయం. తెలుగు వారి విశిష్ట సంప్రదాయ నృత్యం ‘కూచిపూడి’లో ‘తాళ చిత్ర నృత్యం’ అనే విభాగం ఉంది. అందులో చిత్రకారిణి నృత్యం చేస్తూ పాదాల కదలికతో బట్ట మీద పరిచిన రంగును చెదరగొడుతూ నర్తనం ద్వారా ఒక బొమ్మను గీస్తుంది. ఎంతో సాధన ఉంటే తప్ప ఈ విద్య సాధ్యం కాదు. ఇదే కూచిపూడిలో ‘సింహనందిని’ అనే నృత్యవిభాగం దుర్గపూజ సమయంలో నర్తకీమణులు ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో రంగు పరిచిన బట్ట మీద నర్తిస్తూ పాదాలతో సింహం బొమ్మ గీస్తారు. ఇది దుర్గాదేవిని ఆరాధించే ఒక పద్ధతిగా వ్యాఖ్యానిస్తారు. భారతీయ నృత్యకళల్లో వేరే నృత్యాలకు లేని విశిష్టత ఈ విధంగా కూచిపూడికి ఉంది. అయితే కేరళలోని కాసర్గోడ్ టౌన్‌కు సమీపంలో ఉండే పయ్యూర్ అనే ఊరికి చెందిన 30 ఏళ్ల లీజా దినూప్ భరతనాట్యం చేస్తూ వేదిక మీద సిద్ధంగా ఉంచిన కేన్వాస్ మీద దేవతల బొమ్మలను గీస్తూ నృత్య చిత్రాల సంగమ కళను ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతోంది. కన్నూర్ యూనివర్సిటీలో ఎం.ఏ భరతనాట్యం చేసిన లీజా ఆ తర్వాత తిరువనంతపురంలో బేచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆమె నృత్యం చేయగలదు... చిత్రకళను ప్రదర్శించగలదు. ఈ రెంటిని కలిపి తానొక ‘చిత్రనర్తకి’ని ఎందుకు కాకూడదు అనిపించింది. వెంటనే ఆమె ఆ కళను సాధన చేసింది. ‘రామాయణ గాధలను, శివ ఆరాధనను, రవివర్మ గీసిన చిత్రాలను కేన్వాస్ మీద పునఃప్రతిష్టిస్తూ నేను భరతనాట్యం చేస్తాను’ అని లీజా దినూప్ అంటుంది. వివాహం అయ్యి మూడేళ్ల పాప ఉన్న లీజా కేరళలో రాష్ట్ర, జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఏది జరిగినా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ఇప్పటికి ఆమె రాష్ట్రమంతా దాదాపుగా 50 చిత్రనర్తన ప్రదర్శనలు ఇచ్చింది. అంతే కాదు ఇలా చేసే ఏకైక చిత్రకారిణి కనుక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కింది. వేదిక మీద సంగీత బృందం రాగతాళాలు కొనసాగిస్తుండగా నృత్యం చేస్తూ మధ్య మధ్య కేన్వాస్ దగ్గరకు వస్తూ కుంచెతో ఆమె ఆ నృత్యంలో ఉన్న ఆధ్యాత్మిక, భక్తిభావాలకు తగిన బొమ్మను గీస్తుంది. ముఖ్యంగా రామాయణంలోని నవరసచిత్రాలను, గణేశ భక్తిని, స్త్రీ శక్తి రూపాన్ని ఆమె కేన్వాస్ మీద రంగుల్లో నాట్యం ద్వారా దేహంలో ప్రదర్శించి మెప్పు పొందుతోంది. ‘కళాత్మిక లలితకళాగృహం’ పేరుతో ఒక నటనాలయాన్ని ప్రారంభించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లీజా నుంచి చిత్రనృత్యాన్ని అభ్యసించే కొత్తతరం తయారవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లొచ్చని ఆశిద్దాం. -
పేరిణిలో ‘రజిత’
సాక్షి, నిర్మల్ అర్బన్: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రభుత్వ మ్యుజిక్ టీచర్‌గా పని చేస్తున్న ఎట్టెం రజిత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం వాస్తవ్యురాలు. నృత్య కళలోనే ప్రత్యేకత సంతరించుకున్న ‘పేరిణి’లో ఆమె కళాకారిణిగా, శిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నమ్మిన కళే తనకు ఉద్యోగాన్ని చూపించిందనే రజిత గర్వంగా చెబుతారు. వివాహానంతరం కూడా శిక్షణను కొనసాగించిన రజిత ఓవైపు డిప్లొమాలాంటి సర్టిఫికెట్ కోర్సులు చేస్తూనే మరోవైపు అనేక మందికి శిక్షణనిచ్చారు. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆంధ్రనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన రజిత పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ చేతుల మీదుగా నాట్యచూడామణి, ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ రమణాచారి చేతుల మీదుగా హంసవాణి అవార్డులను అందుకున్నారు. 2017 అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, విజయవాడ కళాక్షేత్రం వారి నాట్య కౌముది, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా కళాభూషణ, అసోంలోని సాలోరి ఆర్ట్స్ ఆకాడమీ వారి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పేరిణి నృత్యోత్సవంలో కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఉత్తమ నాట్యాచారిణి, బాంబేలో ప్లయింగ్ స్టెరో కంపెనీ వారి బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల్లో జిల్లా ఉత్తమ కళాకారిణిగా కలెక్టర్ ప్రశాంతి రజితకు అవార్డును అందజేశారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలో ఉత్తమ పేరిణి కళాకారిణిగా ప్రశంసాపత్రాలు అందుకున్న రజిత తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తున్నారు. -
బన్నీ సినిమాకు లేడీ కొరియోగ్రాఫర్
సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ సోల్జర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ తన సినిమాల్లో పాటల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంటాడు. తన డ్యాన్స్ లో వేరియేషన్ చూపించేందుకు నార్త్ నుంచి నృత్య దర్శకులను తీసుకుంటుంటాడు. అదే బాటలో తన తాజా చిత్రం కోసం ఓ లేడీ కొరియోగ్రాఫర్ తో కలిసి పనిచేస్తున్నాడు బన్నీ. జాతీయ అవార్డు సాధించిన నృత్య దర్శకురాలు వైభవీ మర్చంట్ బన్నీ నెక్ట్స్ సినిమాకు కొరియోగ్రాఫీ అందిస్తోంది. బాలీవుడ్ లో డోల్ బాజే, హమ్మ హమ్మ రీమిక్స్ లాంటి పాటలతో సెన్సేషన్ సృష్టించిన వైభవి బన్నీతో ఎలాంటి స్టెప్స్ వేయిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
కొరియోగ్రఫీ అవకాశం రావడం అదృష్టం
శ్రీకాకుళం కల్చరల్ : పట్టణానికి చెందిన అభినయ నృత్యకళానికేతన్ నృత్య దర్శకురాలు తిమ్మరాజు నీరజసుబ్రహ్మణ్యంకు కొరియోగ్రఫీగా అవకాశం వచ్చింది. ఈమె కొరియోగ్రఫీ చేసిన చిత్రం ఆడేపాడే తోల్బోమ్మ ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా గత నెల 30వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా విడుదల చేశారు. మెహెర్ బాబా ఆర్ట్‌క్రియేషన్స్ బ్యానర్‌పై మహిళలు మాత్రమే నటించిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం ‘ఆడేపాడే తోల్బోమ్మ’కు కొరియోగ్రఫీగా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని నీరజసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయని, వాటిలో టైటిల్ సాంగుకు తప్ప మిగిలిన పాటలకు కొరియోగ్రఫీ చేశానని తెలిపారు. శ్రీకాకుళం నుంచి మొట్ట మొదటిగా కొరియోగ్రఫీ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. పట్టణానికి చెందిన విద్యార్థినులు కె.సింధూశ్రీహర్షిత, జి.రామలక్ష్మిలు నృత్యాలు చేశారన్నారు. అలాగే ఎంబీ క్రియేషన్స్ వారి తదుపరి చిత్రానికి, జేజే ఆర్ట్స్ చెన్నై బ్యానర్‌పై నిర్మించబోతున్న తదుపరి చిత్రానికి కొరియోగ్రఫీ చేయబోతున్నట్టు ఆమె తెలిపారు. -
నృత్య రీతులు నేర్పించే.. కొరియోగ్రాఫర్
అప్‌కమింగ్ కెరీర్: మనిషి జీవితంలో ఒక భాగం.. నృత్యం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కాలు కదిపినవారే. మంచి సంగీతం వినిపించినప్పుడు తెలియకుండానే కాళ్లు, చేతులు ఆడిస్తాం. ఇది కూడా ఒకరకంగా నృత్యమే. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కెరీర్.. నాట్యాచార్యుడు(కొరియోగ్రాఫర్). నృత్యం నేర్పించేవారికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. డ్యాన్స్‌పై జనంలో అవగాహన పెరిగింది. దీన్ని ఒక కళగానే కాకుండా మానసిక, శారీరక సామర్థ్యాన్ని, ఆలోచనా శక్తిని పెంచే సాధనంగా చూస్తున్నారు. ఫిట్నెస్ సెంటర్లలోనూ డ్యాన్స్ ప్రవేశించింది. నగరాలు, పట్టణాల్లో ఎన్నో డ్యాన్స్ స్కూళ్లు వెలిశాయి. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్‌తోపాటు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకొనేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లోనూ కూచిపూడి, కథక్, భరతనాట్యం వంటి భారతీయ సంప్రదాయ నృత్యాలకు మంచి ఆదరణ ఉంది. సినిమాలు, టీవీ సీరియళ్లు, అడ్వర్టైజ్మెంట్లు, రియాలిటీ టీవీ షోలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య రీతులను సమకూర్చే కొరియోగ్రాఫర్లకు భారీ డిమాండ్ ఉంది. పాఠశాలల్లో చిన్నారులకు నృత్యం నేర్పించేందుకు కొరియోగ్రాఫర్లను నియమిస్తున్నారు. డ్యాన్స్ ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయం ఆర్జించొచ్చు. నాట్యంలో కనీసం 15 ఏళ్లు సాధన చేసిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించాలని ఈ రంగంలోని ప్రముఖ కళాకారులు సూచిస్తున్నారు. నాట్యాచార్యుడిగా పేరు తెచ్చుకోవాలంటే ప్రతిరోజూ కఠోరమైన సాధన చేయాలి. ఇందుకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇతరులను అనుకరించకుండా డ్యాన్స్‌లో తమదైన ముద్ర వేయాలంటే సృజనాత్మకత ప్రదర్శించాలి. కొత్త నృత్య రీతులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తుండాలి. అర్హతలు: నృత్యం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా విద్యార్హతలంటూ లేవు. డ్యాన్స్‌పై సహజమైన ఆసక్తి, అభిరుచి ఉన్నవారు ఇందులోకి ప్రవేశించొచ్చు. కొరియోగ్రఫీని ఫుల్‌టైమ్ ప్రొఫెషన్‌గా స్వీకరించాలనుకొనేవారు ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డ్యాన్స్ స్కూల్లో చేరితే మంచిది. వేరే కోర్సులు చదువుతూ ఖాళీ సమయాల్లో పార్ట్‌టైమ్‌గా కూడా డ్యాన్స్ నేర్చుకోవచ్చు. వేతనాలు: కొరియోగ్రాఫర్లకు ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ఆకర్షణీయమైన ఆదాయం లభిస్తోంది. ఫ్రెషర్లకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా వేతనం అందుతుంది. కొంత అనుభవం ఉన్న కొరియోగ్రాఫర్లు నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదించుకోవచ్చు. డ్యాన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు 1. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్: http://teluguuniversity.ac.in/ 2. వాసవి కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్-హైదరాబాద్ వెబ్సైట్: www.vcmdhyd.ac.in/ 3. కూచిపూడి ఆర్ట్ అకాడమీ వెబ్సైట్: www.kuchipudi.com/ 4. షియామక్ దావర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వెబ్సైట్: www.shiamak.com కొరియోగ్రఫీతో కెరీర్ గ్రోత్ ‘‘ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యాన్ని ఇచ్చేది డ్యాన్స్ ఒక్కటే. అందుకే కేజీ పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కొరియోగ్రఫీకి క్రేజ్ పెరుగుతోంది. సినిమాలు, టీవీ ఛానళ్లు, డ్యాన్స్ కాంపిటీషన్స దీనికి మరింత హోదాను తెచ్చిపెడుతున్నాయి. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఉన్నతంగా మలచుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. ఆసక్తికి క్రియేటివిటీ తోడైతే కెరీర్ గ్రోత్ సాధ్యం. మంచి వేతనాన్ని, సంతృప్తినిచ్చే కెరీర్.. కొరియోగ్రఫీ’’ - శేఖర్ మాస్టర్, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్