![Aata Sandeep Special choreography On Ayodhya Ram Mandir Ceremony - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/22/Aata-Sandeep-Special-choreography.jpg.webp?itok=H7t2KEmu)
ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు.
తాజాగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్‌తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment