బన్నీ సినిమాకు లేడీ కొరియోగ్రాఫర్ | Vaibhavi Merchant Dance Choreography for Allu Arjun | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమాకు లేడీ కొరియోగ్రాఫర్

Published Sat, Dec 2 2017 9:37 AM | Last Updated on Sat, Dec 2 2017 10:57 AM

Vaibhavi Merchant Dance Choreography for Allu Arjun - Sakshi

సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ సోల్జర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ  సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ తన సినిమాల్లో పాటల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంటాడు. తన డ్యాన్స్ లో వేరియేషన్ చూపించేందుకు నార్త్ నుంచి నృత్య దర్శకులను తీసుకుంటుంటాడు. అదే బాటలో తన తాజా చిత్రం కోసం ఓ లేడీ కొరియోగ్రాఫర్ తో కలిసి పనిచేస్తున్నాడు బన్నీ. జాతీయ అవార్డు సాధించిన నృత్య దర్శకురాలు వైభవీ మర్చంట్ బన్నీ నెక్ట్స్ సినిమాకు కొరియోగ్రాఫీ అందిస్తోంది. బాలీవుడ్ లో డోల్ బాజే, హమ్మ హమ్మ రీమిక్స్ లాంటి పాటలతో సెన్సేషన్ సృష్టించిన వైభవి బన్నీతో ఎలాంటి స్టెప్స్ వేయిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement