Vaibhavi
-
సంతానం సినిమాకి శింభు సంగీతం
తమిళసినిమా: అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలిగా అని అన్నారు నటుడు సంతానం. కామెడీ నుంచి హీరోగా మారిన ఈయన నటించిన తాజా చిత్రం చక్క పోడు పోడు రాజా. నటి వైభవి హీరోయిన్గా నటించిన ఇందులో వివేక్, వీటీవీ.గణేశ్, రోబోశంకర్ ముఖ్య పాత్రలు పోషించారు. వీటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీటీవీ.గణేశ్ నిర్మించిన ఈ చిత్రానికి జీఎల్.సేతురామన్ దర్శకత్వం వహించారు. సంచలన నటుడు శింబు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్నార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్తో ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. బుధవారం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోనున్న చక్క పోడు పోడు రాజా చిత్ర విలేకరుల సమావేశాన్ని మంగళవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సంతానం మాట్లాడుతూ ఇది 200 శాతం కమర్శియల్ అంశాలతో రూపొందిన చిత్రం అని తెలిపారు. వివేక్, వీటీవీ.గణేశ్, రోబోశంకర్, పవర్‌స్టార్ శ్రీనివాసన్ వంటి ప్రముఖ హాస్యనటులు నటించడంతో వినోదభరితంగానూ ఉంటుందన్నారు. చిత్ర పరిశ్రమ కష్టాల్లో ఉందని అంటున్నారని, నిజానికి అలాంటిదేమి లేదని సంతానం వ్యాఖ్యానించారు. ఇక్కడ శ్రమ ముఖ్యం అన్నారు. అందరూ ఎవరి బాధ్యతలను వారు బాధ్యతాయుతంగా శ్రమించి పనిచేస్తే నష్టం అనేదే రాదన్నారు. ఇటీవల కలకలం సృష్టిస్తున్న ఫైనాన్స్ విషయం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలిగా అని పేర్కొన్నారు. ప్రణాలికతో చిత్రాలను రూపొందిస్తే ఎవరికీ నష్టం వచ్చే అవకాశం ఉండదని, ప్రకృతి సిద్ధమైన ఆటంకాలతో చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగితే రుణ భారం పెరుగుతుందని, అలాంటి సమయాల్లో చేసిన రుణం విషయంలో చర్చించుకోవచ్చు గానీ, ప్రణాళిక లేకుండా చిత్రాలు చేసి ఆలస్యం చేసుకుని రుణభారం పెరిగిపోయిందంటే అది స్వయంకృతాపరాధమే అవుతుందన్నారు. నటుడు శింబు షూటింగ్‌ల విషయాల గురించి తనకు తెలియదు గానీ, ఈ చిత్రానికి అనుకున్న సమయంలోనే సంగీతాన్ని అందించారని అన్నారు. ఆయనపై ఇటీవల ఒక నిర్మాత చేసిన ఆరోపణల గురించి స్పందించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు బుధవారం జరగనున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై తనే బదులివ్వనున్నారని సంతానం పేర్కొన్నారు. -
బన్నీ సినిమాకు లేడీ కొరియోగ్రాఫర్
సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ సోల్జర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ తన సినిమాల్లో పాటల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంటాడు. తన డ్యాన్స్ లో వేరియేషన్ చూపించేందుకు నార్త్ నుంచి నృత్య దర్శకులను తీసుకుంటుంటాడు. అదే బాటలో తన తాజా చిత్రం కోసం ఓ లేడీ కొరియోగ్రాఫర్ తో కలిసి పనిచేస్తున్నాడు బన్నీ. జాతీయ అవార్డు సాధించిన నృత్య దర్శకురాలు వైభవీ మర్చంట్ బన్నీ నెక్ట్స్ సినిమాకు కొరియోగ్రాఫీ అందిస్తోంది. బాలీవుడ్ లో డోల్ బాజే, హమ్మ హమ్మ రీమిక్స్ లాంటి పాటలతో సెన్సేషన్ సృష్టించిన వైభవి బన్నీతో ఎలాంటి స్టెప్స్ వేయిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఆ విషయంలో రాజీపడను!
‘‘ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మూవీస్‌నే ఎందుకు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారు. మహేశ్, ప్రభాస్ ఇలా ఇండస్ట్రీలోని స్టార్ట్స్ అందరితో నటించాలని నాకు ఉంది. కానీ, పర్టిక్యులర్ రోల్స్ కావాలని నేనెవర్నీ అప్రోచ్ కాలేదు. నాకు వచ్చిన చాన్సుల్లో నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాను. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలన్నదే నా కోరిక’’ అన్నారు రష్మీ గౌతమ్. ఆది, వైభవీ శాండిల్య, బ్రహ్మజీ, రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. రష్మీ గౌతమ్ చెప్పిన విశేషాలు.. ► మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇందులో గ్లామరస్ రోల్ చేశాను. ఈ సినిమా అంతా నేను శారీస్‌లోనే కనిపిస్తాను. నా రోల్ ఫస్ట్ హీరోయిన్నా? లేక సెకండ్ హీరోయిన్నా? అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. క్యారెక్టర్ నాకు నచ్చింది. నైట్ షూట్స్ బోర్ కొట్టేశాయి. అందుకే, ఇకపై హర్రర్ మూవీస్‌లో నటించకూడదనుకుంటున్నా. ► దర్శకుడు ప్రభాకర్ ముందు నటుడు కాబట్టి సెట్లో మా పని ఈజీ అయ్యింది. ఆయన నటించి చూపించేవారు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే అది సినిమాలోని క్యారెక్టర్స్ పరంగానే ఉంటాయి. అయినా డైరెక్టర్స్ విజన్‌ని మనం నమ్మాలి. అల్లు అరవింద్‌గారు, ‘బన్నీ’ వాసు వంటి నిర్మాతల విజన్‌ను రెస్పెక్ట్ చేయాలి. ► డైరెక్టర్స్ నాకు కథ చెప్పినప్పుడు క్యారెక్టరైజేషన్ మాత్రమే ఆలోచిస్తాను. కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కాను. కంఫర్ట్‌గా ఉంటేనే వేసుకుంటాను. కాస్ట్యూమ్స్ సరిగా లేవని ఓ ఐటమ్ సాంగ్ వద్దనుకున్నాను. ► ప్రేక్షకులు చుస్తున్నారు కాబట్టే గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అయినా నాకు గ్లామర్ ఉంది... చూపిస్తున్నాను. నాకు తెలిసి నేనిప్పటి వరకు 30 పర్సెంట్‌కు మించి స్కిన్ షో చేయలేదు. ఈ రోజుల్లో బికినీ అనేది కామన్ అయిపోయింది. కొన్ని వెబ్‌సైట్స్‌లో నా గురించి ఏవేవో వార్తలు రాశారు. వారి దగ్గర ప్రూఫ్ ఉండదు. అవి పుకార్లని నాకు తెలుసు కాబట్టి, సైలెంట్‌గా ఉంటాను. ► సినిమాలు చేస్తున్నాను. టీవీ షోస్‌లోనూ కంటిన్యూ అవుతాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. -
తర్వాత నువ్వే
నువ్వు... నువ్వు... నువ్వు... తర్వాత నువ్వే అంటున్నారు ఆదీ సాయికుమార్. ఇంతకీ ఎవర్ని అంటున్నారు? అంటే.. ప్రస్తుతానికి నో ఆన్సర్. దసరాకి స్క్రీన్ మీద చూసుకోవాల్సిందే. ఆదీ సాయికుమార్ హీరోగా ప్రభాకర్. పి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 మూవీస్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. వైభవి, రేష్మి కథానాయికలు. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘వి4 బ్యానర్లో నిర్మిస్తున్న ఈ మొదటి సినిమా ద్వారా ప్రభాకర్. పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఆదీ సాయికుమార్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుçపుతున్నాం. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్‌రెడ్డి, హిమజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, ఎడిటింగ్: ఎస్.బి. ఉద్దవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి. -
ఆ పాపకు పేరుపెట్టిన ప్రధాని మోదీ
-
ఆ పాపకు పేరుపెట్టిన ప్రధాని మోదీ
వారణాసి : ఒక వ్యక్తిపై ఉన్న అభిమానంతో ఎంతోమంది తమకు పుట్టిన పాపలకు వారి పేర్లు పెడుతుండటం లేదా వారి ఆశీర్వాదాలు చిన్నారులకు ఇప్పించడం వంటివి చేస్తుంటారు. గుజరాత్ లోని ఓ మిర్జాపూర్ జంట కూడా ప్రధాని మోదీపై ఉన్న అమితమైన ఆరాధనతో, తమకు పుట్టిన పాపకు మోదీతో పేరు పెట్టించుకోవాలనుకున్నారు. వారి అభిలాషను ఓ లేఖ ద్వారా ప్రధానికి తెలియజేశారు. వెంటనే స్పందించిన ప్రధాని, వారికి పుట్టిన పాపకు తాను పేరు పెడుతున్నట్టు ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కాల్ చేశారు. "హలో, నేను నరేంద్రమోదీని, మీ భార్య విభ సింగ్ రాసిన ఉత్తరం నాకు అందింది. పాప పుట్టినందుకు శుభాకాంక్షలు. నా ఆశీస్సులు ఎల్లవేళలా మీ పాప తోడుంటాయి. పాప పేరు వైభవిగా నామకరణం చేస్తున్నా. ఈ పేరు తల్లిదండ్రుల ఇద్దరి పేర్ల కలయిక" అని విభ సింగ్ భర్త భరత్‌కు ఫోన్ లైన్లో తెలిపినట్టు అతను చెప్పాడు. ప్రధాని మోదీ నుంచి ఫోన్ రావడం ఒక్కసారిగా తమల్ని ఆశ్చర్యకితుల్ని చేసిందని మిర్జాపూర్ జిల్లా నయపురా హసిపురా గ్రామానికి చెందిన ఆ జంట ఆనందం వ్యక్తంచేస్తోంది. తన కూతురు చాలా అదృష్టవంతురాలని, ప్రధాని చేత పేరు పెట్టించుకుందని పాప తండ్రి సంబర పడుతున్నాడు. ఆగస్టు 13న తమకు పాప పుట్టిందని, ప్రధానిని ఆరాధించే తాము, పాపకు మోదీచే పేరు పెట్టాలని భావించామని పేర్కొన్నాడు. వెంటనే తన భార్య ఓ లేఖ రాసిందని, దాన్ని అదేరోజు స్పీడ్ పోస్టులో పీఎంఓకు పంపినట్టు పేర్కొన్నాడు. అయితే భరత్ చెప్పిన స్టోరీని పొరుగింటి వారు నమ్మకపోవడంతో, ఈ విషయంపై పీఎంఓకు ఓ అభ్యర్థన లేఖ రాశాడు. వెంటనే పీఎం వారి పాపను దీవిస్తున్నట్టు ఉత్తరాన్ని కూడా భరత్‌కు పంపారు. "పాపకు జన్మనిచ్చినందుకు శుభాకాంక్షలు, వైభవి కలలను మీరు సాకారం చేయాలని దీవిస్తున్నాను. వైభవి మీకు కొండంత బలం అవ్వాలని కోరుకుంటున్నా" అని లేఖలో ఆశీర్వదించారు.