ఆ విషయంలో రాజీపడను! | Rashmi Gautam likes to do more glamorous roles | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో రాజీపడను!

Published Mon, Oct 23 2017 11:54 PM | Last Updated on Tue, Oct 24 2017 6:42 AM

Rashmi Gautam likes to do more glamorous roles

‘‘ఓన్లీ వన్‌ టైప్‌ ఆఫ్‌ మూవీస్‌నే ఎందుకు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారు. మహేశ్, ప్రభాస్‌ ఇలా ఇండస్ట్రీలోని స్టార్ట్స్‌ అందరితో నటించాలని నాకు ఉంది. కానీ, పర్టిక్యులర్‌ రోల్స్‌ కావాలని నేనెవర్నీ అప్రోచ్‌ కాలేదు. నాకు వచ్చిన చాన్సుల్లో నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాను. కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలన్నదే నా కోరిక’’ అన్నారు రష్మీ గౌతమ్‌. ఆది, వైభవీ శాండిల్య, బ్రహ్మజీ, రష్మీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో ప్రభాకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నెక్ట్స్‌ నువ్వే’. వి4 క్రియేషన్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 3న విడుదల కానుంది. రష్మీ గౌతమ్‌ చెప్పిన విశేషాలు..
మంచి కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రమిది. ఇందులో గ్లామరస్‌ రోల్‌ చేశాను. ఈ సినిమా అంతా నేను శారీస్‌లోనే కనిపిస్తాను. నా రోల్‌ ఫస్ట్‌ హీరోయిన్నా? లేక సెకండ్‌ హీరోయిన్నా? అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. క్యారెక్టర్‌ నాకు నచ్చింది. నైట్‌ షూట్స్‌ బోర్‌ కొట్టేశాయి. అందుకే, ఇకపై హర్రర్‌ మూవీస్‌లో నటించకూడదనుకుంటున్నా.

దర్శకుడు ప్రభాకర్‌ ముందు నటుడు కాబట్టి సెట్‌లో మా పని ఈజీ అయ్యింది. ఆయన నటించి చూపించేవారు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. సినిమాలో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ అంటే అది సినిమాలోని క్యారెక్టర్స్‌ పరంగానే ఉంటాయి. అయినా డైరెక్టర్స్‌ విజన్‌ని మనం నమ్మాలి. అల్లు అరవింద్‌గారు, ‘బన్నీ’ వాసు వంటి నిర్మాతల విజన్‌ను రెస్పెక్ట్‌ చేయాలి.

డైరెక్టర్స్‌ నాకు కథ చెప్పినప్పుడు క్యారెక్టరైజేషన్‌ మాత్రమే ఆలోచిస్తాను. కాస్ట్యూమ్స్‌ విషయంలో కాంప్రమైజ్‌ కాను. కంఫర్ట్‌గా ఉంటేనే వేసుకుంటాను. కాస్ట్యూమ్స్‌ సరిగా లేవని ఓ ఐటమ్‌ సాంగ్‌ వద్దనుకున్నాను.

ప్రేక్షకులు చుస్తున్నారు కాబట్టే గ్లామరస్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. అయినా నాకు గ్లామర్‌ ఉంది... చూపిస్తున్నాను. నాకు తెలిసి నేనిప్పటి వరకు 30 పర్సెంట్‌కు మించి స్కిన్‌ షో చేయలేదు. ఈ రోజుల్లో బికినీ అనేది కామన్‌ అయిపోయింది. కొన్ని వెబ్‌సైట్స్‌లో నా గురించి ఏవేవో వార్తలు రాశారు. వారి దగ్గర ప్రూఫ్‌ ఉండదు. అవి పుకార్లని నాకు తెలుసు కాబట్టి, సైలెంట్‌గా ఉంటాను.

సినిమాలు చేస్తున్నాను. టీవీ షోస్‌లోనూ కంటిన్యూ అవుతాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement