‘‘కొత్త వారికి చాన్స్ ఇచ్చేందుకే వి4 బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. పెద్ద బ్యానర్స్‌లో కొత్త డైరెక్టర్స్‌తో వెంటనే రిస్క్ చేయలేం. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇచ్చి, వారు వి4 బ్యానర్‌లో ప్రూవ్ చేసుకుంటే బిగ్ బ్యానర్‌లో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. రైటర్స్‌ని, మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఆది, వైభవీ శాండిల్యా, రష్మీ గౌతమ్ ముఖ్య తారలుగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది.
‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు...
∙ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్టపడుతున్నారు. కథలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ మీద నమ్మకంతోనే ఈ సినిమా నిర్మించా. ఆది చాలా ప్రొఫెషనల్. ఒక మంచి సక్సెస్ వస్తే స్టార్‌హీరో అవుతాడు. ఆ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌లో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని నమ్మి, మారుతి బ్యానర్‌లో రికమండ్ చేశాను. ప్రభాకర్ «థర్డ్ మూవీ కూడా లైన్‌లో ఉంది. నా పార్టనర్స్ కూడా ఓకే అంటే వి4 బ్యానర్‌లోనే ఆ సినిమా ఉంటుంది. నెక్ట్స్ సినిమాకి ముగ్గరు కుర్రాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ∙అల్లు అరవింద్‌గారు 60 ఏళ్ల వయసున్న టీనేజర్. ‘టు బి విత్ యంగ్ పీపుల్’ అనేదే అరవింద్‌గారి బిజినెస్ సీక్రెట్ అనుకుంటున్నా. నాకు, వంశీ (వి4లో మరో నిర్మాత)కి ఆయన గురువులాంటి వారు. ∙పవన్ కల్యాణ్‌గారి ఫ్యాన్‌ని. ఆయనతో వర్క్ చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్.
దానయ్యగారు ఒక్క మాట చెప్పి ఉండాల్సింది
‘‘అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు సినిమాను అదే రోజు విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. మేమే ఫస్ట్ ఏప్రిల్ 27 అని డేట్ చెప్పాం. దానయ్య (మహేశ్ సినిమా నిర్మాత) గారు ఒక్క మాట ముందుగా చెబితే మేమిద్దరం కలసి వేరేలా ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఆయన చెప్పకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బాధ అనిపించింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఇప్పుడు దానయ్యగారు మీకు చెబితే డేట్ మార్చుకుంటారా? అనడగితే.. ‘‘నేనే కాదు... ఇద్దరూ చొరవ తీసుకోవాలి. అది సమ్మర్ సీజన్. హిట్ సినిమాలు ఆడతాయి.
నేను, లగడపాటి శ్రీధర్ (‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రనిర్మాత) గారితో మాట్లాడి ఇంకో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఐదు నిమిషాల పని. ఏప్రిల్ 27న ‘ఖుషీ’ సినిమా రిలీజైంది. ఏప్రిల్ 8న బన్నీగారి బర్త్‌డే. 7న మేం రిలీజ్ చేయొచ్చు కానీ, రామ్‌చరణ్ గారి సినిమా సమ్మర్‌లో వస్తుందేమోనని ఏప్రిల్ 27న అని అనౌన్స్ చేశాం. ఇప్పుడు మేం భయపడి వెళ్లినట్లు ఉండకూడదు. బేసిక్‌గా నాకది ఇష్టం లేదు. అవసరం లేదు కూడా.
పెద్దలు ఉన్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో? ‘ఈగ’, ‘జులాయి’ చిత్రాల రిలీజ్ అప్పుడు రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని మేం పోస్ట్‌పోన్ చేసుకున్నాం. అప్పుడు దానయ్యగారే ఒప్పుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం ఉండాలి. కానీ, ‘నా పేరు సూర్య...’ డేట్ ఆల్రెడీ మేం అనౌన్స్ చేశాం. ఒక్క మాట కూడా చెప్పకుండా దానయ్యగారు అలా చేయడం అన్నది కరెక్ట్ కాదనిపించింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment