Next Nuvve
-
నెక్స్ట్ నువ్వే.. థియేటర్లో సందడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నెక్ట్స్ నువ్వే’ చిత్ర యూనిట్ సోమవారం విజయవాడలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా సినిమా ప్రదర్శిస్తున్న జీ3 రాజ్యువరాజ్ థియేటర్‌కు సోమవారం వచ్చిన యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో ముచ్చటించారు. అనంతరం హీరో ఆది విలేకరులతో మాట్లాడుతూ చిన్న చిత్రాన్ని హిట్‌చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం విజయవంతం కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు చక్కగా నటించి కామెడీ పండించారన్నారు. హీరోయిన్లు రష్మీ, వైభవీ శాండిల్య పాల్గొన్నారు. -
సంసారం.. సేమియా ఉప్మా
‘‘యామిరిక్క భయమేన్’ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని రెండేళ్ల క్రితం నా మనసులో అనుకున్నా. రీమేక్ హక్కులు ‘బన్నీ’ వాసుగారి వద్ద ఉన్నాయని తెలిసి, నేను కామ్ అయిపోయా. అయితే, ఆ సినిమా చివరకు నా దగ్గరకే వచ్చింది’’ అని హీరో ఆది అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► గతేడాది ప్రభాకర్గారిని కలిస్తే ఇరవై నిమిషాలు ‘నెక్ట్స్ నువ్వే’ కథ చెప్పారు. ‘యామిరిక్క భయమేన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో బాగా నచ్చింది. ప్రభాకర్‌గారు ఏంటో నాకు తెలుసు. బాగా డైరెక్ట్ చేస్తారని సినిమా చేయడానికి అంగీకరించా. ► గీతా ఆర్ట్స్ బేనర్ ఈ సినిమా నిర్మిస్తుందని ప్రభాకర్‌గారు చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంతా ఓకే అని ‘బన్నీ’ వాసుగారితో మాట్లాడిన తర్వాత జ్ఞానవేల్‌రాజాగారు, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. క్యారెక్టరైజేషన్స్, కథ, మంచి నిర్మాతలు ఉండటంతో మరో ఆలోచనకు అవకాశం కూడా ఇవ్వలేదు. సింగిల్ షెడ్యూల్లో.. 36 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ► సినిమాలో నా పాత్ర పేరు కిరణ్. సీరియల్స్ తీస్తుంటాను. రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలనే కోరిక. ‘సంసారం.. సేమియా ఉప్మా’ అనే సీరియల్ తీస్తుంటాడు. నిర్మాతగా ఓ సీరియల్ తీసి, అప్పుల పాలవుతాడు. ఆ అప్పుల నుంచి తప్పించుకోవడానికి రిసార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ హాస్యంతో సాగే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. ► ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో బ్రహ్మాజీగారి పాత్ర చూసి, నేనూ ఈయనతో ఓ సినిమా చేస్తే బావుంటుందనుకున్నా. ‘నెక్ట్స్ నువ్వే’తో లక్కీగా ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. ► జ్ఞానవేల్ రాజాగారి స్టూడియో గ్రీన్ బ్యానర్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న మూడు సినిమాలు చేయబోతున్నా. అలాగే, జ్ఞానవేల్ రాజాగారు తెలుగులో చేసే స్ట్రయిట్ మూవీలో కూడా నటిస్తున్నా. -
నెక్ట్స్ మూడు సినిమాలు ఒకే బ్యానర్లో..!
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది సాయికుమార్, విజయాలు సాదించటంలో మాత్రం తడబడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నా తరువాత ఆ ట్రాక్ రికార్డ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డాడు. శమంతకమణితో మల్టీ స్టారర్ సినిమా చేసినా అది కూడా ఆది కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నెక్ట్స్‌నువ్వే మీదే ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆది. అంతేకాదు నెక్ట్స్‌నువ్వే సినిమా నిర్మాతల్లో ఒకరైన తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో వరుస సినిమాలకు ఓకె చెప్పాడు. ఆది తన తదుపరి మూడు చిత్రాలను జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలోనే చేయనున్నాడట. వీటిలో రెండు ద్విభాషా చిత్రాలు కాగా మరోటి తెలుగు సినిమా. రిలీజ్ కు రెడీగా ఉన్న నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని వి4 క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, జ్ఞానవేల్‌రాజా, యువి క్రియేషన్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ఎవరి కెరీర్‌ని వాళ్లే డిజైన్ చేసుకోవాలి!
‘‘సినిమాల్లోకి వచ్చినా, టీవీ సీరియల్స్‌లో కంటిన్యూ అవుతాను. గతంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను. అల్లు అరవింద్‌గారు, వంశీ, ‘బన్నీ’ వాసు, జ్ఞానవేల్ కలిసి స్టార్ట్ చేసిన వి4 బ్యానర్లో నా మొదటి సినిమాను డైరెక్ట్ చేయడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు ప్రభాకర్. ఆది, బ్రహ్మాజీ, వైభవీ శాండిల్య, రష్మి ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘నెక్ట్స్ నువ్వే’ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రభాకర్ చెప్పిన విశేషాలు... డైరెక్టర్ కావాలనుకున్నాక అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా తీయాలనుకున్నా. కథ చెప్పాను. కథకు ఇంప్రెస్ అయ్యారు. కానీ ‘ఈ జోనర్ అండ్ స్క్రిప్ట్ నాకు సెట్ కాదు’ అని శిరీష్ అన్నారు. ఆ తర్వాత ఇదే కథను అల్లు అరవింద్‌గారికి చెప్పే చాన్స్ వచ్చింది. సెకండాఫ్‌ను కాస్త డెవలప్ చేయమన్నారు. తర్వాత ‘బన్నీ’ వాసుకు వినిపించమన్నారు. అయితే... 2014లో వచ్చిన తమిళ సినిమా ‘యామిరుక్క భయమేన్’ని రీమేక్ చేద్దామన్నారు వాసు. ఫస్టే రీమేకా? అని ఆలోచించాను. కానీ, ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్షన్ చేయాలనిపించింది. అలా ఈ బ్యానర్లో ఛాన్స్ కుదిరింది. ∙మన నేటివిటీకి తగ్గట్టు కథ డెవలప్ చేశాం. హీరోయిజమ్ అని కాకుండా అందరికీ నచ్చేలా సినిమా తీయాలనుకున్నాను. ఫుల్ హారర్ కామెడీ అని చెప్పలేను. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కాకపోతే çహారర్ ఎలిమెంట్ ఉంటుంది. ఫన్నీ వేలోనే స్క్రీన్‌ప్లే సాగుతుంది. నవ్విస్తూ, భయపెడుతుందన్న మాట. ఆది బాగా నటించాడు. బ్రహ్మాజీగారి కామెడీ పంచ్‌లు బాగా నవ్విస్తాయి. రఘుబాబుగారి క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాం.సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. లాజిక్‌లు ఆలోచించితే సినిమాను ఎంజాయ్ చేయలేం. ఎక్కడ లాజిక్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో అక్కడ డ్రామా ఎండ్ అవుతుంది. ∙‘మైసమ్మ ఐపీఎస్’ సినిమాలో హీరోగా చేశాను. అయితే నేను హీరోగా చేసిన రెండు– మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. ‘హరేరామ్’, ‘హోమం’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాను. 40 మందికి పైగా హీరోలకు డబ్బింగ్ చెప్పాను. ఎవరి కెరీర్‌ని వాళ్లే డిజైన్ చేసుకోవాలి. వేరేవాళ్లెవరూ చేయరు. మారుతి బ్యానర్లో నేను డైరెక్ట్చేస్తున్న సెకండ్ ఫిల్మ్ షూటింగ్ ఆల్రెడీ 70 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. కన్నడ హీరో శైలేష్ కథానాయకుడు. ఇషా రెబ్బా కథానాయిక. దర్శకుడిగా మరో మూవీని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌కు కమిట్ అయ్యాను. -
ఆయన 60 ఏళ్ల టీనేజర్!
‘‘కొత్త వారికి చాన్స్ ఇచ్చేందుకే వి4 బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. పెద్ద బ్యానర్స్‌లో కొత్త డైరెక్టర్స్‌తో వెంటనే రిస్క్ చేయలేం. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇచ్చి, వారు వి4 బ్యానర్లో ప్రూవ్ చేసుకుంటే బిగ్ బ్యానర్లో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. రైటర్స్‌ని, మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఆది, వైభవీ శాండిల్యా, రష్మీ గౌతమ్ ముఖ్య తారలుగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు... ∙ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడుతున్నారు. కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మీద నమ్మకంతోనే ఈ సినిమా నిర్మించా. ఆది చాలా ప్రొఫెషనల్. ఒక మంచి సక్సెస్ వస్తే స్టార్హీరో అవుతాడు. ఆ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌లో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని నమ్మి, మారుతి బ్యానర్లో రికమండ్ చేశాను. ప్రభాకర్ «థర్డ్ మూవీ కూడా లైన్లో ఉంది. నా పార్టనర్స్ కూడా ఓకే అంటే వి4 బ్యానర్లోనే ఆ సినిమా ఉంటుంది. నెక్ట్స్ సినిమాకి ముగ్గరు కుర్రాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ∙అల్లు అరవింద్‌గారు 60 ఏళ్ల వయసున్న టీనేజర్. ‘టు బి విత్ యంగ్ పీపుల్’ అనేదే అరవింద్‌గారి బిజినెస్ సీక్రెట్ అనుకుంటున్నా. నాకు, వంశీ (వి4లో మరో నిర్మాత)కి ఆయన గురువులాంటి వారు. ∙పవన్ కల్యాణ్‌గారి ఫ్యాన్‌ని. ఆయనతో వర్క్ చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దానయ్యగారు ఒక్క మాట చెప్పి ఉండాల్సింది ‘‘అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు సినిమాను అదే రోజు విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. మేమే ఫస్ట్ ఏప్రిల్ 27 అని డేట్ చెప్పాం. దానయ్య (మహేశ్ సినిమా నిర్మాత) గారు ఒక్క మాట ముందుగా చెబితే మేమిద్దరం కలసి వేరేలా ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఆయన చెప్పకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బాధ అనిపించింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఇప్పుడు దానయ్యగారు మీకు చెబితే డేట్ మార్చుకుంటారా? అనడగితే.. ‘‘నేనే కాదు... ఇద్దరూ చొరవ తీసుకోవాలి. అది సమ్మర్ సీజన్. హిట్ సినిమాలు ఆడతాయి. నేను, లగడపాటి శ్రీధర్ (‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రనిర్మాత) గారితో మాట్లాడి ఇంకో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఐదు నిమిషాల పని. ఏప్రిల్ 27న ‘ఖుషీ’ సినిమా రిలీజైంది. ఏప్రిల్ 8న బన్నీగారి బర్త్‌డే. 7న మేం రిలీజ్ చేయొచ్చు కానీ, రామ్‌చరణ్ గారి సినిమా సమ్మర్లో వస్తుందేమోనని ఏప్రిల్ 27న అని అనౌన్స్ చేశాం. ఇప్పుడు మేం భయపడి వెళ్లినట్లు ఉండకూడదు. బేసిక్‌గా నాకది ఇష్టం లేదు. అవసరం లేదు కూడా. పెద్దలు ఉన్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో? ‘ఈగ’, ‘జులాయి’ చిత్రాల రిలీజ్ అప్పుడు రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని మేం పోస్ట్‌పోన్ చేసుకున్నాం. అప్పుడు దానయ్యగారే ఒప్పుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం ఉండాలి. కానీ, ‘నా పేరు సూర్య...’ డేట్ ఆల్రెడీ మేం అనౌన్స్ చేశాం. ఒక్క మాట కూడా చెప్పకుండా దానయ్యగారు అలా చేయడం అన్నది కరెక్ట్ కాదనిపించింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
ఆ విషయంలో రాజీపడను!
‘‘ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మూవీస్‌నే ఎందుకు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారు. మహేశ్, ప్రభాస్ ఇలా ఇండస్ట్రీలోని స్టార్ట్స్ అందరితో నటించాలని నాకు ఉంది. కానీ, పర్టిక్యులర్ రోల్స్ కావాలని నేనెవర్నీ అప్రోచ్ కాలేదు. నాకు వచ్చిన చాన్సుల్లో నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాను. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలన్నదే నా కోరిక’’ అన్నారు రష్మీ గౌతమ్. ఆది, వైభవీ శాండిల్య, బ్రహ్మజీ, రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. రష్మీ గౌతమ్ చెప్పిన విశేషాలు.. ► మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇందులో గ్లామరస్ రోల్ చేశాను. ఈ సినిమా అంతా నేను శారీస్‌లోనే కనిపిస్తాను. నా రోల్ ఫస్ట్ హీరోయిన్నా? లేక సెకండ్ హీరోయిన్నా? అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. క్యారెక్టర్ నాకు నచ్చింది. నైట్ షూట్స్ బోర్ కొట్టేశాయి. అందుకే, ఇకపై హర్రర్ మూవీస్‌లో నటించకూడదనుకుంటున్నా. ► దర్శకుడు ప్రభాకర్ ముందు నటుడు కాబట్టి సెట్లో మా పని ఈజీ అయ్యింది. ఆయన నటించి చూపించేవారు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే అది సినిమాలోని క్యారెక్టర్స్ పరంగానే ఉంటాయి. అయినా డైరెక్టర్స్ విజన్‌ని మనం నమ్మాలి. అల్లు అరవింద్‌గారు, ‘బన్నీ’ వాసు వంటి నిర్మాతల విజన్‌ను రెస్పెక్ట్ చేయాలి. ► డైరెక్టర్స్ నాకు కథ చెప్పినప్పుడు క్యారెక్టరైజేషన్ మాత్రమే ఆలోచిస్తాను. కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కాను. కంఫర్ట్‌గా ఉంటేనే వేసుకుంటాను. కాస్ట్యూమ్స్ సరిగా లేవని ఓ ఐటమ్ సాంగ్ వద్దనుకున్నాను. ► ప్రేక్షకులు చుస్తున్నారు కాబట్టే గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అయినా నాకు గ్లామర్ ఉంది... చూపిస్తున్నాను. నాకు తెలిసి నేనిప్పటి వరకు 30 పర్సెంట్‌కు మించి స్కిన్ షో చేయలేదు. ఈ రోజుల్లో బికినీ అనేది కామన్ అయిపోయింది. కొన్ని వెబ్‌సైట్స్‌లో నా గురించి ఏవేవో వార్తలు రాశారు. వారి దగ్గర ప్రూఫ్ ఉండదు. అవి పుకార్లని నాకు తెలుసు కాబట్టి, సైలెంట్‌గా ఉంటాను. ► సినిమాలు చేస్తున్నాను. టీవీ షోస్‌లోనూ కంటిన్యూ అవుతాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. -
రెండు రోజుల్లో 8 సార్లు ‘లగాన్’ చూశా
‘‘నెక్ట్స్ నువ్వే’ నా 60వ సినిమా. ‘పైసా’ సినిమా నాకు పర్ఫెక్ట్ బ్రేక్ ఇస్తే, ‘పటాస్’ కమర్షియల్ హిట్ ఇచ్చింది. నేను కమర్షియల్ మ్యూజిక్ పక్కాగా చేస్తానని ‘రాజా ది గ్రేట్’ నిరూపిస్తుంది. దాని తర్వాతి స్థానంలో ‘నెక్ట్స్ నువ్వే’ నిలుస్తుంది’’ అని సంగీత దర్శకుడు సాయికార్తీక్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదలవుతోంది. సాయికార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు సినిమాకి వెళ్లినప్పుడు పాటల గురించి కాకుండా నేపథ్య సంగీతం ఎలా ఉందని చూసేవాణ్ణి. ఆర్ఆర్ మీద నాకెంత ఆసక్తి అంటే ‘లగాన్’ చిత్రాన్ని రెండు రోజుల్లో 8 సార్లు కంటిన్యూస్‌గా చూశా. మొదటి నుంచీ ప్రభాకర్‌గారు అన్ని శాఖల్లో ఉండటంతో కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. కథని బట్టే సంగీతం వస్తుంది. ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో ఐడెంటిటీ ఉంటుంది’’ అన్నారు. -
‘నెక్ట్స్ నువ్వే’ ఆడియో విడుదల