‘‘సినిమాల్లోకి వచ్చినా, టీవీ సీరియల్స్‌లో కంటిన్యూ అవుతాను. గతంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను. అల్లు అరవింద్‌గారు, వంశీ, ‘బన్నీ’ వాసు, జ్ఞానవేల్ కలిసి స్టార్ట్ చేసిన వి4 బ్యానర్‌లో నా మొదటి సినిమాను డైరెక్ట్ చేయడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు ప్రభాకర్. ఆది, బ్రహ్మాజీ, వైభవీ శాండిల్య, రష్మి ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘నెక్ట్స్ నువ్వే’ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రభాకర్ చెప్పిన విశేషాలు...
డైరెక్టర్ కావాలనుకున్నాక అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా తీయాలనుకున్నా. కథ చెప్పాను. కథకు ఇంప్రెస్ అయ్యారు. కానీ ‘ఈ జోనర్ అండ్ స్క్రిప్ట్ నాకు సెట్ కాదు’ అని శిరీష్ అన్నారు. ఆ తర్వాత ఇదే కథను అల్లు అరవింద్‌గారికి చెప్పే చాన్స్ వచ్చింది. సెకండాఫ్‌ను కాస్త డెవలప్ చేయమన్నారు. తర్వాత ‘బన్నీ’ వాసుకు వినిపించమన్నారు. అయితే... 2014లో వచ్చిన తమిళ సినిమా ‘యామిరుక్క భయమేన్’ని రీమేక్ చేద్దామన్నారు వాసు. ఫస్టే రీమేకా? అని ఆలోచించాను. కానీ, ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్షన్ చేయాలనిపించింది. అలా ఈ బ్యానర్‌లో ఛాన్స్ కుదిరింది. ∙మన నేటివిటీకి తగ్గట్టు కథ డెవలప్ చేశాం. హీరోయిజమ్ అని కాకుండా అందరికీ నచ్చేలా సినిమా తీయాలనుకున్నాను. ఫుల్ హారర్ కామెడీ అని చెప్పలేను. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కాకపోతే çహారర్ ఎలిమెంట్ ఉంటుంది. ఫన్నీ వేలోనే స్క్రీన్‌ప్లే సాగుతుంది. నవ్విస్తూ, భయపెడుతుందన్న మాట. ఆది బాగా నటించాడు. బ్రహ్మాజీగారి కామెడీ పంచ్‌లు బాగా నవ్విస్తాయి.
రఘుబాబుగారి క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాం.సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. లాజిక్‌లు ఆలోచించితే సినిమాను ఎంజాయ్ చేయలేం. ఎక్కడ లాజిక్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో అక్కడ డ్రామా ఎండ్ అవుతుంది. ∙‘మైసమ్మ ఐపీఎస్’ సినిమాలో హీరోగా చేశాను. అయితే నేను హీరోగా చేసిన రెండు– మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. ‘హరేరామ్’, ‘హోమం’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాను. 40 మందికి పైగా హీరోలకు డబ్బింగ్ చెప్పాను. ఎవరి కెరీర్‌ని వాళ్లే డిజైన్ చేసుకోవాలి. వేరేవాళ్లెవరూ చేయరు. మారుతి బ్యానర్‌లో నేను డైరెక్ట్‌చేస్తున్న సెకండ్ ఫిల్మ్ షూటింగ్ ఆల్రెడీ 70 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. కన్నడ హీరో శైలేష్ కథానాయకుడు. ఇషా రెబ్బా కథానాయిక. దర్శకుడిగా మరో మూవీని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌కు కమిట్ అయ్యాను.
ఎవరి కెరీర్‌ని వాళ్లే డిజైన్ చేసుకోవాలి!
Published Tue, Oct 31 2017 11:56 PM | Last Updated on Tue, Oct 31 2017 11:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment