prabakar
-
ఐశ్వర్య రాజేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా...! కామెడీతో ఆడుకుంది
-
చెల్లిని మోసుకుంటూ వాగు దాటిన అన్న
చెన్నూర్ రూరల్: సరైన దారిలేక.. వర్షాకాలం లో వాగులు దాటలేక గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యతో ఒక్కోసారి ప్రాణాలూ కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన నిట్టూరి ప్రవళికకు శనివారం ఫిట్స్ వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంటి నుంచి స్కూటీపై తీసుకొచ్చినా.. గ్రామ సమీపంలోని సుబ్బరాంపల్లి వాగుపై వంతెన లేక దాటడం కష్టంగా మారింది. అప్పటికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వాగు అవతలి ఒడ్డు వరకు వచ్చింది. ప్రవళికను ఆమె అన్న ప్రభాకర్ మోసుకుంటూ వాగు దాటి అంబులెన్స్ ఎక్కించాడు. చెన్నూర్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
నా డబ్బులు నాకిచ్చేయ్.. అంతే!
-
ఎవరి కెరీర్‌ని వాళ్లే డిజైన్ చేసుకోవాలి!
‘‘సినిమాల్లోకి వచ్చినా, టీవీ సీరియల్స్‌లో కంటిన్యూ అవుతాను. గతంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను. అల్లు అరవింద్‌గారు, వంశీ, ‘బన్నీ’ వాసు, జ్ఞానవేల్ కలిసి స్టార్ట్ చేసిన వి4 బ్యానర్లో నా మొదటి సినిమాను డైరెక్ట్ చేయడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు ప్రభాకర్. ఆది, బ్రహ్మాజీ, వైభవీ శాండిల్య, రష్మి ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘నెక్ట్స్ నువ్వే’ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రభాకర్ చెప్పిన విశేషాలు... డైరెక్టర్ కావాలనుకున్నాక అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా తీయాలనుకున్నా. కథ చెప్పాను. కథకు ఇంప్రెస్ అయ్యారు. కానీ ‘ఈ జోనర్ అండ్ స్క్రిప్ట్ నాకు సెట్ కాదు’ అని శిరీష్ అన్నారు. ఆ తర్వాత ఇదే కథను అల్లు అరవింద్‌గారికి చెప్పే చాన్స్ వచ్చింది. సెకండాఫ్‌ను కాస్త డెవలప్ చేయమన్నారు. తర్వాత ‘బన్నీ’ వాసుకు వినిపించమన్నారు. అయితే... 2014లో వచ్చిన తమిళ సినిమా ‘యామిరుక్క భయమేన్’ని రీమేక్ చేద్దామన్నారు వాసు. ఫస్టే రీమేకా? అని ఆలోచించాను. కానీ, ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్షన్ చేయాలనిపించింది. అలా ఈ బ్యానర్లో ఛాన్స్ కుదిరింది. ∙మన నేటివిటీకి తగ్గట్టు కథ డెవలప్ చేశాం. హీరోయిజమ్ అని కాకుండా అందరికీ నచ్చేలా సినిమా తీయాలనుకున్నాను. ఫుల్ హారర్ కామెడీ అని చెప్పలేను. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కాకపోతే çహారర్ ఎలిమెంట్ ఉంటుంది. ఫన్నీ వేలోనే స్క్రీన్‌ప్లే సాగుతుంది. నవ్విస్తూ, భయపెడుతుందన్న మాట. ఆది బాగా నటించాడు. బ్రహ్మాజీగారి కామెడీ పంచ్‌లు బాగా నవ్విస్తాయి. రఘుబాబుగారి క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాం.సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. లాజిక్‌లు ఆలోచించితే సినిమాను ఎంజాయ్ చేయలేం. ఎక్కడ లాజిక్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో అక్కడ డ్రామా ఎండ్ అవుతుంది. ∙‘మైసమ్మ ఐపీఎస్’ సినిమాలో హీరోగా చేశాను. అయితే నేను హీరోగా చేసిన రెండు– మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. ‘హరేరామ్’, ‘హోమం’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాను. 40 మందికి పైగా హీరోలకు డబ్బింగ్ చెప్పాను. ఎవరి కెరీర్‌ని వాళ్లే డిజైన్ చేసుకోవాలి. వేరేవాళ్లెవరూ చేయరు. మారుతి బ్యానర్లో నేను డైరెక్ట్చేస్తున్న సెకండ్ ఫిల్మ్ షూటింగ్ ఆల్రెడీ 70 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. కన్నడ హీరో శైలేష్ కథానాయకుడు. ఇషా రెబ్బా కథానాయిక. దర్శకుడిగా మరో మూవీని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌కు కమిట్ అయ్యాను. -
ఆడపడుచు కట్నంగా.. ఓటు హక్కు వినియోగించుకోండి
పోలింగ్ పెంచేందుకు వినూత్నంగా పోల్ చిట్టీల పంపిణీ సిరిసిల్ల, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరగనున్న పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కరీంనగర్జిల్లా సిరిసిల్లలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల సెంటిమెంట్‌ను పట్టుకొని.. పోలింగ్ పెంచే దిశగా పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు.తహశీల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ, సాక్షర భారత్, బీఎల్వోల ద్వారా గ్రామాల్లో పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. వీరు ఇంటింటికీ వెళ్లి తాంబులం ఇచ్చి.. బొట్టు పెట్టి మరీ పోల్ చిట్టీలను అందిస్తున్నారు. ‘మీ ఇంటి ఆడపడుచును అనుకోండి.. నాకు కట్నకానుకలు వద్దు.. మీ ఓటు హక్కు వినియోగించుకుంటే చాలు’ అంటూ ఓటర్ల నుంచి మాట తీసుకుంటున్నారు. -
కట్నం వేధింపులతోవివాహిత ఆత్మహత్య
కొల్చారం, న్యూస్‌లైన్ : కులాల గోడలను కూలగొట్టి.. ప్రేమ బంధంతో పెద్దలను ఒప్పించి ఏకమైన ఓ జంట. అయితే పెళ్లి అయి ఏడాది కాకనే సదరు యువతిని వరకట్నం కాటేసింది. కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేని ఆమె చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలం అప్పాజిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అప్పాజిపల్లి గ్రామానికి చెందిన సాలె తిరుపతి - నాగమణిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె అలివేణి ఇదే గ్రామానికి చెందిన చింతకింది కృష్ణను ప్రేమించి 2012 డిసెంబర్లో పెద్దల సమక్షంలో కులాంతర వివాహం చేసుకుంది. కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే కొంత కాలంగా అలివేణిని వరకట్నం తేవాలంటూ అత్తమామలు చిందకింది శాఖయ్య, మంగమ్మ, భర్త కృష్ణ వేధింపులకు గురిచేసేవారు. అక్టోబర్‌లో కూడా ఇదే విషయమై గ్రామ పెద్దల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. కాగా శుక్రవారం సైతం వేధింపులకు గురి చేయగా అలివేణి (20) అత్తవారి ఇంటి నుంచి సాయంత్రం ఎటో వెళ్లిపోయింది. కాగా అలివేణి కోసం ఆరా తీయగా గ్రామ శివారులోని కిన్నెర్ల కుంట వైపు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో చెరువులో రాత్రి వరకు గాలించడంతో అలివేణి మృతదేహం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రభాకర్ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ వివరించారు.