ఆడపడుచు కట్నంగా.. ఓటు హక్కు వినియోగించుకోండి | new trend in election campaign | Sakshi
Sakshi News home page

ఆడపడుచు కట్నంగా.. ఓటు హక్కు వినియోగించుకోండి

Published Mon, Apr 21 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

ఆడపడుచు కట్నంగా..  ఓటు హక్కు వినియోగించుకోండి

ఆడపడుచు కట్నంగా.. ఓటు హక్కు వినియోగించుకోండి

 పోలింగ్ పెంచేందుకు వినూత్నంగా పోల్ చిట్టీల పంపిణీ

 సిరిసిల్ల, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరగనున్న పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కరీంనగర్‌జిల్లా సిరిసిల్లలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల సెంటిమెంట్‌ను పట్టుకొని.. పోలింగ్ పెంచే దిశగా పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు.తహశీల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ, సాక్షర భారత్, బీఎల్‌వోల ద్వారా గ్రామాల్లో పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. వీరు ఇంటింటికీ వెళ్లి తాంబులం ఇచ్చి.. బొట్టు పెట్టి మరీ పోల్ చిట్టీలను అందిస్తున్నారు. ‘మీ ఇంటి ఆడపడుచును అనుకోండి.. నాకు కట్నకానుకలు వద్దు.. మీ ఓటు హక్కు వినియోగించుకుంటే చాలు’ అంటూ ఓటర్ల నుంచి మాట తీసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement