
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నెక్ట్స్ నువ్వే’ చిత్ర యూనిట్ సోమవారం విజయవాడలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా సినిమా ప్రదర్శిస్తున్న జీ3 రాజ్‌యువరాజ్ థియేటర్‌కు సోమవారం వచ్చిన యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో ముచ్చటించారు. అనంతరం హీరో ఆది విలేకరులతో మాట్లాడుతూ చిన్న చిత్రాన్ని హిట్‌చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం విజయవంతం కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు చక్కగా నటించి కామెడీ పండించారన్నారు. హీరోయిన్లు రష్మీ, వైభవీ శాండిల్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment