ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. భువనేశ్వర్‌లో ఆదివారం మొదలైన ఈ టోర్నీలో మహిళల ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష... మహిళల జావెలిన్ త్రోలో కె.రష్మీ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.
అనూష 13.53 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షీనా (కేరళ; 13.32 మీటర్లు) రజతం... గాయత్రి శివకుమార్ (కేరళ; 13.08 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు.
ఇక జావెలిన్ త్రో ఫైనల్లో రష్మీ జావెలిన్‌ను 54.75 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ అయిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణ కానున్నాడు.
మూడేళ్ల తర్వాత స్వదేశంలో పోటీపడుతున్న నీరజ్ మంగళవారం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్‌లో, బుధవారం జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతాడు.
Comments
Please login to add a commentAdd a comment