rashmi
-
మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబైలోని మాతోశ్రీ (ఉద్ధవ్ ఠాక్రే నివాసం)లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి కొత్త పేరు వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆమె చిత్రంతో కూడి పెద్దపెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే ఏమైందోఏమో వాటిని కొద్దిసేపటికే తొలగించారు.బ్యానర్ల కలకలంమాతోశ్రీలో రష్మీ ఠాక్రేను సీఎం చేయాలనే బ్యానర్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది. గంట వ్యవధిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన యువ కార్యకర్తలు మాతోశ్రీలోని ఆ బ్యానర్లను తొలగించారు.నేడు రష్మీ ఠాక్రే పుట్టినరోజుఇటీవలే మహారాష్ట్రలో మహిళా ముఖ్యమంత్రి అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) రష్మీ ఠాక్రే పుట్టినరోజు. దీనిని దృష్టిలో ఉంచుకుని శివసేన యువసేన మాతోశ్రీ వెలుపల రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు ప్రదర్శించింది. ఈ పోస్టర్లు పెట్టిన కొద్దిసేపటికే పార్టీ అగ్రనేతలు హడావుడిగా వాటిని తొలగించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను సీఎం చేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుమరికొద్ది నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీ, మహాయుతి దళ్ నాయకులు తమ సత్తా చాటేలా ఇప్పటికే ఎన్నికల సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం మొదలుపెట్టారు.ఇది కూడా చదవండి: ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్ -
ప్రధాని మోదీ ప్రస్తావించిన డీజీపీ రష్మీశుక్లా ఎవరు?
ముంబై: మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆమె గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) పోలీసులను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎంపికైన ఈ మహిళా ఐపీఎస్ ఎవరో తెలుసుకుందాం.మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ పేరు రష్మీ శుక్లా. ఆమె 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2024 జనవరి 4న మహారాష్ట్ర నూతన డీజీపీగా నియమితులయ్యారు. అంతకుముందు ఆమె డిప్యూటేషన్‌పై సశాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేశారు. ఐపీఎస్ అధికారి, డీజీపీ రజనీష్ సేథ్ 2023, డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2024,జనవరి 4న నూతన డీజీపీగా రష్మీ శుక్లాను నియమించింది.మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి. మూడేళ్లపాటు ఆమె కేంద్రంలో డిప్యూటేషన్‌పై కొనసాగారు. ఆమె గత జూన్‌లో పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆమె పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. రష్మీ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు. ప్రయాగ్‌రాజ్‌లోనే తన చదువును పూర్తి చేశాడు. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 24 ఏళ్లకే ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. రష్మీ శుక్లా.. ఉదయ్ శుక్లాను వివాహం చేసుకున్నారు. ఉదయ్ ప్రస్తుతం ముంబైలోని ఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు.ఐపీఎస్ రష్మీ శుక్లా నాగ్‌పూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్‌గా, పూణే పోలీస్ కమిషనర్ కూడా విధులు నిర్వహించారు. గతంలో ఆమె రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమెపై పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన దరిమిలా ఆమెపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ, క్లీన్ చిట్ ఇచ్చారు. -
కన్నడ కస్తూరి.. పతకాలపై గురి
2017లో సీనియర్ నేషనల్స్ సమయంలో దుర్గారావుకు, రష్మికి పరిచయం ఏర్పడింది. దుర్గారావు డిస్కస్ త్రోయర్. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2020లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది రష్మికి రైల్వేలో టీటీ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందే దుర్గారావు కూడా క్రీడా కోటాలో టీటీ ఉద్యోగం సాధించారు. ఇద్దరూ క్రీడాకారులవడంతో వాటి ప్రాముఖ్యత బాగా తెలుసు. అందుకే దుర్గారావు ఉద్యోగం చేస్తూ భార్య రష్మికి సహకారంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె జాతీయ క్రీడా క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.గుంటూరు వెస్ట్ (క్రీడలు): కన్నడ నాట జన్మించిన రష్మి గుంటూరు కోడలు అయింది. పట్టణానికి చెందిన దుర్గారావును ప్రేమ వివాహం చేసుకుంది. అథ్లెటిక్స్‌లో గత ఐదేళ్లుగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి పేరు తెస్తోంది. భార్యాభర్తలిద్దరూ జాతీయ అథ్లెట్స్ మాత్రమే కాదు.. భారతీయ రైల్వేలో టీటీలుగా కొలువులు సాధించారు. క్రీడల కోసం ప్రస్తుతం బిడ్డల్ని కూడా వద్దనుకుని కఠోర శిక్షణలో మునిగిపోయింది రష్మి.అద్భుత విజయాలురష్మి తన సోదరుడు అభిషేక్‌తోపాటు పాఠశాల టీటీ సహకారంతో అథ్లెట్‌గా మారింది. ఈ క్రమంలో జూనియర్ సీనియర్ విభాగాల్లో జాతీయ స్థాయిలో డజన్ల కొద్దీ బంగారు, రజత, కాంస్య పతకాలు కై వసం చేసుకుంది. సీనియర్స్ విభాగంలో ఈ ఏడాది నిలకడైన ప్రతిభతో రెండు బంగారు, ఒక కాంస్య పతకం సాధించింది. ఆంధ్రా తరఫున అద్భుతమైన ప్రతిభతో ముందుకు వెళుతోంది. భర్త దుర్గారావు అన్ని విధాలుగా సహాయ, సహకారాలందిస్తున్నారు.స్పాన్సర్ కావాలిరష్మి శిక్షణ, డైట్ అన్నీ కలుపుకుని నెలకు కనీసం రూ.50 నుంచి రూ.70 వేలు అవసరమవుతుంది. దీంతోపాటు పోటీలకు కోచ్‌తో వెళ్లాలి. భర్త దుర్గారావు జీతం మొత్తం రష్మికే ఖర్చు చేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతంలో సగం ఇంటికి వాడుతున్నారు. ఒక్క జావెలిన్ ఖరీదు రూ.2 లక్షలు ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మరింత మెరుగైన సదుపాయాలు, క్రీడా సామగ్రి అవసరం. స్పాన్సర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సౌత్ ఏషియన్ కంట్రీస్ క్రీడా పోటీలే లక్ష్యంగా రష్మి సాధన చేస్తోంది.పెళ్లికి దారితీసిన పరిచయం 2017లో సీనియర్ నేషనల్స్ సమయంలో దుర్గారావుకు, రష్మికి పరిచయం ఏర్పడింది. దుర్గారావు డిస్కస్ త్రోయర్. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2020లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది రష్మికి రైల్వేలో టీటీ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందే దుర్గారావు కూడా క్రీడా కోటాలో టీటీ ఉద్యోగం సాధించారు. ఇద్దరూ క్రీడాకారులవడంతో వాటి ప్రాముఖ్యత బాగా తెలుసు. అందుకే దుర్గారావు ఉద్యోగం చేస్తూ భార్య రషి్మకి సహకారంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె జాతీయ క్రీడా క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. భారత్‌కు పతకాలు తేవడం లక్ష్యంచిన్న నాటి నాకు ఆటలంటే ప్రాణం. మన దేశానికి క్రీడల్లో పతకాలు సాధించాలనేదే నా ఆకాంక్ష. గత నాలుగేళ్ల నుంచి దాదాపు కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ సాధన చేస్తున్నాను. ఈ క్రమంలో మెరుగైన ప్రతిభతో జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నా. అత్యుత్తమ కోచ్ రాజేంద్రసింగ్ సారథ్యంలో ప్రస్తుతం జాతీయ శిక్షణ తీసుకుంటున్నా. భర్త దుర్గారావు సహాయ, సహకారాలు ఎంత చెప్పినా తక్కువే. ఆయన కూడా క్రీడాకారుడు కావడంతో ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. అనుక్షణం నావెంట ఉండి నడిపిస్తున్నారు. నా సోదరుడి ప్రోత్సాహం కూడా ఎపుడూ నన్ను ముందుకు నడిపిస్తోంది. ఏషియన్ గేమ్స్‌లో పకతం సాధించడమే లక్ష్యం. స్పాన్సర్స్ లభిస్తే మరింత సౌలభ్యంగా ఉంటుంది. శిక్షణ సమయంలో చాలా ఖర్చు అవుతోంది.– కె.రష్మి, జాతీయ స్థాయి జావెలిన్ త్రోయర్ -
స్వర్ణ పతకాలు నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు అనూష, రష్మీ
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. భువనేశ్వర్‌లో ఆదివారం మొదలైన ఈ టోర్నీలో మహిళల ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష... మహిళల జావెలిన్ త్రోలో కె.రష్మీ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. అనూష 13.53 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షీనా (కేరళ; 13.32 మీటర్లు) రజతం... గాయత్రి శివకుమార్ (కేరళ; 13.08 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇక జావెలిన్ త్రో ఫైనల్లో రష్మీ జావెలిన్‌ను 54.75 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ అయిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణ కానున్నాడు. మూడేళ్ల తర్వాత స్వదేశంలో పోటీపడుతున్న నీరజ్ మంగళవారం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో, బుధవారం జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతాడు. -
ఒక్క ఫోటో చాలు…. సొల్లు కారుస్తారు రష్మీ ట్వీట్ వైరల్
-
గుంటూరు కారం సాంగ్.. అలాంటి వారిపై మండిపడ్డ యాంకర్ రష్మీ!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో సీనియర్ నటి పూర్ణ సైతం స్టెప్పులతో అదరగొట్టింది. శ్రీలీల ఎక్కువగా హైలెట్ అయింది. అయితే ఈ పాటకు బుల్లితెర యాంకర్ రష్మీని ఎంపిక చేయాలనుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలైంది. పూర్ణ ప్లేస్‌లో రష్మీ గౌతమ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అందుకు రష్మీ నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా వీటిపై రష్మీ స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడింది. అంతే కాదు.. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అందువల్లే తనను ఎవరు రిజెక్ట్ చేయలేదని తెలిపింది. అంతే కాదు.. ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించవద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రష్మీ చివరసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది. This news is absolutely baseless I was not approached so no scope for rejection Also poorna garu did an absolute fab job no one else could have done it better Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024 -
Rashmi Gautam HD Photos: మిర్చికంటే హాట్ అందాలతో రష్మీ గౌతమ్..మరీ ఇంత ఘాటుగానా! (ఫోటోలు)
-
ఇద్దరం ఒకేసారి వచ్చాం... ఇప్పుడు తను నా బెస్ట్ ఫ్రెండ్
-
రష్మీ, భవానిలకు కాంస్యాలు
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రష్మీ, భవాని యాదవ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలతో మెరిశారు. ఒడిశాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో రష్మీ ఈటెను 50.95 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ప్రయత్నంలో ఈ మెరుగైన ప్రదర్శన ద్వారా ఆమె కాంస్య పతకం నెగ్గింది. ఇందులో అన్ను రాణి (ఉత్తరప్రదేశ్; 58.22 మీ.) స్వర్ణం, ప్రియాంక (హరియాణా; 51.94 మీ.) రజతం గెలుపొందారు. అంతకుముందు జరిగిన లాంగ్‌జంప్ పోటీలో భవాని 6.44 మీటర్ల దూరం దూకి కాంస్యంతో తృప్తిపడింది. అన్సీ సోజన్ (కేరళ; 6.51 మీ.), శైలీసింగ్ (ఉత్తరప్రదేశ్; 6.49 మీ.) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. భారత స్టార్ అథ్లెట్, షాట్‌పుటర్ తజీందర్ పాల్ తూర్ తన రికార్డును తానే సవరించి కొత్త ‘ఆసియా’ రికార్డు నెలకొల్పాడు. అతను గుండును 21.77 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 28 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ తజీందర్ 2021లో 21.49 మీటర్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అతను విసిరిన దూరం ఈ సీజన్లో ప్రపంచంలోనే తొమ్మిదో మెరుగైన ప్రదర్శనగా నిలిచింది. 21.40 మీటర్ల క్వాలిఫయింగ్ మార్క్‌ను దాటడంతో ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకూ తజీందర్ పాల్ అర్హత సంపాదించాడు. సోమవారం ముగిసిన ఈ పోటీల్లో ఏపీ అమ్మాయి యెర్రా జ్యోతి ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఎంపికైంది. తమిళనాడు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. -
ఎస్ఎస్బీ డీజీగా రశ్మీ శుక్లా
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రశ్మీ శుక్లా(57) నియమితులయ్యారు. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అదనపు డీజీగా ఉన్నారు. శుక్లా నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమె 2024 జూన్ 30వ తేదీ వరకు విధుల్లో ఉంటారని తెలిపింది. నేపాల్, భూటాన్ సరిహద్దుల భద్రతను ఎస్ఎస్బీయే చూసుకుంటుంది. -
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర స్టార్ రష్మీ
కన్నడ బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రియుడు నిఖిల్ భార్గవ్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులో ఏప్రిల్ 25న వీరి వివాహం జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల రష్మి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ముందుగానే వివరించింది. 'నిఖిల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ ఈవెంట్లో మేమిద్దరం కలిశాం. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్‌గా మారాము. అలా ఒకరినొకరం ఇష్టపడ్డాం. ముందు నిఖిల్ ప్రపోజ్ చేశాడు, నేనూ ఓకే చెప్పాను. ఒక నెల క్రితమే ఇంట్లో మా ప్రేమ విషయాన్ని చెప్పగా వాళ్లు సర్ప్రైజ్ అయ్యారు, పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. లాక్డౌన్లో మేమిద్దం కలిసి ఆహారపొట్లాలు కూడా పంచాము. ఒక నటిగా పెళ్లయ్యాక నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కూడా నిఖిల్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా రష్మి కన్నడ బుల్లితెరపై మనసెల్ల నేనే అనే సీరియల్లో కథానాయికగా నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ ధారావాహిక నుంచి తప్పుకుంది. View this post on Instagram A post shared by Rashmi Prabhakar (@rashmiprabhakar_official) View this post on Instagram A post shared by Golden Pearl Events (@goldenpearl.events) View this post on Instagram A post shared by Golden Pearl Events (@goldenpearl.events) View this post on Instagram A post shared by Golden Pearl Events (@goldenpearl.events) చదవండి: KGF Director: ప్రశాంత్ నీల్.. మన బంగారమే ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్ -
ఆ సమయంలో సీరియస్‌గా ఉంటా: రష్మి
శాండిల్‌వుడ్ నుంచి మరో నటి కోలీవుడ్‌కి దిగుమతి అయ్యింది. ఈ అమ్మడి పేరు రష్మీగోపీనాథ్. విశేషం ఏమిటంటే ఏకకాలంలో కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటించేస్తోంది. ఎంబీఏ చదివి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన రష్మీగోపీనాథ్ అక్కడ 2016లో ఉత్తమ మోడల్‌గా గుర్తింపు పొందింది. ఆ తరువాత సినీ అవకాశాలు తలుపుతట్టాయి. అలా ఇప్పుడు కోలీవుడ్‌లో కాక్టెయిల్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. నటుడు యోగిబాబు హీరోగా నటిస్తున్న చిత్రం కాక్టెయిల్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి రష్మీ గోపినాథ్ చెబుతూ నటుడు యోగిబాబును టీవీలో చూశాను, సినిమాలో చేశానని అంది. అయితే ఆయనతో కలిసి కాక్టెయిల్ చిత్రంలో మొదటి రోజునే నటిస్తానని ఊహించలేదని అంది. అయితే తన టెన్షన్‌ను ఆయన మొదటి రోజునే పోగొట్టారని చెప్పింది. ఈ చిత్రంలో తనది గ్రామీణ యువతి పాత్ర అని చెప్పింది. షూటింగ్లో తనను ఎవరైనా ఆట పట్టించాలనుకుంటే మాత్రం ఊరుకోనంది. వారి పనిపడతానని చెప్పింది. అంతగా దూకుడు అమ్మాయిని తానని చెప్పింది. కాక్టెయిల్ చిత్ర షూటింగ్లో ఒక సన్నివేశంలో యోగిబాబును తిడుతూ చాలా పెద్ద డైలాగ్ చెప్పాలని, అలా తడబడకుండా చెబుతుంటే మధ్యలో ఆయన కౌంటర్ వేశారంది. అంతే తాను జామ్ అయిపోయానని చెప్పింది. ఆయన కౌంటర్‌కు నవ్వు ఆపుకోవడం సాధ్యం కాలేదని చెప్పింది. యోగిబాబు నటిస్తున్నప్పటి కంటే బయట ఇంకా నవ్విస్తారని చెప్పింది. అదే మూడ్‌లో నటించడానికి రెడీ అయితే సరిగా నటించలేకపోయోదాన్ని అని చెప్పింది. అందుకే యోగిబాబుతో నటించేటప్పుడు అంతకుముందు జరిగిన సీరియస్ సంఘటనను తలచుకుని నటించేదాన్ని అని చెప్పింది. కాగా కాక్టెయిల్ చిత్రంతో పాటు కన్నడంలో పాత్రా అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. అదేవిధంగా తెలుగులో డబ్బే డబ్బు అనే చిత్రంలో నటించినట్లు చెప్పింది. కాగా ప్రస్తుతం తమిళంలో సీవీ.కుమార్ నిర్మిస్తున్న వైరస్ అనే చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నట్లు చెప్పింది. ఇందులో తన పాత్ర కాక్టెయిల్ చిత్రంలోని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. వైరస్ చిత్రంలో ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిపింది. అయితే కథానాయకి పాత్రలనే కాకుండా నటిగా తన సత్తాచాటుకునే విధంగా వైవిధ్యభరిత పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు రష్మి గోపీనాథ్ చెప్పుకొచ్చింది. -
ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..
బంజారాహిల్స్: వారంతా బుల్లి తెరపై మెరిసి ఆ తర్వాత వెండితెరపై మైమరపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. టీవీ నటులుగా వెలుగొందిన అనంతరం చలనచిత్రాలపై దృష్టి సారించి ఔరా అనిపిస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై కనిపించాలంటే నాటకాల్లో నటించి.. ప్రతిభను కనబరిచి సినిమా అవకాశాల్లోకి వచ్చేవారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, సూర్యకాంతం, నాగభూషణం, రావుగోపాలరావు తదితర మేటి నటీనటులు నాటకాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపి సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో పాటు మెగాస్టార్ చిరంజీవి అప్పటి మద్రాస్ పాండీబజార్లో సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగి తమ ప్రతిభను చాటి అవకాశాలు తెచ్చుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత కూడా ఒక వెలుగు వెలిగిన నటులంతా చెన్నైలో సినిమా అవకాశాల కోసం తిరిగి దర్శకులను ఒప్పించి, మెప్పించి తారలుగా వెలుగొందారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాల్లో అవకాశాల కోసం బుల్లితెరను నమ్ముకుంటున్నారు. వెండితెరపై వెలగాలంటే ముందుగా బుల్లితెరను మెప్పించాల్సి ఉంటోంది. టీవీల్లో ఒకవైపు సీరియళ్లు, ఇంకోవైపు షోలలో అలరిస్తూ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పలు టీవీ చానళ్లు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా చాలా మంది యువతీ యువకులు వెండితెరపై వెలిగిపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే నాటి నాటకాల వేదికలే ఇప్పుడు బుల్లితెరలుగా మారాయి. టీవీషోలకు దూరం కాలేదు.. ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్నారు కొందరు నటులు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా అని వీరు టీవీలను మాత్రం వదలడం లేదు. యాంకర్ రష్మీ రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించినా బుల్లితెరను మాత్రం వదులుకోలేదు. పాటల్లో నటించే అవకాశం వచ్చినా అనసూయ కూడా యాంకర్‌గా, ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా చేస్తున్నా తాను నమ్ముకున్న టీవీని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడిప్పుడే మరింత మంది టీవీనటులకు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ముందుగా టీవీ షోలలో మెప్పించి ఆ తర్వాత సినిమా స్క్రీన్లపై కనిపించేందుకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నవ్విస్తూ.. మెప్పిస్తూ.. బుల్లితెరపై సందడి చేస్తున్న ప్రముఖ హాస్యనటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రవితో పాటు రష్మీ, హీరో హీరోయిన్లుగా వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించారు. వీరికి బుల్లితెర అనే వేదిక లేకపోతే వెండితెర ఏమాత్రం పరిచయం కాకపోయి ఉండేది. టీవీల్లో హాస్య ప్రధానంగా వస్తున్న కార్యక్రమం ద్వారా మహేష్ అనే నటుడు ఏకంగా రామ్‌చరణ్ తేజ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో మంచి చాన్స్ కొట్టేసి ఇప్పుడు బిజీగా మారాడు. మాటీవీలో సందడి చేసిన బిగ్‌బాస్ సీజన్– 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు కాగా జీవితా రాజశేఖర్ కూతురు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక యాంకర్‌గా ఒక వెలుగు వెలుగుతున్న అనసూయ భరద్వాజ్ కూడా బుల్లితెరపై మెప్పించి పలు సినిమాల్లో కూడా నటించారు. సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. మేడమీద అబ్బాయి అనే సినిమాలో హైపర్ ఆది సెకండ్ హీరోగా నటించారు. యాంకర్ శ్రీముఖి కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. చలాకీ చంటి, చమ్మక్‌చంద్ర, రాకెట్ రాఘవ, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, అప్పారావు తదితరులు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టీవీషోల ద్వారానే వీరందరికీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయనడంతో సందేహంలేదు. రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌తో నటించిన టీవీ నటుడు మహేష్ -
రష్మీ... ద రాకెట్
నిప్పు రవ్వ వెలిగిస్తే చాలు రాకెట్ రివ్వున ఆకాశంలోకి పరిగెడుతుంది. ‘గెట్ సెట్ గో’ అనే పదాలు వింటే చాలు రష్మీ కూడా రాకెట్లా దూసుకుపోతుంది. ఆమె పరుగు వేగాన్ని చూస్తే కచ్చితంగా రష్మీ ద రాకెట్ అనాల్సిందే. గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మి పాత్రలో తాప్సీ నటించనున్న చిత్రం ‘రష్మీ ద రాకెట్’. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాల్లా నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్నిసార్లు ముందుకు దూసుకువెళ్లాలంటే కొన్ని అడుగులు వెనక్కి వేయాలి. కొత్త ట్రాక్‌లో రేస్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది’’ అని తాప్సీ పేర్కొన్నారు. పరుగు పందెంలో తన సత్తా చాటే క్రీడాకారిణిగా ఇందులో తాప్సీ కనిపించనున్నారు. ఇదో ఊహాజనిత కథ అని, ఏ అథ్లెట్ బయోపిక్ కాదని సమాచారం. -
వాలి స్ఫూర్తితో...
ముగ్గురు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అయితే ఆ ముగ్గురిలో ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది? అనే సస్పెన్స్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘శివరంజని’. రశ్మి, నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర ప్రధాన పాత్రల్లో నాగప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్ పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగు’ సినిమా తర్వాత మా బ్యానర్లో వస్తోన్న సినిమా ఇది. లవ్, సస్పెన్స్, హారర్‌తో పాటు థ్రిల్లర్ అంశాలున్నాయి. ప్రేక్షకులు థ్రిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. శివరంజని ఎవరు? అనేది తెలుసుకోవడమే సినిమా. ధన్‌రాజ్ కామెడీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కె. రాఘవేంద్రరావు, చంద్రమహేష్, వినాయక్ గార్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘వాలి’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. ముందు క్లయిమాక్స్ రాసుకుని ఆ తర్వాత కథ రెడీ చేశా. అనుకున్నదాని కంటే సినిమా బాగా వచ్చింది’’ అన్నారు నాగప్రభాకర్. నందినీరాయ్, అఖిల్ కార్తీక్, ధన్‌రాజ్, ఢిల్లీ రాజేశ్వరి నటించిన ఈ సినిమాకి కెమెరా: సురేందర్ రెడ్డి, సమర్పణ: నల్లా స్వామి, సహ నిర్మాత: కటకం వాసు. -
మనిషిని దెయ్యం ప్రేమిస్తే...
‘‘ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారింది. వీటి మనుగడ ఉన్నప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం ఓ ప్రత్యేక చానల్‌ను ఏర్పాటు చేస్తోంది. శాటిలైట్ రైట్స్ వైజ్‌గా చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశం’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నాకు మనసున్నది’. రాజశేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నాన్చేరి దేవా శంకర్‌గౌడ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో సాగే సినిమా ఇది. సినిమా పూర్తయి చాలా రోజులవుతున్నా విడుదల పెద్ద టెన్షన్‌గా మారింది. నిర్మాత సాయి వెంకట్‌గారు, ప్రతానిగారు, డైరెక్టర్ సిరాజ్ సపోర్ట్‌తో ఈ నెల 20న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు చిత్ర నిర్మాత శంకర్ గౌడ్. నిర్మాత సాయి వెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ శంకర్, కెమెరా: వెంకీ పెద్దాడ. -
ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను
జై, రష్మి జంటగా ఎస్.జై. ఫిలింస్ పతాకంపై జానీ దర్శకత్వంలో సతీష్ గాజుల, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘అంతకుమించి’. భాను ప్రకాశ్, కన్నా సహ నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ –‘‘ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. నన్ను ఇంప్రెస్ చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. సినిమా విజయం సాధించాలి’’అన్నారు. ‘‘అడగ్గానే మా చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన సుకుమార్‌గారికి థ్యాంక్స్. సెన్సార్ అవ్వగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన సుకుమార్‌గారికి థ్యాంక్స్. జై, రష్మిలకు గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు జానీ. ‘‘మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటించాను’’ అన్నారు జై. -
‘నాకిదే చివరిరోజు.. బాబుని నువ్వే చూసుకో’
బెంగళూరు : వరకట్నం వేధింపులకు మరో యువతి బలైపోయింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న రష్మీ (28) ఆదివారం రాత్రి తన ఫ్లాట్‌లో బలవన్మరణానికి పాల్పడింది. చనిపోవడానికి ముందు.. అమెరికాలో ఉంటున్న తన సోదరికి ‘నాకిదే చివరిరోజు, బాబును చూసుకో’ అని మెసేజ్ చేసింది. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలివి.. కెంపెగౌడా రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో నివసించే రష్మీ.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత అమెరికాలో ఉన్న తన సోదరికి మెసేజ్ చేసింది. ఇదే తన చివరి రోజని, బాబును జాగ్రత్తగా చూసుకోవాలన్నది మెసేజ్ సారాంశం. దీంతో కంగారుపడ్డ సోదరి.. బెంగళూరులోనే నివాసం ఉంటున్న తల్లి భాగ్యమ్మకు విషయాన్ని చెప్పి, తక్షణమే రష్మీ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. ఎంతసేపు తట్టినా తలుపు రష్మీ తీయకపోవడంతో ఆమె తల్లి.. సతీష్(రష్మీ భర్త)కు ఫోన్ చేసింది. అతను ఊళ్లో లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. తలుపులు పగులగొట్టి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న రష్మీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వేధింపుల పరంపర : కోలార్ జిల్లాకు చెందిన సతీష్, బెంగళూరుకు చెందిన రష్మీలకు మూడేళ్ల కిందట వివాహమైంది. ఈ ఇద్దరూ స్థానిక మాన్యతా టెక్ పార్కులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కాగా, అదనపు కట్నం తేవాలంటూ రష్మీని సతీష్ వేధించేవాడు. శారీరక, మానసిక హింసకు గురిచేసేవాడు. భర్త వేధింపులు తాళలేని స్థితిలో రష్మీ రెండు వారాల కిందటే ఉద్యోగానికి రాజీనామా చేసింది. 16 నెలల వయసున్న కొడుకును తల్లి భాగ్యమ్మకు అప్పగించింది. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకునేముందు సోదరికి మెసేజ్‌లు పంపింది. ఫిర్యాదుబమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీష్ ను, అతని తల్లి గాయత్రిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. రష్మీ, ఆమె భర్త సతీష్ (ఫైల్ ఫొటో) -
హృదయానికి హత్తుకుందాం...
బట్టలు కట్టుకోవడం తెలుసు... మూటలు కట్టుకోవడం తెలుసు... పిల్లల్ని కట్టుకోవడం తెలుసా... సరదాగా ఉంది కదూ... నిజమే... పిల్లల్ని కట్టుకోవడం... ఈ మాట వినగానే తల్లిదండ్రుల మనసు పరవశిస్తుంది... నవమాసాలు కడుపులో మోసిన పాపాయి భూమి మీద పడగానే ఉయ్యాలలో నిదురిస్తుంది. తల్లి గుండె మీద నిదురిస్తుంది. అమ్మ కాళ్ల మీద నిదురిస్తుంది. మరి అమ్మ బయటకు వెళ్లినప్పుడు. అప్పుడు కూడా అమ్మ గుండెల మీదే పరవశంగా, ప్రశాంతంగా నిదురిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఎంఎస్ఎల్ సంస్థ ఈ సదుపాయం కల్పిస్తోంది. నడుముకి పిల్లవాడిని కట్టుకున్న ఝాన్సీరాణి రూపం అందరికీ గుర్తే. అలా కట్టుకునే యుద్ధం కూడా చేసింది. కూలివారు సైతం పిల్లలను నడుముకి కట్టుకుని పనిచేసుకోవడం భారతదేశంలో చాలాకాలంగా ఒక సంప్రదాయం. పేదరికంతో కొన్నిసార్లు, అవసరం కోసం కొన్నిసార్లు ఇలా నడుముకి బిడ్డను బిగించి కట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కారణం ఏమైనా ఇది పటిష్టమైన తల్లిబిడ్డల బంధానికి ప్రతీక.చాలా సంస్థలు బేబీవేరింగ్ను ఉత్పత్తి చేస్తునే ఉన్నాయి. అయితే ఇప్పుడు ముంబైకి చెందిన ఆరుగురు మహిళలు లాభాపేక్షలేకుండా బ్రాండ్ న్యూట్రల్ స్లింగ్ లైబ్రరీని ప్రారంభించారు. దీని పేరు ‘ముంబై స్లింగ్ లైబ్రరీ’ (ఎంఎస్ఎల్). ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ బేబీవేరింగ్ దొరుకుతాయి. ఈ బేబీవేరింగ్ను, పిల్లల ఆటవస్తువులను కొనలేనివారు అద్దెకు కూడా తీసుకోవచ్చు. పిల్లలకు చుట్టే వస్త్రాలు, పిల్లలను ఆడించే గిలక్కాయలు, మెత్తగా ఉండే పరుపులు... వంటి పిల్లలకు కావలసిన అన్ని వస్తువులు ఈ లైబ్రరీలో అద్దెకు దొరుకుతాయి. అనేక కంపెనీలు సైతం పిల్లలకు సంబంధించిన అనేక ఉత్పత్తులను వీరికి డొనేట్ చేస్తున్నారు. అన్మోల్ బేబీ యజమాని, ఆర్కిటెక్ట్ అయిన రష్మీ భటియా గాజ్రా జూలై, 2014లో ఈ సంస్థను రూపొందించారు. ‘‘కొత్త పేరెంట్స్... పిల్లలను ఎలా ఆడించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపడం కోసం రూపుదిద్దుకుంది ఎంఎస్ఎల్’’ అంటారు రష్మీ. పిల్లలను ఎత్తుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు చేతిలో నుంచి జారిపోతుంటారు. ఒక్కోసారి చెయ్యి నొప్పి వచ్చి, చెయ్యి మార్చుకోవలసి వస్తుంది. చంటిపిల్లల్ని శరీరానికి కట్టుకుంటే ఎంత బావుంటుందోనని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది పిల్లలను ఇలా కట్టుకుని బజారుకి వెళ్లడం, పనులు చేసుకోవడం చూస్తున్నాం. మరింత సౌకర్యంగా ఈ అవకాశాన్ని ఎంఎస్ఎల్ కల్పిస్తోంది.ఈ సంస్థలో.. రష్మీతో పాటు, ఆర్కిటెక్ట్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యమన్ బెనర్జీ కోరగావోంకర్, లాక్టేషన్ కౌన్సెలర్ అలోక్ మెహతా గంభీర్, మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రాచీ షా దేధియా, ఇంజనీర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ కోశలి దాల్వి, ఎంబీఏ హెచ్ఆర్ మేనేజ్మెంట్ షర్మిలా డిసౌజా.. భాగస్వాములు. ఇది ఏ విధంగా సహాయపడుతుంది... గిరిజన సంస్కృతి నుంచి విదేశీ సంస్కృతి వరకు బేబీవేరింగ్ అలవాటుగా వస్తోంది. ఇందులో పసిపిల్లలను భద్రంగా పట్టుకోవడం వల్ల, వాళ్లు సురక్షితంగా, భద్రంగా ఉన్న భావనతో హాయిగా చిరునవ్వులు చిందిస్తూ నిద్రిస్తారు. అంతేకాదు... ఇందులో పిల్లలకు కావలసిన ప్రాథమిక అవసరాలన్నీ తీరుతాయి. ప్రీటెర్మ్ బేబీలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కంగారూలాగ పొట్టలో దాచుకుంటే, వారి శరీరానికి తల్లి శరీరం తగులుతుంటే వెచ్చగా పడుకుంటారు, భద్రత భావనతో త్వరగా కోలుకొంటారు. బిడ్డకు తల్లి పాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక బిడ్డను అక్కున చేర్చుకోవడం వల్ల, తల్లి నుండి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. ఇదొక అందమైన, ఆనందకరమైన అనుభవం. తల్లిపాలు, పాలు మాన్పించడం, తప్పటడుగులు వేసే సమయంలో ఇచ్చే ఆహారం, ఫిట్నెస్... వంటివి కూడా తెలియపరుస్తారు. బేబీ వేరింగ్ ఉత్పాదనలకు సంబంధించి కొత్త పేరెంట్స్‌లో ఎన్నో సందేహాలు! పసిపిల్లలు పాడైపోతారా, నడక అలవాటు చేసుకోలేరా, పిల్లల కాళ్లు పాడైపోతాయా, తల్లులకు వీపు నొప్పి వస్తుందా... అంటూ కొందరు తల్లులు సందేహాలు అడుగుతుంటారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే వారికి ఇటువంటి అనుమానాలు కలిగి, ఆ అపోహలనే నమ్ముతుంటారని అంటారు రష్మీ. ఇలాంటి అనేక అనుమానాలను నివృత్తి చేస్తుంటారు రష్మీ, భాగస్వాములైన ఆమె స్నేహితులు. ‘‘మేం చేస్తున్న పని కంటే, ప్రేమను పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అభిరుచితో మొదలుపెట్టిందే ఈ ప్రాజెక్టు. మా కంపెనీకి చాలా బేబీ వేరింగ్ బ్రాండ్స్ నుంచి సహకారం లభించింది. ఇక మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అంటారు ప్రాచీషా. రెండేళ్ల కాలంలో ముంబై, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ కంపెనీ 40 సమావేశాలు ఏర్పాటు చేసింది. 50 రకాల బేబీవేరింగ్ ఉత్పత్తులు పరిచయం చేసింది. – డా. వైజయంతి -
నెక్స్ట్ నువ్వే.. థియేటర్లో సందడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నెక్ట్స్ నువ్వే’ చిత్ర యూనిట్ సోమవారం విజయవాడలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా సినిమా ప్రదర్శిస్తున్న జీ3 రాజ్యువరాజ్ థియేటర్‌కు సోమవారం వచ్చిన యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో ముచ్చటించారు. అనంతరం హీరో ఆది విలేకరులతో మాట్లాడుతూ చిన్న చిత్రాన్ని హిట్‌చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం విజయవంతం కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు చక్కగా నటించి కామెడీ పండించారన్నారు. హీరోయిన్లు రష్మీ, వైభవీ శాండిల్య పాల్గొన్నారు. -
కాన్సెప్ట్ సినిమాల కోసమే వి4 బ్యానర్
‘‘తమిళంలో కాన్సెప్ట్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తెలుగులో ఆ తరహా సినిమాలకు ఆదరణ ఉన్నా పెద్దగా రావడం లేదని ‘బన్నీ’ వాసు, నేను డిస్కస్ చేసుకున్నాం. తెలుగులో కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ‘వి4 క్రియేషన్స్’ సంస్థను స్టార్ట్ చేశాం! ‘నెక్ట్స్ నువ్వే’ విడుదలయ్యేలోపు కొత్త కథలున్నవారు మమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో చెబుతాం’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమ అక్షయ పాత్రలాంటిది. ఎవరొచ్చినా ఎంకరేజ్ చేస్తుంది. టైటిల్లోనే అసలు మజా, సక్సెస్ ఉంది. అల్లు అరవింద్‌గారు, జ్ఞానవేల్ రాజా, ‘బన్నీ’ వాసు, వంశీగారు కలిసి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఈ సంస్థను స్థాపించారు. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. అరవింద్, ‘బన్నీ’ వాసు, వంశీ, జ్ఞానవేల్ రాజా వంటి మంచి మనుషుల కారణంగా నాకు దర్శకునిగా చాన్స్ వచ్చింది. టైటిల్ క్రెడిట్ మాత్రం పరుశురాంగారిదే’’ అని ప్రభాకర్ అన్నారు. ‘‘రెండున్నరేళ్లు ముందుగానే ఈ సినిమా చేయాలనుకున్నాం. కానీ, కొన్ని కారణాలతో ఆగిపోయి మళ్లీ స్టార్ట్ అయింది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. నవంబరు 3న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని ‘బన్నీ’ వాసు చెప్పారు. నటుడు సాయికుమార్, ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, హీరో విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. -
తర్వాత నువ్వే
నువ్వు... నువ్వు... నువ్వు... తర్వాత నువ్వే అంటున్నారు ఆదీ సాయికుమార్. ఇంతకీ ఎవర్ని అంటున్నారు? అంటే.. ప్రస్తుతానికి నో ఆన్సర్. దసరాకి స్క్రీన్ మీద చూసుకోవాల్సిందే. ఆదీ సాయికుమార్ హీరోగా ప్రభాకర్. పి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 మూవీస్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. వైభవి, రేష్మి కథానాయికలు. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘వి4 బ్యానర్లో నిర్మిస్తున్న ఈ మొదటి సినిమా ద్వారా ప్రభాకర్. పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఆదీ సాయికుమార్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుçపుతున్నాం. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్‌రెడ్డి, హిమజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, ఎడిటింగ్: ఎస్.బి. ఉద్దవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి. -
పాపం తమన్నా చెల్లెలు!
క్రైమ్ పేరెంటింగ్ హిందీలో ‘తమన్నా’ అంటే ఆశ.. కోరిక.. కాంక్ష. ఏదో కావాలన్న ఆశ. ఏదో అయిపోవాలన్న కోరిక. ఒక్క ఛాన్స్ వస్తే.. స్టార్ అవ్వాలన్న కాంక్ష. ఇవన్నీ లేకపోతే.. అమ్మాయిలు హీరోయిన్లు ఎలా అవుతారు? కష్టం ఉండాలి.. నష్టం ఉండాలి.. దీక్ష ఉండాలి.. ప్రతిభ ఉండాలి. వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా ఉంటోంది! అమాయకత్వం! ‘అచ్చు.. తమన్నా చెల్లెల్లా ఉన్నావు’ అని ఎవరైనా అంటే... మన అమ్మాయికి ఆశ కలగదా? కోరిక పుట్టదా? కాంక్ష.. పెడదారి పట్టదా?! ‘‘పిల్ల ఏం చేస్తోంది? ఏమాలోచిస్తోంది– అని ఒక్కసారైనా పట్టించుకున్నావా?’’ కోపంతో అరిచాడు సురేష్ భార్య మీద.‘‘దాని మనసులో ఇలాంటి ఆశలున్నాయని నేను మాత్రం కలగన్నానా?’’ కళ్లల్లో తిరిగిన నీళ్లను పమిటచెంగుతో తుడుచుకుంటూ అంది రత్న.‘ముందునుంచీ చెప్తున్నా.. పిల్లలు చెప్పినట్టు ఆడొద్దు.. ఏది కావాలంటే అది ఇప్పించొద్దు అని?’.. అదే పిచ్‌లో అన్నాడు సురేశ్.‘‘తప్పు నా ఒక్కదానిదేనా? మీకు లేదా బాధ్యత? ఎప్పుడూ ఆఫీస్, క్యాంప్‌లు అని తప్ప ఇంట్లోవాళ్ల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా?’’ ఒక్కసారిగా ఏడ్చేసింది రత్న. పరిస్థితి తీవ్రం అవుతోందని గ్రహించి రత్న తల్లిదండ్రులు, సురేష్ తల్లిదండ్రులు.. మధ్యలో కల్పించుకున్నారు. ‘‘ఇది తప్పొప్పులు ఎంచుకునే టైమ్ కాదు. ముందు పిల్ల జాడ వెదికే ప్రయత్నం చేయండి’’ అన్నాడు సురేష్ తండ్రి. ‘‘బావగారూ... రశ్మి ఇంటిలోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్ కంప్లయింట్ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు. బేలగా చూశాడు సురేష్. అక్కడున్న అందరూ అవునన్నట్టు కళ్లతోనే చెప్పారు. తప్పదన్నట్లుగా రశ్మీ ఫోటో, వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి రాసిన ఉత్తరం.. తీసుకొని బావమరిదిని వెంటబెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు సురేష్. హైదరాబాద్.. యూసుఫ్‌గూడ ‘‘అబ్బ.. సేమ్ టు సేమ్ తమన్నా!’’ అన్నాడు మధు. బ్లూజీన్స్, బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వచ్చిన రశ్మిని చూసి ముగ్ధుడైనట్టు. ‘‘అంత కలర్ ఉన్నానా?’’ ఆ కితాబుకు కొంచెం సిగ్గు పడుతూ అంది రశ్మి. ‘‘అంతకన్నా ఎక్కువే ఉన్నావ్! అయినా నీకేం తక్కువరా.. మంచి కలర్, మాంచి ఫిగర్.. నువ్వు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక నిన్ను చూసి తమన్నా కుళ్లుకోకపోతే అడుగు!’’ సవాలు విసురుతున్నట్టుగా అన్నాడు మధు. ‘‘తెలుగులో కాదు.. హిందీలో చాన్సెస్ కావాలి.. రాజమండ్రిలో నన్నంతా ‘బాలీవుడ్ భామలాగుంటావే’ అనేవాళ్లు’’ అంది అద్దం ముందు అటూ ఇటూ రకరకాల భంగిమల్లో కదులుతూ. ‘‘అబ్బో..’’ అని సణుక్కున్నాడు. ‘‘ఏమన్నావ్?’’ అంది కాస్త మొహం ఎర్రగా చేసుకుంటూ.. ‘‘అబ్బా.. అన్నాను మెచ్చుకుంటూ’’ సవరించుకున్నాడు మధు. రశ్మి మొహం వెలిగిపోయింది.‘‘నీకు తెలుసా.. నేను లాంగ్ టాప్.. నీలెంగ్త్ లెగ్గింగ్ వేసుకుంటే...’’ అని రశ్మీ చెప్తుంటే ‘బాబోయ్ మొదలెట్టిందిరా మళ్లీ’ అన్నట్టుగా చూపులను నేలకు దించి.. తనలో తనే మెల్లగా గొణుక్కున్నాడు. ‘‘ఏయ్.. మధూ..’’– వింటున్నావా లేదా అన్నట్టుగా గద్దించింది.‘‘అదే.. రశ్మీ.. వింటున్నా... నీలెంగ్త్ లెగ్గింగ్, లాంగ్ టాప్ వేసుకొని వెళితే నీ ఫ్రెండ్స్ అంతా ‘దీపికా పడుకోన్లా ఉన్నావే’ అని కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు అవునా...’’ ఎన్నిసార్లు చెప్తావ్ అనే ధ్వని మధు మాటలో.‘‘దీపికా కాదు.. కత్రినా..’’ సరిదిద్దింది.‘‘అదేలే.. జీన్స్ వేసుకుంటే దీపికాలా .. హెయిర్ లీవ్ చేస్తే అనుష్కలా.. లాంగ్‌స్కర్ట్ వేసుకుంటే ఆలియాలా.. పటియాలా వేసుకుంటే కరీనాలా.. కదా..’’ అన్నాడు మధు.. కరెక్ట్‌గా గుర్తుంది అన్నట్టుగా!‘‘ఊ.. అవును’’ మళ్లీ సిగ్గుపడింది.‘‘రశ్మీ.. ఈరోజు మా ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు రూమ్‌కి. మనం ఖాళీ చేసేయ్యాలి’’ అన్నాడు. ‘‘ఎలా మరి?’’ అంది కంగారుగా.‘‘నువ్వేమో ‘బాలీవుడ్ చాన్స్‌లే కావాలి’ అంటున్నావ్. ముంబైలో మా ఫ్రెండ్‌కి రాత్రి కాల్ చేస్తే.. ‘ముందు మోడలింగ్‌కి ట్రై చేయాల్రా.... తర్వాతే సినిమాల్లోకి’ అన్నాడు. వాడికి నీ ఫోటో కూడా పంపా..’’ చెప్పాడు.‘‘ఏమన్నాడు..’’ రశ్మీ గొంతులో ఆత్రం, కళ్లల్లో మెరుపుతో అడిగింది.‘మోడలింగ్‌లో ఈజీగా చాన్స్ దొరుకుతుందిరా ఆ ఆమ్మాయికి అన్నాడు. కాని.. ’ అంటూ ఆగాడు మధు.‘‘కాని ఏంటీ?’’ ఆందోళనగా అంది ఆమె.‘‘మనం ముంబై వెళ్లడం అంత ఈజీకాదు. నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ఇక్కడలా కాదు. రూమ్‌లో షేర్ చేసుకోవడానిక్కూడా ఇష్టపడరు. ముందు కనీసం వారం రోజులైనా హోటల్లో ఉండాలి.. ఆ తర్వాత రూమ్ వెదుక్కోవాలి. నా దగ్గర అంత డబ్బు లేదు’ ’అన్నాడు బాధపడ్తున్నట్టు.‘‘నా దగ్గర ఉంది కదా..’’ అంటూ గబగబా తన హ్యాండ్ బ్యాగ్ తీసి ఐదు వందల నోట్లతో ఉన్న యాభైవేల రూపాయల కట్ట తీసింది ‘‘ఇవిగో... ‘ఇంకా మా అమ్మమ్మ నా కోసం చేయించిన చైన్, బ్రేస్లెట్, ఇయర్రింగ్స్, రెండు రింగ్స్ కూడా తెచ్చా.. ఏదో ఒక చాన్స్ దొరికేదాకా పనికొస్తాయి కదా..’’ అంది భరోసా ఇస్తున్నట్టు. ఈసారి మెరుపు మధు కళ్లల్లో.‘‘రేపటికి రిజర్వేషన్ చేయించనా ముంబైకి’’ అన్నాడు మధు. ‘‘డన్’’ అంది రశ్మి. కుడిచేయి పిడికిలి బిగించి బొటన వేలును మాత్రం పైకి చూపిస్తూ! ‘‘బావగారూ... రశ్మి ఇంట్లోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్ కంప్లయింట్ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు. రాజమండ్రి పోలీస్‌స్టేషన్ ‘‘చదువు చదువు అని ఏమన్నా ఇబ్బంది పెట్టారా?’’ అడిగాడు ఎస్ఐ.‘‘లేదు సర్. ఒక్కానొక్క కూతురు. తననెప్పుడూ ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టరు మా అక్క, బావ’’ ఆన్సర్ చేశాడు సురేష్ బావమరిది.‘‘మరి.. బాయ్‌ఫ్రెండ్...’’ ఆగాడు ఎస్ఐ.‘‘అబ్బే .. చిన్నపిల్లండి. మొన్ననే టెన్త్ అయిపోయింది. అలాంటిదేం లేదు సర్’ అన్నాడు నొచ్చుకున్నట్టుగా సురేష్.‘ఆరోజు కోప్పడ్డం కాని... కొట్టడం కాని ఏమన్నా చేశారా..’’ ఎస్ఐ కూపీలాగుతుండగానే రశ్మీ రాసిన లెటర్ తీసిచ్చాడు సురేష్. చదవడం పూర్తి చేస్తూ ‘సినిమా పిచ్చి అన్నమాట’ అన్నాడు లెటర్‌ను పేపర్‌వెయిట్ కింద పెడుతూ ఎస్ఐ. ఏం మాట్లాడాలో తెలియక మొహమొహాలు చూసుకున్నారు బావ, బావమరుదులు.‘‘వెళ్తూ వెళ్తూ ఏమన్నా తీసుకెళ్లిందా?’’ ఎస్ఐ. ‘‘యాభై వేలు, కొంచెం బంగారం’’ చెప్పాడు బావమరిది.‘ఊ...’ నిట్టూరుస్తూ కానిస్టేబుల్ని పిలిచాడు ఎస్ఐ.. అమ్మాయి ఫోటో తీసుకొని వివరాలు రాసుకొమ్మని పురమాయించాడు.‘‘సర్.. కొంచెం త్వరగా..’’ రిక్వెస్ట్ చేశాడు సురేష్. ‘ట్రై చేస్తాం లెండి. అయినా మూడు రోజుల క్రితం అమ్మాయి కనిపించకుండా పోతే ఇప్పుడా చెప్పడం’’ అని చీవాట్లు కూడా వేశాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ‘‘ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లావ్? అటే వెళ్లి పోయావ్?’’ తనను అంతసేపు వెయిట్ చేయించాడనే కోపంతో అంది రశ్మీ.‘‘సారీ! కాస్త లేట్ అయింది’’ అని ఆమెకు సమాధానమిచ్చి తన పక్కనే ఉన్న వ్యక్తిని చూపిస్తూ ‘‘రశ్మీ.. ఇతని పేరు సతీష్. నా ఫ్రెండ్’’ అని పరిచయం చేశాడు.‘‘హాయ్’’ అంది రశ్మి. కళ్లతోనే పలకరించాడు ఆ వ్యక్తి.కాస్త దూరంగా వీళ్ల ముగ్గురినే గమనిస్తూ ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు నిలబడున్నారు.మధు అటూ ఇటూ చూసి రశ్మీకి దగ్గరగా వస్తూ కాస్త చిన్నగా.. ‘‘సారీ.. నాకు ముంబై రావడం కుదరట్లేదు. ఇక్కడ షూటింగ్ పనిపడింది అర్జెంట్‌గా. మూడు రోజుల్లో వస్తాను. సతీష్ నాకు చాలా క్లోజ్. బాగా బతిమాలితే నిన్ను తీసుకెళ్తానన్నాడు. అక్కడ నీకు ఆనంద్‌ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బు ఆనంద్ అకౌంట్లో వేశా. నీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు. గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకున్న ఎమౌంట్ సతీష్ దగ్గర ఉంది. ఖర్చులకు కావాలి కదా.. ’ నచ్చజెప్పాడు. ‘‘అయ్యో నువ్వు రావట్లేదా? మరి అతనికి అన్నీ తెలుసా?’’ అడిగింది రశ్మి.‘‘అన్నీ తెలుసు. నీ స్క్రీన్ టెస్ట్ కల్లా నేను అక్కడ ఉంటాగా’’ భరోసా ఇచ్చాడు. స్క్రీన్ టెస్ట్ అనగానే మొహం చేటంతయింది రశ్మీకి. సతీష్‌కు కళ్లతోనే ఏదో సైగ చేస్తూ... ‘‘వస్తా మరి’’ అని అక్కడ నుంచి కదులుతుండగా... నలుగురు మనుషులు వేగంగా వచ్చి ఈ ముగ్గురినీ పట్టేసుకున్నారు ‘‘ఎక్కడికిరా వచ్చేది’’ అంటూ! వాళ్లు పోలీసులు. రశ్మి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ‘మీ అమ్మాయి దొరికింది’ అని. పేరెంట్స్‌కీ కౌన్సెలింగ్ మధుది అమలాపురం. హైదరాబాద్‌లో బ్రోకర్ పనులు చేసేవాడు. ముఖ్యంగా అమ్మాయిల ట్రాఫికింగ్‌లో మధుకి క్రైమ్రికార్డ్ ఉంది.కొన్నాళ్లు హైదరాబాద్ జైల్లో కూడా ఉన్నాడు. కౌన్సెలింగ్ ఇచ్చి మరీ విడుదల చేశారు పోలీసులు. అప్పుడే రాజమండ్రికి వెళ్లాడు వాళ్ల అక్క దగ్గరకు. అక్కడే రశ్మి పరిచయం అయింది. మెల్లగా తనతో స్నేహం చేశాడు. ఆమెకు మోడలింగ్ అంటే మోహమని, సినిమా అంటే పిచ్చి అని అర్థమైంది. దాన్ని క్యాష్ చేసుకుందా మనుకున్నాడు. తనకు హైదరాబాద్, ముంబైలలో చాలామంది సినిమా ఫ్రెండ్స్ ఉన్నారని... ఈజీగా చాన్స్లిప్పిస్తానని, ఓవర్‌నైట్‌లో హీరోయిన్ను చేసేస్తానని రశ్మీని మాయలోపెట్టాడు. గుడ్డిగా నమ్మింది ఆ పదహారేళ్ల పిల్ల. ఒకరోజు మధుతో ట్రైన్ ఎక్కింది. ఇప్పుడిలా పోలీసుల చేతికి దొరికింది. ‘చూడమ్మాయ్.. వాడు నిన్ను ముంబై తీసుకెళ్తోంది నీకు సినిమా చాన్స్లిప్పించడానిక్కాదు. అక్కడ రెడ్‌లైట్ ఏరియాకు పంపించడానికి. నీ దగ్గరున్న డబ్బు లాక్కొని నిన్ను ఆ సతీష్ అనే వాడికి అమ్మేశాడు తెలుసా... ’ అన్నాడు ఎస్ఐ. అవాక్కయింది రశ్మీ.‘‘చూడ్డానికి బాగుండగానే సినిమాలో చాన్స్‌లు దొరకవు. ఒకవేళ ఆ కెరీర్ కావాలనుకుంటే దానికి వేరే మార్గం ఉంటుంది. ఇలా ఎవరు పడితే వాళ్లు సినిమా చాన్స్లిస్తామంటే నమ్మకూడదు. వెంట వెళ్లకూడదు. ముందు బాగా చదువుకో. లోకజ్ఞానం పెంచుకో. అర్థమైందా?’’ అని చెప్పి రాజమండ్రి పంపించారు. అక్కడ ఆమె తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు..‘‘టీన్స్‌లో ఉన్న అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి వాళ్లు ఎవరైనా ‘మీ అమ్మాయికేం. చందమామ తునక.. నాకు ఫలానా ప్రొడ్యూసర్ తెలుసు.. కెమెరామన్ తెలుసు.. డైరెక్టర్ తెలుసు.. చాన్స్‌లు ఇప్పిస్తా. డబ్బే డబ్బు’ అంటారు. అలాంటి వాళ్లను దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. ఒక్క సినిమా చాన్సే కాదు... సిటీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, బోలెడు డబ్బని.. ఆడవాళ్లు, మగవాళ్లు, ఎవరు చెప్పినా నమ్మి పిల్లలను వాళ్ల వెంట పంపొద్దు’’ అని. రశ్మి అమ్మా నాన్నా ఊపిరి పీల్చుకున్నారు. – శరాది -
యాంకర్‌గా చేయడం తప్పా?
తమిళసినిమా: తెలుగు నటుడితో ప్రేమలో పడ్డానా? అంటూ దీర్ఘాలు తీస్తోంది నటి రేష్మీ. ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగులో చిత్రాల్లోనూ అడపాదడపా నటిస్తూ, బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది. తమిళంలో కండేన్, మాప్పిళై వినాయగర్ చిత్రాల్లో నాయకిగా నటించిన రేష్మీ తాజాగా ప్రియముడన్ ప్రియా అనే చిత్రంలో నటిస్తోంది. ఒక బుల్లి తెర నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. అయితే రేష్మీ అదంతా బేస్‌లెస్ ప్రచారం అని కొట్టిపారేస్తోంది. దీని గురించి ఈ అమ్మడు చెబుతూ తానెవరినీ ప్రేమించడం లేదని చెప్పింది.అంతే కాదు ప్రస్తుతం తన పనిలో తాను చాలా సంతోషంగా ఉన్నానని అంది. సినిమాల్లో నటిస్తూ బుల్లితెర కార్యక్రమాలు చేస్తున్నారేమిటని అడుగుతున్నారని, టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా చేయడం తప్పా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఇంకా చెప్పాలంటే తానీ స్థాయికి రావడానికి బుల్లితెరే కారణం అని పేర్కొంది. పెద్ద చిత్రాల విడుదల సమయాల్లో వాటి ప్రమోషన్ కోసం టీవీ చానళ్లనే ఆశ్రయిస్తుంటారని, హాలీవుడ్లో కూడా ప్రముఖ నటీనటులు వెబ్ సీరియళ్లలో నటిస్తున్నారని తెలిపింది. అంత దాకా ఎందుకు 14 ఏళ్ల పోరాటం తరువాత బుల్లితెరే తనకు గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పింది. ఇప్పుడు ప్రముఖ నటీనటులు కూడా టీవీ సీరియళ్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల బుల్లితెరను చులకనగా చూడడం సరికాదని పేర్కొంది. త్వరలో ఒక ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో ఆదికి జంటగా నటించనున్నట్లు రేష్మీ తెలిపింది. -
నంద్యాలలో రేష్మి సందడి
నంద్యాల: హీరోయిన్, ప్రముఖ యాంకర్ రేష్మి స్టెప్పులతో, పాటలతో అదరగొట్టారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి యువకులు ఎగబడ్డారు. జేవీసీ మోటార్స్ సంస్థ హీరోహోండా స్కీం లక్కీడిప్ తీసేందుకు ఆమె ఆదివారం నంద్యాలకు వచ్చారు. సంస్థ అధినేత మనోహర్ ఆధ్వర్యంలో లక్కీడిప్ తీశారు. అనంతరం మొదటి బహుమతి సాధించిన నూనెపల్లెకు చెందిన వీరారెడ్డికి రూ.60వేల విలువ గల బైక్‌ను, రెండవ, మూడో బహుమతులను, 20 కన్సోలేషన్ ప్రైజ్ లను విజేతలకు అందజేశారు. అనంతరం రేష్మి మాట్లాడుతూ.. నంద్యాల ప్రజలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని, మనోహర్ ద్వారానే అవకాశం వచ్చిందన్నారు. టీవీ యాంకరింగ్ కార్యక్రమాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా వస్తున్నాయని చెప్పారు. అనంతరం ఆమె డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. యువకులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడటంతో ఎస్ఐలు రమణ, మోహన్‌రెడ్డి, సిబ్బంది యువకులను అదుపు చేసి, ఆమెను క్షేమంగా పంపారు. స్థానిక గాయకుడు ప్రభాకర్ సంగీత విభావరి అందరిని ఆకట్టుకుంది.