కాన్సెప్ట్‌ సినిమాల కోసమే వి4 బ్యానర్‌ | Aadi- Vaibhavi Shandilya starrer, Next Nuvve's audio release | Sakshi
Sakshi News home page

కాన్సెప్ట్‌ సినిమాల కోసమే వి4 బ్యానర్‌

Published Mon, Oct 9 2017 12:23 AM | Last Updated on Mon, Oct 9 2017 12:23 AM

Aadi- Vaibhavi Shandilya starrer, Next Nuvve's audio release

‘‘తమిళంలో కాన్సెప్ట్‌ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తెలుగులో ఆ తరహా సినిమాలకు ఆదరణ ఉన్నా పెద్దగా రావడం లేదని ‘బన్నీ’ వాసు, నేను డిస్కస్‌ చేసుకున్నాం. తెలుగులో కాన్సెప్ట్‌ సినిమాలను ఎంకరేజ్‌ చేయాలనే ‘వి4 క్రియేషన్స్‌’ సంస్థను స్టార్ట్‌ చేశాం! ‘నెక్ట్స్‌ నువ్వే’ విడుదలయ్యేలోపు కొత్త కథలున్నవారు మమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో చెబుతాం’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా నటుడు ప్రభాకర్‌ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన సినిమా ‘నెక్ట్స్‌ నువ్వే’.

సాయికార్తీక్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమ అక్షయ పాత్రలాంటిది. ఎవరొచ్చినా ఎంకరేజ్‌ చేస్తుంది. టైటిల్‌లోనే అసలు మజా, సక్సెస్‌ ఉంది. అల్లు అరవింద్‌గారు, జ్ఞానవేల్‌ రాజా, ‘బన్నీ’ వాసు, వంశీగారు కలిసి కొత్త సినిమాలను ఎంకరేజ్‌ చేయాలనే ఈ సంస్థను స్థాపించారు. సినిమా హిట్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘హారర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

అరవింద్, ‘బన్నీ’ వాసు, వంశీ, జ్ఞానవేల్‌ రాజా వంటి మంచి మనుషుల కారణంగా నాకు దర్శకునిగా చాన్స్‌ వచ్చింది. టైటిల్‌ క్రెడిట్‌ మాత్రం పరుశురాంగారిదే’’ అని ప్రభాకర్‌ అన్నారు. ‘‘రెండున్నరేళ్లు ముందుగానే ఈ సినిమా చేయాలనుకున్నాం. కానీ, కొన్ని కారణాలతో ఆగిపోయి మళ్లీ స్టార్ట్‌ అయింది. మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. నవంబరు 3న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని ‘బన్నీ’ వాసు చెప్పారు. నటుడు సాయికుమార్, ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, హీరో విజయ్‌ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement