తర్వాత నువ్వే | nexts nuvve The film's first look was released. | Sakshi
Sakshi News home page

తర్వాత నువ్వే

Published Sun, Aug 6 2017 12:38 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

తర్వాత నువ్వే

తర్వాత నువ్వే

నువ్వు... నువ్వు... నువ్వు... తర్వాత నువ్వే అంటున్నారు ఆదీ సాయికుమార్‌. ఇంతకీ ఎవర్ని అంటున్నారు? అంటే.. ప్రస్తుతానికి నో ఆన్సర్‌. దసరాకి స్క్రీన్‌ మీద చూసుకోవాల్సిందే. ఆదీ సాయికుమార్‌ హీరోగా ప్రభాకర్‌. పి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్‌ నువ్వే’. వి4 మూవీస్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. వైభవి, రేష్మి కథానాయికలు. శనివారం ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘వి4 బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మొదటి సినిమా ద్వారా ప్రభాకర్‌. పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఆదీ సాయికుమార్‌ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుçపుతున్నాం. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఫ్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్‌రెడ్డి, హిమజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ పళని, ఎడిటింగ్‌: ఎస్‌.బి. ఉద్దవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సత్య గమిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement