ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబైలోని మాతోశ్రీ (ఉద్ధవ్ ఠాక్రే నివాసం)లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి కొత్త పేరు వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆమె చిత్రంతో కూడి పెద్దపెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే ఏమైందోఏమో వాటిని కొద్దిసేపటికే తొలగించారు.
బ్యానర్ల కలకలం
మాతోశ్రీలో రష్మీ ఠాక్రేను సీఎం చేయాలనే బ్యానర్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది. గంట వ్యవధిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన యువ కార్యకర్తలు మాతోశ్రీలోని ఆ బ్యానర్లను తొలగించారు.
నేడు రష్మీ ఠాక్రే పుట్టినరోజు
ఇటీవలే మహారాష్ట్రలో మహిళా ముఖ్యమంత్రి అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) రష్మీ ఠాక్రే పుట్టినరోజు. దీనిని దృష్టిలో ఉంచుకుని శివసేన యువసేన మాతోశ్రీ వెలుపల రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు ప్రదర్శించింది. ఈ పోస్టర్లు పెట్టిన కొద్దిసేపటికే పార్టీ అగ్రనేతలు హడావుడిగా వాటిని తొలగించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను సీఎం చేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
మరికొద్ది నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీ, మహాయుతి దళ్ నాయకులు తమ సత్తా చాటేలా ఇప్పటికే ఎన్నికల సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం మొదలుపెట్టారు.
ఇది కూడా చదవండి: ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్
Comments
Please login to add a commentAdd a comment