'ఆ మొత్తం చెల్లించండి లేదంటే చనిపోతా' | 'Pay Me for My Sugarcane Or I'll Kill Myself': Farmer to Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

'ఆ మొత్తం చెల్లించండి లేదంటే చనిపోతా'

Published Fri, Sep 4 2015 8:20 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

'ఆ మొత్తం చెల్లించండి లేదంటే చనిపోతా' - Sakshi

'ఆ మొత్తం చెల్లించండి లేదంటే చనిపోతా'

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు అనూహ్య పరిణామం ఎదురైంది. కరువు పీడిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా పర్భానీ జిల్లాలోని ఓ గ్రామంలో సభ నిర్వహిస్తుండగా మాధవ్ భాలేరావ్ అనే రైతు నుంచి విస్తుపోయే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఫడ్నవీస్ ఓ క్షణంపాటు తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. 'నాకు చెరుకు పంట సొమ్ము చెల్లించండి. లేదా నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఫ్యాక్టరీకి పంట మొత్తాన్ని తరలించి ఆరు నెలలైంది.

ఆ ప్యాక్టరీ మీ ప్రభుత్వంలోని కీలక మంత్రి పంకజ్ ముండేది. ఇప్పటి వరకు నాకు రూపాయి కూడా యాజమాన్యం చెల్లించడం లేదు. ఎంత అడిగినా పట్టించుకోవడం లేదు. మీరు వాటిని చెల్లించండి లేదా ఆత్మహత్య చేసుకుంటాను. ఇది నా ఒక్కడి సమస్య కాదు ఇక్కడ ఉన్నవారందరీ సమస్య' అని ఫడ్నవీస్ను ప్రశ్నించారు. దీంతో ఒక్క క్షణంపాటు ఆగి త్వరలోనే మీకు ఆ మొత్తం అందుతుందని స్వయంగా ముఖ్యమంత్రి రైతు మాధవ్ భాలేరావ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement