స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. ! | Maharashtra Chief Minister Eknath Shinde Met With Salman Khan At Home In Bandra - Sakshi
Sakshi News home page

Salman Khan: సల్మాన్ ఖాన్‌ ఇంటికి సీఎం..!

Published Tue, Apr 16 2024 6:06 PM | Last Updated on Tue, Apr 16 2024 6:15 PM

Chief Minister Met With Star Hero Salman Khan At Home In Bandra - Sakshi

బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి ‍అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్‌ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


కాగా.. ఈనెల‌ 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్‌  గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌  వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ ​సైకిల్​ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.  ఈ కాల్పుల ఘటనలో  విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement